ముఖచిత్రం -అల్లం నారాయణ

Posted on February 22, 2010 by allam.
Categories: telangana.

వేదన దశబంధ చెరువు లాంటిది. గొలుసుకట్టుగా అది గుండెగుండెకూ వ్యాపిస్తూ ఉంటుంది. అంతా బాగానే ఉన్నట్టుంటుంది. కొన్ని క్షణాలు కాగడాలై వెలిగినట్టుంటుంది. అంతలో దీపం మలిగినట్టూ చీకటి అవుతుంది. అడపాదడపా శీతాకాలపు అరుదైన జల్లులాగా ఎవరో రక్షకుడు ఉన్నాడని భ్రమ కలుగుతుంది. అంతిమ తీర్పులో తెలంగాణను రక్షించేవాళ్లే ఈ లోకంలో లేరనీ అనిపిస్తుంటుంది.
ఆర్ట్స్ కాలేజీ నుంచి, కాకతీయ వర్సిటీ ప్రాంగణం నుంచీ ఏ విద్యార్థో పొలికేకవేసినప్పుడు నిలువెల్లా ధైర్యం పాకినట్టుంటుంది. కాళ్లకింద నేలను లాగేసే తెలంగాణ రాజకీయ నాయకుడు.. నిర్దయగా ఆకాంక్షల ను అమ్ముకుంటున్నప్పుడు గొంతుపూడుకుపోయిన నిశ్చేష్ట అవుతుంది తెలంగాణ. కనీస ఊరటలేని ఉక్కపోతలో బతికిన ప్రాంతం ఏదన్నా ఉందంటే అది తెలంగాణయే. నిలువెల్ల గాయాల వీణ.
ఉస్మానియా ూనివర్సిటీలో అడ్డగోలుగా పోలీసులు గొడ్లను బాదినట్టు విద్యార్థులను, జర్నలిస్టులనూ కలెగలిపి బాదినప్పుడు.. తెలంగాణ ఇల్లిల్లూ ఏందిది? ఇంత అన్యాయమా? పిల్లలనిట్లా హింసిస్తుంటే అసలు రాజ్యమున్న దా? అనుకున్న వాళ్లకు ఒక తీర్పు ఫర్వాలేదులే ఎవరో ఒకరు.. ఉండకపోతారా? అని కొంత ఊరటనిస్తుంది. స్వయంగా పోలీ సు అధికారి జర్నలిస్టు బైక్‌ను పోలీసులే తగల బెట్టారని చెబుతుంటే.. నిండుసభలో హోంమంత్రి.. అంతా విద్యార్థులే రాళ్లు రువ్వారు. రువ్వుకున్నారు. తగుల బెట్టారు. తగులబెట్టుకున్నారంటే.. తెలంగాణ గురించి అప్పుడప్పుడూ మాట్లాడే హోం మంత్రి ఇట్లా మాట్లాడ్తున్నారేమిటని నీరసపడినట్టు. ఒక క్షణం. మళ్లీ ఆక్రోశం. ఒక తీర్పుతో ఊరట లభిస్తే మరో తీర్పు బలగాలు కొనసాగాలి అంటే.. ఏం చేస్తుంది తెలంగాణ.
వేణుగోపాల్‌రెడ్డి శవం మీద ప్రతిజ్ఞలు చేసిన వాళ్లిప్పుడు.. కొత్త ‘యాక్షన్’ కమిటీతో నటించడానికి రంగస్థలాన్ని సిద్ధం చేసుకుంటుంటే.. తెలంగాణను మరోసారి వేలానికి సిద్ధం చేస్తుంటే.. ఎంతలో ఎంత కుదేలు. ఎంతలో ఎంత దిగాలు. ఆర్ట్స్ కాలేజీ ముందు తెలంగాణ వచ్చేదాకా.. ఇచ్చేదాకా రాజీనామాల ఉపసంహరణ లేదని నమ్మబలికిన నేత.. నీతులు చెబుతుంటే నిరుత్తరంగా.. నిర్వికారంగా చూడడమా! నిర్లజ్జపై నిరసనకేతనం ఎగరేయడమా తోచకుండా ఉంది విద్యార్థికి. ఒక మోసం కాదు. ఒక దగా కాదు. నలభై ఏళ్ల క్రితం కళ్లముందు కదలాడుతుంటే బెంగటిల్లక ఏం చేస్తాడు. గడ్డం నెరసిన తెలంగాణవాది. తెలంగాణది ఒక శాశ్వత భంగపాటు చరిత్ర.
