Jan 13 2010

siddartha

ప్రళయం

Posted at 7:02 pm under సాహిత్యం

- సూర్య చంద్రిక

బలవంతుడి పై బలహీనుడిని పోటీ పెట్టలేము
మెరుపు-తీయని మాటలతో పనిని తప్పించుకోలేము
రహస్య ఒప్పందాలతో రాజకీయ చతురత చూపలేము
రెండు కనులు సమానమైనా  వదలుకోం గుడ్డి కన్నును
విడువలేము వీడలేము ప్రజాస్వామ్యపు విలువలను…

ప్రజలుగా ఎల్లప్పుడు శాంతిని కోరుతాము
చర్చలే సమస్యా పరిస్కారం కోసము
సమస్యను పక్కన బెట్టి శాంతిని స్థాపించలేము
శాంతి పేరుతో మోపలేము ఉక్కుపాదమును
విడువలేము వీడలేము ప్రజాస్వామ్యపు విలువలను…

వార్తలను వ్యాఖ్యానం కలగల్పి ప్రజలను దారి మల్లించలేము
స్వేచ్ఛను పత్రికాదిపుతుల కోసము తాకట్టు పెట్టలేము
వ్యాపార దృక్కోణంతో  పత్రికా విలువలను వదలలేము
శాంతి భధ్రతల పేరుతో నొక్కలేము పత్రికల పీకలను
విడువలేము వీడలేము ప్రజాస్వామ్యపు విలువలను….

ముల్లును ముల్లుతోనేనని ఉద్యమాన్ని ప్రతి ఉద్యమంతో అణచలేము
మూలాన్ని వదలి మొగ్గలోనే ఉద్యమాన్ని-ప్రజాకాంక్షను తుంచలేము
స్వార్థంతో వంచించే వ్యాపారిని పూజారిని రాజకీయ బేహారిని నమ్మలేము
ద్వైపాక్షికతనొదలి శత్రువు-శత్రువు గొళుసుతో పరిస్కరించలేము సమస్యను
విడువలేము వీడలేము ప్రజాస్వామ్యపు విలువలను..

మానవీయ కోణమంటు ఎంగిలి మెతుకులు విదిలించలేము
ప్రజా క్షేమము మరచి సానుభూతితో అందలమెక్కి ఏలలేము
అదికార-ప్రతి పక్షాల వైఖరి ప్రజలు కాక ప్రజా ఓటే అనలేము
విరాళాల కోసం ప్రజాసంపద దోపిడికి తెరవలేము దారులను
విడువలేము వీడలేము ప్రజాస్వామ్యపు విలువలను….

సృష్టించే ప్రజా సంపద దోపిడీ జరిగితే ప్రజాస్వామ్యాన్ని రక్షించలేము
పునాదినొదలి గోడలనే బాగు చేస్తూ ప్రజాస్వామ్య కట్టడాన్ని నిలపలేము
న్యాయం అందని పుల్లని ద్రాక్షయితే ప్రజాస్వామ్యనికి న్యాయం చెయ్యలేము
భధ్రత కోరటానికే భయపడే స్థితి ఉంటే కలిపించలేము ప్రజాస్వామ్యానికి భధ్రతను
విడువలేము వీడలేము ప్రజాస్వామ్యపు విలువలను…

No responses yet




Trackback URI | Comments RSS

Leave a Reply