January 21st, 2010
by Dileep Konatham
నిన్న ఉస్మానియాలో పోలీసులు సృష్టించిన భీభత్సం గత నెలన్నరగా తెలంగాణా ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా అణచాలని ప్రయత్నిస్తున్న శక్తుల పన్నాగమే అని స్పష్టంగా రుజువులున్నాయి.
సంఘటనా స్థలంలో ఉన్న ఆంధ్రజ్యోతి విలేకరి ఎంతో ధైర్యంతో ఈ కుట్రను బట్టబయలు చేశాడు. చదవండొక సారి.

పూర్తి వార్త చదవడానికి పై బొమ్మపై క్లిక్ చేయండి.
మొన్న వేణుగోపాల్ రెడ్డి చనిపోయినట్టు తెలిసిన మరుక్షణం నుండి అతని దేహాన్ని అక్కడినుండి వీలైనంత త్వరగా తరలించాలని పోలీసులు చేయని ప్రయత్నం లేదు. వేలాది మంది విద్యార్ధులు పోలీసుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. పోస్టుమార్టం కూడా యూనివర్సిటీలోనే జరిపించారు. ఆ తరువాత వేణు మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఆర్ట్స్ కాలేజీకి తరలించారు.
మంగళవారం రాత్రంతా విద్యార్ధులు అంటూనే ఉన్నారు పోలీసులు ఏ క్షణాన్నైనా విరుచుకుపడి వేణు దేహాన్ని అక్కడినుండి తరలిస్తారని. అందుకే అంత చలిలోనూ ఉస్మానియా విద్యార్ధులు ఆర్ట్స్ కాలేజి వద్దే రాత్రంతా జాగారం చేశారు. ఉదయం వారు వేణు దేహాన్ని ఊరేగింపుగా అసెంబ్లీ ముందు గన్ పార్క్ లో ఉన్న తెలంగాణా అమరవీరుల స్తూపం వద్దకు తీసుకువెళ్ళాలని అనుకున్నారు.
తెలంగాణా ఉద్యమంలో అమరులైన వారిని అ స్తూపం వద్ద కాసేపు ఉంచే సాంప్రదాయం ఉంది. ఇప్పటి ఉద్యమంలో మొదటగా ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంత్ చారి దేహాన్ని కూడా అమరవీరుల స్థూపం వద్ద కాసేపు ఉంచిన తరువాతే అతని స్వగ్రామం పొడిచేడు తీసుకువెళ్లారు. ఆరోజు కూడా శ్రీకాంత్ దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ నుండే నేరుగా పొడిచేడు తరలించాలని పోలీసులు విఫలయత్నం చేశారు. అయితే విద్యార్ధులు పోలీసులను ఒప్పించి చాలా శాంతియుతంగా అఫ్జల్ గంజ్ నుండి గన్ పార్క్ వరకూ ఊరేగింపుగా వచ్చారు. ఆ రోజు శ్రీకాంత్ అంతిమయాత్రలో అంబులెన్స్ ను పోలీసులు ఎక్కడ బలవంతంగా హైజాక్ చేస్తారోనన్న ఆందోళనతో ఆ అంబులెన్స్ వెనుక ఒక రక్షణ వలయంగా మేము నడిచాం. గుండెల్లో ఎంతో బాధ ఉన్నా, కట్టలు తెంచుకునేందుకు సిద్ధంగా విద్యార్ధుల ఆగ్రహం ఉన్నా ఆ రోజు ఊరేగింపు అత్యంత శాంతియుతంగా సాగింది. ఊరేగింపు ముందు నడిచిన హరీశ్ రావు వంటి నేతలు కూడా అంతిమ యాత్ర సజావుగా జరిగేటట్టు చూసుకున్నారు.