పోగొట్టుకున్న నెత్తురు కూ.. పొరలిన చైతన్యానికి.. కోల్పోయిన బతుకులకూ.. పొందిందేమీ లేని ఆరు దశాబ్దాల చరిత్ర. మూడు విప్లవాలను కన్నది తెలంగాణ. నైజాం గుండెల్లో నిదురించిన తెలంగాణ చుట్టుముట్టు సూర్యపేట.. నట్టనడుమ నల్లగొండగా కత్తుల కోలాట మాడింది. బందగి చిందిన రక్తం.. ఐలమ్మ కొంగు నడుముకు చుట్టిన వీరత్వం.. దొడ్డి కొమురయ్య అమరత్వం. కైగట్టిన యాదగిరి పాట ఎగరేసిన కేతనం. మూడువేల గ్రామాల్లో ఎగిరిన ఎర్రజెండాలు. సమరంలో వేల త్యాగాలు.. మొదటి విప్లవం విరమించిన తర్వాతి వ్యథ. కాలం గొడ్డుబోయింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల రహదారుల మొగదల్లో మెరిసే సుత్తీకొడవలి స్తూపాలు మిగిలాయి.
అవి కొన్ని కన్నీళ్లద్దుకొని ఊరూరికీ కనిపించే ప్రతీకలయి మిగిలాయి. ఎర్రరంగు వెలిసిన ఆ స్తూపాలమీద.. ఆన..ఎవరూ మిగలలేదు. వలసలు విజృంభించినాక.. సాయుధ పోరాటాలు, కమ్యూనిస్టు విప్లవాలూ విశాలాంధ్రలో ప్రజారాజ్యాలను ప్రసవించకుండానే మొద్దువారిన సుత్తీకొడవళ్లు. తెలంగాణ కార్యక్షేత్రమే కానీ.. పురుడుపోసుకున్న విప్లవాలకు ఈ పుడమితల్లి ఒక ప్రయోగశాలేకానీ.. కమ్యూనిస్టులకీ అస్తిత్వ ఆత్మఘోష చెవికెక్కనేలేదు. 1969. కొలువుల కోసం.. యూనివర్సిటీల విద్యార్థుల ఆత్మగౌరవం కోసం.. లేచి నిలబడింది తెలంగాణ. కామ్రేడ్స్ సమైక్యాంధ్ర కోసం బాణాకర్రలతో సంఘటితంగా బుర్రలు బద్ధలు కొడ్తున్నప్పుడు. కమ్యూనిజం ప్రపంచాన్నీ.. ప్రపంచంతోపాటు తెలంగాణనీ మారుస్తుందనుకున్న కల చెదిరింది.
నా తెలంగాణ నాకివ్వు అన్న తెలంగాణ వాది విచ్ఛిన్నకర ప్రాంతీయశక్తి అయ్యాడు. మూడువందలా అరవై తొమ్మిది త్యాగాలు అసెంబ్లీ ముందర గన్‌పార్క్‌లో నిక్షిప్తమైన స్తూపమొకటి.. నిష్టగా నిలుచుని ఉన్నది. అదిప్పటికీ తెలంగాణ కలలు మొలిపించే కదన కేంద్రం. విచ్ఛినకారులు, సంఘవిద్రోహులు, ప్రాంతీయవాదులు, సమైక్యతను సమగ్రతను భంగపరిచిన వాళ్లని రాజ్యముద్రలు వేయించుకున్న ఆ పిల్లల శవాలమీద పేలాలు ఏరుకున్నవాళ్లు. త్యాగాలను వేలం వేసుకున్న వాళ్లూ.. చరిత్రలో కలిసిపోయారు.
తెలంగాణ ఒక మానని గాయం. గాయాలు తడుముకున్న తెలంగాణ .. మూడో విప్లవాన్ని కన్న ది. రాని తెలంగాణ తెచ్చిన త్యాగాల దుఃఖం.. దగాకు, మోసానికి నిలువు నిలువునా నీరయిన ఆక్రోశం.. పెల్లుబికిన ఆగ్రహం.. అది శ్రీకాకుళాన్ని జగిత్యాలకు ఆహ్వానించింది. జగిత్యాల కదిలింది.. జంబాయిరే..నక్సల్బరీ ఊరూరికీ ఒక జీవనరాగమయిం ది. దొరలకు అగ్గినీళ్లు బందు పెట్టించిన తెలంగాణ.. దొరలను పట్నాలపాలు చేసిన తెలంగాణ. మళ్లీ.. త్యాగాలు.. ఎన్ని శవా లు.. ఎవరి శవాలు..ఎన్‌కౌంటర్లు.. ఖననాలు.. కళేబరాలు.. మిస్సింగ్‌లు.. కోవర్టు హత్యలు.. వేలమంది త్యాగాలు. పల్లెలు చెరసాలలయ్యాయి. చావిడీలు చిత్రహింసల కొలుములయ్యాయి.
