ఒకసారి, కాళోజికి కొద్దిగా సెహత్‌ బాగాలేకుండె.  ఏదీ తినబుద్ధి కాకపోతుండె.  తిండి సహించకపోవుడు. ఏదీ తినకపోవుడు, డాక్టర్‌ లక్ష్మణమూర్తి ”మీరు తినాలెనండి, తినకపోతేఎట్ల” అని అనుడు.

Read more

మనకు జీవితంల చాలామంది వ్యక్తులు తలుగుతుంటరు.  కొందరు చానా ఖచ్చితంగ మాట్లడుతరు.  అవుతలవాడు ఏవన్నా అనుకోని అని.  కొందరేమో, ఎటు అంటకుండా, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరిగినట్లు మాట్లాడుతరు.

Read more

వెనుకటి రోజులల్ల వివాహేతర సంబంధాలుండడం ఒక స్టేటస్‌ సింబల్‌గ అనుకునేటోళ్ళు. ముఖ్యంగా పెత్తందార్లు, దొరలు పటేల్‌ పట్వారీలు జాగీర్దార్లు. ఇండ్లల్ల పనిచేసే ఆడబాపతోటి గూడ వాండ్లకు సంబంధాలుండెటియ్యి.

Read more

కాళోజి స్త్రీలకు సమాన హక్కులుండాల్ననీ, స్త్రీకి ఆర్థికంగ స్వాతంత్య్రం రావాల్నని కోరుకునేటివాడు. ఎన్నో అటువంటి సభలల్ల మాట్లాడిండు. ఒకసారి ఆయన ఒక చిన్న కథ చెప్పిండు. తెలంగాణల లాండ్‌ సర్వే సెటిల్‌మెంట్‌ను జమాబంది అంటరు.  జమబందిల జిల్లా కలెక్టర్‌ దగ్గర్నించి సుంకరి అదే షేత్‌ సిందీ దనుక అందరూ ఉంటరు.

Read more

సినిమాలల్ల పనిచేయాల్నని సినిమాలకు రాయాల్నని కోరిక లేనోళ్ళు ఎంతమందుంటరు, శానా తక్వ, వాండ్లు గూడ ఛాన్సులు రాక ఊర్కునుడే గానీ, వస్తే ఇడిశిపెట్టరుగద.

Read more

1982ల పోతన భాగవత పంచశతజయంతి సభలని, వరంగల్‌ల ధూమ్‌ధామ్‌గ జరిగినయి వారంపదిరోజులు- పి.వి.నర్సింహారావుగారు చేయంగ. పాములపర్తి సదాశివరావు, అమరేశం రాజేశ్వరశర్మ సుప్రసన్న అట్టాంటోండ్లు శానాపని చేసిండ్రప్పుడు.  భాగవతాన్ని అచ్చు కొట్టిచ్చి అగ్గువకు ఇచ్చిండ్రు తిరుపతి దేవస్థానంవాండ్లు. అప్పటి ఉపరాష్ట్రపతి హిదయతుల్లా ప్రారంభం చేసిండా సభల్ని.

ఓనాడు కవి సమ్మేళం పెట్టిండ్రు. దాశరథి అధ్యక్షుడు. సభ అయితున్నది. వేదిక మీద కాళోజి, దాశరథి ఉన్నరు. కవిత్వాలు చదివేటోళ్ళు చదువుతనే వున్నరు. ఒక్కొక్కరికి, ఒక్కటే కవిత చదివే అవకాశమిచ్చిండ్రు కవులెక్కువున్నరని, కొంచెం సేపయ్యాక దాశరథి కొద్దిగ మెయి బాగలేక అధ్యక్షత కాళోజి నిర్వహిస్తడని చెప్పి పక్కకు తప్పుకున్నడు. కాళోజి అధ్యక్షుడయినంక ఇద్దరు ముగ్గురు కవులు అయినాంక వెల్డండ రఘుమారెడ్డి, జాతీయకవి అని పేరున్నాయన- ఆయన వంతు వచ్చింది. అయితే ఈయన శ్రీశ్రీని విమర్శించుకుంట కవిత్వం చదివిండు. శ్రీశ్రీని అభిమానించేగ్రూపు, వ్యతిరేకించే గ్రూపులు వున్నయి గద సాహిత్యంల. ఎప్పుడైతే శ్రీశ్రీని తిట్టుకుంట కవిత్వం చదివిండో, రఘుమారెడ్డి అనుయాయులంతా పెద్ద చప్పట్లుగొట్టిండ్రు.  శ్రీశ్రీని తిట్టిండని సంబరంతోటి, అంతేకాదు వన్స్‌మోర్‌ అని పెద్దగ ఒర్లిండ్రు. ఇంకోటి చదవాలె ఇంకోటి చదవాలె ఇట్లాంటిదే అని లొల్లికూడ చేశిండ్రు.

రఘుమారెడ్డి పాపం వినయంగ, ”అధ్యక్షులవారు అనుమతిస్తే….” అని కాళోజి దిక్కు చూసిండు.

