పోరు చరిత by Allam Krishna Vamshi

Posted on March 18, 2010 by allam.
Categories: telangana.

జై తెలంగాణాని ఉయ్యాలొ,
బతుకు పోరుజెయ్య ఉయ్యల!
మానీళ్ళు మాకోసం ఉయ్యాలొ,
మాపోరుసాగంగ ఉయ్యాల!
యాభయ్యేండ్లసంది ఉయ్యాలొ,
అణుచుకుంటిమి బాధ ఉయ్యాలొ!
మా జాగ మాకేనని ఉయ్యాలొ,
జంగు సైరనూదినాము ఉయ్యాల!
ఇన్నేండ్ల తండ్లాట ఉయ్యాలొ,
తెలంగాణ రావలే ఉయ్యాల!
నినదించి జనమంత ఉయ్యాలొ,
నిరహర దీక్షలు ఉయ్యాల!
గొంతులో పొలికేకలు ఉయ్యాలొ.
యుద్ద నాదములాయే ఉయ్యాల!
ఆత్మా గౌరవము ఉయ్యాలొ,
మేముగోరినాము ఉయ్యాల!
న్యాయపోరాటము ఉయ్యాలొ,
నిప్పుల్ల మండింది ఉయ్యాల!
కాసోజు శ్రీకాంతు ఉయ్యాలొ,
మండేటి సూర్యుడు ఉయ్యాల!
నిలువెల్లా మంటల్ల ఉయ్యాలొ,
నినాదమిడవలే ఉయ్యాల!
బలిదానలెన్నున ఉయ్యాలొ,
బతుకులు మారలె ఉయ్యాల!
మాకొలువు మాకంటే ఉయ్యాలొ,
మమ్ముల కొట్టిరి ఉయ్యాల!
యూనివర్సిటిలల్ల ఉయ్యాలొ,
ఉద్యమించే బిడ్డలు ఉయ్యాల!
ఉద్యమాల సదువులు ఉయ్యాలొ,
ఉగ్గుపాల బట్టె ఉయ్యాల!
ప్రశ్నించే దిక్కులు ఉయ్యాలొ,
గర్జించే సింహాలు ఉయ్యాల!
హక్కులు కోరితె ఉయ్యాలొ,
మక్కలిరగతన్నె ఉయ్యాల!
కొవ్వొత్తి బట్టిన ఉయ్యాలొ,
కేసులు బెట్టిరి ఉయ్యాల!

లాఠీ చార్జిలల్ల ఉయ్యాలొ,
నెత్తుర్లు పారేను ఉయ్యాల!
చిందిన నెత్తురు ఉయ్యాలొ,
పారేను పల్లెల్లొ ఉయ్యాల!
దిక్కులన్నికూడి ఉయ్యాలొ,
ఉక్కుపిడికిలై లేచె ఉయ్యాల!
చినుకులన్నీ కూడి ఉయ్యాలొ,
తుఫాను పుట్టింది ఉయ్యాల!
చిన్నోల్ల పెద్దోల్ల ఉయ్యాలొ,
చేతులన్నీ కలిసె ఉయ్యాల!
పొడిసేటి పొద్దుల్లొ ఉయ్యాలొ,
పొరుబాటన సాగె ఉయ్యాల!
బువ్వబందులు చేసి ఉయ్యాలొ,
భూమికొసం పోరె ఉయ్యాల!
బందులు చేసిరి ఉయ్యాలొ,
బలిదానలిచ్చిరి ఉయ్యాల!
డప్పుల దరువుల్ల ఉయ్యాలొ,
గుండెల సప్పుల్లు ఉయ్యాల!
ఇందరి పొలికేక ఉయ్యాలొ,
ఢిల్లీని కదిలించె ఉయ్యాల!
అమ్మగారీ దూత ఉయ్యాలొ,
మాటిచ్చి పొయ్యిండు ఉయ్యాల!
ఇన్నేండ్ల త్యాగాలు ఉయ్యాలొ,
కండ్లముంగట మెదిలె ఉయ్యాల!
గడప గడపలోన ఉయ్యాలొ,
గంపెడు ఆశలు ఉయ్యాల!
కొత్తబతుకు మీద ఉయ్యాలొ,
కలలెన్నో కంటెమి ఉయ్యాల!
ఒక్కరోజూ కాలే ఉయ్యాలొ,
కుక్కలెంటావడ్డై ఉయ్యాల!
దోచుకో దొర్కక ఉయ్యాలొ,
దొంగలేకమయ్యిరి ఉయ్యాల!
తెలుగోళ్ళు ఒకటని ఉయ్యాలొ,
కల్లబొల్లికతలల్లే ఉయ్యాల!
నువ్వూ నేను అంతా ఉయ్యాలొ,
అన్నదమ్ములమంట ఉయ్యాల

ఒక్కవ్వ బిడ్డలైతే ఉయ్యాలొ,
ఒక్కతీరు లేమేంది? ఉయ్యాల!
ప్రాజెక్టులీడైన ఉయ్యాలొ,
పారేటి నెల్లాడ ఉయ్యాల!
క్రిష్ణమ్మ నీల్లుంటె ఉయ్యాలొ,
కన్నీళ్ళు మిగిలేనా? ఉయ్యాల!
గోదారి మాకుంటె ఉయ్యాలొ,
గొడ్లెందుకమ్ముదుం ఉయ్యాల!
కరువుల కోరల్ల ఉయ్యాలొ,
దూప ఆరని నేలలు ఉయ్యాల!
బీడూ జాగాలీడ ఉయ్యాలొ,
మూడు పంటలాడ ఉయ్యాల!
ఎండిన చేలల్ల ఉయ్యాలొ,
తుమ్మలు మొల్శెను ఉయ్యా

