Telangana in News » Andhra Jyothy

జైబోలో సంకల్పం
” కథ రాస్తున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఏడ్చానో నాకే తెలుసు. సన్నివేశాలు తలచుకున్నప్పుడు కన్నీళ్లు ఆగేవికావు. సినిమా నిర్మాణానికి ఎన్నో కష్టాలు. ఇంకెన్నో ఆర్థిక ఇబ్బందులు. నా మొత్తం కెరీర్‌ను పణం పెట్టి తీసిన సినిమా ఇది. ఎలా చూసినా ఈ సినిమా నా జీవితం.”

తెలంగాణ సాయుధ పోరాటంపై సినిమా తీయాలన్నది నా చిరకాల కోరిక. అది నా మనస్సులో అలాగే వుండిపోయింది. పది సంవత్సరాల క్రితం దానిని సెట్స్‌మీదికి తీసుకురావాలని బలంగా అనుకున్నాను. అదే నేపథ్యంతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాను. కొన్నాళ్లకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యింది. పెద్ద బేనర్ ఒకటి అనుకున్నాను. దాంతో పాటు ఒక ప్రముఖ హీరోను ఊహించుకున్నాను. కారణాలేవైనా తెలంగాణ సాయుధ పోరాటం సెట్స్ మీదకు వెళ్లలేదు. డిసెంబరు 29న చౌటుప్పల్‌లో జరిగిన శ్రీకాంతాచారి సంస్మరణసభకు వెళ్లినపుడు నడుస్తున్న తెలంగాణ చరిత్ర ఆధారంగా సినిమా తీయాలనిపించింది. ఆ క్షణంలోనే జై బోలో తెలంగాణ సినిమా మనసులో రూపుదిద్దుకుంది. ప్రకటన చేశానే కానీ ఆ తరువాత సినిమా పరిశ్రమలోకి నడచివచ్చిన దారి గుర్తొచ్చింది. ఆలోచనల్లో పడ్డాను.

మాది నల్గొండజిల్లా చిరుమర్తి గ్రామం. ఇంట్లో మధ్యతరగతి వాసనలు. చదువు అంతంత మాత్రం. రెగ్యులర్ చదువుకంటే సాహిత్యపుస్తకాలపై ఆసక్తి వుండేది. పాలిటెక్నిక్ మధ్యలో ఆపేశాను. నటుడు, దర్శకుడు ప్రభాకర్‌రెడ్డిది మా పక్క ఊరే. బతుకమ్మ, సంక్రాంతి పండగల సమయంలో ఆయన కనిపిస్తుండేవారు. కొంతమంది దగ్గర ప్రభాకర్ రెడ్డి గురించి విన్నాను. సినిమాల గురించి నా ఆసక్తి ఆయనకు చెప్పాను. 1984లో హైదరాబాద్ వచ్చేశాను. ప్రభాకర్ రెడ్డి దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. దాదాపు పదమూడు సంవత్సరాలు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను.

ప్రభాకర్‌రెడ్డి తరువాత బి. భాస్కరరావు, ఇ.వి.వి సత్యనారాయణ, ఎ.కోదండరామిరెడ్డి, కృష్ణారెడ్డిల వద్ద పని చేశాక 1997లో ఎన్‌కౌంటర్ సినిమాతో దర్శకుడినయ్యాను. సాధారణంగా తొలిసినిమాలో ఎవరూ రిస్కు చేయరు. ప్రేమ, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ట్రాక్‌లెంచుకుంటారు. కానీ నేను పెరిగిన పరిస్థితులు, మధ్యతరగతి బతుకుల్లోని కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఆశలు వీటన్నిటితో ఎన్‌కౌంటర్ తీశాను. దానికి పేరొచ్చింది. ఆ తరువాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. శ్రీరాములయ్య, యమజాతకుడు, జయంమనదేరా, భద్రాచలం, ఆయుధం, రామ్ వరకు సినిమాలు చేసుకుంటూ వెళ్లాను. మధ్యలో ఒక కన్నడ సినిమా చేశాను. నా సినిమాల్లో కొత్తవారిని పరిచయం చేశాను.

అలా నేను పరిచయం చేసిన పాటల రచయితలే దాదాపు 15 నుంచి 20 మంది వరకు వున్నారు. ఇలాంటి పరిస్థితిలో లైఫ్ వెరీ కూల్. పేరుంది,క్రియేటివిటీ వుంది. కొత్త టెక్నాలజీని అప్‌డేట్ చేసుకునే శక్తి వుంది. ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో ముందుకెళ్లవచ్చు. సక్సెస్ రేటు మరింత పెంచుకోవచ్చు. కానీ నేను పుట్టిపెరిగిన తెలంగాణ నెత్తురోడుతున్న పరిస్థితులు నన్ను నిలువనీయలేదు. బహుశా లోలోపల ఇంకిపోయిన ఆ ఆవేదనే నాతో జై బోలో తెలంగాణ ప్రకటన చేయించింది.

కళాకారునిగా నా తెలంగాణ ఉద్యమానికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను. కాని ఆ నిర్ణయంతో మొత్తం సినిమా జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టే అనిపించింది. నిర్మాతలెవరూ ముందుకు రాలేదు. ఏవో తిప్పలుపడి నేనే తీసినా సినిమా ఫెయిలైతే పరిస్థితి ఎలా వుంటుందో? ఊహించడమే కష్టం. సినిమాకు తెలంగాణ పేరు పెట్టుకున్నాను కాబట్టి మిగతావారు చాన్స్‌లు ఇవ్వకపోవచ్చు.

వాళ్ల కారణాలు వాళ్లకుంటాయి. ఎందుకంటే నాపై తెలంగాణ ముద్ర పడుతుంది. అవకాశం ఇవ్వాలంటే ఎన్నో లెక్కలు. ఇవన్నీ ఒక వైపు కంటి ముందు పరిస్థితులు మరోవైపు. గత ఏడాది డిసెంబరు తొమ్మిది తరువాత తెలంగాణలో ఒకరని కాదు, చేతివృత్తుల వాళ్లు, కులవృత్తుల వాళ్లు, సంఘాల వాళ్లు అందరూ జై తెలంగాణ అంటున్నారు. రోడ్లెక్కుతున్నారు. చివరకు బిచ్చగాళ్లు సైతం ఒక జె.ఎ.సిగా ఏర్పడి బ్యానర్లు పట్టుకున్నారు. ఇక విద్యార్థుల త్యాగాలు మాటల్లో చెప్పలేనివి. వీటన్నిటినీ గుండెతో విన్నాను. కళ్లారా చూశాను. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా కళాకారునిగా నా బాధ్యత నిర్వర్తించాలనుకున్నాను. సర్వం ఒడ్డాను. జై బోలో తెలంగాణ సినిమా నిర్మించడానికి సిద్ధపడ్డాను.

కళకు మతం లేదు. కులం లేదు. ప్రాంతీయతత్వం అంతకంటే లేదు. ఇవన్నీ వుంటే ఈరోజు జై బోలో తెలంగాణ పాటలు సీమాంధ్ర లో వినిపించకపోవాలి. కానీ అక్కడ కూడా ఈ సినిమా ఆడియో పెద్ద సక్సెస్. సినిమాలో తొంభైశాతం నూతన నటీనటులు, పదిశాతం పాతనటులు -జై బోలో తెలంగాణ తొలినాటి లక్ష్యాల్లో ఇదీ ఒకటి. సినిమాలో ముఖ్య పాత్రకోసం ప్రముఖ నటుడిని పెట్టుకోవాలనీ, హీరో తల్లి పాత్రలో షబనాఆజ్మీ వంటి పేరున్న నటితో నటింపజేయాలనుకున్నాను. తొంభైశాతం కొత్తనటుల్లో డెభ్బైశాతం మంది తెలంగాణ ప్రాంతం వారు వున్నారు. మిగతా ఇరవై శాతం ఇతర ప్రాంత నటులున్నారు.

సినిమాల్లో అవకాశాల కోసం తిరిగే వారికి ప్రాధాన్యతనిచ్చాను. సినిమాలో వచ్చిన సాహిత్యమంతా తెలంగాణ ప్రాంతం వారు అందించినదే. ఈ సినిమాకు రాసిన వారు, పాడిన వారు అందరూ తెలంగాణ వారే. ఈ విషయంలో వాళ్లతోనే రాయించాలనీ, పాడించాలనీ రూలేమీ పెట్టుకోలేదు. అదే కాకతాళీయంగా జరిగింది. ముందే ప్రకటించినట్టు ముఖ్యపాత్రకోసం జగపతిబాబును ఎంచుకున్నాను. దీనికన్నా ముందు స్క్రిప్ట్ వర్క్ జరగాలి. కథ తయారు కావాలి. ఇలాంటి సినిమా నిర్మాణంలో అది చాలా పెద్ద పని. పకడ్బందీగా జరగాల్సిన పని.

శ్రీకృష్ణకమిటీ రిపోర్ట్ 2010 డిసెంబరులో వస్తుంది. ఇది ముందే తెలిసిన విషయం. అందువలన కమిటీ రిపోర్టుకు ముందే సినిమాను విడుదల చేయాలనుకున్నాను. స్క్రిప్ట్‌ను చాలా మందికి చెప్పాను. మార్చిలో షూటింగ్ మొదలుపెట్టాము. అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. ఉద్యమం కొనసాగుతున్న దశలోనే దానికి సమాంతరంగా నిర్మితమైన అరుదైన సినిమా ఇది. అందువలన జరుగుతున్న పరిణామాలను విస్మరించలేని పరిస్థితి. ఇంకోవైపు వాటన్నిటినీ ఏకరువుపెడితే ఇదో డాక్యుమెంటరీ అయిపోతుంది. ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండాలనుకున్నాను.

దీంతో షూటింగ్ జరుగుతున్నంతకాలం స్క్రిప్ట్‌ను మార్చుకుంటూనే, ఎప్పటికప్పుడు ఫ్రెష్‌నెస్ తీసుకురావడానికి ప్రయత్నించాను( సినిమా ఇంకా విడుదల కానందువల్ల సీన్స్‌లో జరిగిన మార్పులు, చేర్పులు గురించి చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు). ఈ ప్రభావం షూటింగ్‌పై పడింది. సాధారణంగా ఏ సినిమా షూటింగ్‌లోనైనా మధ్యాహ్నం ఒంటిగంటకు భోజన విరామం. కానీ జై బోలో తెలంగాణ షూటింగ్‌లో మాత్రం పని పూర్తయ్యాకే తిండి. సెట్‌లో మూడ్ అలా ఉండేది. నటీ నటుల నుంచి లైట్‌మన్ వరకు అందరూ ఎంతగానో సహకరించారు. కె.సి.ఆర్ నుంచి గద్దర్ వరకు పాటల రచయితలందరూ పాటలు రాసిచ్చారు. ఒక్కోపాటకు ఒక్కో ప్రత్యేకత వుంది.

ఒకటి జీవితాన్ని చెబుతుంది. మరొకటి ప్రేమను, ఇంకో పాట దు:ఖాన్ని వెల్లడిస్తుంది. శ్రీకృష్ణకమిటీ నివేదిక రానే వచ్చేసింది. అందులో ఏమీ వుండదని ముందే అనుకున్నాను. ఆ విషయాన్ని కూడా సినిమా ద్వారా ముందుగానే చెప్పాలనుకున్నాను. కానీ సినిమా ఆ లోగా విడుదల చేయలేకపోయాను. 2010 మార్చి నుంచి నవంబరు వరకు షూటింగ్ కొనసాగింది. ఇవన్నీ దాటుకుంటూ చివరకు సెన్సార్‌బోర్డు గడపతొక్కినప్పుడు ఎదురైన అనుభవంతో ఊపిరాడలేదు.

కథ రాస్తున్నప్పుడు ఎన్ని వందల సార్లు ఏడ్చానో నాకే తెలుసు. సన్నివేశాలు తలచుకున్నప్పుడు కన్నీళ్లు ఆగేవికావు. సినిమా నిర్మాణానికి ఎన్నో కష్టాలు. ఇంకెన్నో ఆర్థిక ఇబ్బందులు. నా మొత్తం కెరీర్‌ను పణం పెట్టి తీసిన సినిమా ఇది. ఎలా చూసినా ఈ సినిమా నా జీవితం. నా భవిష్యత్ నిర్ణయించేది కూడా ఇదే. ఇవన్నీ ఎవరికీ చెప్పుకోలేనివి. ఆ తడి ఎన్నటికీ ఆరదు. ఆ ఫైర్ సినిమా జనంలోకి వెళ్లేదాకా ఆగదు. కానీ సెన్సార్‌బోర్డు సినిమా విడుదలకు నిరాకరించినపుడు నిలువెల్లా కంపించిపోయాను. ఎంతో మనస్తాపానికి గురయ్యాను. జై బోలో తెలంగాణ కేవలం సినిమా కాదు.

తెలంగాణ ఉద్యమానికి హృదయం. ఒక ఊపిరి. శ్వాస. దాన్నిప్పుడు ఆపేస్తున్నారు. ఏం చేయాలో తోచలేదు. ఎంతో మంది కళాకారులు, విద్యార్థులు, సంఘాలవాళ్లు వీళ్లంతా దన్నుగా నిలిచారు. లాయర్లు అరెస్టయ్యారు. సినిమా తీశాక నీ పని అయిపోయింది. మేమే చూసుకుంటాం అంటూ ధైర్యం చెప్పారు. కొందరైతే మరొకడుగు ముందుకువేసి ప్రింటులు పంపిస్తే థియేటర్స్‌లో ప్రదర్శిస్తామని ముందుకొచ్చారు. మొత్తానికి కొన్ని సీన్స్ తొలగింపుతో సెన్సార్‌బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నా గమ్యానికి కాస్త చేరువగా వచ్చాను. శుభం కార్డు పడటానికి మాత్రం ఇంకా సమయం వుంది.

సెన్సార్‌బోర్డు సభ్యులు మినహాయిస్తే జై బోలో తెలంగాణను చూసింది కె.సి.ఆర్ ఒక్కరే. సినిమాలో మూడు సీన్స్ దగ్గర ఆయన ఏడ్చేశారు. తెలంగాణ దు:ఖాన్ని చెప్పుకునే సినిమా ఇది. తన బాధను వెల్లడిస్తుంది. గుండెమీద కాలుతున్న కుంపట్లను చూపుతుంది. తన కష్టాలను చెప్పుకుంటుంది. అంతేగానీ ఎవరి మనసుల్నీ కష్టపెట్టదు. తన అవమానాల్ని కళ్లముందు పెడుతుంది. ఎవరినీ అవమానించదు. ఈ సినిమాకు ఆ అవసరం లేదు. ఒక మంచి సినిమాగా అందరినీ మెప్పిస్తుంది.

పూర్తిపేరు: నిమ్మల శంకర్

అమ్మానాన్న: గురవయ్య, సక్కుబాయమ్మ

కుటుంబం: భార్య మాధవి, ఇద్దరు పిల్లలు

చదువు: పాలిటెక్నిక్

దర్శకత్వం చేసిన సినిమాలు: ఇప్పటివరకు తెలుగులో ఆరు, కన్నడంలో ఒకటి

అవార్డులు: 2000 సంవత్సరంలో జయంమనదేరా సినిమా రెండు నందులు గెలుచుకుంది. వీటితోపాటు ఎపిసినీగోయర్స్ అసోషియేషన్ ప్రకటించిన అవార్డులు, మానిక్‌చందర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి.

తెలంగాణ భవిష్యత్ చిత్రపటం
- పరవస్తు లోకేశ్వర్

ఉద్యమ నాయకత్వ మూల స్వభావమే ఉద్యమ స్వభావంగా నిర్ణయించబడి దానికి అనుగుణంగానే ఉద్యమ స్వరూపం కూడా రూపొందుతుంది. ఉద్యమ నాయకత్వ మూలస్వభావానికి ఆధారం వారి సామాజిక, ఆర్థిక వర్గ ప్రయోజనాలు. ఈ కోణం నుంచే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటన- ‘ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకూ అన్ని రకాల ఉద్యోగాలకూ, పదవులకూ అవకాశం ఉంటుంది’ అన్నది పరిశీలించాలి.

