నిన్న ఉస్మానియా యూనివర్సిటిలో తెలంగాణ కోసం నిరాహార దీక్షలు చేస్తున్న తెలంగాణా సాధన సమితికి మద్దత్తుగా వివిధ మహిళా సంఘాలు మానవహారంగా నిలబడి తమ సంఘీభావం తెలిపాయి. మహిళలు బతకమ్మ ఆడుతూ,నినాదాలిస్తూ కదం తొక్కారు. యూనివర్సిటి కేంపస్ అంతా పోలీసులతో నిండిపోయింది. అటు ఇటు రోడ్డు మూసేసారు.బస్సులు కేంపస్ లో కి రావడం లేదు. మేము చాలా కష్టపడి యూనివర్సిటి వెనక నుండి ఆర్ట్స్ కాలేజి దగ్గరకు వెళ్ళగలిగాము. భూమిక ప్రత్యేక తెలంగాణ సంచికను చాలా కాలం క్రితమే తీసుకొచ్చింది. తెలంగాణా ప్రాంత ప్రజల ఆకాంక్షలకు తన మద్దతును ప్రకటించింది.


Comments



Name (required)

Email (required)

Website

Speak your mind