Jan 13 2010
నా తెలుగు పాఠాలు
- శశి కిరణ్
అర్ధం కాని పాఠాలు అనగబట్టి నేర్పిండ్రు
ఫ్రెంచి కన్న కష్టంగుంది కాని, తెలుగే అని చెప్పిండ్రు
ఎప్పుడు ఇనని భాష, ఎవ్వడు మాట్లాడని భాష
తాత్పర్యం తప్పు చెప్తే ఇరగమర్గ దంచిండ్రు
ఎవ్వడు రాసిండో ఏమొ, మా తాతకి పలకనే రాలె
చిన్న పోరగాడ్ని జేసి తప్పు తెలుగు నేర్పిండ్రు
మా గల్లీలనా మాటాలిని ముడ్డితోని నవ్విండ్రు
ఏం భాష ఇది? ఎవని యాస ఇది?
ఎవనయ్యతో నేను నా గోస చెప్పుకునేది?
ఇక చాలు ఆపాలె, ఈ పరాయోండ్ల వ్యాసాలు
ఇక నుండి నేర్పాలె నాకు, ‘నా తెలుగు’ పాఠాలు
No responses yet