తాగునీల్లు లేక ఉయ్యాలొ,
ఫ్లోరోసిస్ రోగము ఉయ్యాల!
అన్నదమ్ములమైతె ఉయ్యాలొ,
ఒక్కోలే లేమేంది? ఉయ్యాల!
బొగ్గుబాయిల నేను ఉయ్యాలొ,
బెంజికారుల నువ్వు ఉయ్యాల!
దుబాయి వలసలు ఉయ్యాలొ,
ఎన్నెన్ని తిప్పలు! ఉయ్యాల!
మా కొలువుల్ల నువ్వు ఉయ్యాలొ,
కులికేటి దొంగవు ఉయ్యాల!
ఒకనెంట ఒకడచ్చి ఉయ్యాలొ,
ఒదిగినారిక్కడే ఉయ్యాల!
బతుక వలుస మాది ఉయ్యాలొ,
వలసొచ్చి నువు బలిసె ఉయ్యాల!
మాయలు మంత్రాలు ఉయ్యాలొ,
రియలేస్టేటు దందాలు ఉయ్యాల!
ఏకులోలెవచ్చి ఉయ్యాలొ,
మేకులై కూసుండే ఉయ్యాల!
గులాము నేనైతె ఉయ్యాలొ,
దొరబాబు నువ్వైతివి ఉయ్యాల!
నా భాష,యాసలు ఉయ్యాలొ,
ఎగతాళి నీకాయే ఉయ్యాల!
అక్కవే నువ్వైతే ఉయ్యాలొ,
నక్కబుద్ధులేల ఉయ్యాల!
బలిదానాలీడ ఉయ్యాలొ,
బలుపు పోరులాడ ఉయ్యాల!
లాఠిదెబ్బలీడ ఉయ్యాలొ,
లాబీయింగు లాడ! ఉయ్యాల!
నువ్వు-నేను ఇద్దరు ఉయ్యాలొ,
ఖచ్చితంగా వేరు ఉయ్యాల!
తూటాలు తిన్నోన్ని ఉయ్యాలొ,
తెలంగాణోన్ని నేను ఉయ్యాల!

ఓట్ల బిచ్చపోడు ఉయ్యాలొ,
మా నోట్ల మన్నేశే ఉయ్యాల!
పాణాలు పోతున్న ఉయ్యాలొ,
పదవీకె అతికీరి ఉయ్యాల!
మంటల్ల మండిన ఉయ్యాలొ,
మాటముచ్చటలేదు ఉయ్యాల!
ప్రజాబంధువులు ఉయ్యాలొ,
రాబందులనిపించే ఉయ్యాల!
నాలుక్కొట్లామంది ఉయ్యాలొ,
నక్షలైట్లు అనె ఉయ్యాల!
నాదు స్వతంత్ర్యపోరాతం ఉయ్యాలొ,
నక్షలైట్లె చెశిన్ల? ఉయ్యాల!
మా బతుకు మాకంటె ఉయ్యాలొ,
తప్పెందుకయ్యింది? ఉయ్యాల!
కొలిమంటుకున్నంక ఉయ్యాలొ,
కమిటీలు యెశిన్లు ఉయ్యాల!
కమిటీల పేరున ఉయ్యాలొ,
కాలరాశె చూపు ఉయ్యాల!
అరచేతి అడ్డుతో ఉయ్యాలొ,
సూరీడు ఆగునా? ఉయ్యాల!
ఒక్కొక్క కణమెల్లా ఉయ్యాలొ,
రణభేరి మ్రోగిస్తం ఉయ్యాల!
తల్లడిల్లిన తల్లి ఉయ్యాలొ,
కన్నీళ్ళు తుడుస్తం ఉయ్యాల!
నిలువెల్ల మాకండ్ల ఉయ్యాలొ,
తెలంగాణ సూస్కుంటం ఉయ్యాల…..
జై తెలంగాణ! జై జై తెలంగాణ!!
-అల్లం క్రిష్ణ వంశీ
[మొన్న 2009 యేడాది చివరలో తెలంగాణ ఉద్యమం ఉగ్రరూపం దాల్చినప్పటి నుండి తెలంగాణలొ ఇవ్వాల్టి (మార్చి 10,2010) వరకు జరిగిన పరిణామాలను గూర్చి చెప్పాలని చేసిన చిన్న ప్రయత్నం ఈ పాట.... ఉయ్యాల పాటలు తెలియని తెలంగాణొల్లు ఉండరన్నది వాస్తవం, మా తెలంగాణ బిడ్డలందరికి ఈ పాట అంకితం]

Archives

Telangana Pata, Oyavva Nayavva: Folk Song on Relations

Posted on March 15, 2010 by allam.
Categories: Telangana Pata.

Telangana Pata: Esha Nagula Katta: Folk Dance

Posted on by allam.
Categories: telangana.

Telangana Pata: Gollamallamma Kodala; Kolatam

Posted on by allam.
Categories: Telangana Pata.

Reading List on Telangana Issue

Posted on by allam.
Categories: telangana.

HRF on Telangana Issue(Human Right Forum)

Prof. Haragopal Article from a Rights Perspective

Pulichintala – A Test Case, K. Balagopal (Indian Express, 16-6-2001)

About Kaveri and Krishna – K. Balagopal (Indian Express, 22-10-2002)

The Historical Context of Andhra And Telangana, 1949-56 (EPW)

EPW Editorial (Dec, 2009) on Telangana Demand

EPW Editorial : Questioning Linguistic States

Myth and Reality: The movement for Telangana – Revathy et al.

