పరీక్షలు బహిష్కరించిన ఎస్‌యూ విద్యార్ధులు
కరీంనగర్, మార్చి 10 (ఆన్‌లైన్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానం చేసుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సాయికుమార్‌కు ఆశ్రు నివాళులర్పించి శాతవాహన విశ్వవిద్యాలయంలో జరుగతున్న ఎంబీఏ, ఎంసీఏ మూడో సెమిస్టర్ పరీక్షలను విద్యార్థులు బహిష్కరించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనున్న ఎంసీఏ 3వ సెమిస్టర్, మొదటి సంవత్సరం ఎంబీఏ, ఎంఏ ఎకనామిక్స్, ఎంకాం అంతర్గత పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పా ట్లు చేశారు.
పరీక్ష కేంద్రం వద్దకు చేరుకున్న విద్యార్థులు జై తెలంగాణ.. జై జై తెలంగాణ, సాయికుమార్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ పరీక్షలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. సాయికుమార్ మృతికి నివాళి అర్పించారు.
మహిళా జేఏసీ ప్రొఫెసర్ సుజాత మాట్లాడుతూ విద్యార్థుల బలిదానం వృథా కాదని, తెలంగాణ ఇచ్చేందుకు ఇంకా ఎంత మందిని ఈ ప్రభుత్వం బలి తీసకుంటుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్య క్రమంలో శాతవాహన విద్యార్థి జేఏసీ కన్వీ టనర్ సాంబ మూర్తి, నాగరాజు, రవి, కోటి, విద్యా ర్థులు పాల్గొన్నారు.
(Courtesy: AndhraJyothy)
The URI to TrackBack this entry is: http://telanganaonline.org/martyrs/2010/03/12/su_students_boycott_exam/trackback/