ఈ ప్రకటన ఉపరితల ఉద్దేశ్యం ముల్కీ నిబంధనలు, ఉద్యోగాలకు సంబంధించినదిగా కనిపించవచ్చు. కానీ దాని వెనుక లోలోతుల్లో రాబోయే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ, ఆర్థిక రంగాల్లో కూడా సీమాంధ్ర సంతతికి, వారి వారసులకు అవకాశాలు ఉంటాయనే సంకేతం ఇస్తూ, వారి కోసం స్నేహ హస్తాన్ని చాచడం కనిపిస్తుంది. గతంలో అనేక సందర్భాలలో కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీమాంద్రులు పరిశ్రమలు, వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు కొనసాగించవచ్చు’ అంటూ హామీ ఇవ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

ఇక ఇప్పుడు పరిశ్రమల సి.ఇ.ఒ.లతో సమావేశమే కానీయండి లేదా ఆయన పుత్రుడు కె.టి.ఆర్. సీమాంధ్ర వారితో తనకు గల వ్యాపార భాగస్వామ్యం గురించి వెల్లడించడమే కానీయండి జాగ్రత్తగా పరిశీలిస్తే రాబోయే తెలంగాణ రాష్ట్రంలో భూస్వామ్య అవశేష వర్గాల వారు సీమాంధ్ర నియోరిచ్ పెట్టుబడిదారులతో చేతులు కలిపి అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపారాలతో సహా ప్రభుత్వంలోనూ, చట్టసభల్లోనూ భాగస్వాములు అవుతారని సూచనప్రాయంగా తెలుస్తుంది. ఆ ‘అపవిత్ర కలయిక’కు తెలంగాణ ప్రజల్ని మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

సీమాంధ్ర పెట్టుబడిదారులు, వ్యాపార వర్గాల వారు కూడా తెలంగాణ రాష్ట్రం విషయంలో మానసికంగా సిద్ధమైనారు. అయితే హైదరాబాద్‌లో తమ ఆస్తుల్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా వ్యాపారాలను కొనసాగించాలనేదే వారి ముందున్న ‘లక్ష వరహాల ప్రశ్న’. మాయల ఫకీరు ప్రాణం చిలుకలో దాగున్నట్టు వారి ఆర్థిక మూలాలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అందువల్ల వారి ముందు రెండు ఆలోచనలు ఉన్నాయి. ఒకటి- హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా లేదా దేశ రెండవ రాజధానిగా ప్రకటింపచేసి తమ ఆర్థిక ప్రయోజనాలను కొనసాగించడం.

అది సాధ్యం కాకపోతే రెండవది- రాబోయే తెలంగాణలో అధినాయకులు, వారి అనుయాయులతో కలిసి ఉమ్మడి భాగస్వాములుగా కొత్త పరిశ్రమలను, వ్యాపారాలను కొనసాగించడం. ఈ దూరాలోచనతోనే ఇటీవలి కాలంలో రెండు వైపుల నుంచి ప్రేమ సంకేతాలు, మైత్రి సందేశాలు వెలువడుతున్నాయి. ఈ మిలాఖత్తు నిజంగానే సాధ్యమైతే రాజకీయంగా, భౌగోళికంగా తెలంగాణ స్వప్నం సాకారమైనా ఆర్థిక, సామాజిక పొరలలో ఏ విధమైన మౌలిక మార్పులు సాధించక ‘కోత్త సీసాలో పాతసారా’ కొనసాగుతుంది.

భారత దేశ అర్ధరాత్రి స్వాంతంత్య్రం, అర్ధస్వాతంత్య్రం పాతకథ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పునరావృతమవుతుంది. అరవై ఏళ్ల స్వాతంత్య్ర ఫలాలు పేదలకు అందనట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగవచ్చు. వేదిక మారినా నాటకం మాత్రం పాతదే సాగుతుంది. అవే కార్పొరేట్ ఆసుపత్రులు, అవే విద్యాసంస్థలు, తెలంగాణ ప్రజల్ని పరిహసించే అవే సినిమాలు, అవే రియల్ ఎస్టేట్ బిజనెస్‌లు, పరిశ్రమలు, కాంట్రాక్టులు ఉంటాయి.

పైగా ఇక్కడ పుట్టిన బిడ్డలుగా రాజకీయ రంగంలో, ప్రభుత్వంలో కొనసాగి ప్రభుత్వ విధానాల రూపకల్పనను, అమలును సీమాంధ్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉండేటట్లు ప్రభావితం చేస్తారు. కర్ణాటకలో ‘గాలి సోదరుల’ పెట్టుబడి అక్కడి ప్రభుత్వాన్ని , రాజకీయాలను ఎట్లా శాసిస్తున్నదో ఈ సందర్భంలో మనం మననం చేసుకోవాలి. హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్ర వ్యాపారాలు, పరిశ్రమల ముందు ఔత్సాహిక తెలంగాణ వారి వ్యాపారాలు, పరిశ్రమలు మొగ్గదశలోనే మాడి మసి అవుతాయి. తెలంగాణ ప్రాంతీయ పెట్టుబడి ఆవిర్భావానికి, అభివృద్ధికి అవకాశాలు ఉండవు.

ఒకవేళ ఇది పొరపాటు అంచనా, ఆలోచన అయినట్టయితే ఈ నాటికి కూడా తెలంగాణ ఉద్యమ నాయకత్వం సీమాంధ్ర ఆర్థిక కార్యకలాపాలపై ‘ఆర్థిక దిగ్బంధనాల్ని’ ఎందుకు విధించలేదు? గతంలో గాంధీజీ చేపట్టిన ‘విదేశీ వస్తు బహిష్కరణ’ స్థాయిలో సీమాంధ్ర ఉత్పత్తులను , విద్యాసంస్థలను, సినిమాలను ఎందుకు బహిష్కరించలేదు? ఏదో ఒకటి రెండు బహిష్కరణలకు పిలుపు ఇచ్చినా వెంటనే ఉపసంహరించుకుని ‘ఘర్షణ, ఐక్యత వెరసి స్వప్రయోజనాలు’ అన్న దళారీ మనస్తత్వాన్ని ఎందుకు ప్రదర్శించింది? ఈ తెరవెనుక రాజీలు, లౌక్యాలు భవిష్యత్తులో పడబోయే లాలూచీలకు పునాదులు కావా?

ఇక నైతిక విలువల సంగతి. ఉద్యమ నాయకత్వపు ఉన్నత స్థానాలలో ఉన్నవారే అవతలి పక్షం వ్యాపారాలలో భాగస్వాములు కావడం తెలంగాణ ప్రజల మనస్సులను గాయపరచడం కాదా? ఏ పెట్టుబడి తెలంగాణను దోపిడీకి, అన్యాయానికి గురి చేసిందో అదే పెట్టుబడిలో భాగస్వాములుగా మారడం ఏ విలువలకు సంకేతం? ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులపై ఏ మాత్రం ప్రేమ, గౌరవం ఉన్నా వెంటనే అటువంటి వ్యాపార భాగస్వామ్యాల నుంచి బయటకు వచ్చి సీమాంధ్ర వస్తూత్పత్తులపై ఆర్థిక దిగ్బంధాన్ని, బహిష్కరణను విధించాలి.

ప్రారంభంలో ఆటుపోట్లు, కష్టనష్టాలు ఎదురైనా లెక్కచేయక నూతన తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక స్వావలంబనతో, తన కాళ్ళపై తాను నిలబడి, యావత్ దేశానికే దీపస్తంభంగా నిలుపుతామని ఉద్యమ నాయకత్వం తెలంగాణ ప్రజలకు హామీ ఇవ్వాలి.

- పరవస్తు లోకేశ్వర్

తెలంగాణ రచయితల జెఎసి కన్వీనర్

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి: తెలంగాణ ఏర్పడి తీరుతుంది: సినారె
వేములవాడ, జనవరి 10(ఆన్‌లైన్‌): చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్‌ జిల్లా వేములవాడలో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ ఈనాటిది కాదని, దశాబ్దాలుగా ప్రజల ఆకాంక్ష, ప్రజలందరి ఏకగ్రీవ కోరిక అని చెప్పారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉండాలన్న ప్రతిపాదనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు చేశారని, అయితే తెలుగు మాట్లాడేవారు వేర్వేరు రాష్ట్రాలుగా ఉంటే నష్టమేమీ లేదన్నారు.

ఎన్‌డీఏ హయాంలో కొత్తగా ఏర్పడిన మూడు చిన్నరాష్ట్రాలు ఎంతో అభివృద్ధి సాధించాయని, చిన్న రాష్ట్రాల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా, పరిపాలనాపరంగా స్వయంసమృద్ధికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు అవసరం లేదని, ఒక ప్రాంతం వారు మరో ప్రాంతం వారిని దూషించడం సరైంది కాదని అన్నారు. ‘తెలంగాణ నాది, రాయలసీమ నాది, కోస్తా నాది..’ అన్నపాట ఎన్టీఆర్‌ కోరికమేరకు రాశానని, నాటి పరిస్థితులు నేడు లేవని, ఇప్పుడు ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం కోరుకుంటున్నారని సినారె అన్నారు.

వినూత్న నిరసన
(ఆన్‌లైన్‌ న్యూస్‌నెట్‌వర్క్‌) ఉద్యమంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, లాయర్లు, ప్రజలు మంగళవారం వినూత్న పద్ధతుల్లో నిరసనలకు దిగారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల క్రాస్‌ రోడ్‌ వద్ద రాజకీయ పార్టీల జేఏసీ, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారిల వేషధారులకు వివాహతంతు నిర్వహించారు. ఈ వివాహతంతుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఎడ్లబండ్లు, ట్రాక్టర్లపై తరలివచ్చారు. నన్నపనేని వేషధారి లగడపాటి వేషధారి నుదుటిపై ముద్దుపెట్టి భర్తగా స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన వేలాది మందికి రోడ్ల మీదే సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు హాజరు కావడం విశేషం. ఈ సందర్భంగా దయాకరరావు మాట్లాడుతూ, టీడీపీ నాయకురాలై ఉండి నన్నపనేని లగడపాటికి ముద్దు పెట్టడాన్ని ఈ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేక ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి భారీగా జనం తరలి రావడంతో 202 జాతీయ రహదారిపై గుడెప్పాడు నుంచి నీరుకుళ్ల దాకా, నీరుకుళ్ల క్రాస్‌ నుంచి మహ్మద్‌ గౌస్‌పల్లి దాకా ఎటు చూసినా దాదాపు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

జిల్లా కోర్టుల సముదాయం ఎదుట రోడ్డుపై హన్మకొండ సుబేదారిలో న్యాయవాదులు వంటావార్పు నిర్వహించి సహపంక్తి భోజనాలు పెట్టారు. వరంగల్‌ పోచమ్మైదాన్‌ సర్కిల్‌లోనూ ఇదే విధమైన నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో మొదటిసారిగా రైల్వే కార్మికులు స్పందించారు. దక్షిణ మధ్యరైల్వే షావుకార్‌, హమాలీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ రైల్వే స్టేషన్‌ నుంచి పోచమ్మైదాన్‌ దాకా భారీ ర్యాలీ నిర్వహించారు.

మొత్తంగా వరంగల్‌ జిల్లా నిరసనలతో హోరెత్తింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పాలమూరు వర్సిటీ విద్యార్థులు చంద్రబాబు, చిరంజీవి, మోహన్‌బాబు, రోజా, లగడపాటి, జగన్‌, నన్నపనేని, జేసీ దివాకర్‌రెడ్డిల బొమ్మలతో తయారు చేసిన రావణాసురుణ్ని ఊరేగించి దగ్ధం చేశారు. జడ్చర్ల ప్రధాన కూడలిలో మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. కొల్లాపూర్‌లో ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ నేతలు కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసుకొని వీధుల్లో తిరిగారు.

యూనివర్సిటీల్లో దీక్షల హోరు

యూనివర్సిటీలు తెలంగాణ పోరుతో హోరెత్తుతున్నాయి. పోరులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో విద్యార్థుల దీక్షలు సాగుతున్నాయి. ఉస్మానియాలో దీక్షా శిబిరాన్ని పోలీసులు తొలగించినప్పటికీ, విద్యార్థులు ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా మరికొంత మంది విద్యార్థులు ఆర్ట్స్‌ కళాశాల వద్ద రిలే దీక్షలు చేస్తున్నారు. ఆర్ట్స్‌ కళాశాల వద్ద తొలగించిన టెంట్‌ను తిరిగి ఇవ్వాలని మంగళవారం అధ్యాపకులు పోలీసులను డిమాండ్‌ చేశారు. ఈలోగా పోలీస్‌ స్టేషన్‌ వైపు వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు అధ్యాపకుల కోరిక మేరకు ఒక చిన్న టెంట్‌ను పోలీసులు తిరిగి ఇచ్చేశారు.

వరంగల్‌ జిల్లా కాకతీయ వర్సిటీలో విద్యార్థుల ఆమరణ దీక్ష కొనసాగుతోంది. పాలమూరు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. దీక్ష చేస్తున్న వారికి మంగళవారం పరీక్షలు చేసిన వైద్యులు, వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు. దీంతో పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో పోలసులకు, విద్యార్థులకు మధ్య తీవ్రంగా తోపులాట చోటు చేసుకుంది.

కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో విద్యార్థుల దీక్ష నాలుగో రోజుకు చేరింది. వీరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వీరిలో నాగరాజు అనే విద్యార్థి ఆరోగ్యం క్షీణించడంతో అతన్ని ఆస్పత్రిలో ఉంచి మిగిలినవారిని పోలీసులు రిమాండ్‌లో ఉంచారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీ జేఏసీ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

నాగం కేసును బనాయిస్తే సహించం: జేఏసీ

ఉస్మానియా వర్సిటీ జేఏసీ నాయకులు కుమారస్వామి, స్టాలిన్‌లను మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జేఏసీ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. దీంతో వారు వెంటనే మానవ హక్కుల కమిషన్‌ను సంప్రదించారు. కమిషన్‌కు కూడా పోలీసులు సరైన సమాధానం ఇవ్వలేదని తెలిసింది. కాగా.. జేఏసీ నేతలిద్దరూ సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. సీఐడీ అదుపులో ఉన్న వారిద్దరినీ నాగం జనార్దనరెడ్డిపై జరిగిన దాడి కేసులో ఇరికించే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అంతే కాకుండా బుధవారం బంద్‌ జరగనున్న దృష్ట్యా… జరిగే అవాంఛనీయ సంఘటనలు ఏవైనా వారిపైకి తోసే కుట్ర జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చకుండా తాత్సారం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులను వెంటనే విడుద ల చేయాలని, నాగం జనార్దన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసును బనాయిస్తే సహించేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ తీవ్రంగా హెచ్చరించింది.

(Courtesy: AndhraJyothy)

అట్లాంటా ప్రవాసుల ‘తెలంగాణ’ డిమాండ్‌
అట్లాంటా, డిసెంబర్‌ 28 : అట్లాంటాలో తెలంగాణ Atlanta TNRIs ఆధ్వ ర్యంలో పలువురు తెలంగాణ ఎన్నారైలు సమావేశమై ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేసారు. సత్య కమతి ప్రారంభించిన ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ ఉద్యమంలో మరణించిన అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఆ తర్వాత స్థానిక ప్రవాస తెలంగాణ సంస్థ అధ్యక్షులు జిఎస్‌ రెడ్డి తమ కుటుంబీకులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న స్ఫూర్తిగాథను, ఆంధ్ర, హైదరాబాద్‌ రాష్ట్ర ఏర్పాటు పరిస్థి తులను ఆహూతులకు వివరించారు. అంతకుముందు తెలంగాణ ఇంటలెక్చల్‌ ఫోరమ్‌ రూపొందించిన తెలంగాణ ఉద్యమ చరిత్రతో కూడిన ఒక డాక్యుమెంటరీని ప్రదర్శించారు.

