Telangana is people’s movement not just KCR
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/01/03/ArticleHtmls/03012012004012.shtml?Mode=1
Filed under Articles, deeksha, Dr. Cheraku sudhakar, DSP Nalini, kcr, political parties, sakala janulu, Samajika telangana, samme, telangana movement, telangana political parties | Comment (0)చంద్రబాబు పర్యటన వెనుక అంతర్యం?
చంద్రబాబు నాయుడు కి హటాత్తుగా రైతుల మీద ప్రేమ పుట్టడానికి కారణం ఏమి ఉంటుంది ? అది కూడా ఇపుడు, ఆటు పార్లమెంట్ సమావేశాలలో ఎక్కడో ఒక చోట, ఒక కారణం, అవకాశం తెలంగాణకు రాక పోతుందా అని చూసే తరుణంలో చంద్రబాబు తెలంగాణలో యాత్ర దేనికి సంకేతం? ఇపుడు రైతుల సమస్య ముఖ్యం కాదు అని కాదు అర్థం , భూమి, రైతుల చుట్టూనే ప్రపంచ ఉద్యమాలన్నీ జరిగినివన్నది వాస్తవం. కాకపొతే తెలంగాణ లోని రైతుల సమస్యలకి , తెలంగాణ ఉద్యమానికి ఎంతో అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయం చంద్రబాబు కాని అయన దగ్గర ఉన్న వంధి మాగధులు కాని తెలుసుకోవలసిన విషయం.
ఇక్కడ వ్యవసాయం ఒక సమస్య గా ఉన్నదంటే కారణం ఇక్కడ ఉన్న బావులు, చెరువులు ఎండి పోవడం, నీటిని దొంగ తనంగా సీమండ్రుల పాలు చేయడం, జీవన విధానం విపరీతంగా దెబ్బతిని తిండికి కూడా లేకుండా వలసలు పెరగడం , ఉన్న పంట పొలాలను కమర్షియల్ అవసరాల కోసం వాడడం, పనికి ఆహార పధకాల వంటి విచిత్రమైన పధకాలు చిన్న కమతాలను కూడా సాగు చేసుకోకుండా నిర్వీర్యం అవుతున్న సందర్బాలు చూస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పొతే రైతు సమస్యలకు ప్రపంచీకరణ విదానలనుంచి మన నిర్లక్ష వైఖరి తోడై ఒక పెద్ద చాంతాడు అవుతుంది. అయితే ఇపుడు చంద్రబాబు నాయుడు, అయన చంద్ర దండు తోని, దండయాత్రలు చేస్తూ, ఇక్కడ ఉన్న చాతకాని నాయకులతోని సమావేశాలు పెట్టిన్చుకుంటూ, కేసీఆర్ ని, జాక్ లను నానా మాటలంటే రైతు సమస్యలు పోతాయనా అర్థం? ఏదైనా మత అనడానికి కూడా అర్హత ఉండాలి, ఆయనకున్న అర్హతలేమిటి? అసలు ఎలిజబిలిటి కూడ లేదు. పాపం ఎంత మీడియా కవరేజ్ ఇచ్చినా కూడా అక్కడ ప్రజలు ఉంటె కదా, కైకిలోల్లని పట్టుకొచ్చి కూసో పెడితే దానిని ఏమి యాత్ర అందురు?
ఆటు జగన్ ఆస్తులు పైనా ఆరా తీసినట్టు చేసి , ఏదో ఒక ఒప్పందాలు చేసుకొని నోరు మూయించిన ప్రభుత్వం, ఇటు బాబు ఆస్తులను కూడా వదలం బొమ్మాలి అని బెదిరించి అవిశ్వాస నాటకం ఆడించే దాక తీసుకొచ్చి మొత్తం తన వైపుకు తిప్పుకొంది. ఒకళ్ళ బాలాబలాలు ఒకరికి చూపించుకొని, శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు..నువ్వు నేను ఇపుడు యుద్ధం చేయవలసింది తెలంగాణ తోని మాత్రమె అని ఒక అవగాహనకు రావడం ఇపుడు స్పష్టంగా కనపడుతుంది. సీమాంద్ర దొరలకి, ఇటు తెలంగాణ దొంగలకి ఒక మంచి అవకాశం. కిరణ్ సర్కార్ చంద్ర బాబు ని తెలంగాణ ల తిప్పుతూ ఇక్కడి వాదనని బలహీన పరుస్తూ , ఇక్కడ ఉన్న ఏకైక పార్టీ పై బురద చల్లుతూ ప్రజల మధ్య ఐక్యతని దెబ్బ తీయడం ఒక్కటె అజెండా. అయినా ఇక్కడి ప్రభుత్వాలకి , ఇతర నాయకులకి ఒక్కటి అర్థం కావాలి, ఇక్కడి ప్రజలు నిప్పు రవ్వలు, అన్ని విషయాలు అందరికి తెలుసు, అన్ని బయట చెప్పక పోవచ్చు దానర్థం ఇంకా గొర్రెలే అనుకుంటే పొరపాటు.