APHDR_2007_Agrarian Economy of AP

Why Telangana ? Why now? – Anil Kumar (EPW)

Planning Commission Report on Development in AP

Political Articulation and Election Discourse in AP, 2004 ( K Srinivasulu)

Some Contemporary Trends – Seminar in AP (EPW)

Cropping Pattern in Andhra Pradesh in 1990s: Micro-level Studies

Agricultural Growth and Irrigation in Telangana, Review of Evidence – Vamsi Vakulabharanam

Telangana’s Agricultural Growth Experience-Venkatnarayana, V Jain (EPW)

Of Canals, Tanks and Wells (Telangana Region Case study)

Telangana: Irrigational Disparities in Andhra Pradesh

Inclusive Growth in AP – Regional Disparities, Poverty, Challenges – Mahendra Dev, CESS

Falling into Poverty in AP (EPW) – Interesting comments about Northern Telangana

Movement for Telangana State: Struggle for Autonomy, Kodandram (EPW)

Rice Cultivation in Telangana, Veronique Alary (EPW)

Polavaram: Major Loss, Minor Gain – Rama Mohan

Telangana: Righting Historical Wrongs or Getting the Future Right, Anand Maringanti, 2010

The Local and the Global in Hyderabad Development, Sanjay Baru

APHDR_2007_District Levels Indices

Trends in AP Poverty: 1973-74, 1999-2000 ( Sudhakar Reddy, Galab et. al, EPW)

Is Economic Inequality a Foundation for Separatist Identity, Dean McHenry Jr.

Rich Peasant ,Poor Peasant – Balagopal, Seminar

Democratic Process and Electoral Politics in AP,  KC Suri

Dimensions of Agrarian Distress in Andhra Pradesh  (K C Suri, EPW)

Political Economy of Agrarian Distress ( EPW), KC Suri

Caste, Class and Social Articulation in AP, Mapping Differential Trajectories, K Srinivasulu

The Farmer-Capitalists of Andhra Pradesh, Carol Upadhaya, Part I

The Farmer-Capitalists of Andhra Pradesh, Part II – Carol Upadhaya

River Water Politics in Drought Prone Telangana, S Simhadri (EPW)

Globalization and Farmers Suicides in Warangal, Sudha

Farmer’s Suicides – Missing Issues, Revathi (EPW)

Is Rural Economy Breaking Down, Farmers Suicides – EAS Sarma (EPW)

Understanding Powerloom Weavers Suicides in Sircilla – Galab, Revathi (EPW)

Irrigation, Agrarian Change and Local Politics in Southern Telangana, 1960-1996 Anil Kumar (Nalgonda Field Study).

Telangana Movement( 1948) Revisited, K Balagopal (EPW)

Economic Liberalization and Indian Agriculture – Good Summary

To Free or Not Free Agriculture – Good Article on Ground Irrigation

GroundWater Irrigation vs Surface Irrigation (Dinesh Kumar et al.)

Pani Panchayats: Has notes on Irrigation Reforms in AP

Status Paper on Rice

Jalayagnam (AP Government Perspective)

Jalayagnam and ‘Bridging’ Disparties – Ratna Reddy (EPW)

Food Security in AP (Detailed Regional Analysis)

Educational Deprivation of Children in AP – M Venkatnarayana

Primary Education: Progress and Constraints – V Ratna Reddy, R Nageswar Rao (EPW)

Dubious Bounty to Telangana (Education in NTR era) – Shaturgna

Business and Manufacturing Sector in AP – Alivelu, K. Srinivasulu, M Gopinath Reddy

News, Telvision and Democracy (Padmaja Shaw)- Discusses Media in Telangana

Diversification of Rural Incomes : Village Level Field Study – Rawal et al.

Rayalaseema : K Balagopal

Source: http://telanganaissue.wordpress.com

Invincible Wounds

Posted on March 14, 2010 by allam.
Categories: telangana.