అనంతరం స్థానిక రిపబ్లిక్‌ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే నరేందర్‌ రెడ్డి తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేందుకు, రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని అభిప్రాయపడ్డారు. అయిదవ అతిపెద్ద రాష్ట్రాన్ని విడగొట్టి ప్రాధాన్యతలేని రాష్ట్రాలస్థాయికి చేరిపోతామంటూ ఆంధ్రలో పలువురు నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ అంతకంటే చిన్న రాష్ట్రాలు 17పైనే వుంటాయని, ఇది అభివృద్ధికి ఒక అవకాశమని వివరించారు. హైదరాబాద్‌లో అన్ని ప్రాంతాల వారూ ఉండవచ్చన్నారు. ఆ తర్వాత తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరమ్‌కి చెందిన వివేక్‌రెడ్డి 1969 తెలంగాణ ఉద్యమంలో తన అనుభవాలు, తెలంగాణ ప్రాంత వ్యవసాయ పరిస్థితులు, ప్రాజెక్టులపై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. అలాగే చంద్రమోహన్‌ నెల్లుట్ల మాట్లాడిన తర్వాత పలువురు ఎన్నారైలు అడిగిన ప్రశ్నలకు నిర్వాహకులు సమాధానాలు ఇచ్చారు. చివరిగా ముగ్గురు చిన్నారులు జనగణమన ఆలపించారు. ఆనంద్‌ గార్లపాటి, ఆట సభ్యులు కరుణాకర్‌ రెడితో పాటు పలువురు ప్రవాస ప్రముఖులు హాజరై తమ మనోభిప్రాయాలు వెల్లడించినందుకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేయడంతో సమావేశం ముగిసింది.

(Courtesy: AndhraJyothy)

Note: Small correction done to the original article

తెలంగాణ కోసం ఖాకీ యూనిఫారం సర్వీసుల జేఏసీ
హైదరాబాద్‌, డిసెంబర్‌ 27(ఆన్‌లైన్‌) తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా ఖాకీ యూనిఫారం సర్వీసులకు చెందిన వారు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడ్డారు. ఖాకీ యూనిఫారం సర్వీసులైన పోలీసు, జైళ్లు, ఫారెస్టు, ఎక్సైజ్‌, ట్రాన్స్‌పోర్టు, ఫైర్‌,తూనికలు కొలతల శాఖకు చెందిన తెలంగాణ ప్రాంత సిబ్బంది ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై తెలంగాణ యూనిఫారం సర్వీసుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడినట్లు ప్రకటించారు. రాష్ట్ర సాధన లక్ష్యంగా యూనిఫారం సర్వీసులకు చెందిన సిబ్బంది బహిరంగంగా ముందుకురావడం దేశంలోనే ఇదీ తొలిసారి.

తెలగాణ రాష్ట్రం ఏర్పడే వరకు నిర్మాణాత్మకమైన ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకుని వెళ్లాలని తీర్మానం చేశామని జేఏసీ కన్వీనర్‌ కొలను వేంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి ప్రతినెల తెలంగాణ జేఏసీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని తీర్మానించామని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్ర  సాధన కోసం తాము చేస్తున్న ఉద్యమం క్రమశిక్షణకు విరుద్దం కాదని, విధి నిర్వహణ పూర్తయిన తర్వాతే పనిచేస్తామని, నిబంధనలకు వ్యతిరేకంగా తామేమీ వ్యవహరించమని ఆయన పేర్కొన్నారు.

జైళ్లశాఖ నుంచి వై.వెంకటరెడ్డి, ఎక్సైజ్‌ నుంచి టి.రవీందర్‌ రావు, డి.అరుణ్‌కుమార్‌, ఫారెస్టు డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎం.రామకృష్ణారావు, వి.తిరుమలరావు,ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎస్‌ఎన్‌ రెడ్డి, పి.రవీందర్‌కుమార్‌, జి.చందన్‌కుమార్‌, ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి వై.ప్రభాకర్‌రెడ్డి,పోలీసుశాఖ నుంచి ఆర్‌.సుదర్శన్‌, జే.రమేష్‌ ప్రతినిధులుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలోనేజిల్లాల వారీగా ఏడు డిపార్ట్‌మెంట్ల స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. వీరికి సంఘీభావంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు శ్రీనివాసగౌడ్‌ తదితరులు హజరయ్యారు

పిల్లలా? తెలం’గన్ను’లా!?
వరంగల్‌, డిసెంబర్‌ 24 (ఆన్‌ లైన్‌): వాళ్లకు పట్టుమనీ పన్నెండేళ్లు కూడా నిండలేదు. తెలంగాణ ఉద్యమంలో మేము ‘సై’తం అంటూ రైల్‌రోకోలో తమ ఊరిజనంతో మమేకం అయ్యారు. వారిలో ఉద్యమ స్ఫూర్తేకాదు ఉప్పొంగించే ఉద్యమ భాషాను చూసి ‘ఔరా పిల్లలా వీళ్లు పిడుగులా’ అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏకబిగిన నినాదాలు ఇవ్వడమే కాకుండా తెలంగాణ నిప్పుల కొలిమికి కేంద్రమే కారణమంటూ వినూత్న నినాదాలను ఇస్తున్నారు.

ఇదంతా ఎవరు చెప్పారు బాబూ అంటే ‘తెలంగాణ బతుకే కొట్లాట అయింది. మేం ఇప్పటి నుంచే పోరాటం చేస్తేనే రేపు మా బతుకులు బాగుపడతాయి’ అని వేదాంతం వల్లిస్తున్నారు. ‘పాలబగ్గల జీతగాడా, పసులగాసే మోనగాడా, పాలుమరచి ఎన్నాళ్లు అయిందో..‘ అన్న సుద్దాల హన్మంతు బతుకుగీతం నుంచి ‘తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడుడే’ అంటూ ఉద్యమభాషను మాట్లాడు తున్నారు. వారి మాటలకు, వారిచ్చే నినాదాలకు హసన్‌పర్తి, సీతంపేట, ఎల్లాపూర్‌ తదితర గ్రామస్థులే కాకుండా రైలులో ఉన్న ప్రయాణికులు, రైల్‌రోకో చేస్తోన్న ఆందోళనకారులను కట్టడి చేసేందుకు వచ్చిన పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరూ.. ఇద్దరిగానే రణనినాదాన్ని ఎత్తుకున్నారు.

<object width="425" height="350"><param name="movie" value="RRhv1DElVuI"></param><param name="wmode" value="transparent" ></param><embed src="http://www.youtube.com/v/RRhv1DElVuI" type="application/x-shockwave-flash" wmode="transparent" width="425" height="350"></embed></object>

‘పుడితొక్కటి సత్తెరెండు రాజిగ ఓరి రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా రాజిగ ఓరి రాజిగా’ అంటూ చప్పట్లతో ఊర్రూతలూ గించే పాటలు పాడారు. రైలులో ఉన్న ప్రయాణికుల దగ్గరి వెళ్లీ మరీ ‘అవ్వా! మాది బతుకు పోరాటం. మెతుకు ఆరాటం’ అంటూ జీవిత చరమాంకంలో చెప్పిన వ్యక్తుల్లా ఈ పిడుగులు మాట్లాడటాన్ని అంతా నివ్వెర బోతున్నారు. గురువారం హసన్‌పర్తి రైల్‌రోకో దగ్గర అందరి దృష్టిని ఆరోతరగతి చదివే విద్యార్థులు వారు. అసలు తెలంగాణ ఉద్యమం గురించి నీకు ఏం తెలుసు? నువు ఎందుకు ఇక్కడి వచ్చావు ఇక్కడికి అంటే ఎస్‌.రాకేష్‌ అనే ఈ విద్యార్థి ఇలా సమాధానం ఇస్తున్నాడు ‘ఇగో సారూ.

<object width="425" height="350"><param name="movie" value="-P72krZq-XE"></param><param name="wmode" value="transparent" ></param><embed src="http://www.youtube.com/v/-P72krZq-XE" type="application/x-shockwave-flash" wmode="transparent" width="425" height="350"></embed></object>

ఈ తెలంగాణ గడ్డమీద పుట్టినందుకు తెలంగాణ కోసం మాట్లాడాలె బిడ్డా అని మా అవ్వ చెప్పింది. ఊళ్లే అందరు జై తెలంగాణ అని గీడికి వత్తే (రైల్‌ రోకో దగ్గరికి) నేను ఇంట్ల పండాల్నా? అందుకే జై తెలంగాణ అంటున్న’ అని సమాధానం ఇస్తున్నాడు. ఉదయం నుంచి తిండీ తిప్పలు లేకుండా ఇంటికిపోయి మంచిగా ఆడుకోక మీ వయసులో ఎందుకీ ఉద్యమం అంటే ‘గట్లెట్ట మాట్లాడతవు సారు. తెలంగాణ కోసం మేం గిట్ల నిరాహార దీక్ష చేస్తున్నం అనుకోరాదు‘ అంటూ అదే గ్రామానికి చెందిన ఎ. అఖిల్‌ అనే ఆరో తరగతి విద్యార్థి సమాధానం ఇచ్చాడు. మొత్తం మీద హసన్‌పర్తి రైల్‌రోకో ఎపిసోడ్‌లో ఈ ఇద్దరూ ఇద్దరుగా అందరినీ ఆశ్చర్యపరిచారు.

<object width="425" height="350"><param name="movie" value="E4cTBy4mf4c"></param><param name="wmode" value="transparent" ></param><embed src="http://www.youtube.com/v/E4cTBy4mf4c" type="application/x-shockwave-flash" wmode="transparent" width="425" height="350"></embed></object>

(Courtesy: AndhraJyothi)

నల్లగొండలో .. గోడలు
దామచర్ల, నాగార్జునసాగర్‌ ప్రాంతాల్లోని గుంటూరు జిల్లా సరిహద్దుల్లో నిరసనకారులు గోడలు నిర్మించారు.

Wall in Nalgonda

సమ్మిళిత అభివృద్ధితోనే సమైక్యత
- ఎమ్‌.ఎల్‌. కాంతారావు

పెద్ద మనుషుల ఒప్పందానికి కట్టుబడి ఉండకపోవడం, ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు పరచకపోవడం, ప్రాంతీయ అభివృద్ధి కమిటీలను రద్దు చేయడం, సహజ వనరుల నిర్వహణ, వినియోగంలో అంతులేని అవినీతి మొదలైన కారణాలే ప్రస్తుత సంక్షోభానికి దారితీసింది. ప్రణాళికా సంఘం నిర్దేశించిన సమర్థ పాలన, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో మనం పూనుకున్నప్పుడే ఈ విషమ పరిస్థితి నుంచి బయటపడగలం.

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు ఏమిటి? తమ ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి నివ్వాలని తెలంగాణ వారు, సమైక్యంగా ఉండాలని కోస్తా, రాయలసీమవారు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. తలసరి ఆదాయం పరంగా కానివ్వండి, మానవాభివృద్ధి సూచీల విషయంలో కానివ్వండి మన రాష్ట్రం మధ్య స్థాయిలో ఉందేగాని అగ్రగామి రాష్ట్రంగా లేదు. ఇక అర్థశాస్త్రవేత్తలు ఇటీవల గీటురాళ్ళుగా తీసుకొంటున్న శ్రేయో సూచీల పరంగా మన రాష్ట్రం ఏ స్థానంలో ఉందో చెప్పనవసరం లేదు. ప్రస్తుత ధరల ప్రకారం 2007- 08లో ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఎన్‌ఎస్‌డిపి 35,864 రూపాయలు.

మరి అదే సంవత్సరంలో వివిధ రాష్టాల తలసరి ఎన్‌ఎస్‌డిపి ఇలా ఉన్నది:

గుజరాత్‌- 58, 531 రూపాయలు;

మహారాష్ట్ర-47,051;

కేరళ-41,814;

కర్ణాటక-36,266.

కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ 1,10,728 రూపాయలతో తలసరి ఎన్‌ఎస్‌డిపిలో అగ్రగామిగా ఉంది. 2004-05 నుంచి 2007-08 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్‌ సగటు వార్షిక తలసరి ఎస్‌డిపి రూ. 22,946 (సూచి 105.4) కాగా అఖిల భారతస్థాయిలో అది రూ.21,769. తలసరి ఎస్‌డిపి విషయంలో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మన రాష్ట్రం 13వ స్థానంలో ఉంది.

పేదరికాన్ని అంచనా వేసేందుకు ప్రణాళికా సంఘం నియమించిన ప్రొఫెసర్‌ సురేశ్‌ టెండూల్కర్‌ కమిటీ నివేదిక ప్రకారం 2004-05 సంవత్సరంలో దేశ జనాభాలో 37.2 శాతం మంది పేదలే. మన రాష్ట్రం విషయానికి వస్తే ఇది 30 శాతం కాగా కేరళలో 19.7 శాతం, తమిళనాడులో 28.9 శాతం, కర్ణాటకలో 33.4 శాతం, ఢిల్లీలో 13.1 శాతం, నాగాలాండ్‌ లో 9 శాతం మంది పేదలు. చిన్న, పెద్ద, కొత్త రాష్ట్రాల అనుభవమేమిటో చూద్దాం. 2004-08 సంవత్సరాల మధ్య స్థిర ధరల ప్రకారం సగటు వార్షిక తలసరి ఎన్‌ఎస్‌డిపి ఆధారంగా కొత్త రాష్ట్రాలైన ఉత్తరాఖండ్‌ 23వ స్థానంలోను, ఛత్తీస్‌గఢ్‌ 24వ స్థానంలోను, జార్ఖండ్‌ 28వ స్థానంలోను ఉన్నాయి.

ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి సమకూరినప్పటికీ పేదరికం నిర్మూలనలో అవి జాతీయ సగటు కంటే తక్కువ ఫలితాలను మాత్రమే సాధించగలిగాయి. రాష్ట్ర వైశాల్యం చిన్నదిగా ఉంటేనే సుపరిపాలన, అభివృద్ధి సాధ్యమవుతాయని చెప్పడానికి వీలులేదు. అలాగే వైశాల్యంలో పెద్దవిగా ఉన్న రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో బాగావెనుకబడి ఉన్నాయి. ఇందుకు మణిపూర్‌, బీహార్‌లే తార్కాణాలు. 2004-07 సంవత్సరాల మధ్య మన రాష్ట్రంలోని 9 కోస్తా జిల్లాల్లో 4 జిల్లాల సగటు వార్షిక తలసరి ఆదాయం రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉంది.

అదే కాలంలో నాలుగు రాయలసీమ జిల్లాల సగటు తలసరి ఆదాయం కూడా రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే ఆ ప్రాంతంలోని పది జిల్లాలకుగాను 5 జిల్లాల తలసరి ఆదాయం రాష్ట్ర సగటు తలసరి ఆదాయం కంటే తక్కువగా ఉంది. సాగుచేస్తోన్న భూమి నికర వైశాల్యం, నీటి పారుదల సదుపాయమున్న నికర భూమి వైశాల్యం మధ్య నిష్పత్తి కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో 2007-08 సంవత్సరంలో కూడా 45 నుంచి 79 శాతం మధ్య ఉన్నది.