తెలంగాణ ప్రజలు ఏండ్ల కొద్ది ఉద్యమాలు చేసి అలసి పోయి ఉన్నారు. ఇపుడా అపుడా అని ఎంతకైనా తెగించి పోరాడుతున్నారు. విలువైన ప్రాణాలను ఫణంగా పెట్టి ఎప్పటికైనా ఈ కరడు గట్టిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కళ్ళు తెరిపిద్దామని చేయని ప్రయత్నం లేదు. కాని ప్రతి చోట ఏదో ఒక అడ్డంకి తీసుకొచ్చి తెలంగాణని బొంద పెట్టే ప్రయత్నాలు నిరంతరం జరుగుతనే ఉన్నాయి. దీనికి ఇక్కడ ఉన్న ఏకైక పార్టీ మరియు ఇతర నాయకుల బలహీనతలు కూడా కారణం అనక తప్పదు. ప్రజలు నేడు అత్యంత రాజకీయ చైతన్యం తో ఉన్నారు..అసలు ఎందుకు చంద్రబాబు ఇక్కడ తిరగాల్సిన అవసరం ఏర్పడింది? ఏ మండలం లో ఎంత మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నారు, ఎందుకు అన్న విషయం పై మాట్లాడి పోరాడవలసిన బాద్యత మనకి లేక పొతే అవతలి వాడు అవకాశం గా తీసుకోడా? మనం వాళ్లకి మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నాం? మీరు ఫాం హుసే లో పడుకున్నారు అని మన ప్రాంతం వాడే అంటే అవును ‘ఉద్యమం లేదు కాబట్టి’ అని మన సమాధానం ఇవ్వడం ఎంతవరకు సబబు ? దీనిని ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చేసే చర్యలన్నింటికి అనేక సంఘాల వాళ్ళు బాద్యత వహిస్తున్నారు. ఇది క్షమించరాని తప్పుగా కూడా ప్రజలు వర్ణిస్తున్నారు.
మన ప్రాంతం సమస్యలను మనం పట్టించుకుంటే, ఇప్పటి ఈ ఉద్రిక్తలకి దారి తీసేది కాదు కదా..ఇట్లాంటి పరిస్తితులలోనే మనం చాల జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ సున్నిత మనస్కులు ఉంటారు, ఈ విషయం సీమంద్రులకు మొత్తుకొని చెప్పినా అర్థం కాదు, ఇక్కడ ఉన్న మన భజన పరులకి అర్థం కాదు. ఇక్కడి జిల్లా ఎస్పి ఎవరైనా నేతలను అడ్డుకుంటే క్రిమినల్ కేసులు పెడతాం అన్న ప్రకటన చూస్తె ప్రభుత్వం, బాబు ఎంత పకడ్బందీగా పధకం వేస్తున్నారో అర్థం అవుతుంది. మన వాళ్ళు అడ్డు పడక మానరు, పోలీసు వారు ఓవర్ ఆక్షన్ చేయక తప్పదు, నష్ట పోయేది మనమే. ఎవరి నేతలు? ఎక్కడి నేతలు? ఎక్కడ పర్యటిస్తున్నారు అది కూడా తెలంగాణని ఎడారి ప్రాంతం చేసిన వారే ఈ కల్ల బొల్లి కబుర్లు చెప్పితే వినడానికి సిద్దంగా లేరు తెలంగాణ ప్రజలు.
బాబు భజన పరులకి తెలంగాణ గురించి, ఇక్కడి నాయకుల గురించి మాట్లాడే హక్కు లేదు, తెలంగాణ పై స్పష్టమైన వైఖరి చెప్పకుండా ఇక్కడ సంస్కరణలు చేపట్టల్సినే అవసరం అంతకన్నా లేదు, ఇపుడు కావాల్సిన నినాదం ఒక్కటె మా ప్రాంతం, మా అధికారం, మా పాలన. ఇది మాట్లాడకుండా, ఇంకేది మాట్లాడినా తప్పవు యుద్ధాలు. టి కాంగ్రెస్ నేతలు కాని, టి టిడిపి నేతలు కాని ఇక్కడ తిరగడానికి అర్హత లేదు, వాళ్ల అధిష్టానం ని వొప్పించ లేని వాళ్ళు ఎం న్యాయం చేస్తారు?
ఇంక ఈ ప్రైవేట్ సైన్యాల యాత్రలకి ముగింపు పలికితే బాగుంటుంది. దానికి మన నాయకులు ఇక్కడి ప్రబుత్వాల మీద వత్తిడి తెస్తూ, ఇక్కడి ప్రాంత సమస్యలను యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టి పరిష్కార మార్గాలు వెతకాలి. జయశంకర్ సార్ టో సహా అందరూ మొత్తుకునేది అన్నింటికీ పరిష్కారం తెలంగాణ ఒక్కటె . దానికి కలిసి కట్టుగా ముందుకు పోయి సమస్యల పై మనమే పోరాటం చేయాలి.
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి
తెలంగాణ ఆటా పాటా !
అరవై ఏండ్ల తెలంగాణ ఉద్యమం, ఆత్మ గౌరవ తెలంగాణ ఉద్యమం, ఒక్కొక్కడిని గడగడ లాడించిన ఉద్యమం ఇప్పుడు అభాసు పాలవుతున్నది. ఒకవైపు ఆత్మహత్యల ఉద్యమంగా మారి గుండెల కలుక్కుమంటుంటే మరొకవైపు రాజకీయ నాయకులకి ఆట పాట అయింది. నేడు రాజకీయాలంటే ఒక పెద్ద జోక్ , ప్రజాస్వామ్యం అంటే ఒక హిపోక్రసీ, ఎన్నికలు అంటే నోట్లు గుమ్మరించి కాంట్రాక్ట్ లు చేత పట్టుకునే ప్రత్యేక పదవులు.