తెలంగాణ ఉద్యమాన్ని ఖాకీ జులుం, కత్తుల వంతెనకుమించిందేదో భంగపరిచింది. తుపాకీ తూటాలనూ మింగేందుకు కూడా సిద్ధమైన యువరక్తాన్ని, మనసును వాటిని మించిన సున్నితాంశమేదో గాయపరిచింది. అణచివేత కేవలం తూటాలు, లాఠీలతోనేకాదు. ఆలోచనలను అణచివేసే కుట్ర ఏదో జరిగింది. అది తెలంగాణ లేత మనసుల నూ తీవ్రంగా గాయపరిచి ఉంటుంది. ఎవరుగాయపరిచారీ సారి తెలంగాణను.
శ్రీకృష్ణ కమిటీ లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో విద్యార్థులు ఆత్మహత్యలుచేసుకోకూడదని, సమస్యల పరిష్కా రానికి తామున్నామని నమ్మ బలుకుతున్న సమయానికే వరంగల్ జిల్లాలో ఇద్దరు అమ్మాయిలు చనిపోతున్నారు. ఈ ఇద్ద రూ తెలంగాణ ఏర్పాటులో జాప్యం భరించలేక అంటించుకున్నారు. ఒకరిపేరు సవేరాబీ. ఇరవై ఏళ్లు. ముస్లింలు తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? తటస్థమా? అసదుద్దీన్ ఒ వైసీ, అక్బరుద్దీన ఒవైసీలు తెలంగాణ కోరుకుంటున్నారా? లేదా? అని మీమాంసలు చెలరేగుతున్న సమయ, సందర్భంలోనే సవేరాబీ ఆత్మహత్య చేసుకున్నది.తెలంగాణ కోసమే.
ఎట్లా అర్థం చేసుకుంటారో..మీ ఇష్టం అని ఆమె ముస్లిం సోదరులందరికీ ఒక సవాల్ కూడా విసిరింది. మరో అమ్మాయి సౌజన్య. మరీ తొమ్మిదవ తరగతి అమ్మాయి. ఏం చెప్పాలీ ఆత్మహత్యలకి.. కారణాలేవి వెతకాలి. జగిత్యాలలో అగుళ్ల వీరస్వామి ఇట్లాగే తెలంగాణ వస్తదా? రాదా? అని అగులుబుగులై ఆత్మహత్య చేసుకున్నాడు. సరే.. ఇంత వివరంగా మరో సారి ఈ ఆత్మహత్యల సంగతి మాట్లాడడానికి కారణం ఏమిటి? ఈ సారి అణచివేత నేరుగా లేదు. ఈసారి దగా సాఫ్ సీదాగాలేదు. ఈసారి మోసం నాజూగ్గా ఉంది.
నలభై సంవత్సరాల క్రితం తెలంగాణ ఎగసిపడినప్పుడు ఇది గుర్రం.. ఇది మైదానం.. తెలంగాణ ఇచ్చేది లేదు అని సూటిగా తుపాకులతో జవాబిచ్చారు. కాసు బ్రహ్మానందరెడ్డి- ఇందిరాగాంధీ. విద్యార్థులు, నవనవోన్మేషమైన కలలునే యువకులూ ఇదే హైదరాబాద్ వీధుల్లో, రాజ్‌భవన్ దారుల్లో, సికింద్రాబాద్ క్లాక్ టవర్ కార్నర్‌లో గుంపులుగా తుపాకులకు ఎదురేగి మరణించారు. వాళ్లకి ద్రోహం అప్పటికి తెలియదు. తెలంగాణను స్పష్టంగా ఎవరు వ్యతిరేకిస్తున్నారో? తెలుసు. మలబారు పోలీసులతో సహా ఛప్పన్నారు బలగాలను ప్రయోగిస్తారనీ తెలుసు.
తమ కలను ఉక్కుపాదంతో క్రూరం గా అణచివేస్తారనీ తెలుసు. అయినా వాళ్లు మృత్యువుకు ఊరేగింపుగా ఎదురేగిన అప్పటితరపు సాహసికులు. కానీ నలభై సంవత్సరాల తరువాత ఇప్పటి తెలంగాణకు శత్రువులెవరు? మిత్రులెవరు? ఎవరు తెలంగాణ ఇచ్చేవారు. ఎవరు తెలంగా ణ తెచ్చేవారు. ఎవరు నిజాయితీ పరుడు. ఎవరు ఆత్మలను, తల్లులను, తల్లుల క్షోభను, కన్నీళ్లను అమ్ముకునేవారు. హఠాత్తుగా విందులో కనబడిన మనుషులు ఎవరు? విందులు, విజ్ఞాపనలతోనే తెలంగాణ వస్తే ..మరి రెండువందల పైబడి న ఆత్మహత్యలకు కారకులెవరు? చివరికి తెలంగాణ ఒక కి టీ ముందర మోకరిల్లి మరోసారి మరోసారి అడుక్కోవడమే నా? సాధించింది.
మరణించిన వారి గురించి కదా మాట్లాడుకోవలసింది. ఎవరు ప్రారంభించారు. ఎందుకు? మలుపులు తిప్పారు? ఎవరు నమ్మబలికారు. చిదంబరం తొమ్మిదో తారీ ఖు మాటకూ.. శ్రీకృష్ణ కమిషన్‌కూ సాపత్యం ఏమిటి? ఎవరు గెలిచారు. ఎవరు ఓడారు. బహుశా నమ్మిన వాళ్లు. నమ్మక తప్పని వాళ్లు మోసపోయి ఉంటారు. భంగపడి ఉంటారు. ఎవరి నిత్య జీవితాల్లో వారు.. ఎవరి యావల్లో వారు.. ఎవరి అభిరుచుల్లో వారు. ఎవరి ప్రణాళికల్లో వారు.. క్షణ విరామం లేకుండా తిరుగాడుతున్నప్పుడు .. ఎవరో ఒకరు ఎగదోసే మంటల్లోకి స్వచ్ఛందంగా పరిగెత్తే ప్రవాహమౌతున్న వాళ్ల గురించి కదా.. మాట్లాడుకోవలసింది.