నిన్న కూడా ఉస్మానియా విద్యార్ధులు, ప్రజా సంఘాల నేతలు, జే.ఏ.సి. నాయకులు పోలీసులకు తాము శాంతియుతంగా అంతిమ యాత్ర చేపడతామని ఎంతో నచ్చజెప్పారు. అయినా పోలీసులు వినకుండా కుట్ర పూరితంగా వేణు దేహం ఉన్న అంబులెన్స్ ను హైజాక్ చేశారు. అన్నిటికన్నా ఘోరం నిన్న యూనివర్సిటీలో మఫ్టీ పోలీసులే యూనిఫార్మ్ ధరించిన పోలీసులపై రాళ్లదాడి మొదలుపెట్టారు. ఇది తమపై బలప్రయోగం చేయడానికి పోలిసులు పన్నిన కుట్ర అని అర్థం చేసుకున్న విద్యార్ధులు వెంటనే రాళ్ళు రువ్వుతున్న మఫ్టీ పోలీసులను పట్టుకుని ఒకరిని పోలీసు అధికారులకు అప్పజెప్పారు. అయినా ఇదేం పట్టించుకోకుండా తాము అనుకున్నది చేసి చూపించారు పోలీసులు. ఫైబర్ లాఠీలతో విద్యార్ధులను విచ్చలవిడిగా బాదారు. భాష్పవాయు గోళాలు ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపారు. రెచ్చిపోయిన కొంత మంది విద్యార్ధులు పోలీసులపైకి రాళ్ల్లు రువ్వుతుంటే వారిని తోటి విద్యార్ధులే అడ్డుకుని శాంతపరిచారు. ఈ హింస ఆపమని పోలీసులకు చేతులెత్తి దండాలు పెట్టారు.
ఈ నెలన్నరలో ఉస్మానియాలో విద్యార్ధులను రెచ్చగొట్టడానికి పోలీసులు చేయని ప్రయత్నం లేదు. ఒక రోజైతే ఏ కారణం లేకుండానే పక్కనే ఉన్న మాణీకేశ్వరి నగర్ బస్తీలోకి వెళ్ళి రోడ్డుపై వెళ్తున్న సామాన్య ప్రజలను లాఠీలతో మోదారు. మరో రోజు మెస్ లో వంట చేసే వ్యక్తిని దొరకబుచ్చుకుని చావబాదారు. ఆ రోజు కూడా నేను ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నాను. ఈ విషయం గురించి ఇక్కడ రాశాను.
ఉస్మానియాలో 29 నవంబర్ నాడు విద్యార్ధులపై విచక్షణారహితంగా లాఠీచార్జీ చేయించినందుకు బదిలీ అయిన కర్కోటక పోలీస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర మళ్లీ నిన్న యూనివర్సిటీలో సంఘటనా స్థలంలో పోలీసులను పర్యవేక్షించడం దేనిని సూచిస్తుంది? శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్ధులను రెచ్చగొట్టి వారిని హింసాకాండకు పురికొల్పే పధకం ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయని ఒక సారి యూనివర్సిటీకి వెళ్ళి చూస్తే అర్థం అవుతుంది.
ఉద్యమంలో హింస చెలరేగేలా చేసి ఆ తరువాత ఇది శాంతి భద్రతల సమస్యగా మాత్రమే పరిగణించే దశకు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ సాయంతో చేస్తున్న కుట్ర ఇది. అందుకే ఇవ్వాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “ఆపరేషన్” నిర్వహించడానికి స్టీఫెన్ రవీంద్ర, మహేశ్ చంద్ర లడ్డా వంటి “ఎన్ కౌంటర్ స్పెషలిస్టులు” రంగంలోకి దింపబడ్డారు.
ఎంత రెచ్చగొట్టినా తెలంగాణా ప్రజలు సహనంతో రాష్ట్రం సాధించుకుంటారు. తమని తాము బలిదానం చేసుకోవడమే ఈ ఉద్యమంలో జరుగుతున్న అతి పెద్ద హింస.
