గతి
బోరుకు వచ్చింది బండి. ఇంకో ఎత్తుగడ్డ ఎక్కితె అడ్డం బడుతది అన్నట్టు ఉన్న బండిని ఏసుకొని బయల్దేరిండు శీను. ఇయ్యాల పని ఎగ్గొట్టి ఎక్కడికి పోవాలని పరధ్యానంల బండి తోలుతుంటె కండ్ల ముందటి నుంచి ఒక కాయితం ముక్కసొంటిదేదో తేలుకుంట పొయ్యింది., దాని తోటి ఇదివరకే పరిచయం ఉన్నట్టే రెప్పపాటులనే గుర్తు పట్టినట్టు దబ్బున బ్రేకు మీద కాలేసిండు. ఓవర్ బ్రిడ్జికి ఓ పది అడుగుల దూరంల పొయ్యి బండి ఆపి స్టాండు ఏసి, ట్రాఫిక్‌ని ఎదురీదుకుంట [...]