హన్మకొండలో దీప స్తంభానికి మేఘ్యా శవాన్ని వేలా డ దీసింది రాజ్యం హంటర్‌రోడ్డు హంటింగ్ రోడ్డయింది. ఇక్కడ పెరిగిన విప్లవం దేశవ్యాప్తంగా వీచిన తూర్పుగాలి కిరీటం అయ్యింది. విప్లవం రాలేదు. భుజా న మోసిన బంధూకు భారమయిం ది. విప్లవం కనరాలేదు. త్యాగం తప్ప.. తపన తప్ప.. విప్లవం కొనసాగుతుండవచ్చు.. కానీ.. తెలంగా ణ తెప్పరిల్లలేనంత త్యాగాల గడ్డ అయింది. కోలుకోలేని గాయాల గీతమయింది . కానీ.. తెలంగా ణ తండ్లాట తీరలేదు. బతుకు మారలేదు. పోరాటమూ ఆగలేదు. మళ్లీ లేచినిలబడింది తెలంగాణ.. 1969ని ఆవాహన చేసుకున్నది. 2010లోనూ అదే వారసత్వం. అదే కల. అదే ఆకాంక్ష. అదే యుద్ధం.
నాలుగు దశాబ్దాల క్రిందటి ఆకాంక్ష ఆగ్గి పుట్టించింది తెలంగాణలో.. మా నిధులు మాకే కావాలి. మా నీళ్లు మాకే కావాలి. మా బొగ్గు మాకుకావాలి. మా ఆత్మగౌరవం కోసం మేము నిలబడ్తాం.. పడిపోతాం.. మళ్లీ నిలబడ్తాం.. మా పాలన కోసం మళ్లీ మేం పోరాట పతాకను ఎత్తుకుంటాం. చలో..ధూమ్‌ధామ్. ఆటపాటల.. కోటయ్యింది తెలంగాణ. 1969లో అమరవీరులు ఎత్తిన పతాకను అందిపుచ్చుకున్నది ఆర్ట్స్ కాలేజీ. కాకతీయ యూనివర్సిటీ. మళ్లీ ప్రారంభం. మరిచిపోయిన జ్ఞాపకాలు మళ్లీ కలవరపెట్టిన క్షణాలు.. మా తెలంగాణ మాకు కావాలి. 9న ఒక ఆశావహ ప్రకటన. చిదంబరం ఒకరోజు బాగోతానికి మూతి మీసాలు కొరిగిచ్చుకున్న తెలంగా ణ సంబరాలు జరిపింది.
కోలాట మాడింది. కిలకిలా నవ్వింది. ఒక్క ఊరట… ఆరు దశాబ్దాల్లో ఒక చిన్న ఆశ. ఒక చిరుదీపం వెలిగినట్టు.. పదిన ఆ ఆశల దీపమూ ఆరిపోయింది. ఇప్పుడు తెలంగాణపై తిరుగుతున్న గద్దల తండా.. ఎక్కుపెట్టిన రాజ్యహింస. భవిష్యత్ భయభీతావహ చిత్రపటం.యూనివర్సిటీ లాఠీచార్జిలో గాయపడిన మణి.. నాగమణి.. స్వప్నలు ఇప్పుడేమనుకుంటారు. విధి ఒక విషవలయంగానూ.. విధానం ఒక అణచివేత.. సాచివేత సాధనంగానూ కనపడ్తున్నప్పుడు ఎవరు మాత్రం ఎందుకు మోసపోవాలి. ఇప్పుడిక చిదంబరం గుట్టురట్టు.. ఏకాభిప్రాయంతోనే తెలంగాణ.
రాజకీయ జాక్.. కూలిపోతున్నది. ఊరూరా బతుకమ్మలాడిన ఉద్యమంలోకి దూరిన రాజకీయ క్షుద్రజీవులు ఒక్కొక్కటిగా జారుకుంటున్నప్పుడు.. కలత చెందని.. విద్యార్థి.. ఒక్కడే. మళ్లీ 1969 జ్ఞాపకం.. అనంతర దగా.. మరో గుణపాఠం.. తెలంగాణ ఉద్యమమంటే మరోసారి దగాకు రంగస్థలం సిద్ధం చేస్తున్న రాబందులు. తెలంగాణ మిగిలే ఉంటుంది. జీవితం మిగిలే ఉంటుంది. అసెంబ్లీకి విద్యార్థులను రానిస్తారా లేదా? వేరే సమస్య. విద్యార్థులను అణచివేస్తారా? కాల్చివేస్తారా వేరే సమస్య.
కానీ.. తెలంగాణ మరోసారి రాజకీయ నాటక కమిటీలకు రెండు కళ్ల మాటలకు లొంగరాదని పిలుపునిస్తున్నవాడే నేటి హీరో.. అతనే రేపటి తెలంగాణ పోరా ట యోధుడు.. నమ్మకండి. రాజకీయాలను.. వాటి నాటకాన్ని.. వాటి మోసాన్ని.. ఇక చాలు.. ఎవడైతే గన్‌పార్క్‌లో ప్రతిజ్ఞ చేసి రోడ్డున పడ్తాడో వాడే రేపటి తెలంగాణ యుద్ధవీరుడు. తెలంగాణ వేదనకు అలవాటుపడింది. అది దాని జీవిత విధానం.. అంతులేని వేదన నుంచి అనంత పోరాటాల వేపు… చలో.. చలో.. తెలంగాణ వర్థిల్లాలి.. తెలంగాణ వచ్చేదాకా.. మిగిలే వుంటుంది. గొంతులో నినాదం.