ఈ విషయంలో మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు మొత్తం 23 జిల్లాల్లో వరుసగా 20, 21 స్థానాల లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తంగా చూస్తే నికర సాగు భూమి, నికర సాగునీటి వసతి గల భూమి మధ్య నిష్పత్తి 44 నుంచి 45 శాతం మధ్య ఉంది. 2006-07 సంవత్సరంలో సాగునీటి వసతి గల మొత్తం పంట క్షేత్రాల వైశాల్యం, సాగుచేస్తోన్న మొత్తం భూ వైశ్యాలం మధ్య నిష్పత్తి

పశ్చిమ గోదావరి జిల్లాలో 87.65 శాతం,

కరీంనగర్‌ జిల్లాలో 78.05 శాతం,

నెల్లూరు జిల్లాలో 75.39 శాతం,

వరంగల్‌ జిల్లాలో 67.47 శాతంగా ఉంది.

చివరి నాలుగు స్థానాలలో

అనంతపూర్‌ (14 శాతం),

ఆదిలాబాద్‌ (19 శాతం),

కర్నూలు (22 శాతం)

మహబూబ్‌నగర్‌ (25 శాతం) ఉన్నాయి.

ఈ అంకెలను బట్టి వివిధ రంగాలలో తెలంగాణ, కోస్తా జిల్లాలు అగ్ర స్థానంలో ఉన్నాయని, రాయలసీమ జిల్లాలు చివరి స్థానాలలో ఉన్నాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతం జిఎస్‌డిపి/జిడిపిలలో 55 శాతం సేవల రంగం ద్వారా సమకూరుతుంది. కనుక మానవ వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అగ్ర ప్రాధాన్యమివ్వవలసివుంది. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య అవగాహనా వారధులనే గాని, వేర్పాటు గోడలను నిర్మించకూడదు.

రవాణా, కమ్యూనికేషన్‌ రంగాలలో అనూహ్య పురోగతి మూలంగా ప్రాంతాలు, ప్రదేశాల మధ్య దూరాలు తగ్గిపోయాయి. టెలీ కాన్ఫరెన్స్‌లు జరుగుతున్న నేటి పరిస్థితుల్లో సమర్థ పాలన నందించేందుకు చిన్న రాష్ట్రాలనేర్పాటు చేయాల్సిన అవసరమేమిటి? ‘సెంటిమెంటు’ మాత్రమే పురోగతి సాధనకు తోడ్పడదు. అదనపు వనరులను సమకూర్చుకోని పక్షంలో ఏ రాష్ట్ర మూ ఆర్థిక సౌష్ఠవాన్ని పెంపొందించుకోలేదు; సుస్థిర పాలనను అందివ్వలేదు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకు తావివ్వకుండా సుపరిపాలన నందిస్తూ, అభివృద్ధి సాధనలో సరైన ప్రాధమ్యాలను నిర్దేశించుకున్నప్పుడు మాత్రమే మనం ప్రస్తుత దురదృష్టకర పరిస్థితుల నుంచి బయటపడగలం.

మరి మనం చింతిస్తున్న ఈ దురదృష్టకర పరిస్థితులకు కారణాలేమిటి?

పెద్ద మనుషుల ఒప్పందానికి కట్టుబడి ఉండకపోవడం,

ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు పరచకపోవడం,

ప్రాంతీయ అభివృద్ధి కమిటీలను రద్దు చేయడం,

పాలనా వ్యవస్థలో మితిమీరిన కేంద్రీకరణ,

పంచాయతీరాజ్‌ సంస్థలు, పట్టణ స్థానిక పాలనా సంస్థలను నిర్వీర్యం చేయడం,

సహజ వనరుల నిర్వహణ, వినియోగంలో అంతులేని అవినీతి,

ప్రణాళికా బద్ధంగా ఆర్థిక వనరులను వినియోగించుకోకపోవడం,

ప్రణాళికా లక్ష్యాలకు విరుద్ధం గా భారీ ‘అభివృద్ధి’ పథకాలను చేపట్టడం,

పాలకులలో ‘నా తరువాత, ప్రళయమే’ అన్న వైఖరి ఇత్యాదులు ప్రస్తుత దురదృష్టకర పరిస్థితులకు దారి తీశాయి.

మరి మార్గాంతరం ఏమిటి?

రాజ్యాంగబద్ధమైన జిల్లా ప్రణాళికా సంఘాలను పటిష్టం చేయాలి.

వివిధ చట్టాలు నిర్దేశించిన అధికారాలను వాటికి సమకూర్చాలి.

ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు మూడు ప్రాంతీయ అభివృద్ధి సంఘాలలోను ప్రజా శ్రేయస్సుకు నిబద్ధమయిన రాజకీయవేత్తలు, అధికారులను నియమించాలి.

వాటికి సరైన రీతిలో నిధులు సమకూర్చాలి.

అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షించేందుకు వాటికి అవసరమైన అధికారాలు అన్నిటినీ సమకూర్చాలి.

రాష్ట్రంలో సాపేక్షంగా వెనుకబడిన జిల్లాలలో అన్ని రంగాలలోను సత్వర అభివృద్ధి సాధించేందుకు ‘బ్యాక్‌వర్డ్‌ రీజియన్స్‌ గ్రాంట్‌ ఫండ్‌ (బిఆర్‌జిఎఫ్‌) కింద పెద్ద ఎత్తున ఆర్థిక సహాయమందించాలి.

సమర్థ పాలన, సమ్మిళిత అభివృద్ధి అనేవి 11వ పంచవర్ష ప్రణాళిక (2007-12) ప్రధాన లక్ష్యాలు అనే విషయాన్ని మనం విస్మరించకూడదు.

ఏ సమస్యనైనా ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించుకోవడం,

నిర్ణయాలు తీసుకోవడం లోను, వాటిని అమలుపరచడంలోను జవాబుదారీతనంతో వ్యవహరించడం,

అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలను భాగస్వాములను చేయడం, వర్తమాన అవసరాలనే కాక భవిష్యత్‌ తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచు కోవడం మొదలైనవి సమర్థ లేదా సుపరిపాలన లక్షణాలు.

సరిగ్గా ఇప్పుడు కొరవడింది సమర్థ పాలనా, అన్ని ప్రాంతాల మధ్య సమానాభివృద్ధి. ప్రస్తుత దురదృష్టకర పరిస్థితులు తొలగిపోవాలంటే సుపరిపాలన, మూడు ప్రాంతాలలోను సమాన స్థాయిలో అభివృద్ధిని సాధించడమే ఇప్పుడు మన పాలకుల ప్రథమ ప్రాథమ్యం కావాలి. (ఇందుకు అవసరమైతే అధికరణ 356 కింద రాష్ట్ర శాసనసభను సుషుప్త చేతనా వస్థలో ఉంచాలి). ఏమైనా ఇటువంటి పరిణామానికి అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు మానసికంగా సంసిద్ధమయ్యేవున్నారు.

ఆందోళనల ఒత్తిడి నుంచి వారిని బయటపడవేయవలసిన అవసరముంది. ‘ఐక్యంగా ఉంటే మనమే బలవంతులం, విడిపోతే కొరగాని వాళ్ళమవుతామని’ పెద్దలు చెబుతుంటారు. ఆ సుభాషితాన్ని ఇప్పుడై నా సరిగ్గా అర్థం చేసుకొంటేనే మనం ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడతాం. సుపరిపాలనతో పాటు మూడో అంచె పాలనా వ్యవస్థ అంటే పంచాయతీరాజ్‌ సంస్థలు, పట్టణ స్థానిక పాలనా సంస్థలను సముచిత అధికారాలతో సాధికారికం చేసినప్పుడు మాత్రమే ప్రస్తుత సంక్షోభం తొలగిపోగలదు. మానవ దేహంలో ఏదైనా ఎముక విరిగినప్పుడు ఆ ఎముకకు కట్టుకట్టి, కదలకుండా చేసి మూలికల సహాయం తో ఆరు వారాలు లేదా రెండు మూడు నెలల్లో దానికి సమీపంలో ఉన్న ఇతర ఎముకలతో పూర్వం మాదిరిగా అతుక్కుపోయేలా చేయడం మన సంప్రదాయ వైద్య పద్ధతి.

అయితే ఆధునిక వైద్యులు ఇనుపబద్దలు, ఇతర దృఢ పరికరాలతో కట్టు కట్టి ఆరు వారాల కంటే తక్కువ సమయంలోనే విరిగిన ఎముకలను సరిచేసి బాధితుడికి బాధా ఉపశమనం చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయ వ్యవస్థ కూడా తీవ్ర ఘాతాలకు లోనయివుంది. సామరస్యత పూర్తిగా దెబ్బతింది. రాజకీయరంగంలోనే కాక సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో కూడా ఇది తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతోంది. మరి ఆయా ప్రాంతాల ప్రజల మనస్తాపాలకు నిజమైన కారాణాలు ఉన్నా లేకపోయినా రాష్ట్రాన్ని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడవేయడానికి సరైన ‘వైద్యం’ తక్షణమే చేయవలసిన అవసరమెంతైనా ఉంది.

రాజకీయ అస్థిరతను రూపుమాపడానికి, ఆర్థిక వెనుకబాటుతనాన్ని నిర్మూలించేందుకు, సామాజిక పతనాన్ని అరికట్టేందుకు, సమున్నత సాంస్కృతిక వైభవాన్ని సాధించేందుకు మనం చ్తితశుద్ధితో పూనుకోవాలి. పదకొండవ పంచవర్ష ప్రణాళిక లక్ష్యంగా నిర్దేశించుకున్న సమ్మిళిత అభివృద్ధి గురించి శతాబ్దాల క్రితమే మన ప్రాచీనులు చెప్పారు. ‘పేదరికం ఎక్కడ ఉన్నా అది అక్కడ ఐశ్వర్యానికి ముప్పు చేస్తుందని‘ వారు అన్నారు. మన పెద్దలు చెప్పిన ఈ సత్యాన్ని మరచిపోనప్పుడే మనం అన్ని ప్రాంతాలలోను, అందరికీ సమానాభివృద్ధిని సాధించగలం.

- ఎమ్‌.ఎల్‌. కాంతారావు

(వ్యాసకర్త విశ్రాంత అర్థశాస్త్ర ఆచార్యులు)

‘ప్రదేశ్‌’ తెలుగు పేరే కాదు
-వరవరరావు

‘ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్‌ జాతి ప్రస్తావన ఉంది’ ‘ఆంధ్రప్రదేశ్‌ పేరుతో సహా చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటి ది’ అంటూ ‘ఆ చరిత్ర తెలియని కుహనావాదులు, అజ్ఞానులు, అమాయకులు, ‘ఆంధ్రప్రదేశ్‌’ నిన్న, మొన్నటిదనుకొని జాతి వ్యతిరేక చర్యలకు ఉపక్రమించడం చరిత్రను కించపరచడమే’నని రాసిన లగడపాటి కి తెలుగు (పోని ఆంధ్ర) భాష-అజంత (అచ్చుతో ముగిసే) భాష అని కూడా తెలిసినట్టు లేదు. తెలుగులో ప్రదేశం అని ఉంటుంది గాని ప్రదేశ్‌ అనేది హిందీ మాట అని కూడా తెలిసినట్టులేదు.

ఆంధ్రుల చరిత్ర రాసిన ఆదిరాజు వీరభద్రరావు ‘మొదలు ఇది తెలంగాణమే’ అని ప్రారంభిస్తారు. తెలుగు వారికి ఆణెము-నివాసం అనే అర్థంలో, తెలుగునాడు, తెలుగుసీమ, తెలుగుదేశం, ఆంధ్ర, విశాలాంధ్ర-శబ్దాలు తెలుగు వారికి శబ్దాలవుతాయి గానీ, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు శబ్దం కాదు. కమ్యూనిస్టులు విశాలాంధ్ర కోరారు కనుక అది ఇవ్వడం ఇష్టంలేక, ప్రాచీనమైన తెలంగాణ పేరు పెడితే ఆంధ్ర శబ్దంతో రూఢ్యర్థం ఏర్పడిన కోస్తా ఆంధ్రవాదుల భావాలు తృప్తిపడవని’ 56లో జవహర్‌లాల్‌ నెహ్రూ పెట్టిన పేరు ఆంధ్రప్రదేశ్‌. 1956 నవంబర్‌ 1 కన్న ముందు ఏ ప్రాంతం నుంచి వచ్చిన తెలుగు జాతి చరిత్రలోనైనా ఆంధ్రప్రదేశ్‌ అనే పద బంధం ఉన్నదేమో చూపమని నేను లగడపాటి ని ‘అమాయకం’గానే అడుగుతున్నాను.

చూపలేకపోతే ఆయన వాడిన మిగతా రెండు విశేషణాలు అయనకే చక్కగా సరిపోతాయి. నాలుగున్నర శతాబ్దాల శాతవాహనుల పాలన ఇప్పటి కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాల, ఎలగందులతో గోదావరి తీరంలో ప్రారంభమైందని గానీ, బుద్ధుడు వింధ్యాచలాలు దాటి మొదట ఆ ప్రాంతాలకు వచ్చాడని గాని లగడపాటి ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. ఆదిరాజు వీరభద్రరావు మాత్రమే కాదు అక్కిరాజు ఉమాకాంతం, తిరుమల రామచంద్ర వంటి పండితులు కూడా తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాన్ని తెలంగాణమనే పిలిచారు.

అక్కిరాజు ఉమాకాంత పండితులు 90 ఏళ్ల నాడే మద్రాసులోని తిరువక్కేణిలో ‘తెలంగాణ లిటరేచర్‌ అసోసియేషన్‌’ అని పెట్టారు. సమస్యల్లా ఈ మూడువేల సంవత్సరాల గర్వించదగిన తెలుగుజాతి చరిత్రలో తెలంగాణదే కేంద్రస్థానమైన రాజకీయార్థిక, సాంస్కృతిక చరిత్ర అనే విషయాన్ని గత యాభై మూడేళ్లలో లగడపాటి వంటి నేపథ్యం నుంచి వచ్చినవాళ్లు ఎన్నడైనా గుర్తించారా? శాతవాహనులు మొదట కరీంనగర్‌ను, కాకతీయులను వరంగల్‌, కుతుబ్‌షాహీలు గోల్కొండను, ఆసఫ్‌జాహీలు హైదరాబాద్‌ ను రాజధానిగా చేసుకొని పాలిస్తే, గత యాభైమూడేళ్లుగా మళ్లీ హైదరాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ఉంటే ఇంత సుదీర్ఘకాలం తెలుగురాజ్యంలో కేంద్రస్థానంలో ఉన్న తెలంగాణ ప్రజలు- రెండవ రకం పౌరులుగా ఎందుకు వివక్షకు గురయ్యారో ఆయనే చెప్పాలి.

Counter to original article ఇదీ తెలుగు జాతి చరిత్ర by లగడపాటి రాజగోపాల్‌

ఇవేం దీక్షలు?
Mallempooti Adinarayana

ప్రత్యేక తెలంగాణా కోసం కేసీఆర్‌ దీక్ష ముగిసిందో లేదో.. కోస్తాంధ్ర, సీమల్లో సమైక్యాంధ్రను బలపరుస్తూ అక్కడి నేతలంతా పోటాపోటీ దీక్షలకు దిగిపోయారు. ఒకప్పుడు తెల్లపాలకులపై సత్యాగ్రహం ఎక్కుపెట్టి స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొనే ఈ దీక్షలు చేస్తున్నామంటున్నారు నేటి తరం నేతలంతా..! నిజంగా ఆయన ఆశించినంత పవిత్రంగానే దీక్షల్లో కూర్చుంటున్నారా..? స్వార్థరహితంగా చేపడితేనే దీక్షలకు పరమార్థమన్న గాంధీ ఆలోచనలను గౌరవిస్తున్నారా..? అంతకంటే భిన్నంగా- ‘ఆమరణ నిరాహారదీక్షలు’ నేటి నేతల స్వార్థానికి చిక్కి శల్యమై.. బలిపశువులుగా మారుతున్నాయా..? ప్రస్తుత సత్యాగ్రహాలలో సత్యమెంత..? అంటూ ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ మంత్రి ఎం.ఎస్‌.రాజలింగం (91) మనసును తెలుసుకోవాలనుకుంది ‘నవ్య’. అపహాస్యమైపోతున్న దీక్షలపై ఆయన ఏమంటున్నారో చూడండి..