Category తెలంగాణ |
No Comments →
January 20th, 2010
by Dileep Konatham
నిన్న రాత్రంతా ప్రయాణం చేసి తెలతెలవారుతుండగా నిద్రపోయిన నన్ను ఒక దుర్వార్త నిద్రలేపింది.
ఎం.సి.ఏ. ఫైనల్ ఇయర్ విద్యార్థి కొండేటి వేణుగోపాల్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మాహుతి చేసుకున్నాడన్న ఆ వార్త తెలుసుకుని తల్లడిల్లిపోయాను. నేను నా స్కూలు చదువులు మొదలుపెట్టిన సూర్యాపేట ముద్దుబిడ్డ వేణుగోపాల్.
Read the rest of this entry »
Category తెలంగాణ |
No Comments →
January 8th, 2010
by Dileep Konatham
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలామంది ఆంధ్ర, రాయలసీమ, ఇతర రాష్ట్ర మిత్రులకు తెలియదు. అందుకే ఈ అంశం గురించి చాలా చర్చలు కేసీయార్ తో మొదలై టీఆరెస్ తో ముగుస్తాయి.
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఇక్కడి ప్రజలలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే ఉన్నదని చాలా మందికి తెలియదు. ఈ చరిత్ర తెలియకనే ఇప్పటి తెలంగాణా ఉద్యమాన్ని మిత్రులు అపార్ధం చేసుకుంటున్నారు. మొదటి ఎస్సార్సీ తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయమని సిఫారసు చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంతోషించారు. అయితే ఆంధ్ర నాయకుల పైరవీతో ఢిల్లీ స్థాయిలో జరిగిన మంత్రాంగంలో వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రతో విలీనం అయిన నాటినుండీ తెలంగాణ ప్రజల్లో ఈ రాష్ట్రకాంక్ష ఇంకా బలపడుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణా దారుణమైన వివక్షకు గురై చివరికి ప్రజలు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించే దాకా వచ్చింది.
Read the rest of this entry »
Category తెలంగాణ |
No Comments →
January 6th, 2010
by Dileep Konatham
2009 ఎన్నికల్లో రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తమతమ మానిఫెస్టోల్లో స్పష్టంగా ప్రకటించాయి. ఆ పార్టీల సీమాంధ్ర ప్రతినిధులు ఇవ్వాళ మాట్లాడుతున్న మాటలు చూస్తే ఊసరవెల్లులు కూడా సిగ్గుపడేట్టున్నాయి.
2009 ఫిబ్రవరి 12 నాడు దివంగత ముఖ్యమంత్రి వైయెస్ రాష్ట్ర అసెంబ్లీలో “తెలంగాణ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి సూత్రప్రాయంగా ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయంలో నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్ళే సమయం ఆసన్నమైంది” అన్నాడు.
“The Government of Andhra Pradesh has no objection to the formation of Telangana State in principle and feels that the time has come to move forward decisively on this issue.”
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి వివిధ భాగస్వామ్య వర్గాల వాదనలు పరిశీలించడానికి, చర్చనీయాంశమైన అంశాలను ఖరారు చేయడానికి అప్పటి ఆర్థిక మంత్రి రోశయ్య అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేస్తున్నట్టు స్వయంగా ప్రకటించాడు.
ఆ రోజు ఈ సోకాల్డ్ సమైక్యవాదులేమయ్యారు?
Read the rest of this entry »
Category తెలంగాణ |
No Comments →
January 5th, 2010
by Dileep Konatham
<![CDATA[ఢిల్లీ సమావేశంలో చిదంబరం ప్రారంభ వ్యాఖ్యలు.