Archives

ఇంతకీ యాదన్నని సంప ప్రయత్నించిందెవరు???

Posted on February 20, 2010 by allam.
Categories: telangana.

 

कुसुमस्तबकस्येव द्वयी वृत्तिर्मनस्विन:।
मूर्ध्नि वा सर्वलोकस्य विशीर्येत वनेऽथवा॥

English Translation of Sanskrit Quote:
High-souled persons have only two states like that of a bunch of flowers; either they have to be on top of the whole world or they should wither away.

Telangana Translation:

గొప్పోల్లకి రెండె స్థితులు.. అయితె శిఖరాసనం.. లేకుంటె వాడిపోవు కుముద సుహాసనం..

 

 

అతడొక అమరవీరుడు అంటారు కొందరు..
కాదు పిరికి వాడంటారు ఇంకొందరు..

అదొక తొందరపాటు చర్యంటారు కొందరు..
నేను సైతం
రేగుతున్న విప్లవానికి సమిధనొక్కటి ఆహుతినిచ్చాను అంటాడు అతడు..

అమ్మా లేదు, నాన్న లేడు, వాడు చస్తె ఎంత అన్నట్టు ఆంధ్ర నాయకులు..
ఎవరన్నారు..
4 కోట్ల బందువులున్నం యాదయ్యని యాదికి తెచ్చుకోనికి..

మేనమామ అన్నడు ఈడ్నే పంజూస్కో కొడుకా అని..
ఇదే నా పనన్నడు..
ఇందుకోసమే నేను పుట్టిన అన్నడు..

ఎవరేం చెప్తె అది నమ్మిండు..
చిరంజీవి చెప్పిండు జై తెలంగాణ అని..
యాదయ్య జై చిరంజీవి అన్నడు..

చంద్ర బాబు చెప్పిండు జై తెలంగాణ అని..
తమ్ముడు జై చంద్ర బాబు అన్నడు..

అమరుడైన తెలంగాణ బిడ్డ ఇంద్రన్న ఆశయాల సాధనకోసం పంచేస్త అన్నది సబితమ్మ..
తమూడు జై సబితమ్మ అన్నడు..

చివరుకు యాదన్న కలల సాకారం తెలంగాణాచ్చింది..
యాదన్న దండం పెట్టిండు… మీరంత నా దేవుల్లన్నడు..

కని ఇంటి గుమ్మంలనే చిరంజీవి చెప్పుదెబ్బ కొట్టి పంపిండు ..
తెలంగానేందిరా నీ అబ్బ సొత్తా అని..

చంద్ర బాబు దగ్గరికి పొయిండు..
యే లే ఉత్తగనే అన్న కని ప్రబుత్వం గిట్ల తెలంగాణ ఇస్తదని అనుకోలె..
మనం సమిష్టి పంచేసి స్వర్నాంధ్ర చెయ్యాలె గని తెలంగానేంది తమ్మి అన్నడు..
నాలుగు వాతలు పెట్టి పంపిండు..

సబితమ్మ దగ్గరుకు పొయిండు కొండంత ఆశతోని..
తమ్ముడూ ఇగో నా చేతిల యేం లేదు..
ఆల్లెంత చెప్తె నేను గంతే..
ఇంతల పోలీసొడొకడచ్చి తెలంగాణ పేరెత్తంగనే యాదన్నని కుల్లబొడుసుడు మొదలుపెట్టె..
ఒక్కడ్ని చేసి పోరన్ని కుక్కలెక్క కొట్టి రబ్బరు బుల్లెట్ల తోని కాల్షిండ్లు..
సబితమ్మ మొత్తం చూశి అరె ఎంత పనైపాయె..
పాపం గట్ల కొట్టకున్లి పోరన్ని అని కూడ అన్లే..
మొత్తం కొట్టుడయినంక సారీ చెప్పున్లి పపం దెబ్బల్ తిన్నడు బాగ అంటె
పోలిసోల్లకి జరంత ద్యాసచ్చి సారి చెప్పి పంపిన్లు..

ఫోన్ తీషిండు యాదన్న..
ఎవరికన్న చేద్దామని..
అమ్మా, నాన్నల్లేని అనాధ..
తెలంగాణె తల్లై, పోరాటమె తండ్రై బతుకుతున్న ఓ అమాయక విద్యార్థి..
ఎమ్మెల్యేలకు ఫోన్ కొత్తి అడిగిండు..
అన్నా గిట్లైంది..మీరు రాజినామ చేషి నిరసన చెయ్యాలె..
అరె జరంత ఉండు తమ్మి …
మనం పవర్ల ఉంటెనే ఎమన్న చేస్తం అని కట్ చేసిండు ఎమ్మేల్యే సాబ్..

