Sep
22
2011

siddartha
డ్రైనేజ్ కంపులు కొట్టే నోర్లు మళ్ళీ లీకైనై
పెండ నిండిన మెదడ్లు మళ్ళీ బ్లాకైనై
ప్రత్యేక రాష్టం ఏదో నిన్న గాక మొన్న కొత్తగా వచ్చిన వాదమైనట్టు
ప్రభుత్వాలు జేసినా ప్రమాణాలు, పార్టీలు జేసినా తీర్మానాలు
అవకాశానుకూలంగా మర్చిపోయినై, అవి యాది జేపిస్తే మొఖాలు మాడ్చినై.
“సమాజం ఎప్పుడు మారదు – దేశం ఎన్నడు బాగు పడదు”
అని నిరాశవాద ఉపన్యాసాలు దంచే “సామాన్య” ప్రజా శ్రేయోభిలాషులకు
సర్వ సాధారనులైన కార్మికులు, ఉద్యోగులు, విద్యార్ధులు వగైరా
అన్నిటికి సిద్ధమై సామాజిక చైతన్యంతో ఉద్యమం చేస్తుంటే -
తెలంగాణ సకల జనుల సమ్మె జేస్తుంటే
దిమ్మ దిరిగి పిచేక్కి వెడ్డి వెడ్డిగా వాగుడే పని అయ్యింది…
దౌడ పన్లు రాలక ముందే, ఎన్ను బొక్కల్ ఇర్గక మునుపే
చరిత్ర పుస్తకాల్లల్ల సిరా రంగు మారక మునుపే
బైర్లు గమ్మిన కన్లు తెర్చుకొని, న్యాయం ఎంబడి నిలబడి
కోట్ల మంది అడుగుతున్నా “మా తెలంగాణ మాగ్గావాలె” కి
అర్ధం తెల్సుకొని, మానం గాపడ్కొని, అక్కరకు రాని ముచ్చట్లు బందు పెట్టి
సమజ్ జేస్కుంటే సలాం, ఇంకా ఎర్కైతలేదంటే రాం రాం!
- తెలంగాణ సమ్మయ్య
Tags: Telangana, కవిత్వం, సాహిత్యం
Jun
15
2010

siddartha
-సిధ్ధార్థా పాములపర్తి
అమవాస చీకట్ల అవ్వ పాడిన జోల
పున్నమి వెలుగుల ఆదివాసిల రేల Continue Reading »
Tags: కవిత్వం, పాట, సాహిత్యం
Jan
19
2010

siddartha
-హరి కిరణ్
వీధి కుక్కకు గూడా లేని వింత వక్రము,
ఇంగితము లేని నీ మెదడుకే సొంతము Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, ద్రోహులు, సాహిత్యం
Jan
19
2010

siddartha
-శశి కిరణ్
నవ్వుకోండి ద్రోహులార
మూతులూషి పడేదాకా
నవ్వుకోండి ద్రోహులార
పొట్ట పగిలి సచ్చేదాక Continue Reading »
Tags: తెలంగాణ, ద్రోహులు, పాట, సాహిత్యం
Jan
14
2010

siddartha
-శశి కిరణ్
ఎందుకుర ఈ సమైక్యాంధ్ర
అసలెవ్వనికిర ఈ సమైక్యాంధ్ర
కనిపిస్తలేవ మీకు ‘మా తెలంగాణ’ కన్నీళ్లు
ఇనిపిస్తలేవ మీకు ‘జై తెలంగాణ’ నినాదాలు Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, సాహిత్యం
Jan
13
2010

siddartha
- సూర్య చంద్రిక
బలవంతుడి పై బలహీనుడిని పోటీ పెట్టలేము
మెరుపు-తీయని మాటలతో పనిని తప్పించుకోలేము Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, సాహిత్యం
Jan
13
2010

siddartha
- శశి కిరణ్
అర్ధం కాని పాఠాలు అనగబట్టి నేర్పిండ్రు
ఫ్రెంచి కన్న కష్టంగుంది కాని, తెలుగే అని చెప్పిండ్రు
ఎప్పుడు ఇనని భాష, ఎవ్వడు మాట్లాడని భాష
తాత్పర్యం తప్పు చెప్తే ఇరగమర్గ దంచిండ్రు Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, సాహిత్యం
Jan
05
2010

siddartha
- సూర్య చంద్రిక
గద్దొచ్చె కోడిపిల్ల… ఖియ్యం ఖియ్యం!! || గద్దొచ్చె ||
నీల్లెత్తుకెల్లే… సీమదొంగను సూడు Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, పాట, సాహిత్యం
Dec
31
2009

siddartha
-సూర్య చంద్రిక
రేపటి సూర్యోదయం కోసం ఆకలి హోరుతో
నేటి వెన్నెలలో ఉద్యమిస్తోంది, Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, సాహిత్యం
Dec
30
2009

siddartha
-సిధ్ధార్థా పాములపర్తి
గణపతి దేవుడి పట్టపుటేనుగు
మదమెక్కి కదనరంగమున కదంతొక్కింది Continue Reading »
Tags: కవిత్వం, తెలంగాణ, సాహిత్యం