Meeting of eight political parties of Andhra Pradesh on Telangana issue begins
CHIDAMBARAM APPEALS FOR PEACE AND HARMONY IN THE STATE
12:50 IST
Consultations with eight recognised political parties of Andhra Pradesh on the issues arising out of the recent agitations in the State in favour of and against the separate state ofTelangana began here today. In his opening statement at the meeting, the Union Home Minister, Shri P.Chidambaram stressed the need to maintain peace and harmony in the State while the consultations take place. Following is the text of his statement :-
Read the rest of this entry »
Category తెలంగాణ |
No Comments → | Tagged batkamma, batukamma, bratukamma, dasara, dussera, telangana
January 5th, 2010
by Dileep Konatham
ఉస్మానియా విద్యార్థి గర్జన దృశ్యమాలిక ఇక్కడ చూడండి
Category తెలంగాణ |
No Comments →
December 29th, 2009
by Dileep Konatham
నిన్న రాత్రి ఎనినిమిదింటికి ఒక సమావేశంలో ఉండగా మాతోపాటు ఉన్న బాల్ రెడ్డి ఫోన్ మోగింది. అటువైపు ఉన్నది ఉస్మానియా విద్యార్ధులు. మెస్సును పోలీసులు మూసేయించారని దాదాపు 2000 మంది విద్యార్ధులు ఆకలితో ఉన్నారని. ఏదైనా సాయం చేయమని అభ్యర్ధన.
కొంచెం సమయం ఇవ్వమని చెప్పి బాల్ రెడ్డి ఫోన్ పెట్టేశాడు. క్యాటరింగ్ వ్యాపారం చేసే తన మిత్రుడైన అశోక్ కు ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు. భోజనం ఏర్పాట్లు చేసేందుకు అశోక్ సంతోషంగా ఒప్పుకున్నాడు.
మేము సమావేశం ముగించుకుని రాత్రి పది గంటలకు ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్నాం. అదొక దుర్భేధ్యమైన కోటను తలపిస్తోంది. ముళ్లకంచెలు, ర్యాపిడ్ ఆక్షన్ ఫోర్స్, సి.ఐ.ఎస్.ఎఫ్, సి.ఆర్.పి.ఎఫ్ బలగాలు యూనివర్సిటీని దిగ్బంధం చేశాయి.
Read the rest of this entry »
Category తెలంగాణ |
13 Comments →
December 9th, 2009
by Dileep Konatham
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైనట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
జై తెలంగాణ!
Category వ్యక్తిగతం |
7 Comments →
December 9th, 2009
by Dileep Konatham
తెలంగాణా రాష్ట్రం ఇవ్వరాదని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు మీడియా ద్వారా సంకేతాలు అందుతున్నాయి. కేసియార్ ఆత్మత్యాగం చేసినా ఈ డిమాండును ఆమోదించవద్దనేది కాంగ్రెస్ అలోచనగా చెపుతున్నారు.
నాకొక పాట గుర్తొస్తున్నది. నైజాము సర్కరోని మీద మా యాదగిరి రాసిన ఆ పాటలో …
బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా
పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా
స్త్రీ పురుషులంత గలిసి
ఇల్లాలమంత గలిసి
వడిసేల రాళ్లు గట్టి
వడివడిగ గొట్టితేను
కారాపు నీళ్లు దెచ్చి
కండ్లళ్ల జల్లితేను
నీ మిలిట్రి బారిపొయెరో
నీ మిలిట్రి బారిపొయెరో…
నైజాము సర్కరోడా
సుట్టుముట్టూ సూర్యపేట,
నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేది హైద్రబాదు
దాని పక్క గోలుకొండ
గోలుకొండా ఖిలా కిందా
గోలుకొండా ఖిలా కిందా
నీ గోరి కడుతం కొడుకో
నైజాము సర్కరోడా
–
తెలంగాణా ప్రజల న్యాయమైన ఆకాంక్షలపైకి సైన్యాన్ని, సీ.ఆర్.పి.ఎఫ్, బీ.ఎస్.ఎఫ్., గ్రే హౌండ్స్, రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ బలగాలను ఉసిగొల్పుతున్న రోశయ్య, సోనియా దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదు.