తెలంగాణ ఉద్యమ క్రమాన్ని ప్రపంచం నిశితంగా పరిశీలిస్తున్నదన్న జ్ఞానం కూడా లేకుండా, మార్కెట్ల పెడితే కనీసం పైసా కి కూడా అమ్ముడు పోనీ నాయకుల చేతిలో పడి ఈ ఉద్యమం గిలగిల కొట్టుకుంటన్నది. ఇది బయటోడికి తమాషా కాక ఇంకేమైతది. నిన్నటికి నిన్న ‘ఫలానా పార్టీ, క్షమించండి ఆ పార్టీ పేరు మతికి లేదు, ఒకాయన, వారెవరో ఎవ్వనికి తెల్వది నిన్నటి దాకా ‘ఉరితాడు’ ఆటా పాటా కార్యక్రమం చేసిండు. అది కూడా పబ్లిక్కుగా, అమర వీరుల స్తూపం దగ్గర, పెద్దగా ఉండాలని, ఇద్దరు కలిసి ఒక్కతాడుతోనే సావాల్నంట, ఎం దోస్తాన సారూ! ఒక కంచం, ఒక మంచం అని ఇన్నం కాని ఒక సావు , ఒక తాడు అని ఇంత వరకు ఇనలే. తమాషా! అంతా మజా! అయన ఒక పెద్ద తాడు తీసుకొని రావడం, ఆయనకు మద్దతుగా అయన ఫాల్లోవర్స్, దానికి దీటుగా తట్టుకోవడానికి టీ ఆర్ ఎస్ శ్రేణులు. వీరిని కాపాడడానికి పోలీసోల్లు. అన్నా! ఏమి జరుగుతాంది తెలంగాణాల? ఎవరు ఎవరిని చంపుకోవాలే? ఎందుకు? చస్తానని బెదిరించుడు, చావమని దేబిరించుడేంది? శ్రీకాంతా చారి ఎవరిని అడిగి, ఎవరికి చెప్పి, ఎవరి పర్మిషన్ తీసుకొని, ఏ వ్యాపార ప్రకటనలిచ్చి జైతెలంగాణ అనుకుంట అగ్నికి ఆహుతుడైండు? యాదయ్య ఎందుకు ఆగం అయిండు అందరి కండ్ల ముందట, వేణుగోపాల్ ఎవడు చూడని చోట మాడి మసి బొగ్గు ఎందుకయిండు? యాది రెడ్డి డిల్లీల పోయి పార్లమెంట్ గుమ్మం ముందు గుమ్మడి కాయ లెక్ఖ ఎట్ల శవమై వేలాడిండు? ఎవరు మొదలు పెట్టిన్రయ్యా ఈ మారణకాండ? ఎవడి స్వార్థాలకు బలైనరు మన పోరగాల్లంత? తెలంగాణా రాకపోతే సస్తమని ఎక్కడ మొదలైంది ఈ సావు కథ? ఎవరి పానాలు పొట్టనబెట్టుకున్నది, ఎవరి బెదిరింపులు బూటకపు సావు నాటకాలు సిద్దాంతాలై పత్రికల్ల పతాక శీర్శిక్లై ఆగని ఏక్తా కపూర్ సీరియల్ లెక్క వ్యాపర మైనాయి ? నాయకుల్లారా మీకు ఆట పాట, ధూమ్ ధామ్ లు అయినయా మా చావులు? అమర వీరుల స్తూపాలు మీకు వేదికలైనయా మస్తీలకి?
ఇంకొక వైపు మావోల్లు గోడకు వేలాడదీసిన తుపాకి కూడా మౌనంగానే ఉంటది అని ఒక డైలాగ్ డెలివరీ చేసింరు. ఏమి పోలిక? ఎక్కడి కథ? అవును ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఎప్పుడు అమ్ముల పోదిలోంచి బయటికి తీస్తరో ? ఇంతకీ మనం తుపాకిని హేళన చేసినట్టా? ఆ మాట అన్నోల్లని అవమానం చేసినట్టా? ఈ తుపాకి ఎప్పుడు పేలుతుంది అన్న? 2014 ల పెలుతుందా? లేకపోతె తుపాకి రామన్న, పిట్టల దొర తుపాకి లెక్ఖ మిగిలిపోతుందా అని కూడా మావోల్లు విరుచుక పడుతున్నారు. ఏం తమాషాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు? అరే బంగారం లెక్క ఒక్క అవకాశం వస్తే అస్సెంబ్లీల నోరుమూసుకున్న ఈ నాయకులా తెలంగాణ తెచ్చేది? కనీసం చాయ్ తాగనీకి అందరు కలిసి ఒక్కసారి బయటికి పోయిన గింత భయం వస్తుండే కదా? తెలంగాణ అడ్డం పెట్టుకొని, మైనింగులు, సెజ్జులు, సోలార్ పవర్ ప్లాంట్లు, ఆంద్రోల్ల తోని కలిసి వ్యాపారాలు చేసే నాయకులా తెలంగాణ గురించి మాట్లాడేది?