దీక్షలు చేపట్టి- విద్వేషాలను రగల్చడం, ఆస్తులను ధ్వంసం చేయడం, హింసను ప్రేరేపించేలా రెచ్చగొట్టడం గాంధీజీ సత్యాగ్రహ మూల సిద్ధాంతానికి విరుద్ధమని మాత్రం నేను కచ్చితంగా చెప్పగలను. సేవాగ్రామ్‌లో రెండేళ్లపాటు నేను గాంధీగారితో కలిసి ఉన్నాను. ఒక సమస్యపై నిరసనను వ్యక్తం చేసి, ప్రజల విశ్వాసాన్ని పొంది, తద్వార చైతన్యం తీసుకొచ్చేందుకు మహాత్మాగాంధీ సత్యాగ్రం, నిరాహార దీక్షలను ఎంచుకొనేవారు. హింసకు దారి తీస్తుందనగానే విరమించుకొనేవారు. ఏకాభిప్రాయసాధన కోసం ఎంతో పవిత్రంగా దీక్షలను చేపట్టేవారాయన. ఈ రోజు దేశంలోని పలు ప్రాంతాలలో గాంధేయమార్గమని చెప్పుకుంటున్న దీక్షల్లో సత్యమెంతో ప్రజలకు తెలుసు. అందులో నిజాల జోలికి నేను వెళ్లదలుచుకోలేదు. ఆమరణ నిరాహార దీక్షలను ఎందుకు చేయాలి..? ఎంత పవిత్రంగా చేయాలి..? చేస్తున్న నాయకుని లక్ష్యం ఎలా ఉండాలి..? ఎంత చిత్తశుద్ధి, నిజాయితీ కావాలి..? అన్నది గాంధీగారు నడిచిన జీవితమే ఈ కాలానికి పాఠం అవుతుంది.

దీక్షలను చేపట్టాలంటే కొన్ని షరతులను విధించేవారాయన. దీక్షకు దిగే నాయకుల్లో ఏమాత్రం స్వార్థం ఉండకూడదు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదు. విద్వేషం వెదజల్లకూడదు. హింసకు దారితీయకూడదు. ఉద్యమం ఆత్మప్రభోదం మేరకే ఉండాలి. ‘ఉపవాసాలకు కూర్చున్నప్పుడు ఏ ధైర్యంతో కూర్చున్నావో.. అవసరమైనప్పుడు అంతకంటే ధైర్యంతో విరమించేందుకు సిద్ధంగా ఉండాలి’ గుర్తుంచుకోండి అంటూ గాంధీ పదేపదే చెప్పేవారు. నౌకాలీలో ఒకసారి హిందూ, ముస్లింల మధ్య హింస చెలరేగింది. దీన్ని నిరసిస్తూ గాంధీ ఉపవాసదీక్ష చేపట్టారు. రోజులు గడుస్తున్నా ఆయన అలాగే మొండిగా కూర్చున్నారు. నెహ్రూ వచ్చి దీక్ష విరమించమన్నా ఒప్పుకోలేదు. ‘శాంతిభద్రతలను కాపాడకుండా ప్రభుత్వ ఏం చేస్తోందన్నది సమస్య కాదు. హింసకు కారణమైన వారు నా దగ్గరికి వచ్చి.. తాము పశ్చాత్తాప్పడుతున్నాం.

శాంతి నెలకొల్పుతామంటే దీక్ష విరమిస్తా’ అన్నారు గాంధీ. అదే ఇప్పటి నేతలైతే అసలు సమస్యను గాలికి వదిలి.. వ్యక్తిగతంగా వాళ్లకు ఎంత పేరొస్తుందనే ప్రయత్నిస్తారు. ఈమధ్య కాలంలో తెరమీదికి వచ్చిన దీక్షలన్నీ చాలావరకు గాంధీ సిద్ధాంతాలకు భిన్నంగా ఉంటున్నాయనిపిస్తోంది. దీక్షల్లో రాజకీయ లబ్ధికి అవకాశముందనే అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ ధోరణి ఉద్యమాలను కూడా బలహీనపరుస్తుందని ప్రజాస్వామ్యవాదులంతా గ్రహించాలి. ఏ నిరసన చేపట్టినా.. ‘సత్యం, అహింస, ప్రేమ’ పునాదిగా వుండాలని గాంధీ కోరుకొనేవారు. ఆయన దగ్గర నేను నేర్చుకున్నది అదే. ప్రస్తుత ఉద్యమాల్లో ఈ మూడు అంశాలు లేవు. గాంధీజీ పేరు చెప్పుకొని దీక్షకు పూనుకోవడం ‘ఎత్తుగడ’కే పరిమితమైపోయింది. ఆ నిజాయితీ అలాగే ఉంటుందని చెప్పలేం. నేతలకు అంతా తెలుసు. అందుకే ఆత్మపరిశీలన చేసుకోరు.

సానుభూతి గెలవాలి..

మన దేశంలో నిరసన దీక్షలను సత్యనిష్టతో చేపట్టి.. ప్రాచుర్యం కల్పించింది గాంధీగారే. అందుకే- గాంధీ చేపట్టిన ప్రతి దీక్ష ఒక్కో గొప్ప పాఠం. నేను సేవాగ్రామ్‌లో ఉన్నప్పుడు అహ్మదాబాద్‌లో ఓ మిల్లు యజమానికి, కార్మికులకు మధ్య గొడవ జరిగింది. నిరసనదీక్షలకు సారథ్యం చేపట్టాలని గాంధీని కోరారు కార్మికులు. “ఎట్టి పరిస్థితులలోనూ శాంతికి భంగం వాటిల్లకూడదు. ఎంత కాలం దీక్షలు చేపట్టినా గట్టిగా పోరాడాలి. యాజమాన్య ప్రలోభాలకు లొంగిపోకూడదు. అందుకు అంగీకరిస్తేనే మీకు నాయకత్వం వహిస్తా”నంటూ గాంధీ షరతులు పెట్టారు. కార్మికులు సరేనంటూనే గాంధీ ఉపవాసదీక్షకు దిగారు. రోజులు గడుస్తున్నకొద్దీ ఆయన మీద విపరీతమైన సానుభూతి కలిగి.. ప్రజలే గాక యాజమాన్యానికి చెందిన కుటుంబ సభ్యులు కూడా దీక్షకు మద్దతు పలికారు. వెంటనే సమస్య పరిష్కారమైంది. నిస్వార్థంతో, శాంతియుతంగా చేసిన రోజే దీక్షకు మహత్తరశక్తి ఉంటుందని తెలిసింది. దీక్షలను మంచికైనా చెడుకైనా వాడుకొనే సంఘటనలు అప్పట్లో కూడా జరిగాయి. అలాంటి స్వార్థపూరిత దీక్షలను అట్టే కనిపెట్టేస్తారు గాంధీగారు.

ఓ రోజు- సేవాగ్రామ్‌ ఎదురుగా చెట్టు కింద పంతల్‌జీ అనే వ్యక్తి ఎంతో వినయంగా కూర్చుని సన్నటి దారం వడకడం మొదలుపెట్టాడు. అప్పటికే ఖాదీ ఉద్యమాన్ని గాంధీ ప్రారంభించారు. మహాత్ముడి మెప్పు పొందేందుకే పంతల్‌జీ ఈ పని చేస్తున్నాడని ఎవ్వరూ ఊహించలేదు. రోజూ అదే మార్గంలో వెళుతున్న గాంధీగారు కూడా పంతల్‌జీని పలకరిస్తూ యోగక్షేమాలడిగేవారు. గాంధీనే మాట్లాడుతున్నాడంటే ఈయన ఎంత గొప్పవాడోనని ప్రజలందరూ పంతల్‌జీని చూసేందుకు తరలివచ్చారు. ఈ ప్రజాదరణకు పొంగిపోయిన పంతల్‌జీ ఒక రోజు- “గాంధీగారూ నన్ను సేవాగ్రామ్‌లో మెంబర్‌గా చేర్చుకోవాలి” అన్నాడు. అందుకు గాంధీ ఒప్పుకోకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగి, బెదిరించడం మొదలుపెట్టాడు పంతల్‌జీ. కొన్ని రోజుల వరకు దీక్షలోనే కూర్చున్న పంతల్‌జీ ఆరోగ్యం క్షీణించింది.

రెండ్రోజుల్లో దీక్ష విరమించకపోతే అతను చచ్చిపోవడం ఖాయమని అందరం పరిగెత్తుకుంటూ వెళ్లి గాంధీకి చెప్పాం. అప్పుడు ఆయన కరాఖండిగా తెగేసి చెప్పారు “పంతల్‌జీని ఎట్టిపరిస్థితులలోనూ సేవాగ్రామ్‌లో మెంబర్‌గా చేర్చుకోన”ని. “ఎందుకని గాంధీగారు..?” అడిగాం మేమంతా. “కడుపులో స్వార్థం దాచుకొని పంతల్‌జీ ఉపవాసదీక్షకు దిగాడు. ఇలాంటి వారు సమాజానికి హానికరం. ఈ సమయంలో నేను ఓకే అంటే, వాడి విజయం స్వార్థ విజయం అవుతుంది” అంటూ విసురుగా వెళ్లిపోయారు గాంధీ. చేసేది లేక ఆఖరికి పంతల్‌జీనే దీక్ష విరమించారు.

అర్థం మారిపోయింది..

ఈ సంఘటనలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే.. దీక్షలను అప్పట్లో ఎంత పవిత్రంగా భావించేవారో తెలుసుకునేందుకే. కానీ, ఆధునిక రాజకీయాలలో దీక్షలకున్న అర్థమే మారిపోయింది. స్వార్థపూరిత రాజకీయాలకు దీక్షలను ఫణంగా పెట్టేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ, జై ఆంధ్ర, సమైక్యాంధ్ర అంటూ దీక్షలు చేస్త్తున్నారు. ఇది సర్వజన ఆమోదయోగ్యమైనవి కావు. ఎవరికి వారు ‘ప్రజాభిప్రాయం’ అంటున్నారు. ఇవి వివాదాంశాలు. గాంధేయవాద మూల సిద్ధాంతం ‘ఏకాభిప్రాయం’. ఆ భావన ప్రకారం చూస్తే- పక్కవాళ్లను ద్వేషించకుండా, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయకుండా, రాకపోకలకు ఇబ్బంది కలిగించకుండానే దీక్షలు చేయాలి. ప్రస్తుతం గాంధీజీ సిద్ధాంతాన్ని అనుసరించి ఎవ్వరూ నిరసన దీక్షలను చేయడం లేదు.

ఈ మాట నిష్టూరంగానే అనిపించవచ్చు. కానీ, ఇది సత్యం. యుద్ధాలు చేసుకున్నా చిట్టచివరికి శాంతికే దారి తీస్తుంది. అందుకే గాంధీజీ ఉపవాసదీక్షల్లో రాజీకి అవకాశం ఉంది. దీక్షలు చేపట్టే నాయకులకు సహనం, సహజీవన విధానం రెండు కళ్లు కావాలి. అప్పుడే ప్రజలందరూ ప్రశాంతంగా జీవించే వాతావరణం ఏర్పడుతుంది. అప్పట్లో పొట్టిశ్రీరాములు ఆమరణ నిరాహారదీక్షను దేశమంతా ఒప్పుకుంది. అందులో నాన్‌కాంట్రవర్సీ ఫిలాసఫీ, నాన్‌ కాంట్రవర్సీ ప్రోగ్రామ్‌ ఉంది. అఖిలభారతం అంగీకరించిన సిద్ధాంతం ఆయనది. అందుకే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. పొట్టిశ్రీరాములు దీక్షకు కూర్చున్నప్పుడు విరమించమనేందుకు వెళ్లిన 16 మంది ఎమ్మెల్యేల బృందంలో నేను కూడా ఉన్నాను. “మీరు బతికుంటే దేశానికి ఇంకా మేలు జరుగుతుంది. దీక్ష విరమించండి” అంటూ ఆయనకు చెప్పాం.

కానీ, పొట్టిశ్రీరాములు ఒప్పుకోలేదు. దీక్షలతో ఉద్యమాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లాలి. ఎప్పుడు ముగించాలి అన్నది దీక్షలకు దిగినవారే తేల్చుకోవాలని అర్థమైంది నాకు. ఇటీవలే ప్రత్యేక తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్షకు దిగిన కేసీఆర్‌ దగ్గరికి కూడా వెళ్లాను. “ప్రస్తుత వాతావరణాన్ని శాంతియుతంగా మార్చేందుకు దీక్ష విరమించాల”ని ఆయనకు చెప్పా. ఆ తర్వాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. మన దేశంలో గాంధీయుగానికి ముందు- అండమాన్‌ దీవుల్లో జితేంద్రనాథ్‌ అనే ఖైదీ 60 రోజులు ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. స్వాతంత్య్రపోరాటంలో ఆయన చనిపోయాడు. ఆ తర్వాత నిరాహార దీక్షలు, ఉపవాస దీక్షలను గాంధీగారు గొప్ప సంకల్పంతో చేపట్టారు.

ఆ బాటలోనే పోరాడి స్వాతంత్య్రం తీసుకురావడంతో.. ఆ తర్వాత నేతలంతా ఏ సమస్య వచ్చినా దీక్షలకు కూర్చోవడం సర్వసాధారణమైంది. కాలంతోపాటు రాజకీయాల్లో స్వార్థం ప్రవేశించినట్లే.. ఆమరణ నిరాహార దీక్షల స్వభావం కూడా మారిపోయింది. రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి భాగం, హక్కులున్నాయి. అందుకే ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విభజన సమస్య పరిష్కారానికి అందరూ బాధ్యతతో కృషి చేయాలి. ప్రభుత్వానికి సలహాలను అందివ్వాలి. గాంధేయవాద దీక్షలను సజీవంగా కాపాడుకోవాలి.

“వరంగల్‌ జైల్లో నేను కూడా ఉపవాసదీక్షలకు కూర్చున్నాను. ఖైదీలందరికీ జైల్లో జొన్నరొట్టెలు పెట్టేవారు. అవి సరిగా జీర్ణంకాక అందరూ అనారోగ్యానికి గురయ్యేవారు. ఈ సమస్యపై జైలు అధికారులు స్పందించకపోతే- వెంటనే ఉపవాసదీక్షకు కూర్చున్నాను నేను. కొన్ని రోజులకు.. జొన్నరొట్టెకు బదులు అన్నం వడ్డించడమే కాకుండా.. జైలు మాన్యువల్‌ కూడా మార్చారు. నా ధీక్షలో ఎలాంటి స్వార్థం లేనందునే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు”

రాష్ట్ర విభజనపై అమెరికా తెలుగు రచయితల అభిప్రాయాలు
పరిష్కారం ఏదైనా ప్రజలే గెలవాలి

రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం

సమస్య పట్ల అవగాహనా, భావోద్వేగాలకు లోనుగాకుండా తార్కికంగానూ దూరదృష్టితోనూ పరిష్కారం ఆలోచించగల వివేచనా కనిపించడం లేదు. ‘సమైక్యాంధ్ర’ బోలు నినాదం. ప్రత్యేక తెలంగాణ అంత తేలిగ్గా ఇవ్వరన్న నమ్మకంతో ఇన్నాళ్లూ అందుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలూ, ఉద్యమం జరుగుతున్నన్నాళ్లూ చోద్యం చూస్తూన్న ఇతర ప్రాంత ప్రజలూ ఇప్పుడు సమైక్యాంధ్ర అంటూ గొంతు చించుకోవడం విచిత్రం. ఇన్నాళ్లూ అమలు జరపని ఒప్పందాలూ, నిష్పక్షపాతంగా వనరుల, నిధుల కేటాయింపూ ఇప్పుడు పాటిస్తామనే భరోసా ఇవ్వడం అటుంచి వాటి ఊసే ఎవరూ ఎత్తకపోవడం సమస్య మూలాలు విస్మరించడమే.