ఇది ధర్మ పోరాటం. న్యాయమైన ఆకాంక్ష. ఇప్పుడు అణిచివేస్తే రేపో ఎల్లుండో మళ్లీ ఎగిసిపడటం ఖాయం.
జై తెలంగాణ!
తెలంగాణ జాతీయ గీతం “జయ జయ హే తెలంగాణ” ఇక్కడ వినండి
Category తెలంగాణ |
4 Comments →
December 8th, 2009
by Dileep Konatham
తెలంగాణాకు ఇతర విషయాల్లో జరిగిన అన్యాయాలను కాసేపు పక్కన పెడితే ఈ న్యాయమైన ఆకాంక్షని కాంగ్రెస్ చేస్తున్న అవహేళన చూస్తుంటే కడుపు రగిలిపోతుంది.
తెలంగాణాపై కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన ప్రతిసారీ నాకు విపరీతమైన కోపం వస్తుంది ఆ తరువాత ఈ దేశానికి వీరు తప్ప మరో ప్రత్యామ్న్యాయం లేరనే నిజం గుర్తుకువచ్చి భయం వేస్తుంది. ప్రపంచంలో మరే దేశంలోనయినా కాంగ్రెస్ పార్టీ అంతటి దుర్మార్గమైన పార్టీ ఉంటుందని నేననుకోను. రాజకీయాలంటే ప్రజలకు విరక్తి కలిగే విధంగా రాజకీయం నెరపుతూ గత 6 దశాబ్దాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు కాంగీయులు.
దాదాపు 10 కోట్ల మంది తెలుగు ప్రజానీకం పది రోజులుగా పడుతున్న ఆవేదన, 20పై చిలుకు యువకుల ఆత్మార్పణ, ఒక పార్లమెంటు సభ్యుడి ఆమరణ నిరాహార దీక్ష తరువాత కూడా తెలంగాణా అంశాన్ని కాంగ్రెస్ జటిలం చేస్తున్న విధానం చూస్తుంటే అసలు ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అనేది మిగిలి ఉందా అని అనుమానం వస్తున్నది. ప్రజలను ఇంత దారుణంగా వంచించడం బహూశా కాంగ్రెస్ పార్టీకొక్కదానికే సాధ్యమవుతుందనుకుంటా.
Read the rest of this entry »
Category తెలంగాణ |
2 Comments →
December 7th, 2009
by Dileep Konatham
ఒక వైపు మహోధృతంగా సాగుతున్న తెలంగాణా ఉద్యమంలో మా భూమిపుత్రులు తమ ప్రాణాలు తామే అర్పించుకుంటుంటే కొందరు సమైక్యవాదులు, తెలంగాణ వ్యతిరేకులు బ్లాగుల్లో అవాకులు చవాకులు పేలుతున్నారు. తెలంగాణా ఉద్యమం ఎందుకు జరుగుతుందో అనేక సార్లు వివరించినా అర్థం చేసుకునే ప్రయత్నం చేయని వీరు కేసీఆర్ ను విమర్శించే నెపంతో తెలంగాణా ప్రజలను దూషిస్తున్నారు.
విధ్వంసం విధ్వంసం అని గుండెలు బాదుకుంటున్నవారు ఒక సారి అలోచించండి ఇప్పటికే 25 మంది యువకులు తెలంగాణ కొరకు తమ ప్రాణాలు తామే తీసుకున్నారు. తమ దేహాలను అగ్నిగోళాలుగా మార్చుకుని “జై తెలంగాణా” అని నినదిస్తున్నారు, ఉరి తాళ్లను ముద్దాడుతున్నారు, బుల్లెట్లను గుండెల్లో దింపుకుంటున్నారు, గరళాన్ని దిగమింగుతున్నారు, రైలు పట్టాలపై శిరచ్చేధం చేసుకుంటున్నారు, సెల్ టవర్లు, నీటి ట్యాంకులపై నుండి “జై తెలంగాణ” అని దుంకుతున్నరు.