అంతిమ క్షణాల్లో .. ప్రతివాడూ ద్రోహే. అంతిమ సారాంశంలో ప్రతివాడూ..మోసగాడే. ఇస్తానన్నవాడు ఇవ్వడు. ఛస్తానన్నవాడు ఎన్నడూ చావడు. గొంతులు కోసుకునేవాళ్లూ కోసుకోరు. తలలు తెగిపడేవీ.. కనబడు. ఉత్తబోలు మాటలు. రెండువందల పైచిలు కు ఆత్మబలిదానాలు చూడడానికి కళ్లులేని కబోది ఒక కమిటీ. ఏం వింటారు. సామాన్యులను? విభాత సంధ్యల్లో నలిగి నీలుగుతున్న సామాన్యుడి మూలుగుని వినేందుకు కమిటీలకు చెవులుంటాయా? చెవిటి కమిటీల ముందు ఏ శంఖారావాలు ఊదితే తెలంగాణ వస్తుంది.
ఏ బలిదానాలనూ గుర్తించని కమిటీలు ఆ బలిదానాల మూలకారణలైన ఆకాంక్షలనేమి గుర్తిస్తుంది. అణచివేత ఈసారి కుట్ర పూరితంగా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగిసిన తరంగం లాంటి. అలలు అలలుగా ఎగిసిన పల్లెల తుపానులను పసిగట్టేందుకు కమిటీకి ఉన్న సాధనాలేమిటి? చివరికిలానూ మిగులుతాం.. వీధులు ఖాళీగా.. వెలిగిన దీక్షా శిబిరాలు మలిగిన దీపాలుగా. బతుకమ్మలు నీళ్లులేని చెరువుల్లో, దొరువుల్లో నిమజ్జనమైనట్టుగా. అంతా గప్‌చుప్‌గా. జరగాల్సిందేదో జరిగినట్టుగా. నిజమే. ఎవరి కాళ్లకాడికి ఆత్మగౌరవాన్ని తీసికెళ్లేందుకు ఈ ఉద్యమా లు.
కన్ీళ్లనూ కల్మషం చెయ్యగల శక్తిగల ఏ రాజకీయంలోకి మళ్లించేందుకు ఎందుకీ నెత్తుటి తర్పణలు. పోరాడనివానికి కదా.. పోరాటం లేనివాడికి కదా. ద్రోహ చింతన. తెలంగాణ మేల్కాంచిన ప్రతిసారీ జరిగేదే జరుగుతుంది. పిలుపులిచ్చే వాళ్ళిప్పుడు ఎక్కడ దాక్కుంటారు. పొలికేకలు పెట్టిన రాజకీయుడిప్పుడే కమిటీల ముందు మోకరిల్లుతాడు. రేపెట్టిన వాడిప్పుడు ఏ ఆత్మ బలిదానాలకు సమాధానం చెబుతాడు. అంతిమ యాత్రల్లో నిందితుల ఆనవాళ్లు. మోసగాళ్లు పన్నిన వలల్లో పడుతున్న ఉద్యమాల చేపలు.
తెస్తానన్నవాడు,ఇస్తానన్నవాడు, అరచినవాడు, కేకలేసినవాడు, నినాదం మొలిపించినవాడు, నాటినవాడు.. రెండువందల పైచిలుకు బలిదానా ల భారం నుంచి మాట్లాడే వాళ్లకు సమాధానం చెప్పవలసే ఉన్నది. ఒళ్లు చిట్లేలాగా.. తలలు పగిలేగా.. కుట్లు పడేలాగే.. లాఠీలు మింగిన వాళ్లకు సమాధానం చెప్పవలసే ఉన్నది. పచ్చికుట్లు. గాయం సలుపుతున్నది. చెప్పండి మితరులారా. కమిటీలకు మించిన అణచివేత ఏముంటుంది. కమిటీలకు మించిన సాచివేతలేముంటాయి. చిదంబరం మాట ప్రధాని పలుకుతాడు.
పిల్లీ.. ఎలకలకు.. విడిపోయే మొగుడూ.. పెళ్లాలకు మధ్య కన్సెన్సస్.. ఏకాభిప్రాయం. ఒక ప్రాంతాన్ని అణచివేస్తూ.. ఒక ప్రాంతాన్ని నిలువునా దోపిడీ చేస్తూ ఒక ప్రాంతాన్ని విధ్వంసం చేస్తూ.. బతుకులతో ఆడుకుంటున్న మెజారిటీ ప్రాంతానికి పది జిల్లాలకూ మధ్య కన్సెన్సస్. గుప్పెడు మంది ప్రలోభాలకు, నాలుగుకోట్ల మంది జనాభిప్రాయానికీ మధ్య కన్సెన్సస్.
ఈసారి అణచివేత ఏకాభిప్రా యం రూపంలో ఉండవచ్చు. ఏకాభిప్రాయం ఎన్నడూరాని ఒక ఎండమావి కూడా కావొచ్చు. ఇంతకీ ఇది ఎన్నో కమిటీ.. దశావతారం అంతిమ పరిష్కారం ఏమి చూపుతుంది? పెద్దమనుషుల ఒప్పందాల నాడే ప్రారంభమైన దగాకు యాభై నాలుగేళ్లు. ఎన్నిసార్లు చెప్పాలి మోసాన్ని. సోనియా కాళ్ల ముందు మోకరిల్లినా.. చంద్రబాబు కుడికంటి కింద కాపురాలెట్టనా.. వస్తుందా? రాదా? తెలంగాణ. ఇప్పటి తెలంగాణ దెబ్బతెలియని, గుబ్బతేలని దొంగదెబ్బలకు బలవుతున్నది.
ఇది మనసున పట్టకనే కదా. సవేరాబీ స్వంత పరిష్కారం వెదుక్కున్నది. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. మేల్కొనే వరకే సమస్య. ఒకసారి మేలుకొలుపు తర్వాత.. తెలుగు ప్రజలారా.. ఇక విభజన తప్పదు. విభజన జరగనప్పుడు.. విభజన ఆగినప్పుడు వికృత శిశువులు జన్మిస్తాయి. ఆత్మహత్యలు , హత్యలు కాకూడదని కోరుకునే వాళ్లందరమూ.. అంగీకరిద్దాం. కమిటీ లో… కన్సెన్సస్‌లో ఏదో ఒకటి తెలంగాణ విడిపోతేనే ఎనిమి ది కోట్ల తెలుగు జనానికి అన్ని రకాలా మంచిది. తెలంగాణ న్యాయవాదులు ఎట్లాగూ చూపారు దారి. ఉద్యమం కొనసాగుతుంది. అది చనిపోయిన వాళ్ల ఆత్మలను సజీవ పతాకలుగా ఎగరేస్తుంది.