విడిపోవడం ఎప్పుడూ బాధాకరమే అయినా తెలుగు తల్లి ముక్కలు అవుతోందంటూ దానికి రొమాంటిక్‌ రంగు పులమడం అర్థరహితం. అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతల్ని రూపుమాపే సమగ్ర ప్రణాళిక లేకుండా సమైక్యాంధ్ర మనలేదు. అభివృద్ధి, లేదంటే ప్రత్యేకం అన్న నినాదానికి తెలంగాణా ఉద్యమం చివరిదాకా కట్టుబడి ఉండవలసింది. ఆంధ్ర నుంచి వలసలు వచ్చినవారిని దోపిడీదారులుగా చిత్రించడం, విద్వేషాన్ని రగల్చడం ఎవరికీ మేలు చేయదు. ఏ ప్రాంతంవారయితేనేం, పరిశ్రమలు, నెలకొల్పకపోతేనూ, భూములు కొనకపోతేనూ హైద్రాబాదు ఆర్థికంగా ఈ స్థాయికి చేరేది కాదు. విడిపోయినా, కలిసి ఉన్నా దృష్టి నిలపవలసింది తెలంగాణతోపాటుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధిపైన.

- చంద్ర కన్నెగంటి, రచయిత, డల్లాస్‌, టెక్సస్‌

ఐదు భాగాలుగా ఆంధ్రప్రదేశ్‌

ఉద్రేకం ఊరికి నష్టం అంటారు. ఉద్రేకం తార్కికతని మటుమాయం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని నాలుగు లేకపోతే ఐదు భాగాలుగా విభజించడానికి వ్యతిరేకత చూపే మేధావుల (!) వాదోపవాదాలు, ఈనాటికీ ఎమోషనల్‌ స్థాయి దాటిపోలేదు. కొందరు మేధావులు అధివాస్తవిక స్థాయిని మించిపోయారు. ఈ వాదోపవాదాలకి అసలు కారణం సంకుచిత మనస్తత్వం. భాషపరంగా, సంస్కృతి (?) పరంగా వ్యాపారపరంగా సమైక్యంగా ఒకే రాష్ట్రంగా ఉండడం శ్రేయస్కరం అనే వాదంలో నైతిక బలం తక్కువ. స్థానిక బలం పాలు ఎక్కువ. ఆవేశం పాలు అంతకన్నా జాస్తి. అయితే కొన్ని ప్రత్యేక వర్గాలకి తాత్కాలిక రాజకీయావశ్యకతే ఈ వాదానికి ఆధారం అనడానికి సందేహం ఉండకూడదు.

పదికోట్ల జనాభా పరిపాలనా యంత్రాంగానికి, రెండున్నర – మూడుకోట్ల జనాభా పరిపాలనా యంత్రాంగానికీ మధ్య ఉండే అంతరం, దాని సౌలభ్యతా అర్థం చేసుకోవడానికి ఆర్థికశాస్త్రంలో ప్రావీణ్యత అక్కరలేదు. ఒకరిని మించి మరొకరు తెలుగుభాషా పునరుద్ధరణకి పాటుపడతారు. భాషాపరంగా, భాషాభివృద్ధికోసం సమైక్యత పెరుగుతుంది. తెలుగుకోసం ఇప్పటికన్నా బాగానే కృషిచేస్తారు. మన భారతీయ సంస్కృతి వేరువేరు రంగుల్లో, వివిధ రకాల ఛాయల్లో దేశవ్యాప్తంగా ఉన్నది.

ఆ ఛాయలనీ అలుసుగా నిందించడానికి బదులుగా సరసంగా గౌరవించడం అలవాటవుతుంది. అంటే భిన్నతని గౌరవించడం అలవాటవుతుంది. అందుకని, ఆంధ్రప్రదేశ్‌ని, ఉత్తర ఆంధ్ర, మధ్య ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడం అన్నివిధాలా సముచితం; శ్రేయస్కరం; అభివృద్ధిదాయకం. అయితే, హైదరాబాదు నగరాన్ని మాత్రం ఈ నాలుగు రాష్ట్రాలకీ తాత్కాలిక రాజధానిగా కనీసం పది-పదిహేనేళ్లపాటు ఉంచడం, మామూలు ప్రజలందరికీ శ్రేయస్కరం. అలా హైదరాబాదుతో కలిపి ఐదు భాగాలుగా చెయ్యడం సముచితంగా కనిపిస్తుంది.

- వేలూరి వేంకటేశ్వరరావు, రచయిత, అట్లాంటా, జార్జియా

తెలుగు సంయుక్త రాష్ట్రాలు

ఎలా, ఎప్పుడు పుట్టుకొచ్చినా, ఎంత సమంజసమైనది అయినా ఈనాటి తెలంగాణా ఉద్యమం ‘మాకు అన్యాయం జరిగింది’ అనే నినాదంతో, పాలకులను మార్చడానికే ప్రాధాన్యత ఇచ్చింది కానీ, కొత్త పాలకులు కావలసిన అభివృద్ధిని తెచ్చే పథకాలను కనీసం సూచనప్రాయంగా అయినా వెలుగులోకి తీసుకురాకపోవడం విచారకరం. అలాగే సమైక్యాంధ్రావాదులు కూడా, ప్రస్తుత వ్యవస్థ యధాతథంగా ఉండాలనే తపన తప్ప మౌలికమైన అంశాలు ప్రస్తావించే పరిస్థితిలో లేరు. ఎటునించి, ఎటుచూసినా ఈ ఉద్యమాలన్నీ రెండు అగ్రవర్గాల మధ్య రాజకీయ, ఆర్థిక ఆధిపత్యాలకోసం పోటీయే.

బడుగువర్గాలూ, పేరుకి మాత్రమే అగ్రవర్గాలైన ఇతరులూ ఆటలో అరటిపండ్లే. అందువలన ఆంధ్రప్రదేశ్‌ ఎన్ని రాష్ట్రాలుగా విడిపోయినా, పోకపోయినా, అభివృద్ధి, సమానత, జీవన విధానంలలో చెప్పుకోదగ్గ మార్పులు నాయకత్వ మార్పిడి జరిగినంత తొందరగా వస్తాయని అనుకోకూడదు. భాష విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుందేమో? ఎందుకంటే తెలుగు భాషా, సాహిత్యమూ అనాధలు. వాటికి వ్యాపార లావాదేవీలూ, వోట్‌బేంకులూ లేవు. గ్లామరు అంతకంటే లేదు. రాజకీయ ప్రాధాన్యత లేని కారణం వలన వాటికోసం ఉద్యమించే నాయకులు లేరు. హైదరాబాదు అభివృద్ధి మార్గంలో ఎలాగూ ఉంది కాబట్టి, రాష్ట్ర విభజన జరిగినా, జరగకపోయినా రాష్ట్ర రాజధానిని మరొక ప్రాంతానికి మారుస్తే ఆ ప్రాంతాల అభివృద్ధికీ, బహుశా భాష పరిరక్షణకీ అన్నివిధాలుగానూ బావుంటుందేమో!

- వంగూరి చిట్టెన్‌ రాజు, హ్యూస్టన్‌, టెక్సస్‌

బలవంతం న్యాయం కాదు

చాలాకాలంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు కోరుతూ వచ్చారు. ఆ కోరికను అప్పుడప్పుడూ రాజకీయ నాయకులు, తెలంగాణలోనూ తెలంగాణేతర ప్రాంతంలోనూ, స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ వచ్చారు. ఇప్పుడూ అదే జరుగుతూ ఉంది. అయినా ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక తెలంగాణ ప్రజల్లో బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణను బలవంతంగా సమైక్య ఆంధ్రలో భాగంగా ఉండమనటం న్యాయం కాదు.

ఐక్యంగా ఉండాలంటే ముందు సమంగా ఉండాలిగదా? సమంగా ఎదగనివ్వలేదనే గదా తెలంగాణ ప్రజలు అంటుంది? సమంగా ఎదగకపోవటానికి కారణం ఎవరైనా, ఇకముందు వారి అభివృద్ధికి తగిన ప్రయత్నాలు వారే చేసుకునే అవకాశం కల్పించటమే న్యాయమనిపిస్తుంది నాకు. మరో విషయం, గత పదిహేనేళ్లుగా సంయుక్త రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులు తెలుగు భాషకు ద్రోహం చేస్తూ వచ్చారు. పొరుగు రాష్ట్రాలవారు తమ భాషలకు ఇస్తున్న మద్దతు మన రాష్ట్రంలో తెలుగుకు లేదు. ఆంధ్రప్రదేశ్‌ని రెండుగానో మూడుగానో విభజిస్తే, వీరిలో ఒక్కరైనా తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతారేమోనని నా ఆశ.

- ఆరి సీతారామయ్య, కథా రచయిత, డెట్రాయిట్‌, మిషిగన్‌

ప్రజలు ప్రేక్షక స్థానాన్ని వదిలాలి

2002లో తెలంగాణ నినాదం గొంతు విప్పుకుంటున్నప్పుడు, ప్రవాసం నుంచి మాతృదేశానికి వచ్చి హైదరాబాదులో ఉన్నాను నేను. రెండేళ్ల పాటు తెలంగాణా పల్లెపల్లెల్లో విస్తృతంగా పర్యటించాను. తెలంగాణ ప్రజానాయకుల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతకి ఉన్న చారిత్రక సైద్ధాంతిక అవసరాల్ని తెలుసుకుని అర్ధం చేసుకున్నాను. చూస్తుండగానే టీఆర్‌ఎస్‌ ఉద్భవించింది. కెసిఆర్‌ మహానాయకుడిగా ఎదిగారు. రాష్ట్ర ఆవిర్భావానికి సరైన వేదిక ఏర్పడిందని నా స్నేహితులైన ప్రజానాయకులతోపాటు నేనూ సంతోషించాను. ప్రత్యేక రాష్ట్రం కూడదన్న నా కోస్తాంధ్ర మిత్రులతో విభేదించి వాదించాను కూడా. కానీ 2004 ఎన్నికల నుంచీ జరుగుతూ వస్తున్న తెరచాటు రాజకీయాలు ఉద్యమాన్ని తప్పుదారి పట్టించి నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయి.

ఒకప్పుడు ఎంతో ఆశతో సంఘపు అట్టడుగు పొరల్నించీ స్పందించి నిర్మించుకున్న వేదికపైన సామాన్య తెలంగాణా పౌరునికి స్థానం లేకుండా పోయింది. అతని గొంతు వినిపించనంతగా రాజకీయ రొద చెవులు దిబ్బెళ్లు వేస్తోంది. ప్రత్యేక తెలంగాణ అనేది సభ్య సమాజపు చర్చల్లో ఒక అపహాస్యంగా తయారైంది. 1969లో ఇలాగే వ్యక్తిగత ప్రయోజనాల కోసం బడా నాయకులు అప్పటి ఉద్యమాన్ని భూస్థాపితం చేశారు. కోట్ల ప్రజల ఆశయాలు ఒక్క మంత్రి పదవితో చెల్లు. ఇప్పుడు అదే వేదిక మీద జరుగుతున్న డ్రామా అప్పటి నాటకం కొనసాగింపే. ఐతే ఇదే చివరి అంకం మాత్రం కాదు. తెలంగాణా ప్రజలు తమ ప్రేక్షక స్థానాన్ని వదిలి తమ భవిష్యత్తు స్క్రిప్టు తామే రాసుకోవాలి! అప్పుడు కానీ ఈ డ్రామాకి తెరపడదు!

- ఎస్‌.నారాయణ స్వామి కథా రచయిత, బ్లూంఫీల్డ్‌ హిల్స్‌, మిషిగన్‌

రెండు రాష్ట్రాలూ బాగుపడతాయి

తెలంగాణ తనకున్న అస్తిత్వాన్ని నిలబెట్టుకోవటానికి పడ్డ అవస్థలు ఇప్పటివి కావు, నాలుగైదు వందల ఏండ్ల సంది ఉన్న లొల్లే ఇది. ఇక్కడివాళ్లు తమ నిరసనను ఏదో ఒక రకంగా బయటపెడ్తనే ఉన్నరు. అక్కడి నరనరాల్లో ఉన్న తిరుగుబాటు తత్వాన్ని అర్థం చేసుకోవటానికి వలసవాద ఎలిటిస్టు ధోరణి అడ్డొచ్చింది.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రతి ప్రజాస్వామ్యవాది హర్షించవలసిన విషయం. ఇప్పటికే ఈ రైలు రెండు జీవిత కాలాల లేట్‌. ఇప్పటికైనా దీన్ని ఒక మంచి మలుపుగా తీసుకుని, అనిశ్చితి తొలగినందుకు సంతోషించి అన్ని ప్రాంతాలవారు అభివృద్ధికి పెద్దపీట వేయాలి.. తెలంగాణ అభివృద్ధి చెందితే ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ తగ్గి ఉండేది అనుకోవటం ఒక భ్రమ.

ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా స్వయంనిర్ణయాధికారం కోరుకోవటం జరుగుతుంది. ‘సమైక్యాంధ్ర’ నినాదంలో పస లేదు, దానికి ‘మోరల్‌ రూట్స్‌’ లేవు. నీతి లేని కథ నీటిమూటే, చాలా కాలాలు నిలువలేదు. ఇప్పుడు జర్నలిస్టులు, టీచర్లు, విద్యార్థులు, రాయటం తెలిసినవాళ్లంతా సమైక్యాంధ్ర పేరుతో వచ్చే రెండు గంటల సినిమా కల్చర్‌ నుంచి బయటకొచ్చి, నిజ జీవితాలెట్లా బాగుపడతాయి అని ఆలోచించాలి. రెండు రాష్ట్రాలవటం మన జీవిత కాలంలో వచ్చిన ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని ప్రజలెట్లా ఉపయోగించుకోగలరో ఆలోచన చేయాలి.

- విప్లవ్‌, కథా రచయిత, టల్సా, ఒక్లహోమా

కృత్రిమ ‘ఆందోళన’ కుట్రే!

‘సమైక్యాంధ్ర’లో తెలంగాణ, రాయలసీమవి ఎప్పటికీ ఊరి చివరి బతుకులు. వెలివేయబడిన చరిత్ర వాటిది.. కోస్తా సంపన్నుల పెత్తనం నించి విడివడితే తప్ప తెలంగాణ, రాయలసీమ బాగుపడవు. ఇది ఆ రెండు ప్రాంతాల ఉనికి సమస్య. ఇటీవలి తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ శిబిరాల నించి ఎగసిపడింది కాదు, అనేక రకాలుగా అణగారిపోయిన విద్యార్థుల, పీడితుల, దళిత ముస్లింల ఆగ్రహంలోంచి రాజుకున్న అస్తిత్వ ఉద్యమం. ఇన్నాళ్ల అసమానత్వ రాజకీయాలకు ఆలశ్యంగానయినా ప్రాయశ్చితం చేసుకుంది కాంగ్రెస్‌. ఫక్తు పేదరికంలో కన్ను తెరచిన బాల్యం తెలంగాణ, సీమ రచయితలది. వీరి సాహిత్యాలలో తొలుత ప్రతిధ్వనించిన ఈ ఆకలి, అస్తిత్వ ప్రకంపనలు ఇప్పుడు రాజకీయ, విద్యార్థి ఉద్యమమై, ప్రత్యేక తెలంగాణ వైపు వెళ్లడం సహజ చారిత్రక పరిణామం.

దాన్ని సమైక్యాంధ్ర అనే కృత్రిమ ‘ఆందోళన’తో చల్లార్చాలని అనుకోవడం నిజంగా కుట్ర. కాస్త నిక్కచ్చిగా- ఖుల్లంఖుల్లా- చెప్పాలంటే, కబ్జాకోరు రాజకీయార్థిక కుట్ర. ఇంకోవైపు తెలుగు భాషనీ, సంస్కృతిని దోచేసుకోవాలన్న ఆబ. తెలంగాణ, సీమ బ్రదర్స్‌ని కలుపుకుందాం అని ఇప్పుడు చెబ్తున్న కోస్తా రాజకీయ సంపన్నులు, సాహిత్య పెత్తందారులు తెలంగాణ, సీమ జనాన్నే కాదు, భాషా, సాహిత్యాల్ని కూడా ఎగతాళి చేసినవాళ్లే. తమ పెత్తనం కోసం తెలంగాణ, సీమల్ని తొక్కిపడేసినవాళ్లే.