ఫోన్ల సిం కార్డు తీశి ఔతల పడేషిండు యాదన్న..
గా దేవుల్లందరితోని దిగిన ఫోటొలు సంచిల పెట్టుకున్నడు…
ఎవరన్న కనిపిస్తె అడుగుదాం నేనేం తప్పు చేశిన గిట్ల శిక్షిస్తున్లు నన్ను అని..
ఎవ్వరు దొరకలే..
దెబ్బలాగుతలేవు..
బొబ్బలు తగ్గుతలెవ్వు…
తిన్న దెబ్బల గాయాలు, వాతల బాధలు సలుపుతున్నయ్..
పోరడు అస్తిత్వం కోసం బయలు దేరిండు..
తెలంగాణ ఎవ్వరు తెస్తేంది తేకుంటేంది అని
ఒంటరిగ బయలు దేరిండు..
వీధి వీధి వాడ వాడ వాడే..
ఉస్మానియా లాటీ చార్జిల వాడె..
గర్జనల్ల వాడె..
ఉప్పెనై, పెను తుఫానై వాడె..
ఎక్కడ సూషిన వాడె..
వాడు రగిలించిన విప్లవం రాష్త్రమంత అలజడి రేపింది…
సుడిగాలిలా మారి వడగాలిని రేపుతుంది..
రాజకీయ సంక్షోభం యేర్పడ్డది..
వానికి తోడుగ వేల గొంతుకలు..
అనాధని ఎవరన్నరు…
మతిలేనోడె అంటడామాట…

సమైక్య ప్రపంచం దద్దరిల్లింది..
అతలకుతలమయ్యింది..
పక్క దారిన దొంగ మాటు వేసింది వాడి హ్రుదయం మీద..
వాడి మనసులొ అలజడి రేపింది..
మానసిక సంక్షోభాన్ని లేపింది..
వాడిని నిలువునా తగులబెట్టింది..
ఆ మంటల్ల కాలుతున్న తెలంగాణ ఆత్మాభిమాన ఆర్తనాదాన్ని చూసి వికట్టట్టహాసం చేసింది..

కొన్ని ప్రష్నలు..
ఇంతకీ యాదన్న మనిషేనా..
లేదంటె తెలంగాణ అస్తిత్వం మానవ రూపం దాల్చిందా..
లేదంటె ఆ మంటల్ల మా దైన్యం, నిస్సాహయతని ఎత్తి చూపుతుందా..
లేదంటె తనకు సాయం రాని సంఘం అసమానతలని తట్టి లేపుతుందా..
లేదంటె కలుతున్నది స్సమానత్వ అప్రజాస్వామ్యమా..
లేదంటె గాయపడ్డ తెలంగాణ తల్లి నిత్యక్షోభ ఆర్తనాదమా..
లేదంటె దగాపడ్డ నా ప్రజల ఓటమా..
ఇంతకీ యాదన్నని సంపిందెవరు???
ఏమో మరి..
ఇన్ని ప్రష్నలకి సమాధానం దొరకక సతమతమవుతుంటె..
పిరికి చర్య అంటడేందో మరి చంద్ర బాబు..

ఎమో మరి..మీకే తెల్వాలె..
జగమెరిగిన జగన్నాటక సూత్ర ధారులు…
నీటముంచినా, నిలువునా కాల్చినా
మీ మాటే మా వేద మంత్రం..
మీ సమైక్యతా, అభివ్రుద్దే మా అంతిమ ధ్యేయం..
మీ కాలి కింద చెప్పులం..
నాలుగు కోట్ల అనాధలం..
సీమాంధ్రప్రదేష్ సమైక్యాంధ్ర సాక్షిగా
వెయ్యి కాలాలు బాగుండాలె..
మీరు, మీ పిల్లలు అందరూ సల్లగ ఉండాలె..
మీ పొలాల్ల మా నీల్లు కలకాలం పారాలె..
మీరందరు మా జాగల్ల సుఖం గ ఉండాలె..
మీ పోరగాల్లందరికి మా జాగల్ల కొలువులు దొరకాలె..
మీరేం కలత పడవద్దు..
మేమున్నం మీకు.. సమైక్యంగ..
రోజు మీకు చాయ్ తెస్తం.. బూట్లు తుడుస్తం..పాయ్ ఖానాలు కడుగుతం..
అవసరమైతె చర్మం తీషి చెప్పులు కుట్టిస్తం..
మీరు అభివ్రుద్ధి జెయ్యిండ్రి గిట్లనె…
మేమున్నం..మీకోసం..
సమైక్యంగ ఉందాం మనం కలకాలం..
జై సమైక్యాంధ్ర..

Vidyarthi Garjana Video Mastered with NDTV comments.

Posted on February 19, 2010 by allam.
Categories: telangana.

