Jan 19 2010
బాయిల కప్పవా? బురదల పందివా?
-శశి కిరణ్
నవ్వుకోండి ద్రోహులార
మూతులూషి పడేదాకా
నవ్వుకోండి ద్రోహులార
పొట్ట పగిలి సచ్చేదాక
తల్లడిల్లిన తల్లికొరకు
లాఠీలకు, తూటాలకు
వెన్నుదిరగక ఎదురు నిలిచి
నెత్తుటి మడుగులలో
పోరాడుతున్న తమ్ములనుజూచి
సిగ్గులిడిచి, ఒల్లుమరచి
నవ్వుకోండి ద్రోహులార
ఈ తల్లికి పుట్టలేద,
తల్లి ఒడిల పెరగలేద?
రోదిస్తూ వేడుకున్న
తల్లి బాద్యత నీకు లేద?
వీధి వీధిల ఉద్యమాలతొ
జోరు జోరుగ పోరుబట్టిన
చెల్లెలను ఈడ్చుకపోతె,
బొర్లి బొర్లి, దొర్లి దొర్లి
నవ్వుకోండి ద్రోహులార
తమ్ముళ్ల త్యాగం ఉత్తగ పోలె
చెల్లెళ్ళ ధైర్యం వృధా కాలె
అదుగో, వస్తున్నదదిగో
కనుచూపుమేరలో కనిపిస్తున్నదదిగో
విముక్తి పొందిన ‘తల్లీ తెలంగాణ’
మీ ఒళ్ళు తిమ్మిరెక్కి పులకరిస్తలేదేమో
మీ కండ్లు నెత్తికెక్కి కనిపిస్తలేవేమో
ఇగ నవ్వుకోండి ద్రోహులార
మూతులూషి పడేదాకా
నవ్వుకోండి ద్రోహులార
పొట్ట పగిలి సచ్చేదాక
One response so far
I Liked it.