- అఫ్సర్‌, కవి, రచయిత, విమర్శకులు, ఆస్టిన్‌, టెక్సస్‌

చిన్నరాష్ట్రాల అభివృద్ధికి దాఖలాలేవి?

శాంతి, సహనం, సమభావం.. ఏవీ చరిత్ర మనకు నేర్పిన పాఠాలు? ఏవీ శతాబ్దాల మన సంస్కృతి మనకు నేర్పిన విలువలు? నిన్నటివరకూ సోదరులం అనుకున్న వాళ్లని కుక్కలనీ, పందులనీ తిట్టడం, దిష్టిబొమ్మల దహనం, ఇష్టం వచ్చిన రీతిలో ప్రభుత్వ ఆస్థుల్ని ధ్వంసం చేయడం, బోర్డులు మార్చివేయడం.. ఇదంతా వెర్రి తలలు వేసిన ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం ముసుగులో జడలు విప్పిన అరాచకం! ఎక్కడికి వెళుతున్నాం? యువతరం సంపాదించిన విజ్ఞాన ఫలితం ఇదేనా? కేవలం విభిన్నమైన భాషలు మాత్రమే కాదు, విభిన్నమైన జాతులు, మతాలు, దేశీయులు కలిసి సహజీవనం సాగిస్తున్న అంతర్జాతీయ దేశాల్ని గమనించి కూడా మనం పాఠాలు నేర్చుకోలేదంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలి.

అభివృద్ధి కుంటుపడుతోందనుకున్న ప్రాంతాలు దానికి పరిష్కారాలు విశ్లేషించాలి, అభివృద్ధి పథకాల కోసం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చెయ్యాలి, సాధించుకోవాలి. ప్రజాస్వామ్యం ఉన్నదే అందుకోసం. చిన్నరాష్ట్రాలు అభివృద్ధి పథంలోకి దూసుకుపోయిన దాఖలాలు ఏవీ? హైదరాబాదు ముఖచిత్రాన్ని మార్చివేసిన అంతర్జాతీయ కంపెనీలకి మనం ఇస్తున్న భరోసా ఏమిటి? తక్షణ కర్తవ్యం రాజకీయ నాయకుల ముసుగులోని స్వార్థపూరిత శక్తుల్ని అదుపులో పెట్టడం, శాంతియుత వాతావరణంలో చర్చలకు కూర్చోవడం జరగాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చిత్తశుద్ధి, రాజకీయ ఒత్తిళ్లకి లొంగని దృఢ సంకల్పం ఉంటేనే ఇది సాధ్యమౌతుంది.

- కిరణ్‌ ప్రభ, కవి, రచయిత, డబ్లిన్‌, కాలిఫోర్నియా

దోపిడీని కొనసాగించే నినాదం

ప్రపంచంలో తొట్టతొలి నాగరికతలన్నీ నదీతీరాల్లో విరాజిల్లినాయి. కానీ రెండు మహానదుల పరీవాహక ప్రాంతమైన తెలంగాణ మాత్రం గత 50 ఏళ్ళుగా బీడు పడిపోయి ఎడారిగా మారిపోయింది. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో భాగమైనప్పటి నుంచి నేటి దాకా, ఆంధ్ర వలసపాలకుల దోపిడీలో తెలంగాణకు జరిగిన నష్టం అపారమైనది. తెలంగాణ నీటినీ, నిధులనీ, ఉద్యోగాలనీ, భూమి జాగాలనీ దోచుకుని, ఆంధ్రా ప్రాంతపు భూస్వాములు, పాలక వర్గాలు, బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, సినిమా వాళ్ళు కోట్లకు కోట్లకు లెక్కలేనన్ని ఆస్తులు గడించారు. తెలంగాణ ప్రాంత ప్రజానీకాన్ని కడు పేదరికానికీ, అలవికాని కష్టాలకూ కడగండ్లకూ గురి చేశారు. చారిత్రికంగా భౌగోళికంగా తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రం.

ఇది కాదనలేని వాస్తవం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో భాగం ఎప్పుడూ కాదు. కాలేదు కూడా! ఒకే భాష మాట్లాడినంత మాత్రాన ఒకే రాష్ట్రంగా ఉండాలని ఎక్కడా లేదు. ప్రత్యేక రాష్ట్ర డిమాండు ప్రజాస్వామికమైనది. దాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ప్రపంచవ్యాప్తంగా గౌరవిస్తున్నారు. సాంస్కృతికంగా కూడా తెలంగాణకు ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. భౌగోళికంగా, చారిత్రికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన తెలంగాణను ఆంధ్ర ప్రాంతంతో కలిపి సమైక్యంగా ఉండమని ఒత్తిడి చేయడం అప్రజాస్వామికం, అన్యాయం, నిరంకుశత్వం కూడా. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన వెంటనే కోస్తాంధ్ర, రాయలసీమలకు చెందిన పాలక వర్గాలు, వారి అడుగులకు మడుగులొత్తే రాజకీయ నాయకులు (పార్టీల కతీతంగా) ఒక్క తాటి మీద ముందుకొచ్చి తమకు సమైక్యాంధ్ర కావాలని పెద్ద ఎత్తున ఆందోళన లేవ దీస్తున్నారు.

మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలని, వారి ప్రజాస్వామిక ఆకాంక్షలని, వారి కలలని అపహాస్యం చేస్తున్నారు. అవమానిస్తున్నారు. ఇది అప్రజాస్వామికం, నిరంకుశత్వం! తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు వీళ్ళంతా సమైక్యాంధ్ర అని ఎందుకనలేదు? పైగా అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణను సమర్థిస్తామని అన్న వాళ్ళే కదా! తెలంగాణకు జరిగిన అన్యాయం గురించీ వివక్ష గురించీ ఒక్కసారయినా మాట్లాడని ‘సమైక్యాంధ్ర’వాదులు ఇవాళ్ల కలిసి ఉండాలని, విడిపోవడానికి వీల్లేదని ఆధిపత్య ధోరణితో ఉద్యమం లేవనెత్తడం అప్రజాస్వామికం కాదా? నిరంకుశత్వం కాదా? వీళ్లు ఇవాళ నిరసనలు, దీక్షలు, విధ్వంసాలు పార్టీలకతీతంగా కొనసాగించడానికి కారణమేమిటి? ఇన్నాళ్లూ తాము యదేచ్ఛగా దోచుకుతిన్న తెలంగాణ వనరులు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, భూమి జాగలు ప్రత్యేక తెలంగాణ వల్ల ఎక్కడ చేజారిపోతాయోనని, హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్న వారి దోపిడీకి వ్యాపారాలకు ఆస్తులకు ఆటంకం కలుగుతుందనే భయంతోనే!

‘సమైక్యాంధ్ర’ దోపిడీని యథాతథంగా కొనసాగించే నినాదమనీ ప్రజాస్వామికవాదులంతా ఒక్క గొంతుతో చాటించాలి. తెలంగాణలో నివసిస్తున్న సామాన్య ఆంధ్ర ప్రజానీకానికి ఎటువంటి హానీ కలుగదనీ, వారంతా దయగల తెలంగాణ తల్లి ఒడిలో క్షేమంగా నివసించవచ్చనీ తెలంగాణ ఉద్యమకారులు భరోసా ఇవ్వగలగాలి. వారిని కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కలుపుకుపోగలగాలి. అట్లా ఆంధ్రా ప్రాంత దోపిడీ పాలకుల పన్నాగాలని, సమైక్యాంధ్ర కుట్రలనీ బలంగా తిప్పికొట్టాల్సిన అవసరమూ కర్తవ్యమూ ప్రజాస్వామికవాదులందరిదీనూ!

- నారాయణ స్వామి, కవి, ప్రిన్స్‌టన్‌, న్యూజెర్సీ

కలసి వుంటే కలదు సుఖం

‘కలసి వుంటే కలదు సుఖం’ అనేది సామాన్య ప్రజానీకానికీ, సమాజానికీ ఎంతో మంచిది. ‘విభజించి పాలించు’ అనేది రాజకీయ నాయకులకూ, స్వంత లాభం కోరుకునేవాళ్లకూ ఉపయోగకరం. 1970లలో రాజకీయ వినాయకులు పదవులు రాక చేసినదే, ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఇప్పుడు నిప్పు రాజుకుని, రాష్ట్రం తగలబడుతున్నది కనుక నాకు రెండే పరిష్కారాలు కనిపిస్తున్నాయి- హైదరాబాద్‌లో కొత్త పరిశ్రమలు తగ్గించి, సమైక్య రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలలోనూ పరిశ్రమలకు పెట్టుబడులు తీసుకువచ్చి మొదలుపెట్టటం, ఎయిర్‌పోర్టులు మొదలైన వాటితో ప్రతిచోటా అభివృద్ధి సాధించటం అవసరం. రెండు: హైద్రాబాద్‌ పెట్టుబడులవల్లా, జనాభావల్ల ఒక జాతీయ నగరం. హైద్రాబాద్‌ని ఒక యూనియన్‌ టెర్రిటోరీగా చేసి, తెలంగాణ, ఆంధ్రాలను వేరు చేయటం. అప్పుడు రాయలసీమ కూడా వేరుపడాలి అనే రాజకీయ నాయకులు వుంటారు. మరి వాళ్లకేం సమాధానం చెప్పాలి? చిన్న రాష్ట్రాల వల్ల పెద్దగా లాభాలు వుంటాయని నేను అనుకోను. చూద్దాం ఏమవుతుందో!

- సత్యం మందపాటి, రచయిత, ఆస్టిన్‌, టెక్సస్‌

సమైక్యతకు తలవొగ్గినా భవిష్యత్తులో కష్టం

గుంటూరు జిల్లాలో పుట్టిన నేను 14 ఏళ్ల వరకు మద్రాస్‌లో, పదేళ్లు హైదరాబాద్‌లో వున్నాను. 1983 నుండి కనడాలోని టొరంటోలో నివాసం. ఆంధ్రదేశమంతా కలసికట్టుగా వుండాలని కాంక్షించేవారిలో నేనొకదాన్ని. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న మనస్సును కలచివేసే సంఘటనల దృష్ట్యా విభజన తప్పదనీ, తాత్కాలికంగా ఏదో ఒక నిర్ణయానికి కట్టుబడి సామరస్యంగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నాను. సమైక్యతకు తలవొగ్గినా భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ సమస్య ఇంతకంటే అధిక నష్టంతో ప్రజ్వరిల్లే అవకాశాలు చాలా వుంటాయి.

అందువల్ల వారి కోరికను అంగీకరించే ముందు ఆంధ్రా తెలంగాణా రాజకీయ నాయకులందరూ కలసి విభజన వల్ల కలిగే ఉపయోగాలూ, నష్టాలూ కూలంకషంగా చర్చించే సదవకాశాన్ని ఒకటికి పదిసార్లు ఏర్పాటు చేసుకోవాలి.. ఈమధ్యకాలంలో సినిమాలు, నవలలూ, పాటలూ మొదలైనవన్నీ తెలంగాణా ‘యాస’లో వస్తుండటం వారి ప్రాంతీయ భాషకి ప్రాముఖ్యత బాగా ఇస్తున్నట్లు అవగాహనకు వస్తోంది. అన్నదమ్ములమే అయినా విభజన జరగాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణా ప్రాంతీయుల ఆకాంక్ష మేరకు ఆ ప్రాంతం అద్భుతమైన ప్రగతిని సాధించగలదనీ నా ప్రగాఢ విశ్వాసం.

- కొమరవోలు సరోజ, రచయిత్రి, టొరంటో, కెనడా

మార్పు తేకుండా విభజన లాభంలేదు

గాంధీగారి నించి నేర్చుకున్న నిరాహార దీక్షని హింస చెలరేగడానికీ, జనజీవితం స్తంభించిపోవడానికీ ఉపయోగించుకుంటున్న రాజకీయ నాయకుల పద్ధతి చూస్తే వీళ్లు దేన్నైనా తమ లాభాల కోసం ఉపయోగించుకోగలరని బోధపడుతుంది. ఇందులో తెలంగాణా లేదు, ఆంధ్రా లేదు, తెలుగు జాతి అసలే లేదు. వున్నదల్లా రాజకీయ నాయకుల, బడాపెట్టుబడిదార్ల స్వప్రయోజనాలే. తెలంగాణ ఇస్తే ఎవరికి లాభమో, ఇవ్వకపోతే ఎవరు బాగుపడతారో మేధావులు (ఇంతవరకూ నిశ్శబ్దంగా వున్నవారు) సమర్థంగా చర్చించాలి. సమర్థమైన చర్చలవల్ల తెలంగాణా ఇవ్వడం అక్కడి ప్రజలకి లాభమని స్పష్టపడితే, తెలంగాణా వేరుచెయ్యమని అడగాలి. ఇది ఆవేశాలవల్ల తేలవలసిన సమస్య కాదు.

అమాయకులైన విద్యార్థులు ప్రాణాలు, చదువులు పోగొట్టుకుంటే తేలే సమస్య కాదు. అల్లర్లవల్లా, ప్రాణాలు పోగొట్టుకోడం వల్లా, ఇలాటి సమస్యలు పరిష్కారం అయితే, ఆ పరిష్కారం మళ్లీ కొన్ని కొత్త సమస్యల్ని సృష్టిస్తుంది. పరిపాలనలో మార్పులే తేకుండా కేవలం రాష్ట్ర విభజన వల్ల ప్రజలకి కలిసొచ్చేదేమీ లేదని ప్రజలకి చెప్పగల మేధావులు రావాలి. పరిపాలించే నాయకులు ఇంత అవినీతిపరులు అయినంతకాలం తెలంగాణా విడిపోతే తెలంగణవాళ్లకి ఒరిగేదేమి లేదు. ఒక రాష్ట్రంలో బదులు రెండు రాష్ట్రాల్లో అవినీతి ఏర్పడుతుందంతే.

- వెల్చేరు నారాయణరావు, విమర్శకులు, షికాగో

నలుగురూ కలిసి నిర్ణయం చేయాలి

ఒకవేళ ఆంధ్ర, తెలంగాణా వేరే రాష్ట్రాలుగా విడిపోతే ఇరు ప్రాంతాల్లో కూడా ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌ వచ్చే అవకాశం ఉంది కదా. పైగా రాష్ట్రం చిన్నదైతే పరిపాలన సులభమవుతుంది. సమస్యలను ఎదుర్కోవడం తేలికవుతుంది. నేడు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రత్యేక తెలంగాణా నెలకొల్పడం ఒక రకంగా మంచిదేమో? కాని, అది రావడానికని మనం చేపట్టిన రాక్షస మార్గాలు మాత్రం మంచివి కావు. సమస్యలని కూలంకషంగా అర్థం చేసుకొనే రాజకీయవేత్తలు నలుగురూ కలిసి, చర్చలు జరిపి, నిర్ణయం తీసుకున్న తరువాత దాన్ని ప్రజలకు అర్ధమయ్యే తీరులో వారికి చెప్పడం చేయాలి. ఇలా ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకోవడం మనకు చేతవుతుందా? కష్టమే!