Source: Andhra Jyothy Daily. Editorial.

యాదయ్యలు బతుకాలె

Posted on by allam.
Categories: telangana.

యాదయ్య ముఖం యాదికస్తున్నదా.. ముద్దుగా.. ధృఢంగా.. ఆరోగ్యంగా.. అతను మంటల్లో ఎగురుతూ.. ఎగురుతూ.. ఏ మాత్రం తూలిపోకుండా.. కూలిపోకుండా.. పరిగెట్టడం.. మీ మనసు పీడకలలు కంటున్నదా. గాయపడినట్టుగా ఉన్నదా. మనసు. నిజమే. ఆత్మహత్యలను కీర్తించలేము. నిజమే ఆత్మహత్యలు వీరత్వమూ కాదు. అమరత్వ మూ కాదు. యాదయ్యను ప్రాణం తీసుకోవడానికి పురికొల్పిందేమిటి? యాదయ్య మంటల్లో కాలుతున్నప్పుడు.. కూలుతున్నప్పుడు తెలంగాణ ప్రజానీకం పీడకలలు కంటుంటే.. రాజకీయ నాయకత్వం ఏమి కలలు కంటున్నది.
ఇప్పుడిక ఆంధ్రా యూనివర్సిటీ అమాయకపు ముఖాలు. ఆ ఆడపిల్లలంటే కొండంత గౌరవం పెరుగుతున్నది. యాదయ్య మరణాన్ని వాళ్లు గుర్తించగలిగారు. అతని ఆత్మహత్య వెనుక గల త్యాగాన్నో, సాహసాన్నో.. తెలియని తనాన్నో, మనసులో ఒకే అంశంమీద కలిగిన మథనాన్నో. మంటల్లో మాడిపోయిన నిరసననో ప్రకటించిన యాదయ్య మనసును వాళ్లు పసిగట్టి ఉంటారు.
యాదయ్యకు ఆ నిష్కల్మషమైన మనసుగల ఆడపిల్లలు కొవ్వొత్తులతో.. నివాళులర్పించారు. పిల్లలు.. పిల్లలు కాదు.. వాళ్లు తల్లిదండ్రులు అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే అని ఉండవచ్చుగాక.. కానీ పిల్లలెక్కడైనా పిల్లలే.. స్వార్థం లేని వాళ్లు.. సాహసాలు చేయగల వాళ్లు.. అందరి శ్రేయస్సు కోసం ఆత్మార్పణం చేసుకోగలిగిన వాళ్లు.. నమ్మిన విశ్వాసాల మీద గురితప్పని వాళ్లు.. జీవితం అంటే కుట్రలూ.. చిన్ని బొజ్జల శ్రీరామరక్షలు. తను.. తన చుట్టూ వ్యాపించిన ముళ్లజెముడు స్వార్థాలు తెలియని వాళ్లు.. తెలంగాణ ప్రాంతపు ఒకానొక కాంగ్రెస్ నేత ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోండి.
తెలంగాణ ప్రాంతపు ఒకానొక తెలుగుదేశం పార్టీ నాయకుడి ముఖాన్ని గుర్తుకు తెచ్చుకోండి. అసెంబ్లీ ముట్టడిలో విద్యార్థులు..బారికేడ్లు దాటుతున్నప్పుడు, తన్నులు తింటున్నప్పుడు.. రోడ్డుమీద బైఠాయిస్తున్నప్పుడు.. తలలు పగిలినప్పు డు.. ముఖం మీద చారికలా నెత్తురూ.. చెమట పారుతున్నప్పుడు.. రబ్బర్ బుల్లెట్లు ఎగిరి వస్తున్నప్పుడు.. బాష్పవాయువుకు అడ్డంగా ఉల్లిగడ్డలు పెట్టుకుని యుద్ధరంగంలో పోరాడుతున్నప్పుడు.. శాసనసభలో కూచు ని.. ఏదో ఒకటి తీవ్రంగా చర్చిస్తూ.. చర్చిస్తూ.. విసుర్లకు.. మాటలకు.. వ్యంగ్యాలకు.. ఛలోక్తులకు స్పందిస్తున్నప్పుడు, పడిపడీ నవ్వుతున్న ఆ ముఖాలను గుర్తుకు తెచ్చుకొంటే మీకేమన్పిస్తున్నది.
వికారంగానా? అసహ్యంగానా? అంతకన్న మించి.. ఏదన్నానా? కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలిసినట్టు.. కళింగాంధ్ర భవన్‌లో రాజకీయం ఒకే దిక్కున గుమికూడ్తున్నప్పుడే.. గుంపు కడ్తున్నప్పుడే.. గొట్టాల ముందర పోటీ పడ్తున్నప్పుడే.. వేదికంతా.. వరుసలు వరుసలుగా ఆక్రమించుకుంటున్నప్పుడే.. ఈ రాజకీయ గుంపు.. దేనిమీదనో వాలబోతున్న …రాబందుల్లా గోచరించడం ఎవరి లోపం కాకపోవచ్చు.. మొదటి రోజే పసిగట్టినప్పటి కీ.. శవాల మీద పేలాలు.. నాణేలు ఏరుకునే ఒక గుంపు.. మొత్తం.. ఉద్య మం నిండా వ్యాపించింది.
ఎంత సొల్లు.. ఎన్ని ప్రగల్భాలు. ఎన్ని ఆవేశకావేశాలు.. ఒక్కొక్కరు ఒక.. విప్లవకారుడు.. ఒక్కొక్కరు ఒక తత్వవేత్త.. ఒకరనికాదు. ఎవరూ మినహాయింపు కాదు.. యాదయ్య ఎందుకు చనిపోయినట్టు.. నిలువు నిలువునా.. అతని విశ్వాసాన్ని.. అతని నమ్మకాన్ని.. అతని సంసిద్ధతను.. అతని ఊరేగింపులో జెండా ఎత్తుకొని నాభిలోంచి నినాదాలివ్వగలిగిన తత్వాన్ని.. ఓటమి అంగీకరించని అతని క్రీడా మనస్తత్వాన్ని ఎవరు హరించినట్టు.. ఒక చెట్టులా ఎదగాల్సిన మొక్కకు.. ఎందుకట్లాంటి మనోవైకల్యం కలిగినట్టు.. ఇప్పుడు మళ్లీ గుర్తుచేసుకోండి..
