అమ్మ

Posted on February 13, 2010 by allam.
Categories: allam narayana, amma, mother, telangana.

అమ్మ-అల్లం నారాయణ
పొద్దుతో పాటు
పంట పొలంలో పొడిచేది అమ్మ
చెమట ముత్యాల్లోకి జారి
కత్తిలాంటి మా కండల్లోకి ఇంకేది
అమ్మ నుదుట సిందూరం పువ్వు
“అమ్మా ఆకలే” అనడం తప్ప
అమ్మ కడుపులో కాసిన
ఎర్ర టెండను పట్టించు కున్నదెవ్వడు?
మొగ్గలకు రెక్కలతికిన అమ్మ
నల్ల నల్లని రేగళ్ళ నాగేటి చాలయ్యింది
కంట్లో కారు చీకట్లు దాచుకుని
వెన్నెల నవ్వుల్ని విరిసింది
పక్షుల్ని పిలిచి మాకు పాటల్ని నేర్పింది
పొగ చూరిన పాత వంట గది కావల
మాకోసం మా అమ్మ ప్రపంచం కిటికీ తెరిచింది
ప్రపంచం కిటికీ గుండా
నేను ఆవలి గట్టుకి దూకేశా
మా అమ్మ మాత్రం
వంటింటి గడప మీద శిలయ్యింది
పసుపు కుంకుమలు, తాళిబొట్టు, కాలి పట్టెడ
పాతివ్రత్య ధర్మం మీద పూర్వీకులు రాసిన పుస్తకం
సాక్షీ భూతాలుగా
మా అమ్మ వంటింటి గడప మీద శిలువ బడింది
from the anthology ‘amma’ 1997
A rendition in English
Mother
Allam Narayana
from the anthology ‘amma’ 1997
Along with the dawn
Amma used to be up in the fields.
(Her) sweat, a stream of pearls
Nurtured our muscles strong.
A red ‘sindoora’ flower on her forehead.
Except to cry “amma, I’m hungry”,
Who amongst us cared about
The ruddy glare of the Sun in her belly?
Amma, who adorned the buds with petals (wings)
Became the path of the plough in the black earth.
She hid the blackest darkness in her eyes,
Yet bloomed with moon light smiles.
She called the birds to teach us songs.
Beyond the old sooty kitchen
She opened the world’s window for us.
Through this world window
I jumped out onto the other side.
But my mother
froze as a rock on the kitchen entrance.
Turmeric, Sindoor, tali, and anklets*
And the book written by ancestors on the duties of a good wife,
With these as witnesses
Amma got herself crucified on the kitchen entrance.

Note 1: * all these are symbols of a married hindu woman

Note 2: This Telugu poem uses so many images and references unique to Telugu language that I found it extremely difficult to render in English. So, sorry for the shoddy job. I hope the English version gives at least a hint of the feeling in the original.


Source: tramesh’s tripod