ఆటు కేంద్రం తన లెక్ఖలు తాను చూసుకుంటున్నది. నల్లారి నల్లి లెక్ఖ ఉద్యోగాల వల విసిరి విద్యార్థులు, ఉద్యమ కారులు బయటికి రాకుండా చేస్తున్నాడు. రాత్రిబగలు కష్టపడి చదివితే ఏమైంది? ఆంద్రోల్లు దొంగ చాటుగా దెబ్బ కొట్టి ఉద్యోగాలు కబ్జా చేస్తనే ఉన్నారు.. మల్లా మనోళ్ళు ఇక్కడ జోన్లకు అన్యాయం జరిగింది, తెలుగు మీడియం ఆగం అయింది, ఇది సీమాంద్ర ప్రభుత్వమే అని అరిగి పోయిన రికార్డ్ ఎస్తుంటరు. మోసం, దగా జరిగిందని నిస్పృహ రాగాలు తీస్తనే ఉన్నరు. అయేది అయితనే ఉన్నది, పోయేది పోతనే ఉన్నది. ఏ శాపనార్ధాల వల్ల, ఏ యాగాల వల్ల, ఏ కూనిరాగాల వల్ల ఏమి ఆగుతున్నది? ఎవరు ఆపగలరు ఈ అన్యాయాన్ని, ఇప్పటికైనా ఈ ఆటా పాటా ఆపి, సినెమా డైలాగులు పక్కన పెట్టి, అన్యాయాన్ని నిజంగా ఆపే పటిష్టమైన కార్యక్రమం చేపడితే బాగుంటది. ఏ సమస్యైనా ఎన్నికల వరకు ఆగాల్సిందేనా? ఎన్నికలు కాకుండా వేరే కార్యక్రమాలు లేవా తెలంగాణ ల ? సామాన్యులకు కావాల్సిన విషయాలపైన, సమస్యలపైన ఏమన్నా చేయగలమా? తెలంగాణ చేంబర్ ఆఫ్ కామర్స్ అని ఈ మధ్యనఏ కొన్ని ప్రత్యామ్నాయ వ్యవస్థలను మొదలు పెట్టిండ్లు. దీని గురించి వేరే రోజు చర్చిద్దాం. కాని దాని లెక్ఖనే ‘తెలంగాణ స్టేట్ సర్వీసెస్’ ఉద్యోగాల కొరకు కొట్లాడితే బాగుంటుందేమో. ఎక్కువ మంది ప్రజలకు పనికొస్తుందేమో.
నేను మాట్లాడితే కొందరికి కోపం వస్తున్నది. బాద అయితుంది అని ఫోన్లు చేసి మరి చెపుతున్నారు. తెలంగాన అన్యాయపు రాజకీయాల గురించి, ఆత్మ హత్యలను ప్రేరేపించే చేతల గురించి, కోల్పోతున్న వనరులు గురించి, ప్రజలు తమంత తాము చేపడుతున్న ఉద్యమాల పట్ల నాయకుల నిర్లక్ష్యం గురించి విమర్శించ కుండా ఇంకేమైనా చేయొచ్చు కదా అని బాదపడుతున్నారు. ఇప్పటి మా గోస ఎన్నికలకు , వోట్లకు పనికి రాకపోయినా మన ప్రజలకు , మన ప్రజల అస్తిత్వం కాపాడుకోనేందుకు, ఏదో కొంత మిగిలి ఉన్న అవకాశాలను, వనరలు కాపాడుకొనేందుకు చేస్తూన్న ప్రయత్నాలని మీరు ఇప్పటికైన గుర్తించాల్సిందే , ఈ ప్రజలే రేపెప్పుడో వోట్లెయ్యడానికి మల్లా పనికొస్తరని దయచేసి గమనించండి. ఏదో చేయొచ్చనే సలహాలు పక్కన ప్బెట్టి, ఉద్యమాలను బలపర్చండి.
మేము ఏ లేక్ఖలోకి వస్తమో తెలవదు కాని ప్రజల గొంతు వినిపించే బాద్యత అయితే తీసుకున్నాం. ఏ ప్రజలు? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కొట్లాడుతున్న ప్రజలు. ఏదో సాదించాలనే ఆశలు, నిరాశలకు బలైన బిడ్డలను కండ్ల ముందు బొంద పెట్టుకున్న ప్రజలు. మా గొంతు గిట్లనే ఉంటది, మా బాద సురుక్కు మంటది. తెలంగాణ ఉద్యమాన్ని మాత్రం మంట గలపకున్రి, మజాక్ చేయకున్ద్రి, ఇపుడు మాటలకు, మౌనాలకు టైం కాదు, ఓన్లీ ఆక్షన్! ఆక్షన్ ఆన్ ది గ్రౌండ్.
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి
హిస్టరీ రిపీట్స్! మరొక విద్రోహ దినం!
