"Malli-Bandenaka bandi katti"

Posted on January 31, 2010 by allam.
Categories: andhra, bandenaka bandi katti, dopidi, gaddar, galam, jai telangana, naijam, samaikyandhra, sarkaroda.



నైజాం మీద పోరు గీతం.. అప్పటి పాట
బండెనక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లో పోతావ్‌ కొడకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవురో
నైజాము సర్కారోడా

పోలీసు మిల్టీ రెండు
బలవంతులా అనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కారోడా

స్త్రీపురుషులంతా కలిసీ
పిల్లలమంతా కలిసీ
వడిశెల్ల రాళ్ళు నింపీ
వడివడికొట్టితేను
కారాపు నీళ్ళు తెచ్చీ
కళ్ళల్లో చల్లితేను
నీ మిల్టి పారిపోయెరో..
నీ మిల్టి పారిపోయెరో..
నైజాము సర్కారోడా

మా పొలం మింగినోడా
మా అడవి దోచినోడా
మా బతుకు బుగ్గు చేసి
సిరిసంపదంతా దోచీ
సంచుల్లకెత్తుకోనీ
బండ్లల్ల నింపుకోని
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
నైజాము సర్కరోడా

చుట్టుముట్టు సూర్యపేట
నట్ట నడమ నల్లగొండ
నువ్వెళ్ళేది హైద్రాబాదు
దానిపక్కన గోలకొండ
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
నీ ఘోరీ కడతాం కొడకో
నైజాము సర్కారోడా

సీమాంధ్ర దగాకోర్ల మీద పోరు గీతం.. ఇప్పటి పాట
కోట్లెనక కోట్లు కొట్టీ…
వేల కోట్లు కొట్టి..
యే కార్ల పోతవ్ కొడుకో..
ఆంధ్ర సర్కారోడా..
నైజాముని మించినవురో
ఓ ఆంధ్ర సర్కారోడా…

కోట్లెనక కోట్లు కొట్టీ…
వేల కోట్లు కొట్టి..
యే కార్ల పోతవ్ కొడుకో..
ఆంధ్ర సర్కారోడా..
నైజాముని మించినవురో
ఓ ఆంధ్ర సర్కారోడా…

తెలంగాణ ప్రజలంతా
బలహీనులా అనుకోని
సమైక్య పేరు చెప్పి..
నువ్వు రాష్త్రం దోస్తివి కొడుకో
తెలంగాణా దోస్తివి కొడుకో
తెలంగాణా దోస్తివి కొడుకో ఓ ఆంధ్ర సర్కారోడా

||కోట్లెనక కోట్లు కొట్టీ||

విద్యార్థులంత కలిసీ
అరె పిల్లలమంతా కలిసీ
ఉద్యమాలి చేసి
రాస్తరోకో చేసి
నిరాహార దీక్ష చేస్తె కొడుకో
కేంద్రం కదిలిపోయెరో..
అరె కేంద్రం కదిలిపోయెరో..
ఓ ఆంధ్ర సర్కారోడా

||కోట్లెనక కోట్లు కొట్టీ||

మా పొలం మింగినోడా
మా అడవి దోచినోడా
మా బతుకు బుగ్గు చేసి
సిరిసంపదంతా దోచీ
సంచుల్లకెత్తుకోనీ
స్విసు బాంకులల్ల దాసుకొని
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
బయలెల్లినావు కొడకో
ఓ ఆంధ్ర సర్కరోడా

||కోట్లెనక కోట్లు కొట్టీ||

చుట్టుముట్టు సూర్యపేట
నట్ట నడమ నల్లగొండ
నువ్వెళ్ళేది హైద్రాబాదు
దానిపక్కన గోలకొండ
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
గోల్కొండ ఖిల్లా కిందా
నీ ఘోరీ కడతాం కొడకో
ఓ ఆంధ్ర సర్కారోడా

||కోట్లెనక కోట్లు కొట్టీ||
                                                           -క్రిష్న చైతన్య అల్లం















Archives

అశ్రు నివాళి – కృష్ణ చైతన్య అల్లం


తూరుపు తెల తెల్ల వారింది…
తొలి వెలుగు చిరునవ్వు ఆకాశం మీదకు ఎర్రగ ఎగ బాకుతున్నది…
సూర్యుని బంగారు కిరణాలు వాగుల్ల చేప పిల్లలని నాట్యం చేయిస్తున్నాయ్,,
ఒళ్ళు విరుచుకున్న చిలుకలు బద్దకంగ ఎగురుతున్నయ్…
గువ్వ పిట్టల గుస గుసల్లో ఎదో మతలబు…
ఉదయమంత ఉత్సాహంగ ఉద్యమిస్తలేదు…
ఉషస్సు ఉరితాడు కొసన వేలాడుతున్నట్టుంది…

వసంతం వంతపాడడమాపి విష వాయువుల జల్లుతున్నది..
.
ఉప్పెనై ఎగసిన ఉద్యమ తరంగం నేడు నెత్తుటి ప్రవాహమయ్యింది…
పసి వాడని ప్రాయంపై, రక్తపు మరకల తడి సాక్ష్యాలు చెదరకముందే..
రోజొక రణరంగం..

విద్యార్థి నెత్తుటి ప్రతిబింబం..

ఎక్కడ చూసినా మనిషి వాసన…
ముక్కులు మూసుకున్నా చేదిస్తూ, కాలుతున్న శవాల వాసన…

కాళ్ళ కింద రక్తం యేరులై పారుతున్నట్టు…

కొవ్వొత్తుల వెలుగుల్ల ఆత్మ ఘోషల చరమ గీతాలు అంతిమంగ పోరుతున్నట్టు..


