Telangana in News » Vaartha

హైదరాబాద్‌ సరే, సింగరేణిని ఏంచేస్తారు?
-పి.లక్ష్మీపరంధాములు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం గత 50 యేండ్ల నుంచి సాగుతున్నది. తెలంగాణ ప్రజాసమితికి ప్రజలు బ్రహ్మ రథంపట్టి అఖండ మెజార్టీతో గెలిపించితే అనేక మంది నాయకులు తమ స్వార్థంతో  అమ్ముడుపోవడంతో ఉద్యమంలో కొంత స్తబ్దత ఏర్పడింది. మళ్లీ పి.ఇంద్రారెడ్డి ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమ కమిటి, భువనగిరి తెలంగాణ వాదుల సమావేశం, వరంగల్‌ డిక్లరేషన్‌,

తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభలతో ఉద్యమం మళ్లీ మొలకెత్తింది. 2001 టిఆర్‌ఎస్‌ ఆవిర్భావం ఉద్యమం ఊపు అందుకుంది. అయితే కెసిఆర్‌ ఆమరణ నిరాహారదీక్ష ప్రభావంతో తెలంగాణ పోరాటం విద్యార్థుల, ప్రజల, కవులు, కళాకారులు, జర్నలిస్టుల చేతుల్లోకి వెళ్లింది వాస్తవం. మారుమూల గ్రామాల సాధారణ మహిళలు సైతం నేడు బయటకు వచ్చి ‘జై తెలంగాణ అంటున్నారు. ఈ వాస్తవాన్ని ఇప్పటివరకు తెలంగాణ మీదా స్పష్టమైన వైఖరి తెలపని కాంగ్రెస్‌ నాయకులు కూడ అంగీకరిస్తు న్నారు.

వలసవాదుల పాత్ర ప్రశ్నార్థకం

అయితే ఇదే తరుణంలో రాష్ట్ర మంత్రులు దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌లతో పాటు కొందరు ఆంధ్ర వలస వాదులు హైదరాబాద్‌ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆంధ్ర వలసవాదుల పాత్ర ఉన్నదని గట్టిగా ఉదహరిస్తున్నారు. నిజానికి హైదరాబాద్‌ చరిత్రలో ఆంధ్ర వలసవాదుల పాత్ర ఏమిటో? అంతు చిక్కని ప్రశ్న. పట్టణంలోని చారిత్రాత్మక కట్టడాలకు వారు రాళ్లు ఎత్తారా? సున్నం మోసారా? కనీసం నీళ్లు చల్లారా? అనే దానికి ఆధారాలు లేవు.అయినప్పటికి తెలంగాణకు తల లాంటి హైదరాబాద్‌ మీదనే గురి పెట్టారు.

వలస వాదులు హైదరాబాద్‌కు ఎప్పుడు వచ్చారు? పరిశ్రమలు ఎప్పుడు పెట్టారు? తెలంగాణ సంస్కృతి ఏమి చేసారు అనేది ఇక్కడ చర్చ కాదు. కాని హైదరాబాద్‌ తదుపరి 120 సంవత్సరాల చరిత్ర సింగరేణికి ఉన్నది. తెలంగాణకు తల మానికంగా, ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా విరాజిల్లుతుండేది. అయితే అప్పటి నుంచి సింగరేణిలో అధికారులందు ఆంధ్రులే. సివిల్‌ కాంట్రాక్టర్లు, సూపర్‌వైజర్లు, క్లర్క్‌లు, జిఎంలు, చివరికి డైరక్టర్లలో అధికంగా ఆంధ్రులుండగా కేవలం కార్మికులు మాత్రమే తెలంగాణ వారున్నారు. చివరికి తెలంగాణ ఉద్యమం వచ్చిన తదుపరి ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొట్టుతూ ఇక్కడి బొగ్గు సంపదను ఆంధ్రాకు ఎత్తుకెళ్ళ డానికి ఆగమేఘాల మీద తవ్వుతున్నా ఓపెన్‌కాస్టుల ఓబి కాంట్రాక్టర్లు కూడా రాయలసీమ, ఆంధ్రప్రాంతం వారే. మరీ ఇదే తరుణంలో హైదరాబాద్‌ను ప్రత్యేక ప్రాంతంగా డిమాండ్‌ చేస్తున్నట్లు సింగరేణి విస్తరించిన నాలుగు జిల్లాలను కూడ ప్రత్యేక జిల్లాలుగా అడగవచ్చుకదా?