Harish Rao Assembly Speeches Rap Mix

Posted on by allam.
Categories: telangana.

Telangana State Is Formed!

Posted on by allam.
Categories: telangana.

“We are the world”, edited with 1000 Telangana Photos, and speeches.

Posted on by allam.
Categories: telangana.

అంత మంచే అమ్మా

Posted on February 17, 2010 by allam.
Categories: telangana.

Can I have one chicken burger?
6 dollars 45 cents! Sir.
Not that one, the one which is a dollar.
Ohh, Ohkayy……..!! It’s a dollar… and 8 cents. With the Tax. Sir.
Thinking to myself, eating crap and had to spend 56 rupees.
అమ్మ వండిన కోడికూర, పచ్చి పులుసు యాదికచ్చే..
బిళ్ళ వక్క (సర్వపిండి) తిని ఎల్లాయే..
అప్పాలు, సకినాలు తల్సుకుని కల్లపొంటి దుక్కమచ్చే..
వంకాయ వండుతే పళ్ళెం ఎగరేసిన నా బలుపు యాదికచ్చే..
ఉప్మా చూశి ఇదిల్లు కాదు నరకం అని తినకుంటనే బడికి పోతిని..
పట్టి పట్టి తినిపిస్తే వదిలెయ్యి తల్లి నన్నిట్ల గోస పెట్టకని తిడితిని..
రోడ్డు మీద గడ్డి కొనుక్క తింటిని..
హాస్టళ్ళ ఉండుండి ఇంటికస్తే గాని అర్దమయ్యేది గాడు ఇంటి తిన్డేంది అని..
డాడి చేశిన వంటల ప్రయోగాలు యాదికచ్చే..
అసయ్యంగా నేను చేశిన ఆలుగడ్డ కూర ఇంట్లంత మెచ్చుకుని తినే..
పండుగలు లేవాయే పబ్బాలు లేవాయే..
ఏడు మొత్తం గదే బర్గరు, గదే పిజ్జా లు తినాలె…
బస్సెక్క నూటయాభై రూపాయలాయే..
రైలెక్క వెయ్యి రూపాయలు..
కాలేజి ఫీసు కి సగం జీవితం అంకితం..
ఒళ్ళు హూనం చేస్కొని సంపాదిస్తే అచ్చే పైసల్ చాయ్ తాగే సరికి అయిపాయే…
ఎవడురా తమ్ముడు నికిక్కడ బంగారు నిధి నిక్షేపాలని చూపెట్టింది..
మాయా ప్రపంచం.. ప్రపంచీకరణల పాతిపెట్టబడ్డ నీ అస్తిత్వం..
యంత్రాలు నడుస్తాయో నడిపిస్తాయో అర్ధం కాని యాంత్రికత..
పుర్రె నిలువునా కొస్తే గాని అర్ధం కాదు తలెందుకు బద్దలవుతుందో..
ఊపిరి తిత్తుల్ల నింపిన పొగ నిండి నిండి నిలువునా తగులబెడుతుంది..
నీకు నా మీద ప్రేమే లేదని, నాకు కాల్ చేయడం గుర్తే ఉండదు నీకని ప్రియురాలు నీ నిబద్దతని నిలదీస్తుంది..
అమాసకోసారి ఇంటికి చేసిన కాల్ మాస్కేసుకుని మాట్లాడమంటుంది..
తల్లి గుండె సంతోషించెట్టు నాలుగు ముక్కలు మాట్లాడమంటుంది..
అంత మంచే అమ్మా..
మూడు ముక్కలు మాట్లాడ్డం అంత బరువని తెలుసుకునేసరికి,
చేజారిన బాల్యం గుర్తుకు వచ్చి కలవరపెడుతుంది..
నిద్ర లేని రాత్రులు నిజాన్ని గుర్తుకుచేస్తూ ఉంటాయి పదే పదే..
నిలువునా కూలిపోవడమా, పారి పోవడమా పరిష్కారం కనుచూపుల్ల కనిపించదు..
సమాధానాల్లేని ప్రశ్నలు సతమతపెడుతుంటే గుండె గంట అలారమై మొగుతుంటుంది..
నేనున్నానని మధ్య మధ్యలో మనసు గుర్తు చేస్తుంది..
చచ్చి పోయిన ఆత్మ తాలూకు అట్టడుగు జ్ఞాపకాల్లోంచి..
త్రిశంకు స్వర్గపుటంచుల చివరి కొసన వేలాడుతున్న స్వేచ్చని అడిగా…
ఇదేనా స్వేచ్చంటే అని..
నువ్వెంచుకున్న దారి గమ్యం నిర్దేశించడమే స్వేచ్చ అంది..
కాని శిథిలమైన గమ్యాన్ని అస్పష్టమైన స్వేచ్చ అతిక్రమిన్చినట్టున్దేన్డుకనో ..
చేజారిన ఆత్మ స్తైర్యానికే తెలువాలి..
నాది కాని నా జీవితానికే తెలువాలే

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరి తరపునా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా..