తెలంగాణా ల ఒక్కటె ‘దినాల’ హడావిడి, కెసిఆర్ దీక్షా ‘దినం’ నుంచి, చిదంబరం ప్రకటన, అయన వెనకకి తీసుకోవటం వగైరా, వగైరా. తెలంగాణ చరిత్ర అంతా చూసినా మోసాలు , ద్రోహాలు , విద్రోహాలు కాకపొతే ఏమున్నది? ఒకవైపు నెత్తురోడుతున్న, ఎండిపోయిన, బీటలు వారిన తెలంగాణ కళ్ళ ముందు కనపడతనే ఉన్నది. ఎటు దిక్కు చూసినా కాలిన శవాల ముక్క వాసన, ఏడ్చి ఏడ్చి వట్టి పోయిన కండ్లు, అవిసి పోయిన గుండెలు..ఎన్ని విద్రోహాలు లెక్ఖ పెట్టుకోవాలే 1956 విలీన దినం కాడినుంచి? ఎన్ని తద్దినాలు జరుపుకోవాలే 1969 నుండి ఇయ్యాల్టి దాక? అప్పటి విద్రోహాల కారణంగా అడవుల్లో కలిసి పోయి అదివాసీలకి అన్నలై, అక్కలై నేడు దేశ నాయకులై, ఏరోజు ఏ రూపంల పానాలు పోతాయో తెలవక విప్లవాలకు కేరాఫ్ అడ్రస్ గా మారినారు కొందరు. అప్పటి ఉద్యమాల చరిత్రలకి జోహార్లు! కనీసం విలువైన పానాలు తీసుకొని పిరికివాల్లుగా ముద్ర వేసుకోలే ఎవరు. వారిని వదిలేస్తే, మరొక వైపు తిననీకి తిండి లేక, కుటుంబ పోషణ కోసం, పొట్ట చేత పట్టుకొని దేశ దేశాలు, రాష్ట్రాల కు పోయి శవాలు కూడా వస్తాయో లేవో తెలవకుండా ఉన్నారు. అసలు అందరి కి ఉన్న అనుభవాలు, కళ్ళముందు తరలి పోతున్న వనరులు, తెలంగాణ భాషా, సంస్కృతీ అన్ని చూసుకుంటే 365 రోజులు సరిపోతాయా మనకి విద్రోహ దినాలు జరుపుకోనికి ? ఒక్కసారి మనం వాటిని దినంగా జరుపుకోవడం మొదలు పెడితే అవి పునరావృతం అయితనే ఉంటాయి ‘శత జయంతి ఉత్సవాలలాగ’.
చంద్ర బాబు నాయుడు తెలంగాణ ల రైతు యాత్ర, అయన కి ఒక జైత్ర యాత్ర లాగ ఉన్నది, నిన్నటికి నిన్న మా జాక్ నాయకుడు, ఆయనని ఏమనకున్ద్రి, చచ్చిన పాముని మనమెందుకు పట్టించుకోవాలే అని ముచ్చట చెప్పిన్రు. కాని పిచ్చి తెలంగాణ ఉద్యమ కారులకి ఎట్ల అర్థమైతది? బిడ్డలను పోగొట్టుకొని, బతుకులను కొల్లగోట్టినోల్లు కళ్ళముందు తిరుగుతాంటే కడుపుల మండ కుండ ఉంటదా? అట్లనో, ఇట్లనో అడ్డం పడతానే ఉన్నారు. ఈ తల్లికి ద్రోహం చేసినోడిని ఎట్ల తిరగనిస్తం అని తిరగబడతనే ఉన్నారు. ఇంత పెద్ద నాయకులు, మేధావులు ఉన్నారు ఒక్క చిన్న విషయం ఎందుకు సమజ్ ఐతలేదో, విద్రోహ దినాలు జరుపుకునే బదులు ద్రోహులను తరిమి కొట్టే పనిని చేపడితే తెలంగాణ అంతా కలిసి ఒక్కతాటి పైకి రాదా? ఇపుడు మనం ఆటు వైపు అడుగులు వేయకూడదు అని హై కమాండ్ ఆర్డర్. దాని పేరు శాంతి మంత్రం, యంత్రం. అవును దొరా, నీ ముల్లెం పోయింది, నీ బిడ్డలకేమైంది చెప్పు?
కేవలం ఎలక్షన్లపుడు మాత్రం బయట కనపడటం, అపుడే గర్జిస్తాం, గాన్డ్రిస్తాం. ఉద్యమాన్ని ఎలక్షన్ల చుట్టూ తిప్పనీకి ఇన్ని పానాలు ఎందుకు తీసుకున్నారు మన పిచ్చోళ్ళు? అవును తెలంగాణ అంతా త్యాగాల మయం కదా, రేపు కవులు కళాకారులు చెప్పుకొని మురవద్దు? ఇదే అమాయకత్వం మీద త్యాగాల మీద మా నాయకులు గెలవద్దా? శవాల మీద పేలాలు ఎరుకోవద్దా? మల్లా విరామం, అయన మౌనం తుఫాను ముందు ప్రశాంతం అని అయన వారసులు, రాజ్య బటులు సెలవిస్తారు. జీ హుజూర్ ! అని మనం వినమ్రంగా నమ్ముతాం.