అంతేకాకుండా హైదరాబాద్‌ తదుపరి తెలంగాణలో పెద్ద పట్టణమైన వరంగల్‌ చుట్టు పక్కల అనేక గుంటూరు పల్లెలున్నారు. ఈ పల్లెలనన్నీ ప్రత్యేక గ్రామాలుగా గుర్తించా లంటే ఎలా? వరంగల్‌ జిల్లాలోని మంగపేట, కమలాపూర్‌, పస్రా, గోవిందరావుపేట, రామన్నపేట, నిజామాబాద్‌ జిల్లాలో డిచ్‌పల్లి, బాల్కొండ, వర్నీ ఆదిలాబాద్‌ జిల్లాలో మంచిర్యాల ఎసిసి లాంటి ప్రాంతాలలో వలసవాదులదే ఆదిపత్యం. ఇక ఖమ్మం జిల్లా సరిహద్దు గ్రామాల పరిస్థితి సరేసరి. మరి ఈ గ్రామాలను కూడ ప్రత్యేకంగా ప్రకటిం చాలనే డిమాండ్‌ వస్తే ఎలా? కోనేరు కోనప్ప, మండవ వెంకటేశ్వర్‌రావులాంటి వలసవాదులు తమ నియోజక వర్గాలను ప్రత్యేకంగా గుర్తించాలంటే ఎలా? ఆదిలాబాద్‌ జిల్లాలోని నల్లరేగడి భూముల మీదా కన్నువేసి నేడు వేమన్‌పల్లి, లాంటి మారుమూల గ్రామాలలో భూము లను కౌలుకు తీసుకుని పత్తి పండిస్తున్నా గుంటూరు జిల్లా రైతులు ఆ భూములను ప్రత్యేకంగా తమకే కేటాయించాలంటే ఎలా? హైదరాబాద్‌ మీదా హక్కు కోరే ఆంధ్ర వలస వాదులు వారికి మద్దతునిచ్చే మంత్రులు ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే బాగుంటుంది.

హైదరాబాద్‌ అభివృద్ధి జరిగిందా?

ఆంధ్ర వలసవాదులు వాదిస్తున్నట్లు నిజంగా హైదరా బాద్‌ అభివృద్ధి చెందిందా? అదే నిజమైతే పాతబస్తీ పరిస్థితి ఏమిటి, వలస వాదులు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పరిశ్రమలలో తెలంగాణ వాసుల ఉద్యోగాల వాటా ఎంతో చెప్పగలరా? హైదరాబాద్‌ను కాలుష్య పట్టణంగా మార్చి లాభాలు గడించారే తప్పా. ఇక్కడి వారికి ఉద్యోగాలు దక్కలేదు, అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. ఇదే తరుణంలో మంత్రులు నాగేందర్‌ ముఖేష్‌లు కొన్ని ప్రశ్న లకు సమాధానం చెప్పాలి. సింగరేణిలో వలస వాదులు ఉద్యోగాలు చేస్తున్నట్లు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో, తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఎందరున్నారో చెప్పితే బాగుంటుంది.

వాస్తవానికి కెసిఆర్‌ దీక్ష మీదా, ముక్కుపచ్చలారని పిల్లల ఆత్మహత్యల మీదా, మంచి ఉద్యోగం ఉన్నా కానిస్టేబుల్‌ కిష్టయ్య బలిదానం, ఎస్‌ఐ శ్యాంసుందర్‌ త్యాగం, శ్రీకాంత్‌చారీ లాంటి భావితర మేధావి ఆత్మహత్యల మీదా స్పందించాల్సిన మంత్రులు హైదరాబాద్‌ మీద అర్థరహితంగా స్పందించడం శోచ నీయం.తెలంగాణ ప్రాంతాన్ని బొందలగడ్డగా మారుస్తున్నా ఓ్వపెన్‌కాస్టుల మీదా ఒక్క మంత్రి మాట్లాడారు.మంత్రులు నాగేందర్‌, ముఖేష్‌లతో పాటు కొందరు వలస వాదులకు హైదరాబాద్‌ మీదా భ్రమలుండవచ్చు.లేదా తెలంగాణ సమస్యను జటిలం చేయడానికి ఎత్తుగడ కావచ్చు. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం, దానికి హైదారాబాద్‌ రాజధానిగా ఉండడం ఖాయం. ఇది రేపటి సూర్యోదయ  మంతటి నిజం.ప్రాణమైన విడుస్తారు కానితెలంగాణ ప్రజలు హైదరాబాద్‌ను వదలరు.

(Courtesy: Vaartha)