తొవ్వ !
గాలికి కిటికీలు టపటప కొట్టుకుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది. టైం ఎంతైందో అనుకుంటనే ఉన్న దూరంగ పదకొండు గంట్ల సీటీ ఇనొచ్చింది. వానకు ట్రాన్స్‌ఫార్మర్ పేలి కరంట్ పోయింది, దీపం పెట్టుకొని సంటోన్ని కాల్లమీద ఏసుకొని ఊపుతుంటె ఎప్పుడు కన్నంటుకున్నదో తెలువలే. రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన, జర గట్టిగ ఇంకో గాలొస్తె ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి [...]