వెంటనే కాళోజి ”నేను అనుమతించడంలేదు. ఎందుకంటరా నాకిచ్చిన జాబితా ప్రకారం ఇంకా 20-30 మంది కవులున్నరు వాండ్లందరయినంక ఇంకోప్రోగ్రాం వున్నది. అది కాకపోయినా మీకు వినాల్నని వుంటె, వినేవాండ్లకు ఓపిక ఉంటే, వాండ్లుకూచోనీ, నేను కూచుంట. లిస్టంత అయిపోయినాక రఘుమారెడ్డి ఓపిక మీ ఓపిక చదవనీ విందాం అంతేగానీ పద్దతికి విరుద్ధంగ నేను చేయ” నన్నడు.

లొల్లిచేసినోళ్ళంత ఏమన్లేకపోయిండ్రు.

సమయానికి సభలకు రావడం సభలు సమయానికి మొదలు పెట్టడం అనేటటువంటిది కాళోజి అన్నదమ్ములకు  చానా ఇష్టమైన విషయం. ఏదైనా సభ వీండ్లిద్దరీట్ల ఎవ్వరన్న అధ్యక్షతుండేది ఉంటే సమయంగాంగనే సభల ఎంత తక్వ మంది అన్న వుండనీ, పోవుడు డయాస్‌మీద గూచొనుడు.

Read more

మనం చూస్తునే ఉంటం, చెప్పే వ్యక్తిని బట్టి ఆ విషయాలకు విలువ, వేట్‌ రావడం, దానివలన, ఒక్కొక్కసారి మేలు జరుగుతది. ఓసారి నష్టము జరుగుతది. కానీ అమాయకులు, పెద్దవాండ్లేది చెప్పినా సరిగ్గనే చెప్తరు అని మాట్లాడకుంట ఉంటరు. అప్పుడు తాము చెప్పింది అబద్దమయితే చెప్పినవాని మనస్సు ఎంత మధనపడ్తదో అనటానికి, కాళోజి ఒక సంగతి చెప్పేటోడు.

Read more

కాళోజిది ఏ సంగతికి ఆ సంగతే.  తన విషయంల కవిత్వం విషయంల, ఎవరన్న విమర్శించినా ఎన్నడూ కాంట్రవర్సీల ఎంటర్‌గాలె. జీవన గీత అనువాదం చేసిన రోజులల్ల అనువాదం చేసిందంతా మిత్రమండలి మీటింగ్‌లల్ల, ఇంకా వేరుగ కూడా అందరికీ వినిపిచ్చేటోడు. అసలు ఆ అనువాదం చేసుడే అఫ్సోస్‌గ ఐంది.

Read more

కాళోజి 60 ఏండ్లు వచ్చినాంక మీసాలు పెంచిండు.  70 ఏండ్లు వచ్చినాంక గడ్డం చేసుకోవడం మానివేసిండు. తనే చమత్కారంగ తనకు 60ఏండ్లకు మీసాలు, 70 ఏండ్లకు గడ్డాలు వచ్చినయనేటోడు.

Read more

కాళోజి ఇంట్ల, ఎప్పుడు లేచినా నాస్తా తయారుగాంది మొకం కడగడు.  ఎంత పొద్దెక్కినా సరే నాస్తా అయిందని చెప్తేనే కడుక్కుంటడు. 1967లో జడ్చర్లల వరవరరావింటికి మొట్టమొదటి సారి పోయినప్పటి సంగతి. పొద్దుట్నించి కాళోజి వచ్చిండని ఎవరెవరో వచ్చి మాట్లాడిపోతున్నరు. కాళోజి అట్నే మాట్లాడుకుంటనే Read more

కొలిపాక సుగుణాకర్రావని వకీలున్నడు హన్మకొండల.  మంచి చదువుకున్నోడు. కాళోజి అన్నదమ్ములంటే గౌరవం మర్యాద వున్నోడు.  కాళోజిలను ‘పండిట్‌జి’ అని పిల్చెటోడు. ఆయన, రోజూ సాయంత్రం పూట, వాకింగ్‌ చేసుకుంట కాళోజి ఇంటిముందరికి వచ్చేవరకు, ఇంటిముందట్నే కాళోజి వాకింగ్‌ చేస్కుంట కన్పిం Read more

హైదరాబాద్‌ నిజాం కాలేజిల ప్రొ|| కుమందూరు, షష్టిపూర్తి సభ జరిగిందట.  దానికి శానామంది స్పీకర్లు వచ్చిండ్రు.  అండ్ల అస్గరలీ ఇంజనీరు, కాళోజిలు గూడ స్పీకర్లే.