ఇంకొక ప్రాణం కూడా వృధా కావొద్దు అని మేము ఇక్కడ విజ్ఞప్తులు, విన్నపాలు చేసుకుంటున్నాం.
మీకొకటే విజ్ఞప్తి. ఎవరి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు. అందరికీ భావ ప్రకటనా స్వేచ్చ ఉందీ దేశంలో. సమైక్య రాష్ట్రం ఎందుకు అవసరమో తప్పకుండా మీ అభిప్రాయాలను రాయండి. సమైక్యత సాధించడం కొరకు చేయాల్సిన కృషి తప్పకుండా చేయండి. కానీ ఒక్క నిముషం అలోచించండి. అసలే అవేశాలు రగులుతున్న ఈ సమయంలో మీరు చేసే ఈ అనాలోచిత వ్యాఖ్యలు వాతావరణాన్ని ఇంకా కలుషితం చేస్తాయి. అమెరికాలోనో, కెనడాలోనో కూర్చుని మీరో వెకిలి వ్యాఖ్య చేసి మీ నోటి కుతి తీర్చుకుని ఆనందపడవచ్చు. కానీ అలాంటి వ్యాఖ్యలు ఒక్కోసారి బడబాగ్నిని రగల్చవచ్చు. అది అమాయకులనే దహించివేస్తుంది.
అలాగే తెలంగాణా వాదులు కూడా సంయమనం పాటించాలి. ఆంధ్రా మిత్రులను దూషించి అనవసరంగా మన ఉద్యమంపై దురభిప్రాయం కలుగజేయరాదు. మన పోరు కోస్తాంధ్ర పాలకవర్గాలతోనే కానీ కోస్తాంధ్ర ప్రజలతో కాదని గుర్తెరగాలి.
సమైక్య రాష్ట్రం ఉండాలనుకోవడం తప్పుకాదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం ప్రజా ఉద్యమం. దీనిపై దయచేసి వెకిలి రాతలు రాయకండి.
మీకు ధ్వంసం అవుతున్న ఆస్థులు కనపడుతున్నాయి. మాకు ధ్వంసం అవుతున్న తెలంగాణా భవిష్యత్ తరంపై ఆందోళనగా ఉన్నది.
Category తెలంగాణ |
13 Comments →
December 7th, 2009
by Dileep Konatham
ఉస్మానియాపై వెయ్యిమంది రాపిడ్ ఆక్షన్ ఫోర్స్ పోలీసుల దాడి. విద్యార్ధులు ధర్నా చేస్తున్న టెంట్ల తొలగింపు. మీడియాను యూనివర్సిటీలోకి అనుమతించని పోలీసులు. తీవ్ర ఉద్రిక్తత. 29 నాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై జరిగిన పాశవిక దాడిని టివీల్లో చూశాకనే అనేకమంది తెలంగాణా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన ఉదృతం చేశారు. ఆరోజు నుండీ తెలంగాణా ఉద్యమానికి గుండెకాయలా నిలిచినింది ఉస్మానియా యూనివర్సిటీ. అందుకే ప్రభుత్వం కన్ను ఈ విద్యార్ధులపై బడింది.
సమస్య పరిష్కరించకుండా బలప్రయోగం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని రోశయ్య ప్రభుత్వం భావిస్తే మాత్రం రానున్న రోజుల్లో ఈ ఉద్యమ జ్వాలలు ఆయన ప్రభుత్వాన్ని దహించివేయడం ఖాయం.
జై తెలంగాణ!
