Jan 14 2010

siddartha

సహజీవనం

Posted at 6:54 pm under సాహిత్యం

-శశి కిరణ్

ఎందుకుర ఈ సమైక్యాంధ్ర
అసలెవ్వనికిర ఈ సమైక్యాంధ్ర
కనిపిస్తలేవ మీకు ‘మా తెలంగాణ’ కన్నీళ్లు
ఇనిపిస్తలేవ మీకు ‘జై తెలంగాణ’ నినాదాలు

అన్నదమ్ములోలె మనము విడిపోదామని మేమంటే
కుంటి తమ్ముని మీద మీకెందుకురా ఈ కపట ప్రేమ
ముక్కలు చేసిన ఈ ఒక్క కాలు సరిపొదా?
రెండో కాలు సచ్చేదాక మీ కంటికి నిద్దర రాదా?

వద్దుర, అసలొద్దుర ఈ సహజీవనము మాకు
దోచుకున్నది చాలు, మా దారికిగ అడ్డు రాకు
హాయిగ పోనిస్తె మీకు అన్నలాగ విలువిస్తం
అట్లగాదని అడ్డొస్తే, అడ్డంగా నరికేస్తం

No responses yet




Trackback URI | Comments RSS

Leave a Reply