Sep 22 2011
పక్షపాతం- పక్షవాతం
డ్రైనేజ్ కంపులు కొట్టే నోర్లు మళ్ళీ లీకైనై
పెండ నిండిన మెదడ్లు మళ్ళీ బ్లాకైనై
ప్రత్యేక రాష్టం ఏదో నిన్న గాక మొన్న కొత్తగా వచ్చిన వాదమైనట్టు
ప్రభుత్వాలు జేసినా ప్రమాణాలు, పార్టీలు జేసినా తీర్మానాలు
అవకాశానుకూలంగా మర్చిపోయినై, అవి యాది జేపిస్తే మొఖాలు మాడ్చినై.
“సమాజం ఎప్పుడు మారదు – దేశం ఎన్నడు బాగు పడదు”
అని నిరాశవాద ఉపన్యాసాలు దంచే “సామాన్య” ప్రజా శ్రేయోభిలాషులకు
సర్వ సాధారనులైన కార్మికులు, ఉద్యోగులు, విద్యార్ధులు వగైరా
అన్నిటికి సిద్ధమై సామాజిక చైతన్యంతో ఉద్యమం చేస్తుంటే -
తెలంగాణ సకల జనుల సమ్మె జేస్తుంటే
దిమ్మ దిరిగి పిచేక్కి వెడ్డి వెడ్డిగా వాగుడే పని అయ్యింది…
దౌడ పన్లు రాలక ముందే, ఎన్ను బొక్కల్ ఇర్గక మునుపే
చరిత్ర పుస్తకాల్లల్ల సిరా రంగు మారక మునుపే
బైర్లు గమ్మిన కన్లు తెర్చుకొని, న్యాయం ఎంబడి నిలబడి
కోట్ల మంది అడుగుతున్నా “మా తెలంగాణ మాగ్గావాలె” కి
అర్ధం తెల్సుకొని, మానం గాపడ్కొని, అక్కరకు రాని ముచ్చట్లు బందు పెట్టి
సమజ్ జేస్కుంటే సలాం, ఇంకా ఎర్కైతలేదంటే రాం రాం!
- తెలంగాణ సమ్మయ్య