Posted on February 16, 2010 by allam.
Categories: telangana.

original_kcr-ramoji-rao_4b1dd0f412ac4

దిశ లేని మాకు దిక్కు సూపినవ్…

దశ లేని మన లొల్లికి ధిక్కారం నేర్పినవ్..

మరణశయ్య మీద పడుకుని సావుతొ పోరాటం చేషినవ్..

మూగ బొయిన మా గొంతుకలకి గర్జించుడు నేర్పినవ్..

మా బాధకు నీ కన్నీల్లు కలిపి మమ్ముల గుండెల్ల పెట్టుకున్నవ్..

అణగారిన బతుకుల్ల అణువణువున తరగని కరగని చైతన్యం నింపినవ్..

తెలంగాణం మన బతుకు పోరని కర్తవ్యం బోధించినవ్..

సల్లారిపొయిన సెగలకు ఆగ్గి పెట్టి మల్ల మల్ల పోరు బాటకు సంసిద్ధం చేసినవ్…

రాజకీయాలు మనల మారుస్తయ్ అని విన్న..

నువ్వు రాజకీయం మార్చి సూపెట్టినవ్..

పదవికోసం పానాలు తీషేటోల్లని సూషినం..

ప్రజల కోసం పానాలిచ్చేటొల్లని సినిమాల్ల ఆరాధించినం..

తెలంగాణ ప్రజలం గర్వంగ చెప్పుకుంటం మాకు కే సీ ఆర్ ఉన్నడని…

ఇవ్వాల్ల నాలుగు కోట్ల ప్రజల నాయకుడవై,

మా కంటి వెలుగువై,

తెలంగాణ గుండె చప్పుడువై,

రణభూమి తిరుగు బాటు నాదానివై,

తిరుగులేని తొలి వెలుగు రవికిరణానివై,

వెచగ వెలుగుతూ,

పచ్చగ నీ ప్రేమని గిట్లనె పంచుతూ..

నూరేళ్ళు నువ్వు సల్లగుండలన్నా మాకోసం..

నువ్వు గిసొంటి పుట్టినరోజులు మల్ల మల్ల జరుపుకోవాలె..

నువ్వు మల్ల మల్ల వంద సార్లు పుట్టాలె..

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరి తరపునా మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలన్నా..

- కృష్ణ చైతన్య అల్లం

Oh Allam Naarannaa…

Posted on by allam.
Categories: telangana.

15-2slider1

ఎన్ని సార్లు కోడతావు?

ఏమని కోడతావు?

కొట్టిన ప్రతి దెబ్బకి జై తెలంగాణ

కట్టిన ప్రతి గాయపు కడుముకి జై తెలంగాణ

-అల్లం నారాయణ

vaartha2

Katanguru’s Poetic Verse on Allam’s Words

naaranna
14pan2a14pan2c

15_02_2010_009_010_009

D29641408

Thought of trashing these lines from my mind I learned in my childhood.

We, the People of India, having solemnly resolved to constitute India into a Sovereign, Democratic Republic and to secure to all its citizens :- JUSTICE, social, economic and political; LIBERTY of thought, expression, belief, faith and worship; EQUALITY of status and of opportunity, and to promote among them all FRATERNITY, assuring the dignity of the individual and the Unity of the Nation; IN OUR CONSTITUENT ASSEMBLY DO HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.

***

Thanks to hari Goud, who donated $200

to release the innocent students from Jail.

****

Thanks to Telangana Development Forum (TDF) for working out on students releases.

***

అమ్మనొదిలెయ్యన్నా

Posted on February 13, 2010 by allam.
Categories: allam, amma, andhra, chaitanya, krishna, talli, telangana.