.
..
కదన రంగంల అభినవ అభిమన్యుడవయితివి…
గొంతు కలిపి నడిపించి నాయకుడవయితివి..
చెయ్యెత్తి జై కొట్టి చైతన్యం కలిగిస్తివి…

నాతోని నడిశి నా తొవ్వ నాకు చూపిస్తివి…

ఇయ్యాల నీ తొవ్వ నువ్వెట్ల చూస్కున్నవ్ మమ్ముల గాలికొదిలి…

నీ యూనివర్సిటీల గోడలు ఇంకా నీ త్యాగాన్ని శ్వాసిస్తున్నయ్…
నీ ఊర్ల చెట్టు పుట్ట తలవంచుకున్నయ్ నీకు నివాళి చెప్పుకుంట..
ఎక్కడ చూసినా ఒకటే నిశ్శబ్దపు హోరు..
చెవులు మూసుకున్నా వినిపిస్తుంది… భయంకరమైన నిశ్శబ్ద సంగీతం…

బానిస సంకెల్ల తెంచ పోరాటపు సమిధవయితివో…
ధిక్కార భూమి తిరుగుబాటుకి దివిటీవయితివో..
….
కొలిమంటుకున్నది నేడు మరో సారి తెలంగాణల..

ఆ అగ్గి సెగల్ల పిరికి ఆకాశం నిట్టనిలువునా తగులబడుతున్నది..
కమ్ముకున్న మేఘాలల్ల అలజడి రేగుతున్నది..
ఇంక ఒకటే ఆశ…

రేపటి ఉదయం ఉద్యమంతో కాక ఉషస్సుతో మొదలయ్యే నవ తెలంగాణ ని శ్వాసించాలని…
తరతరాల పోరాటానికి తుది ఘట్టం రావాలాని…
నీ త్యాగం చిరుజల్లై దివి నుండి భువికి స్వతంత్ర్యాన్ని వెదజల్లాలని…

మా ఆశ..

మా
ఆరాటం..

మా శ్వాస..
మా పోరాటం..

వీరుడా నీ త్యాగం వ్రుధా కాదు!!

(1969 నుండి 570 కి పైగా త్యాగాలూ, ఆత్మత్యాగాలు, ఆరని మంటల గుండె చప్పుల్లు, తెలంగాణ అమరవీరులకు, ఆత్మ త్యాగాలకు ..)
- కృష్ణ చైతన్య అల్లం

Maanava hakkula netaki Nivaali

Posted on January 29, 2010 by allam.
Categories: bala gopal, campus voice, human rights, jai telangana, ou.



Muslims say – Meri Jaan Telangana

Posted on by allam.
Categories: jai telangana, meri jaan, muslims.

Kavya From Poddutur, Beautiful Song in Re la Re program

ఒడ్డొడ్డు గడ్డి కోసి..
ఒడ్డు కింద బెట్టి..
ఒడ్డొడ్డు గడ్డి కోసి..
ఒడ్డు కింద బెట్టి..
ఒడ్డు నీడలు తిరిగే వసుదేవుడేడే… యాలా రాడే నీలా వరుడు..
అమ్మయ్య నిజమాయేనేమో… యాలా రాడే నీలా వరుడు..

ఒడ్డొడ్డు గడ్డి కోసి..
ఒడ్డు కింద బెట్టి..
ఒడ్డొడ్డు గడ్డి కోసి..
ఒడ్డు కింద బెట్టి..
ఒడ్డు నీడలు తిరిగే వసుదేవుడేడే… యాలా రాడే నీలా వరుడు..
అమ్మయ్య నిజమాయేనేమో… యాలా రాడే నీలా వరుడు..

మను మాను పూలేరి మాను కింద పోసి..
మను మాను పూలేరి మాను కింద పోసి..
మానూ నీడలు తిరిగే మాదేవుడేడే… యాలా రాడే నీలా వరుడు..
అమ్మయ్య నిజమాయేనేమో… యాలా రాడే నీలా వరుడు..

కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి..
కొమ్మ కొమ్మ పూలేరి కొమ్మ కింద పోసి..
కొమ్మా నీడలు తిరిగే కోమారుడేడే… యాలా రాడే నీలా వరుడు..
అమ్మయ్య నిజమాయేనేమో… యాలా రాడే నీలా వరుడు..

పాల నుత్తలు కలిగే పైమంద కలిగే..
పాల నుత్తలు కలిగే పైమంద కలిగే..
పక్కనా నాకొక శంకరుడు కలిగే.. యాలా రాడే నీలా వరుడు..
అమ్మయ్య నిజమాయేనేమో… యాలా రాడే నీలా వరుడు..
యాలా రాడే నీలా వరుడు..
యాలా రాడే నీలా వరుడు..

Telangana Vidyarthi Ranabheri (by ABVP)

Posted on January 28, 2010 by allam.
Categories: abvp, andhra pradesh, garjana, hyderabad, jai telangana, nijam college, rana bheri, vidyarthi.

Cute Sahithi (4yrs) Singing For Telangana

Posted on January 26, 2010 by allam.
Categories: 4yrs old, cute, isthanani, jai telangana, manthani, sahithi, singing, small kid.

Cute Sahithi Singing Telugu Rhymes: (When She was 2yrs Old)

Watch the related videos to see more of her cure videos when she was 2 yrs old.

Same girl is back for Telangana, after two years.

Sahithi singing in Telangana Dhoom Dhaam held at Manthani, Karimnagar.

Chiranjeevi Meets Mamata Benarjee

Chiranjeevi PRP Leader, meets Mamata Benarjee on 24th January, to ask her not to support Telangana and try joining with them.
He did not seem to get her attention.
Well, poor chiru thrown away after that.

News Source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2010/jan/25main13

Telangana Pocket Calendar








నా రక్తం , నా తెలంగాణా (War With no bloodshed)