JayaPrakash Telangana

చెవుటోని చెవ్వుల శంకం ఊదినట్టుకాదు, సమైక్యాంధ్రోని చెవ్వులు పలిగిపోయెటట్టు పాడుంరి తెలంగానాన్ని !

బండెనుక బండి గట్టీ (2009)

Posted on | November 29, 2009 | No Comments

బండెనుక బండి గట్టీ
పదహారు బండ్లు గట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
ఓ ఆంద్ర సర్కరోడా !
అంగ్రేజుల మించినవురో, ఓ వలుస సరుకరోడా !

||బండెనుక … ||

610 జీ.వో అంటే
నియామకాలు అంటే,
మా నడుమ పుల్లలుబెట్టీ
నువు సంకలు గుద్దినవురో
ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||


మీ గాలిగాల్లనంతా
మీ గోనెగాల్లనంతా
ఏ జగడపాటినైనా
మా జోలికొస్తె కొడుకో ||
నీ దుమ్ము దులుపుతంరో, ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||

అభివృద్ధి పేరు మీద
మా భూములన్ని దొబ్బి,
పది జిల్లాలను నువ్వు
తమలపాకులోలె నవిలీ ||
అరె బీళ్ళను చేస్తివి కొడుకో ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||

మా నీళ్ల మలిసినావు
మా కడుపుగొట్టినావు
బొగ్గు గుగ్గి జేసినావు,
గోదారి లోయనంతా ||
నువు పొక్కిలి జేసినవురో
ఓ ఆంద్ర సర్కరోడా !

||బండెనుక … ||

ఇగ మస్తు సూశినంరా
ఇగ మస్తు సైసినంరా
తెలగాణ పోరునింకా
తెలంగాణ జోరునింకా
ఏ బేరేజులాపుతైరా
ఓ ఆంద్ర సర్కరోడా !

బండెనుక బండి గట్టీ
పదహారు బండ్లు గట్టి
ఏ బండ్లె వస్తవు కొడుకో
ఓ ఆంద్ర సర్కరోడా !
నైజామునె మించినవురో, ఓ వలుస సరుకరోడా !

ఇగ కొలిమి అంటినదిరో, ఓ ఆంద్ర సర్కరోడా !
నిను ఖతం జేస్తదిరో, ఓ ఆంద్ర సర్కరోడా !!
ఇగ కొలిమి అంటినదిరో ||
నిను ఖతం జేస్తదిరో ||

(1969 తెలంగాణ అమరవీరుల పోరాట స్పూర్తిగ, ఇయ్యాటి తెలంగాణ ఉద్యమకారుల కోసం)

(29 నవంబర్ 2009)

***

మన దేశంల పరమ్‌వీర్‌ చక్ర, అశోక్ చక్రలు ఇచ్చిన సైనికులను ప్రజలు భుజాన ఎందుకు ఎత్తుకుంటరు? ప్రభుత్వాలు వాల్లను గుర్తించింది కాబట్టి!

మరి మనం ఈ (ఆంధ్ర) సర్కారునే గుర్తిస్తలేము, వాల్లు మన తెలంగాణ యువసైనికులను ఎట్ల గుర్తిస్తరు? ఇప్పుడు ‘జై తెలంగాణ’ అంటున్న ప్రతి ఒక్క యువకుడు, తెలంగాణ సైనికుడు… మనంగూడ వాల్ల మనోభావాలను గుర్తించకపోతె ఇంకెవరు గుర్తిస్తరు?

ఇంకా సంకోచిస్తున్న ప్రజలారా ! ఇప్పుడైనా మీ తెలంగాణ ముద్దు బిడ్డలను హత్తుకోంరి ! వాల్లతోటి గొంతు కలిపంరి ! మీరు ప్రపంచంల ఎక్కడ ఉన్నా, వాల్లతోటి ఉద్యమంల పాలుపంచుకొని ఉద్యమానికి వచ్చిన ఈ కొత్త ఊపిరిని నిలబెట్టంరి. ఇదే ఆఖరి మౌఖా !

తెలంగాణ విద్యార్థి శక్తి వర్థిల్లాలి ! తెలంగాణ అమర వీరులకు జోహార్లు !
జై తెలంగాణ !

Share http://bit.ly/16bandlu

Comments

Leave a Reply





  • Get your ‘Telangana Now’ badge



    Add the 'Telangana Now' badge to you FACEBOOK / TWITTER profile picture & let's demand 'Telangana Now' & not tomorrow !

  • Friend Connect

  • Archives

  • Recent Posts

  • Recent Comments