వేణుగోపాల్‌రెడ్డి శవం మీద.. ఆనలు.. ప్రతిజ్ఞలు.. కన్నీళ్లు.. చితిమంటలు నాల్కల కొసలు ఆకాశం అంటుతుండగా.. అంతు లేకుండా సాగిన ప్రగల్భాలు.. ఏం మాట్లాడాలిప్పుడు.. యాదయ్య ఎందుకు ‘హోప్’ కోల్పోయాడు.. యాదయ్యను చావవద్దని చెబుతున్నవాళ్లమంతా.. అతని నమ్మకాన్ని లాగేసిన వాళ్ల గురించి ఎందుకు మాట్లాడము. తెలంగాణ తెచ్చేది.. ఇచ్చేది వాళ్లే.. కానీ.. ఒకే ప్రభుత్వంలో పట్టుచీరలు.. తెల్ల ఖద్దరు ధరించిన మంత్రులు.. మహనీయ శాసనసభ్యులు కనీసం ఆగమేఘాల మీద ప్రభు త్వం హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకు వెళ్లడాన్నీ.. నిరసించలేరు.
స్వయంగా చిదంబరం ప్రకటించినా.. విద్యార్థుల మీద కొత్త కేసులు పెట్టి నా స్పందించరు. ఉన్న కేసులు సరే. మారు మాట్లాడితే కేసంటున్న పోలీ సు శిబిరాలను ఆదేశిస్తున్న ప్రభుత్వంలో భాగస్వాములైన తెలంగాణ కాంగ్రెస్ రాజకీయవేత్తలు.. రెండు నాల్కలు.. రెండు కళ్లు.. మూడు కోర లు… ఏం మెరుగుపడిందని.. మూడు నెలల పోరాటం.. నాలుగు కోట్ల మంది పోరాటం.. రోడ్డెక్కిన తెలంగాణకు.. రెండు వందల పైచిలుకు బలిదానాలకు.. ఉద్వేగాలు.. భంగపాట్లు.. భగ్న హృదయాలు, కల్లోలమైన జీవితాలు.. స్తంభించిన కార్యకలాపాలు.. ఏమి తెచ్చాయి తెలంగాణకు.. ఉత్త కమిటీ.. చివరకు మిగిలింది.
ఉత్త శ్రీకృష్ణ కమిటీ.. శ్రీ కృష్ణార్పణం అయిన తెలంగాణ తెగువ మున్నెన్నడూ ఎరగని పోరాట ఆరాటాలు.. త్యాగాలు. చివరికి ఏమి సాధించాయి. శ్రీకృష్ణ కమిటీ.. మాటలు మార్చిందెవరు. మళ్లీ తెలంగాణను ఏమార్చిందెవరు? సరిగ్గా నలభై సంవత్సరాల తర్వాత పరిస్థితులు అదేలా మారుతూ.. మారుతుండడానికి బాధ్యులెవ రు.. యాదయ్య ‘హోప్’ను తుంచేసిందెవరు? కాంగ్రెస్ పార్టీయా? తెలంగాణ అని మంత్రం జపించి తప్పుకున్న తెలుగుదేశమా? ప్రజారాజ్యమా? ఎవరు యాదయ్య నమ్మకాన్ని కాలరాశారు.
ఇప్పుడిక ఆత్మహత్యల సారాంశం గురించి మాట్లాడుకుందాం. హంతకులెవరు? ప్రతి ఆత్మహత్యా.. సామాజిక హత్యే.. అవును ఏ సామాజిక పరిస్థితులు తెలంగాణ లో ఆత్మహత్యలకు.. బలిదానాలకు కారణం అవుతున్నట్టు? ఏ మోసాలు.. ఏ కుట్రలు.. ఎవరు.. అయినా.. సీమాం ధ్ర రాజకీ య నేతలంటే ఎంత అసూయ కలుగుతున్నదో? వాళ్లు వాళ్ల ప్రాంతం కోసం మాట్లాడుతున్నారు. వారి వారి స్వీయ ప్రయోజనాల కోసం నిలబడ్తున్నారు.
కనీసం ఒక ప్రాంతం లేని..ఒక రీతిలేని నేత ల గురించీ ఇప్పుడు అంటున్నది.. విడిపొయ్యే వాళ్ల ను కలిసి ఉండాలనడం ఎంత అనైతికమైనా.. ఆ అనైతికతలోనూ ఒక్కటిగా ఉన్న సీమాంధ్ర నేతలను చూసి ముచ్చటేస్తున్నది.
అన్యాయాలు, అవమానాలు.. వివక్ష.. వనరుల దోపిడీ.. న్యాయబద్ధమైన, నైతిక ధృతి కలిగిన ఒక ప్రజా ఉద్యమం వేపు కనీసం నిలబడే తెగువ లేని నేతలను ఏమనాలి? చివరికి మిగిలింది.. రాజకీయ నేతల పచ్చిద్రోహం అయినప్పుడు.. ఇట్లా జరుగుతుందని తెలిసీ హెచ్చరించనందుకు.. ఇట్లా జరుగుతుందని తెలిసీ మళ్లీ రాజకీయ మోస క్రీడకూ ఉద్యమానికీ లంకె పెట్టిన వాళ్ల మీదా.. ఆగ్రహం.. వద్దు.. ఇక చాలు.. మునిగే వాళ్లుంటే.. ముంచుతారు..
వలసల ప్రపంచంలో నేతలూ బానిసలే.. నేతలవీ బానిస బుద్ధులే.. నిటారుగా నిలబడేది.. నిలబడ్డది జనమే… మంచి దో.. చెడ్డదో.. ఒక ఉద్యమం నడుస్తున్నది.. దాన్ని నమ్ముకోవడమే ఇప్పుటి తెలంగాణ జనావసరం.. ఏలికల బానిసలను.. వదిలేయండి.. అణచివేత.. సాచివేతలకు వ్యతిరేకంగా నిలబడ్డవాడే మొనగాడు.. భవిష్యత్ వాళ్లదే.. యాదయ్యలకు అప్పుడు మాత్రమే విశ్వాసం ఇవ్వగలం.. అప్పుడు మాత్ర మే యాదయ్య ఆత్మహత్యల మీద మాట్లాడగల అర్హత పొందగలం. అదొక్కటే.. యాదయ్యలను బతికించగలదు. యాదయ్యలు బతుకాలె.

