ఏందిర లొల్లేందిర వారీ !
Posted on | December 16, 2009 | 2 Comments
ఏందిర పేరేందిర వాంది ?
ఆ… లగడపాటంట ?
ఏదిర జాడేదిర వాంది ?
జండ కప్పుకొని పన్నడంట !
ఓరి లగడపాటి, నీ తోక కత్తిరిచ్చె యాల్లొచ్చేర వారీ ||
ఓరోరి జగడపాటి నిన్ను ఉరికిచ్చే యాల్లొచ్చేర వారీ ||
ఏందిర లొల్లేందిర వారీ, ఓ లగడపాటి
ఉండమంటె సమజైతలేదుర వారీ, ఓ లగడపాటి ?
యాభైయేల్లు దోస్తివిగద వారీ, ఓ లగడపాటి
ఇంక కలిసుండుడేందిర వారీ, ఓ లగడపాటి ?
||ఓరి లగడపాటి, నీ తోక … ||
కన్లు కానొస్తలేవుర వారీ, ఓ లగడపాటి
ఈ జనం కండ్లబడుతలేరుర వారీ, ఓ లగడపాటి ?
నిన్ను తొక్కి ప్రవహిస్తరు వారీ, ఓ లగడపాటి
అంత వరకు ఊకుండవుర వారీ, ఓ లగడపాటి ?
||ఓరి లగడపాటి, నీ తోక … ||
ఒస్తుంది ఒస్తుందిర వారీ, ఓ లగడపాటి
తెలంగాణ ఒస్తుందిర వారీ, ఓ లగడపాటి
నీ లంకలన్ని కాల్శేస్తది వారీ, ఓ లగడపాటి
అంత దాక ఆగెటట్టు లేవుర వారీ, ఓ లగడపాటి
||ఓరి లగడపాటి, నీ తోక … ||
* share this link http://bit.ly/endira_lolli
Tags: lagadapati > lolli > Telangana > Telugu > జగడపాటి > తెలంగాణ > లగడపాటి
Comments
2 Responses to “ఏందిర లొల్లేందిర వారీ !”
Leave a Reply

December 17th, 2009 @ 10:13 pm
లాంకో అనే లంకకు నువ్వు
రాజువేమో రా లగడపాటి
కాని మా భాగ్యనగరమ్ము పైన
మోజుపడితే మసైపోతవుర వారీ
కోట్లు పెట్టి కొంటవేమో నువ్వు
కోటి రాజకీయ గూండాలని వారీ
కాని తెలంగాణ కన్నెరజేస్తే
భస్మం ఐతావురా ఓ జగడపాటి
December 18th, 2009 @ 12:02 pm
మాది ,
జగడం కాదిది లగడం,
ఇది పంతం కానే కాదు,
ఇది గోవేర్నమెంటు పనితనం,
అందుకే ఈ ప్రతిఫలం ,
ఓ లగడం,
పోటీ నిరాహార దీక్షలా ?
కనీ విని ఎరుగని అడ్డమైన దీక్షలా ?
ఓ లగడం,
ఏమిటి ! ఏమిటి ! ఏ గమ్యం లేని ఆవేశం ?
ఎందుకు ! ఎందుకు ! ఆ పదవీ వ్యామోహం ?
నీ , ఈ అచట్లు ముచట్లు కయ్యనికే గాని వియ్యానికి కాదేమో ?