అసలు ఎక్కడైనా ఒక సమస్య తీవ్రంగా ఉన్నపుడు అనేక సంఘాలు అనేక రకాలుగా పని చేయడం చూస్తాం, కేవలం తెలంగాణ విషయంలో మాత్రమె ‘అన్న సై అంటే సై ‘ నై అంటే నై ‘ అంతే, కేంద్రం కనుసన్నలలో ఉద్యమం,
సిగ్గులేని నాయకత్వం. ఇపుడు మళ్లీ ఉప ఎన్నికల్లో ఒక్కసారి విద్యార్థులు, ఉద్యమ కారులు అందరు జై తెలంగాణ అని ఒక్కటె హడావుడి చేస్తారు. ఏమ్చేస్తం, మళ్ళా గెలిపిస్తాం. మళ్లీ వ్యూహాత్మక మౌనం, కొద్ది రోజులైనంక 2014 ఎన్నికలు, మల్లా షురూ, జై బోలో తెలంగాణ! వీడిని గెలిపించండి, వాడిని గెలిపించండి. ఇంక మనం పొత్తు పెట్టుకోనిది ఒక్క జగన్ సార్ తోని మాత్రమె, ఆయనతో పొత్తు పెట్టుకుంటే అన్ని పార్టీలు అయిపోతాయి. మీ రక్తంలో తెలంగాణ ఉంటె ఫలానా వాడినే గెలిపించండ్రి. తరువాత ఏమైతది అన్నా అని అమాయకంగా అడుగుతాడు మా రైతన్న, అప్పటికి ఏ భూమి ఉండదు అనుకొండ్రి అది వేరే విషయం, ఏముంది ఇవాళ బాబు యాత్ర చేస్తే రేపు జగన్ చేస్తడు గంతే. ఒక్కొక్కడికి ఒక్కో దండు, మనం మాత్రం శాంతి శాంతి అనాలే.
జరుపుకోండి, మరొక దినం జరుపుకోండి. చరిత్రలో ఏ ఒక్క పేజి వదల కుండా విద్రోహదినాలు నిమ్పుకోండి , పెన్నులల్ల ఇంకు ఖాళి అయిందాక రాసుకోండి, గొంతులు నొప్పి పుట్టే దాక మొత్తుకొండి కాని వాటికి కారణాలు వెతక్కండి, వాటి వెనుక ఉన్న వాళ్ళని పట్టుకొనే ప్రయత్నం చేయకండి. అవి మళ్లీ పునరావృతం కాకుండా బుద్ధి చెప్పే పనుల జోలికి పోకండి. ఉద్యమాన్ని అంతా ఎన్నికల గడిలో పెట్టి వేలం వేయండి. ఇప్పటికి పోయిన పానాల బలిదానాలు సరిపోక పొతే మరిన్ని పానాలు ఇయ్యనీకి ఈ ఎర్రి మొఖాలు ఎపుడు సిద్దంగానే ఉంటారు మరొక కొత్త డ్రామాకి తెర తీయండి.
అతి తొందరలో ప్రజలు మూడో కన్ను తెరిచి విద్రోహ దినాల కై కాకుండా, ఇంటి, బయట ద్రోహులను పట్టుకొని వాళ్ల భరతం పడతారని ఆశిస్తూ..అపుడు మాత్రమె తెలంగాణ ఉద్యమానికి ఒక సార్థకత , తల్లి తెలంగాణకి విముక్తి ..కాదంటారా ?
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి
నాయకుడు(లు) కనపడుట లేదు
పార్లమెంట్ సమావేశాలు, వాడి, వేడి చర్చలు, సస్పెన్స్ థ్రిల్లర్ లు అన్ని అయిపోయినాయి. పాపం చలి ఎక్కువైందో ఏమో కాని, కాంగ్రెస్ నాయకులు కాని, తెలంగాణ మెసయ్య లు కాని కనిపిస్తలేరు డిల్లిల. నళినీ దగ్గరికి పోక పొతే పోయిరి కనీసం పార్లమెంటుల కూడ కనిపిస్తలేరు. కొత్తల తారా జువ్వలా దూసుక పొఇనరని పదే పదే అయితే టీవిల చూసినం. ఇపుడు ఆ జువ్వలు, రవ్వలు ఏమైనాయో.. నిన్నటినుంచి మళ్లీ కొత్త డిస్కవరీ పేపర్లలో మరియు టీవీలలో “కాంగ్రెస్ మళ్లీ మోసం చేసింది”, వాళ్ళు ఏమ్చేస్తారో, ఎడుంటరో ఇక్కడి పోలీసులకి కాని, డిల్లి పోలీసులకి కాని తెల్వదనుకుంట . విషయం తెలుసుకోవడానికి ఎన్ని వందల ఏళ్ళు అవసరం, ఎన్ని ప్రాణాలు అవసరం..ఉన్న ఉద్యమాన్ని నిలబెట్టుకోలేక , కేంద్రాన్ని కాళ్ళ దగ్గర తెచ్చుకొనే దమ్మున్న ప్రజా ఉద్యమాలని కాపాడుకోలేక పోయిన మీ చేతకాని తనాన్ని చూసి సిగ్గుపడుతున్నాం. ఎవరిని అని ఏమి లాభం..మన బంగారం మంచిగుంటే ఇన్ని తిప్పలు ఎందుకు? అసలు కాంగ్రెస్ ఇస్తదని ఎవరైనా ఎపుడైనా కలలు కన్నారా? కనీసం కాంగ్రెస్ నాయకులకు లేని నమ్మకం మనకు ఎందుకు? డాట్ ఇస్ పొలిటికల్ గేం!