 

Source: Andhra Jyothy Daily, editorial

Telangana Patalu

Posted on March 13, 2010 by allam.
Categories: telangana.

1,Poddu Poddula; Beautiful Folk Song HD

About this song:

Singer puts his soul into words and words like Gobbiyaalo with continuity gives a spectrum of radiance to feel that village morning, takes us to that morning .Describes it with detail. Misses his love of life with the world around him and how it makes him happy, and sad. Such a beautiful piece of Telangana folk..
Lyrics:
పొద్దు పొద్దులు రెండు పొద్దుల్లె రెండు యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..2
పొదలా మీదా ఆలిన తుమ్మెదలే రెండో యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..2
తుమ్మెదలా సప్పుడు ఇంటె గుండె ఝల్లుమన్నాడొ నా మరదలు గుర్తుకు వచ్చినాదో ..
వరదల్లే నా మనసుల పొంగిపొరలుతున్నాదో..
||పొద్దు ||..
||పొదలా మీదా||
గంగమ్మ అలలా మీద గవ్వలు తేలినట్టో ..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
వంగిన పైరు మీద గువ్వలి ఆలినట్టో..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
నా మదిలో జేరి నా మల్లి ఆటలాడుతంది..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
గడియ కూడ నన్ను ఇడిసి ఉండలేనంటంది..నాతో సరసాలాడుతుంది..
తెల్లవారుతుంటె నాకు కలవరమనిపించింది..కలగన్నానని తెలిసింది.. 
||పొద్దు ||..
||పొదలా మీదా||
..
సుక్కాలన్ని పోయి సూర్యుడచ్చే యాలో..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..
ఆ పువ్వులన్ని పూసి పరిమళించే వేళో..యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..
పొద్దు పొద్దునా మల్లి ముద్ద మోము సూడొ.. యవ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో..
నిలువెత్తు నా మల్లి రూపాన్ని సూడంగ రెండు కళ్ళు సాలవాయే.. 
నీలాల కురులు సూత్తె మనసే నిలువదాయె.. తనువంతా తడబాటాయె..
||పొద్దు ||..
||పొదలా మీదా||
కొండా కోనల్లో కూసె కోయిలమ్మలాలో వ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
పొంగి పొర్లుతున్న వాగువంకలాలో వ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో.
నింగీ వైపెగురుతున్న పాల పిట్టలాలో..వ్వన్నా ఓయిలాలో గొబ్బియాలాలో. 
యాడ ఉందో నా మల్లి జాడ తెలుపరమ్మా.. నాపై జాలి సూపరమ్మా..
ఎంతాని వెతకాలమ్మా అలసి పోయానమ్మా..నా మల్లీ ఎక్కడుందమ్మా.. 
||పొద్దు ||..
||పొదలా మీదా||
||పొదలా మీదా||
||పొద్దు ||.

2,Yememi Kayappune, Batukamma Song

3, Veerulara Vandanam

About this song:

Veerulara Vandanam, A Well known song during the December Telangana Movement A song that salutes the Telangana Martyrs. It was sung everywhere in Telangana Movement, I have been trying to find this song since a while but with lot of effort one of my friend sent me this finally. Such a painful meaning deep inside.

4, Nelamma Nelamma

About this song:

One of the rare and famous songs of Telangana. A haunting melody with pain and feeling with a strong emotion in it’s beautiful lyrical magic and soul of Telangana Language.

I am guessing it was either Vimalakka, or Ma bhoomi Sandhya Garu who sung this. I am not sure. (Let me know if anyone knows it.) There in no mp3 version of this song available in internet, I have been searching this for a while too. But as I had no choice, had to use some methods to retrieve the song from telugufolksongs.com, all rights go to their website. Don’t get me wrong for stealing this song. :)

What if British demanded sumthing else before freedom

Posted on March 11, 2010 by allam.
Categories: andhra, andhra pradesh, hyderabad, jai telangana, justice, telangana.

1)British Occupied India. (Seema-Andhrites occupied Telangana, a.k.a Hyderabad State in olden Days)


2)British ruled India, and said developed us, and said we were given railways, language, better life, better scope, better rules, better life styles, and thus their So called development has been done, and development helped only those one’s who were in leading positions, and ruling positions, whoever obeyed British ruling. (Replace British with Seemandhrites, and India with Telangana, that’s what happened with the development, So called development never helped Telangana)


3)India fought for freedom. (Telangana still seeking justice and fighting)


4)British said we can not rule ourselves(Seemandhrites said we had Naxal problem, and we are innocent so we do not know how to rule. I wonder where did our self esteem vanish in their terms)


5)British always said that let us live together and solve the issues but never agreed on leaving our India to us.(Seemandhrites still saying the same, let us live together and develop our state together)


I wonder, if all the above were true, why did we fight for India, and our freedom. Don’t make any sense right. We should have let British rule us.


So you want to suggest, as British developed all the main states, let us make it a common plat form for British and for us and make our resources, and all the places which generates revenue, let us make them Union Territories for British and India and take the rest of the India our self. Same like Hyderabad issue and suggestions on it.


Why we did not do it. What if British asked the same. What if British said so? We could have given our resources and places to a common platform, and let them still steal our Indian resources?


P.S: వ్యాపారాలు పెట్టుకున్నవాల్లకు అభివ్రుద్ధి చేసావని చెప్పి రాజ్యం పంచివ్వరు

Nelamma Nelamma: Telangana Song

Posted on by allam.
Categories: telangana.

Nelamma Nelamma Nelamma

Source:

http://www.youtube.com/krishnaallam