- పూడిపెద్ది శేషుశర్మ, కథా రచయిత్రి, అట్లాంటా, జార్జియా

ఇంటర్వ్యూలు: కల్పనా రెంటాల, ఆస్టిన్‌, టెక్సస్‌

కార్మి’కళ’ ఏది?
సింగరేణిలో రోజురోజుకు కార్మికుల సంఖ్య తగ్గుతోంది. యాంత్రీకరణ, ప్రవేటికీకరణ పెరిగిపోయి కార్మికుల సంఖ్యలో పెను మార్పు వస్తోంది. ఒకప్పుడు నిర్వాసితులకు ఉపాధి కల్పించిన సింగరేణిలో ప్రస్తుతం ఉపాధి కరువైంది. లక్షా 17 వేల మంది ఉన్న కార్మికుల సంఖ్య ప్రస్తుతం 69 వేలకు చేరింది. ఉత్పత్తులు రెట్టింపు అయ్యాయి.. కానీ కార్మికుల సంఖ్య మాత్రం గణనీయంగా పడిపోయింది.

ఉపాధి కల్పించే అండర్‌ గ్రౌండ్‌ గనులు క్రమక్రమంగా మూసివేతకు గురవుతున్నాయి. వీటి స్థానంలో యాంత్రీకరణ, ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నడిచే ఓపెన్‌ కాస్టు గనులు పెరిగిపోతున్నాయి. దీంతో పెద్దఎత్తున పర్యావరణంలో విధ్వంసం ఏర్పడుతోంది.

గత 120 సంవత్సరాల సింగరేణి చరిత్రలో మొదటి వంద సంవత్సరాల్లో వెలికి తీసిన బొగ్గు ఈ ఇరవై సంవత్సరాలల్లో తీసిన బొగ్గు ఒకే రకంగా ఉంది. అంటే బొగ్గు వెలికితీత ఎంత మేరకు రెట్టింపు సాధించిందో చెప్పవచ్చు.

కాగా, నూతనంగా బొగ్గు గనులు వెలుస్తున్న కొద్దీ నిర్వాసితులు కూడా అంతకు రెట్టింపు సంఖ్యలో పెరిగిపోతున్నారు. కానీ వీరికి ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించ లేక పోతున్నారు. ఇటు ఉపాధి లేక.. అటు భూములు కోల్పోయి నిర్వాసితులు వలస కూలీలుగా మారుతున్నారు.

ఈ నెల 17 నుంచి సింగరేణి ఆవిర్భావ సంబరాలు ప్రారంభం కానున్నాయి. సింగరేణి వ్యాప్తంగా ఆయా ఏరియాల్లో ఈ సంబరాలు ఐదు రోజుల పాటు ని ర్వహించనున్నారు. 23న గోదావరిఖనిలో ప్రధాన కార్యక్ర మం ఏర్పాటు చేశారు.

1920 డిసెంబర్‌ 23న అప్పటి ని జాం ప్రభుత్వంలోని హైదరాబాద్‌ కంపెనీ యాక్టు కింద మొట్టమొదటి సారిగా నమోదు చేయించారు. అప్పటివర కు హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీ పేరుమీద ఉన్న బొగ్గు సంస్థను అనంతరం సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌గా మార్చారు. దీంతో డిసెంబర్‌ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు.

1871లో డాక్టర్‌ కింగ్‌ అనే బిట్రీష్‌ భూగర్భ శాస్త్రవేత్త సింగరేణి ప్రాంతంలో బొగ్గును కనుగొన్నారు. 1886లో హైదరాబాద్‌ దక్కన్‌ కంపెనీ పేర రిజిష్టర్‌ అయ్యింది. 1889లో ఇల్లందు ప్రాంతంలోని సింగరేణి గ్రామం వద్ద బొగ్గు గనిలో మొట్టమొదటిసారిగా ఉత్పత్తి ప్రారంభమైం ది.

ఆ విధంగా సింగరేణి సంస్థ 120 సంవత్సరంలోకి అ డుగుపెట్టబోతోంది. తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు వెయ్యి కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థ ఈ ప్రాంత వాసుల జీవితాల్లో ‘వెలుగు’ నింపింది.

నిజాం కాలంలోనే సింగరే ణి సంస్థ ఆవిర్భవించగా, బొగ్గు తవ్వకాలు ప్రధానంగా ని జాం స్టేట్‌లోని రైల్వేలు, థర్మల్‌ విద్యుత్‌ అవసరాల మేరకు ఉపయోగించేవారు. బొగ్గు ఉత్పత్తిలో మానవ శ్రమ ప్రధా న పాత్ర పోషించేది. అందువల్ల బొగ్గు గనుల కింద నిర్వాసితులైన వారు, ఆనాటి దొరల దేశముఖ్‌ల దౌర్జన్యాలను భరించలేక పారిపోయి వచ్చిన వారు ఇందులో ఉపాధి పొందారు. పరిమిత స్థాయిలోనే బొగ్గు తవ్వకాలు చేపట్టా రు.

దీంతో పర్యావరణం పరంగా కూడా పెద్ద ప్రభావం చూపలేదు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ కలిసిపోయాయి. దీంతో రాష్ట్ర పరి ధి విస్తరించింది. ఆ మేరకు బొగ్గు అవసరాలు పెరిగాయి. దీనికితోడు ఇతర దక్షిణాది రాష్ట్రాలకు బొగ్గు అవసరమైంది. దీంతో బొగ్గు ఓ వ్యాపార వస్తువైంది. మారిన పరిస్థితులకు అనుగుణంగా కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో కూడా కొత్త గనులు వెలిశాయి.

బొగ్గు గనులు విస్తరించడంతో గ్రామా లు అంతరించి పారిశ్రామిక వాడలు ఆవిర్భవించాయి. దీం తో సామాజిక రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నా యి. ఉమ్మడి రాష్ట్రం పేరు మీద ఈ ప్రాంతంలో తవ్వితీసిన బొగ్గు, ఇతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ముఖ్యంగా థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు తరలించారు.

కాగా, వీటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని తెలం గాణేతర ప్రాంతాల అభి వృద్ధికే వెచ్చిం చారు. సగటు న సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపా యల సంపద ఈ ప్రాంతాల నుంచి తరలించారు. ‘తట్టా – చెమ్మాస్‌’దే ప్రధాన పాత్ర కావడంతో కార్మికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

1990 నాటికి దాదాపు లక్షా 17 వేల మందికి చేరుకుంది. నిర్వాసితులకు ఉపాధి కల్పించి సింగరేణి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తర్వాతి కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల వల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమల స్వరూపం మారిపోయింది. ప్రైవేటికీకరణ, యాంత్రీకరణ, ఔట్‌సోర్సింగ్‌ పెరిగిపోయి సంస్థ నామ మాత్రంగా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఉత్పత్తిలో ప్రైవేటు భాగస్వామ్యం కూడా పెరిగిపోయింది. సంస్థలో పని చేసే కార్మికుల పరిస్థితి కూడా రోజురోజుకు అ«ధ్వానంగా తయా రవుతోంది. హక్కులు హరించబడుతున్నాయి. సంస్థలో అంతర్గత ప్రైవేటికీకరణ పెరిగి ఫలితంగా పర్మనెంటు కార్మికుల స్థానంలో కాంట్రాక్టు కార్మికులు వస్తున్నారు.

Courtesy : Andhra Jyothy

ఇదీ తెలుగు జాతి చరిత్ర
- లగడపాటి రాజగోపాల్‌

విజ్ఞతతో రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్టపన్నాగాల, చరిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌- తెలుగు ప్రజ విభజించకూడని, విభజించలేని, విభజన కుదరని శతాబ్దాల చరిత్ర కలిగినది.

తెలుగు మాట్లాడే ప్రజల సంక్షిప్త చరిత్రను ఇక్కడ ప్రస్తావించడం సందర్భ రహితం కాదు. మూడువేల సంవత్సరాల క్రితమే ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రప్రదేశ్‌ జాతి ప్రస్తావన ఉంది.క్రీస్తు పూర్వం మూడవ శతా బ్దం నుంచి వారి సామ్రాజ్యం ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతాలన్నింటినీ కలుపుకొని భారతదేశంలోని అధికభాగానికి విస్తరించి ఉంది. క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నుంచి ప్రారంభమైన ఆంధ్ర శాతవాహనుల పాలన నాలుగున్నర శతాబ్దాల పాటు సాగింది. ఇది మౌర్యరాజుల కాలంతో పోల్చితే అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందిన పరిపాలన అని కౌటిల్యుడు తన రచనలలో వివరించాడు. ఆ తరువాత వచ్చిన ఇక్ష్వాకులు కృష్ణా, గోదావరి పరివాహక లోయ ప్రాంతాలను విజయపురి రాజధానిగా- ఇప్పటి నాగార్జునసాగర్‌ ప్రాంతాన్ని పరిపాలించారు.

అంతర్జాతీయ విశ్వవిద్యాలయం ఇక్కడ ఉన్నట్టు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత చాళుక్యులు పాలించారు. వారి తరువాత కాకతీయులు 12వ శతాబ్దంలో ఆంధ్ర నగరిగా ప్రసిద్ధి చెందిన వరంగల్‌ రాజధానిగా తమ సామ్రాజ్యాన్ని నెల్లూరు, కడప వరకు విస్తరించి రెండు శతాబ్దాలు పరిపాలించారు. స్వర్ణయుగంతో పోల్చదగిన కాకతీయుల పాలనలో చిత్రకళ, స్థూపవిద్య, భవన నిర్మా ణ వైభవం వెల్లివిరిసింది. రామప్ప సరస్సు, లబానవరం సరస్సు వంటి నిర్మాణాలు చేపట్టారు. సాగునీటి సౌకర్యా ల వల్ల పటిష్టమైన ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీ సుల్తానుల వల్ల కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. బహుమనీ, విజయనగర సామ్రాజ్యాల పతనంతో గోల్కొండకు చెందిన కుతుబ్‌ షాహీ సుల్తానులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.

సుల్తానులు తమ పాలన లో శ్రీకాకుళం నుంచి గోల్కొండ వరకు తెలుగు మాట్లా డే ప్రాంతాలను అన్నింటినీ ఏకం చేశారు. అసఫ్‌జాహీ అధికారంలో కూడా తెలుగు ప్రాంతాలు అన్నీ ఒకే పరిపాలన కింద ఉన్నాయి. విదేశీ శక్తుల ఆధిపత్యం నెలకొన్న తరువాత మాత్రమే తెలుగు మాట్లాడే ప్రజల ఐక్యత విచ్ఛిన్నానికి బీజాలు పడ్డాయి. 17వ శతాబ్ద ప్రారంభంలో ఉత్తర సర్కారు శ్రీకాకుళం నుంచి దిగువన కృష్ణానది ప్రాంతాన్ని ఫ్రెంచ్‌ సైన్యాల నిర్వహణ ఖర్చుల భారానికి పరిహారంగా సాలార్‌ జంగ్‌ ఫ్రెంచివారికి ధారాదత్తం చేశారు.

మూడవ కర్ణాటక యుద్ధం అనంతరం అధికారం, వాణిజ్యం బలాబలాలు ఆంగ్లేయుల కు అనుకూలంగా మారాయి. దీంతో ఉత్తర సర్కారును 1761లో ఫ్రెంచి ఆధిపత్యం నుంచి ఆంగ్లేయుల ఆధిపత్యానికి మార్చుకుంటూ రాబర్ట్‌ క్లైవ్‌ కలిపేసుకున్నాడు. 1799లో టిప్పుసుల్తాన్‌ పతనం ఫలితంగా బళ్ళారి, కర్నూలు, అనంతపురం, కడప (చిత్తూరుతో కలిపి) హైదరాబాద్‌ నిజాం రాజ్యంలో భాగమయ్యాయి. సీడెడ్‌ ప్రాంతాన్ని 1800 సంవత్సరంలో ఫోర్టు సెంట్‌ జార్జి బ్రిటీష్‌ ప్రభుత్వానికి అప్పగించారు.

ఆనాటికి కర్ణాటకలో భాగంగా గల నెల్లూరు 1901లో ప్రిన్స్‌ ఆరెంటు మనోవర్తి భాగంగా మద్రాసు ప్రెసిడెన్సీలో కలిసింది. అలా చరిత్రాత్మక ప్రమాదాల ద్వారా మాత్రమే విదేశీపాలనలోనే తెలుగు ప్రజలు అశాస్త్రీయ విభజనకు గురయ్యారనేది తిరుగులేని సత్యం. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటిది. ఆంధ్రప్రదేశ్‌ పేరుతో సహా చరిత్ర మూడు వేల సంవత్సరాల నాటిది. ఆ చరిత్ర తెలియని కుహనావాదులు, అజ్ఞానులు, అమాయకులు. ‘ఆంధ్రప్రదేశ్‌’ నిన్న, మొన్నటిదనుకొని జాతి వ్యతిరేక చర్యలకు ఉపక్రమించడం చరిత్రను కించపరచడమే.

ఆంధ్ర ప్రదేశ్‌ చరిత్ర మూడు వేల ఏళ్ల నాటిది

మూడు వేల సంవత్సరాల క్రితం రచించిన ‘ ఐతరేయ బ్రాహ్మణం’లో ఆంధ్రప్రదేశ్‌ జాతి ఉనికి ప్రస్తావించారు. క్రీస్తుకు ముందు మూడవ శతాబ్దానికే సామ్రాజ్యం ఈనాటి ఆంధ్రప్రదేశ్‌ భాగాలను అన్నీ కలుపుకొని భారతదేశంలో అధిక భాగపాలన జరిగింది. నాలుగున్నర దశాబ్దాల కాలం మౌర్యరాజుల స్థాయిలో సరితూగే అత్యున్నత అభివృద్ధి పాలనను ఆంధ్ర శాతవాహనులు అందించారు. ఇది కౌటిల్యుని రచనలలో స్పష్టం గా గమనించవచ్చు. తరువాత ఇక్ష్వాకుల వంశీయుల పాలన విజయపురి రాజధానిగా చారిత్రాత్మకంగా జరిగింది.

బౌద్ధ మహాయానం మూడు పువ్వులు- ఆరు కాయలుగా విరజిల్లిన కాలం ఇదే. 12వ శతాబ్దంలో కాకతీయుల పాలన వరంగల్లు రాజధానిగా నెల్లూరు, కడప వరకు సాగింది. ఈ సామ్రాజ్య పతనం అనంతరం గోల్కొండ సుల్తాన్లు శ్రీకాకుళం నుంచి గోల్కొండ వరకు తెలుగు మాట్లాడే ప్రజల ప్రాంతాలన్నింటినీ సమర్థంగా పరిపాలించారు. అసఫ్‌ జాహీ అధికారంలో కూడా తెలుగు ప్రజ ఐక్యంగా ఉన్నా రు. టిప్పు సుల్తాన్‌ పతనానంతరం కూడా బళ్ళారి, కర్నూలు, అనంతపూర్‌, కడప (చిత్తూరు) కలిపి హైదరాబాద్‌ నిజాంకు కలిసింది.

ఇంకా విజ్ఞతతో రాగద్వేషాలకు అతీతంగా చరిత్ర అధ్యయనం చేస్తే కేవలం విదేశీయుల దుష్టపన్నాగాల, చారిత్రాత్మక తప్పిదాల వల్ల మాత్రమే తెలుగుజాతి, ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక అశాస్త్రీయ, అజ్ఞాన, అనైక్యతకు గురైందని తెలుస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌- తెలుగు ప్రజ విభజించకూడని, విభజించలేని విభజన కుదరని శతాబ్దాల చరిత్ర కలిగినది. ఈ నేపథ్యంలో మానవమాత్రులందరూ ఆంధ్రప్రదేశ్‌ సంరక్షణ, పరిరక్షణకు సర్వశక్తులు వొడ్డి కాపాడుకోవాల్సిన చారిత్రాత్మక సమయమిది. ఇక్కడ ఇప్పుడు ఏమాత్రం ఏమరుపాటులో తప్పటడుగు వేసినా భావితరాల ముందు నేటి రాజకీయ పాలనా ప్రతినిధులుగా, శాశ్వత ద్రోహులుగా శిక్ష అనుభవించక తప్పదు

‘ప్రదేశ్‌’ తెలుగు పేరే కాదు - వరవరరావు