తెలంగాణ ఎపుడు బంగార్ బాతు గుడ్డే, ఈ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలే. మళ్ళా చూస్తూ చూస్తూ ఉప ఎన్నికలు రానే వచ్చినాయి..ఇంకేముంది, జై తెలంగాణ! పోయే భూములు, ఉద్యోగాలు, పోలవరాలు,పోలేపల్లి లు ,కుంతాల ప్రాంత ఆదివాసీల వెతలు, ఆదిలాబాద్ కవ్వాల్ టైగర్ పార్కులు, మైనింగ్ మాఫియాల కబంద హస్తాలు, వందల కొలది గ్రామాల వలసలు..ఏవి ఆగవు భై, ఓన్లీ జై బోలో తెలంగాణ! వోట్ మారో, సీట్ దేవో..హం అప్నా జాన్ భి దేదేన్గే అవుర్ ఖూన్ భి..పర్ తుం రహో చుప్ చాప్. నిన్నటికి నిన్న చంద్రబాబుకు ఒక సవాల్ విసిరినారు మావోల్లు, కావాలంటే మేము ప్రత్యక్షంగా పోలవరాన్ని అడ్డుకుంటాం, నువ్వు ఏమ్చేస్తావ్ అని..అరే, వీళ్ళు పోలవరాన్ని అడ్డుకోవాలంటే చంద్రబాబు నాయుడు కావాలన్న ఒక్క విషయం మా ప్రజలకు తెల్వక పాయె. ఇప్పటికైనా అది ఒక సవాల్ మాత్రమె యువర్ ఆనర్! మేము నిద్ర లేచే సరికి పోలవరం కట్టడం పూర్తీ అయి, ఆదివాసీలు, అడవులు గోదావరిలో కలిసి , వాళ్ల రక్త మాంసాల రూపంలో ఆంధ్ర ప్రాంతానికి తరలి వెల్లుతుంటాయి, ఇన్నెండ్లుగా జరిగింది అదే, ఇక ముందు జరిగేది అదే. చాల సింపుల్ అన్న, సదువుకున్నోడు అమెరికాకి, లండన్ కి , సదువు లేనోడు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి కి(మా నాయకుడి డైలాగ్) అన్నకి అన్ని తెలుసు అదే బాద. ఒక్క తెలంగాణ వచ్చిందాకా మీరు చెప్పిందే ఇనాల్నే..బాంచన్ దొర! ఏమ్చేస్తం! మా ఖర్మ కాలి ఇట్లున్నం కాని ఇన్ని పానాలు పోగొట్టుకొని, జైళ్ళల్ల పడి, రోడ్ల మీద పడి నా కూడా తెలంగాణ రాక పాయె.
మా అన్న తమ్ముళ్ళు చంద్రబాబుని అడ్డుకొనేందుకు పోయి బొక్కలిరగ్గోట్టుకున్తున్రు. చంద్రబాబు తెలంగాణాల ఎట్ల తిరుగుతాడు? లగడ పాటి కంటే వారు ఏమి తక్కువ? దీని గురించి ఎవడు ఎందుకు మాట్లాడడు? చంద్ర దండు అనే ఒక సీమాంద్ర సైన్యం, పక్కన ఒక ప్రకాష్ నాయుడు అని టీ షర్ట్ల మీద బాజాప్తా వేసుకొని తెలంగాణాల తిరుగు తుంటే..పుండు మీద కారం చల్లినట్టు కాదా మావోల్లకి ? తన్నులు తినక చస్తారా? ఎవడికి ఏమి సిగ్గు, శరం వస్తలేక పొతే ఇంకెక్కడి తెలంగాణ! నువ్వు నేను భాయి భాయి అనుకుంటర లోపట లోపట? వాడి ఆఫీసుల వారు , మీ ఆఫీసుల మీరు ప్రెస్ మీట్ లు పెట్టుకుంటే గుక్క తిప్పుకోకుండా తిట్టుకుంటే తెలంగాణ వస్తదా? నిన్నటికి నిన్న ఖమ్మంల లోక్ సత్తా నాయకుడిని అడ్డుకోవడానికి పోయి మళ్లీ తన్నులు తిన్నరు, ఎన్నేండ్లు? ఎన్ని రోజులు? ఒక పార్టీ ఉంటె, ఒక నాయకుడు ఉంటె ఇట్లా దిక్కులేకుండా ఎందుకైతరు మావోల్లు? ఇన్నికోట్ల మంది ఆ నాయకుడి వెనుక ఉన్నారంటే కేంద్రం గజ గజ లాడాల కదా? కేంద్రం పక్కన బెట్టున్రి కనీసం చంద్ర బాబు కాని, కాంగ్రెసోళ్ళు కాని, చివరాఖరికి లోక్సత్త కూడ భయపడక పాయె, ఎక్కడ తప్పు జరుగుతుంది? విమర్శిస్తే మంచి వాళ్ళం కాదు సరే మరే పొగడటానికి ఏమున్నాయి మాముందు యువర్ ఆనర్! మీరు తెలంగాణ తేకపోతే మాయే కనీసం మా వనరులని కాపాడండి, ఈ దోపిడిని ఆపండి..ప్రజల పక్షాన నిలబడి పోరాడండి..అది కూడా చేయకపోతే ఏమ్చేయాలే. ఏండ్లు గడిసే ఒక్క ఇంచు భూమి అన్నా ఆపిన్రా నాయకులారా?
