Dec 08 2009
మీ తెలుగు తల్లికి మల్లె పూదండ
- పర్కాల సోమనాథ రావు
మీ తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వుతో సిరుల తరలించె నా తల్లి
చిరునవ్వుతో సిరుల తరలించె నా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
మా అందరి కడుపులే మండుతాయి
తెలంగాణ బతుకులే ఎండుతాయి
తెలంగాణ బతుకులే ఎండుతాయి
కాకతీయ నగర అపురూప శిల్పాలు
కూలి పడ్తుంటే మా గుండెల్ల గాయాలు
మీ ఫిలిం సిటీలు పర్యాటక కేంద్రాలు
ఆస్తులై భూముల్ని స్వాహ చేస్తుంటేను
కూలి పడ్తుంటే మా గుండెల్ల గాయాలు
మీ ఫిలిం సిటీలు పర్యాటక కేంద్రాలు
ఆస్తులై భూముల్ని స్వాహ చేస్తుంటేను
ప్ర .రా .పా చెక్క భజన
తే.దే.ప తిక్క రభస
మీ చెవుల రింగుమని మారు మ్రోగే దాక
మా పాటలే పాడుతాం మా ఆటలే ఆడుతాం
మా పాటలే పాడుతాం మా ఆటలే ఆడుతాం
నీ ఆట లెట్లాడుతాం
నీ పాట లెట్ల పాడుతాం
ఓ తెలుగు తల్లీ!
ఓ తెలుగు తల్లీ! ఓ తెలుగు తల్లీ!
2 responses so far
excellent
[...] also read మీ తెలుగు తల్లికి మల్లె పూదండ [...]