Category తెలంగాణ |
4 Comments →
December 6th, 2009
by Dileep Konatham
తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పటికీ కొందరు మిత్రులు అవే పాత ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పీ చెప్పీ మా గొంతులు పడిపోతున్నాయి. తెలంగాణా ఎందుకు? ఏమిటి? ఎలా? వంటి ప్రశ్నలకు సమాధానంగా తెలగాణావాదులు చాలా సమాచారం ఇంటర్ నెట్ పైన పెట్టారు. దయచేసి దీన్ని చదవండి. తెలంగాణా ఆకాంక్షకు ఉన్న నేపధ్యం తెలుసుకోండి
Telangana FAQs
http://www.telangana.org/TelanganaFAQ.asp
Fazal Ali Commission Report (First SRC)
http://hridayam.wordpress.com/2007/01/27/first_src_telangana/
Articles About Telangana Movement
http://www.telangana.org/Papers.asp
GO 610
http://hridayam.wordpress.com/2007/06/21/610-reality/
http://discover-telangana.org/wp/2007/06/14/go_610/
Injustice in Irrigation
http://discover-telangana.org/wp/category/books/neellu_nijalu/
Injustice in History
http://discover-telangana.org/wp/category/compilations/reconstruction_of_telangana_history/
Sri Bagh Pact (Rayalaseema people were the first to doubt coastal Andhrites)
http://hridayam.wordpress.com/2007/08/01/sri-bagh-pact/
—
మరో సారి జై తెలంగాణ
వేలు చివర చిన్నగా కాలితేనే అల్లల్లాడిపోతామే అటువంటిది పెట్రోల్ పోసుకుని నిలువెల్లా దగ్ధం అవుతున్న ఈ యువకులకు ఎక్కడి నుంచి వచ్చిందీ ధైర్యం? అగ్ని కీలలు శరీరాన్ని దహించివేస్తుంటే ” జై తెలంగాణా” అనే నినాదం చేసేంత ఆపేక్ష ఎందుకు కలిగింది తెలంగాణాపై? వెయ్యి వోల్టుల కరెంటు తీగలను పట్టుకుని మరీ ప్రాణాలు తీసుకునే ఉద్యమ స్ఫూర్తి ఎలా రగిలిందీ యువకుల్లో?
మనలో చాలా మందికి ఈ యువకులు చేసింది పిచ్చి పని లాగానే కనిపించవచ్చు. వ్యక్తిగత లాభమే పరమావధిగా భావించే ఈ రోజుల్లో ఒక జాతి పోరాటం కొరకు ప్రాణాలే ఇవ్వడం “తెలివిలేని పని” గానే అభివర్ణింపబడవచ్చు.
శ్రీకాంత్ నాకు వ్యక్తిగతంగా తెలియదు. కానీ అతని కుటుంబం నాన్నకు బాగా తెలుసు. మా ఊరికి కొద్ది దూరంలోనే ఉన్న పొడిచేడు గ్రామానికి చెందిన శ్రీకాంత్ చదువుకునే రోజుల్లో మా ఇంటికి కూడా కొన్ని సార్లు వచ్చాడట. మొన్న ఉస్మానియా మార్చురీలో శ్రీకాంత్ మృతదేహం చూస్తుంటే అతన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమే హత్య చేసింది అనే భావం కలిగింది.
Read the rest of this entry »
Category తెలంగాణ |
4 Comments →
December 4th, 2009
by Dileep Konatham
తెలంగాణా అమరవీరుడు కాసోజు శ్రీకాంత్ భౌతికకాయం ఉస్మానియా ఆసుపత్రి నుండి తెలంగాణా అమరవీరుల స్థూపం ఉన్న గన్ పార్క్ వద్దకు తీసుకువచ్చిన దృశ్యాలు ఇక్కడ చూడండి.
http://picasaweb.google.co.in/konatham.dileep/Telangana_Srikanth#
వీడియో క్లిప్పింగ్ ఇక్కడ చూడొచ్చు:
http://www.youtube.com/watch?v=7Gb9MVFME1g
Category తెలంగాణ |
No Comments →
December 3rd, 2009
by Dileep Konatham
తెలంగాణా తుదిపోరుకు వేగుచుక్కలా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్ధినుల ఉద్యమ స్ఫూర్తి ఇక్కడ చూడండి
Category తెలంగాణ |
No Comments →