Jun 15 2010
జానపదం
-సిధ్ధార్థా పాములపర్తి
అమవాస చీకట్ల అవ్వ పాడిన జోల
పున్నమి వెలుగుల ఆదివాసిల రేల
రైతన్న భాదల జాజీరీల పాట,
భాగోత నీతుల మన చిందులాట
పోచమ్మకి బోనాలు పెట్టి ఆడే ఆట ,
బతుకమ్మ ఆడపడుచుల గౌరమ్మ పాట
‘ఓ రామ రామ’ అనే తీయటి ఒగ్గు కథలు,
‘తందానా తాన’ అనే కమ్మటి బుర్ర కథలు
పల్లె సీమల నుండి పట్టణాల దాక
అమాయకత్వం నుండి అభ్యుదయం దాక
ఉద్యమాలకు ఊపిరిలూది,
నేటి తరాన్ని నిద్దురలేపి,
భావితరాలకు బాద్యత తెలిపే
పారేటి సెలయేర్లు పాడేటి పాట,
చిన్న, పెద్దల కలిపి నడిపించె బాట,
తెలంగాణ గడ్డ లో వెలిసిన జ్ఞానపధం,
తేనే కంటే తీయని తెలగాణ పల్లెపదం…
జానపదం.
No responses yet