ఒక శకం ముగిసింది..
కొన్ని పేజీల నిండ రక్తం మరకలు,
కొన్ని శిథిలాలు, కొన్ని శకలాలు..
తల లేని మొండాలు గాల్లో వేలాడుతున్నాయ్..
తెగిన తలలన్ని వాటి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి..
చిన్నప్పుడనుకునేటొన్ని..
బ్రహ్మ రాస్తడు రాత ని..
ఇప్పుడర్దమయ్యింది…
మా రాత రాషినా, చరిత్ర రాశినా మా సీమాంధ్ర అన్ననే రాయాలె అని…
మల్లొక్క సారి చరిత్ర రాస్తరు…
తెలంగాణల ఉద్యమం అని ఉండదు…
తెలుగు జాతి గర్వించదగ్గ తెలుగు వాడీ సమైక్యపోరాటం, వేర్పాటువాద అణచివేత అని ఉంటది… యాభై యేల్ల సంది గోస గంగల తొక్కి ఇష్టమచ్చినట్టు రాస్తున్నరు…
ఎక్కడ చూసినా బూడిద…
ఇండ్లు కాలిపోయిన చమురు వాసన..
శవాలు కాలిపొయిన కమురు వాసన..
శవాల మీద వ్యాపారం చెయ్యనీకి అచ్చిండు అన్నయ్య..
సమైక్యంగ ఉందాం.. శవాల మీద వ్యాపారం చేద్దాం..
కొన్ని చెవులల్ల ఆఖరి ఆక్రందనలు మిగిలిపొయినయ్..
నల్ల గుడ్డ తీసేదాక తెలవలేదు,
అసలు దానికి కళ్ళే లేవని..
కొడుకుల చితికి నిప్పంటించిన,
తెలంగాణ తండ్రుల జూసిన తరవాత
కలం కదులుతలేదు…
చేనేత వర్తకుల ఆత్మహత్యలు చూసినంక తొడిగే బట్టల మీద అసహ్యం వేస్తున్నది..
గొంతు లేపుతె తెగ్గోస్త..
కాలు కదిలితె కడ నరుకుత..
చెయ్యెత్తితె నీ చేతులుండవు…
ఇక్కడ మాట, పాట, ఆట ఉద్యమం నిషిద్ధం..
నిరాటంకంగ ఆత్మహత్య చేస్కొ..
ఎవ్వరు యేమనకుండ నేను చూస్కుంట..
లాబీ చేస్త.. మీడియా కొంట..నీకేం బయం లేదు తమ్ముడూ.
నిర్భయంగ సచ్చిపో…
మన అన్న సమైక్యాంధ్రలున్నడు..
మన సావుకు ఎవ్వరు అడ్డు రాకుండ సూస్కుంటడు..
ఇంకో ఇరవయ్యేల్ల దాక యే ఢోకా లేదన్నయ్యా..
నీ ఇష్టం అచ్చింది నువ్వు చేస్కొవచ్చు..
అప్పుడు మల్ల మా కొడుకులు కూతుల్లు ఉద్యమం మొదలు పెడతరు కదా..
అప్పుడు చెప్పు ఆల్లకు స్మషానాలుగ ఉన్న బూములని నువ్వే అభివ్రుద్ధి చేషిన కనుక మొత్తం నీదే తెలంగాణ అని… నీకు చెప్పేటోన్నా గని..
ఇంకో రెండు ప్రాజెక్టులు కట్టుకో మా నీల్ల మీద..
ఇంకో పది యూనివర్సిటీలు పెట్టుకో మీకాడ..
గదంతెందుకన్నా….రాజు తల్సుకుంటె దెబ్బలకు కొదువా..
అందరిని నరికి మా ఇళ్ళూ, పొలాలూ, భూములూ, అన్ని దోస్కపో ఇగ..
ఈ డొంక తిరుగుడు ఎందుకు చెప్పు…
తెలంగాణ ఫర్ సేల్ అని బోర్డు పెట్టి అన్ని అమ్ముకొని తిను..
మేం గుడ అస్తం.. మమ్మల్ని గుడ ఎవలన్న కొంటరేమొ అమ్మి పడెయ్ యేమన్న చిల్లర మిగుల్తది నీకు…
నీ పెద్ద కొడుకు బండిల పెట్రోల్ కర్సులకు ఐతది అమ్మెయన్న మమ్ముల గుడ..
అరె మేం పుట్టిందే మీ కోసమాయె….
ఇన్ని రోజులు తాగిన రక్తం సరిపోలేదా అన్నా..
చేసిన మారణ కాండ తృప్తి నియ్యలేదా లేకుంటే వినోదంగా లేదా..
యేదొ నోరున్నది అని లేచినం…
మూతి పగులగొట్టిచ్చి మంచిగ చెప్పినవ్ అన్నా మేమేందో మా బతుకులేందొ…
మా యన్న..
మా తెలుగన్న..
మా పెద్దన్న…
మా దొరన్న..
సమైక్యతన్న…
దండాలు నీకు… నీ మేలు యెన్ని జన్మల మరువలేం…
చివరగ చిన్నమాటన్నా…
ఇగ యెట్లా.. తెలంగాణ తల్లి దిక్కులేదయ్యింది కదాని..
మీ పెద్దాపురం బ్రోతల్ హవుస్ ల పెట్టి మాత్రం మా తెలంగాణ అమ్మని అమ్మకన్నా నీకు పున్యం ఉంటది…
.మమ్ముల యేమన్న జెయ్యి…
సంపుకో…
కొట్టుకో..
సరిపోకపోతె చిత్ర హింసలు పెట్టు…
దెబ్బలు మాకు కొత్త కాదు..
అరవై యేల్ల సంది తింటనే ఉన్నం..
కని అమ్మనొదిలెయ్యన్నా…
తెలంగాణ తల్లిని నగ్నంగా నిలబెట్టి వేలం ఎయ్యడం ఆపన్నా…
అమ్మనొదిలెయ్యన్నా నీ కాల్మొక్త .. బాంచన్.
- కృష్ణ చైతన్య అల్లం