అస్గరలీ ఇంజనీర్‌ బోరా తెగ ముస్లిం.  సంస్కరణ భావాలున్నోడు.  లిబరల్‌  ముస్లిం అని అనేవాండ్లు ఆయనను. ఆయన ఆ సభల మాట్లాడుతున్నడు.  అకస్మాత్తుగ ఆయనమీద ఫైరింగ్‌ అయింది. మతఛాందసులు హమ్లా చేసిండ్రు.  పాపం అస్గరలీ కిందికి వొరిగిండు.  ఎక్కడోళ్ళక్కడ బెగ్గంపాడైండ్రు.  పోనిదల్లా కాళోజి ఒక్కడే.  Read more

భాషవిషయం, ముఖ్యంగ తెలంగాణ భాష విషయంల, యాస విషయంల కాళోజికి శానా పట్టింపు. తెలంగాణ యాసను వెక్కిరించుడు ఆయన సహించకపోయేది.  అయితే, తెలంగాణల తెలుగు సరిగ్గ మాట్లాడరని, ఎద్దేవాజేసుడు ఇవ్వాళ్టిది గాదు. వెనుకటినుంచే వుండెనని కాళోజి అనేటోడు. ఆయన ఓ కతలాంటి సంగతి చెప్పిండొకసారి.

Read more

శేషాద్రి రమణ కవులల్ల ఒక్కడైన రమణాచార్యులు బతుకుదెరువు కోసం వరంగల్లు వచ్చి ఇక్కడ పంతులు నౌకరీ చేసిండు. ఇక్కడ శాసనాలు, గుళ్ళు గోపురాల పరిశోధన జేసిండు గూడ.

Read more

తెలంగాణ తెలుగు బాగలేదు అంత ఉర్దూ కలిపి మాట్లాడుతరు అని అనేవాండ్ల మాటలకు కాళోజి ఇట్లన్నడు ఓసారి ”మరి నాది ఉర్దూ అయితే, నువ్వు మాట్లాడేదేంది తెలుగా?

Read more

కాళోజి ఎదుటివారు ఎవ్వరనీ, చిన్ననా, పెద్దనా అని చూడడు.  సమయానికి తనకు ఏది తోస్తే అట్లా పంచ్‌చెయ్యడమే.

అనుముల కృష్ణమూర్తి కాళోజి కంటే 8, 10 ఏండ్లు చిన్నవాడు.  కృష్ణమూర్తి కూడా మడికొండకు చెందినవాడే.  పల్లా దుర్గయ్య,  వానమామలైవరదన్న, బి. రామరాజు అందరూ సంగడికాండ్లే.  అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం అనే అద్భుత ఖండకావ్యం రాసినవాడు.  అయన ఓసారి, అల్సర్‌ వల్ల కడుపునొప్పితో, గాంధీ దవాఖానలో షరీఖైండు. కాళోజి, రామేశ్వర్రావుగారూ ఇంకా కొందరు ఆయనను చూడబోయిండ్రు. వాండ్ల వెంబడి నేనూ వున్న.

Read more

సూర్యాపేటల ఓసారి ఓ సభ జరిగింది.  కాళోజిని వరంగల్‌ నుంచి కారుల తోలుకుని పోయిండ్రు.  తోలుకుని అంటే యాదికి వచ్చింది.  ఇది భాషకు సంబంధించిన విషయం.

Read more

హైద్రాబాద్‌ల ఒక పారి ఉస్మానలీ పాషా గుర్రం ఎక్కి తిరగటానికి పోయిండు పొద్దున్నె. పోంగపోంగ తొవ్వల ఒక మంచి బంగ్లా కన్లబడ్డది. ఈ బంగ్ల ఎవ్వలది అని ఎంక్వయరి చేశిండు. ఎంబటున్నోలు చెప్పిండ్రు ” జనాబ్‌ ఏ మాలికే మకాన్‌ సర్కార్‌కా హీ ములాజిం హై. సర్కార్‌ కె దర్బార్‌ మే కాం కర్తే హైఁ” ఆయన నిజాం కొలువుల మంచి హోదా ఉన్న అధికారి, హిందువు.

”ఐసా క్యా? హం యే ఘర్‌ దేఖ్‌నా చాహతే హై ” అన్నడు నిజాం.

Read more

ఏ నిజాం నిరంకుశ పాలన పోవాల్నని ఉద్యమాలు నడిపిచ్చిరడ్రో, ఏ ప్రజా స్వామ్య పరిపాలన రావాల్నని కొట్లాడిన్రో అది నిజంగనే జరిగినాంక అనుకున్నదొక్కటి అయిందింకొక్కటి అయి కూచున్నది. ” ముక్కుకోసినా మునుపటి మొగడే నయం”  అన్న సందంగ తయారయింది మనం ఎన్నుకున్న వాండ్ల పాలన. ఆ సంగతులు చెప్పుకుంట కాళోజి, నిజాం పాలనల అంత చెడ్డే జరిగిందని, మంచి ఏ మాత్రం జరగలేదని ఎవరన్నంటే అది బేవకూఫీ అంటడు. చెడ్డను తిట్టే హక్కు ఎట్లనైతే ఉన్నదో మంచిని కూడ యాదిచేసే బాధ్యత కూడ ఉండాలె అంటడు.

Read more