బిడ్డలను పోగొట్టుకున్నాం, విద్యార్తుల జీవితాలని బలి తీసుకున్నాం, కొన్ని వందల, వేల గుండెలు బాదతో మండుతున్నై, ఈ ప్రజాస్వామ్యం అనే భావన మంట గలుస్తోంది. అసలు మేము మీకు వోట్లు ఎందుకేయాలే? కనీసం మీ రాజీనామాలు కూడా ఆమోదిమ్పచేసుకొని వాళ్లకు మా విలువైన వోటు ఎందుకు వేయాలి? మీకు కట్ట బెట్టిన పదవులు మాకోసం కాదు కదా? అసలు మొత్తం రాజకీయ నాయకులని తీసుకపోయి సినిమాల్ల పెడితే ఇప్పటి హీరోలు పనికి వస్తార? స్క్రిప్ట్ రైటర్లు లేకుండా డైలాగులు, డైరెక్టర్లు లేకుండా యాక్షన్లు,స్టంట్ మాస్టర్లు లేకుండా త్రిల్లర్లు..వద్దులే సార్లూ అక్కడ ఉన్న ఉద్యోగాలు అన్ని పోతాయి. మాకు తెలుసు మీకేట్లాగు కొత్తవి తెచ్చే దమ్ము లేదని. మీతోని పని చేయించుకొనే హక్కు లేనపుడు మాకు వోటు వేసే అధికారం కూడా లేనట్లే. ఈ ప్రజాస్వామ్యం ప్రజల కొరకు పని చేసినపుడు మాత్రమె వోటు వేస్తాం లేదంటే మీరు చేసిన ప్రతిజ్ఞలు, డైలాగులు అమలు పరచ లేనపుడు మేము మిమ్మల్ని పదవులనుండి దిమ్పగలిగినపుడు, స్వచ్చ మైన నాయకులు దొరికినపుడు అపుడు వోట్లు వేస్తాం..ఈ చాతకాని దద్దమ్మల కోసం మా సమయం, జీవితం వృధా చేసుకోము..చేసుకోము కాక చేసుకోము.
జర నిద్ర లేవండి నాయకులారా! మేధావులారా, జర నాయకులని లేపండి..ప్రజలు మీ పైన వెయ్యి ఆశలతో ఉన్నారు, మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ మెజారిటీ తోని గెలిపిస్తారు , ఏమి బాద పడకండి..ప్రజల నమ్మకాలను నిలబెట్టండి. బర్రెలు చేలల్లో బడి మేస్తుంటే మాత్రం చూస్తూ కూకోకండ్రి..పంట నాశనం కాకముందే లేవండి..కుంభ కర్ణులారా లేవండి!
సుజాత సూరేపల్లి
Filed under Dr. Cheraku sudhakar, kcr, Polavaram, Polepally, political parties, Politics, Telangana, telangana movement, telangana political parties, trs | Comment (0)ఆదివాసి కళాకారుడు జితేన్ కి తప్పిన ఉరి!
జితేన్ మరాండి కి ఉరిశిక్ష రద్దు అయింది, అతనితో పాటు మరో ముగ్గురికి కూడా బెయిల్ వచ్చినట్టు వార్త నిజంగా హర్షించ దగినదే. జితేన్ మరాండి, ఝార్ఖండ్ లోని ఒక ఆదివాసి , జానపద కళాకారుడు. ‘జార్ఖండ్ అభేన్’ అనే సాంసృతిక సంస్తతో ఉండి ఆదివాసీ హక్కుల కోసం గళం విప్పుతున్న యువకుడు. అతను ముఖ్యంగా రాజ్య హింసకు వ్యతిరేకంగా, మంట గలుస్తున్న మానవత్వానికి, మాయమౌతున్న అడవులకి, ఖనిజాలకి , అంతరిస్తున్న ఆదివాసీలకి , ఆకలి కేకలకి ఆట, పాటకట్టి ఆదివాసీలను తట్టిలేపుతున్నకళాకారుడు. . రాజకీయ ఖైదీల విడుదల కమిటీలో ఒక ప్రతినిధి. కొత్తగా ఏర్పడిన జార్ఖండ్, చత్తీస్గర్ వంటి ఆదివాసీ రాష్ట్రాలలో పాగా వేసిన జాతీయ, అంతర్జాతీయ కార్పోరేట్ కంపనీలకి బలి అయితున్న ఆదివాసీలకు అండగా నిలబడుతున్న గొంతు జితేన్ మరాండి. ఆదివాసీ భూముల వెనుక ఉన్న విలువైన ఖనిజాలకోసం అడవులను, ఆదివాసీలను చిద్రం చేస్తూన్న సంస్తలకి అండగా నిలబడ్డ ఈ దేశ ప్రభుత్వం తాను రాసుకున్న రాజ్యన్గాన్నే తుంగలో తొక్కుతుంది అని చెప్పడానికి ఈ అమాయకుడికి పడ్డ శిక్ష ఒక ఉదాహరణ.
ఈ సంవత్సరం జూన్ 2011 నా ఈ ఆదివాసీ యువకుడికి మరియు ఇంకా ముగ్గురికి జార్ఖండ్ లోని గిరిధి కోర్ట్ ఉరిశిక్ష విధించింది. ఈ వార్త వినగానే అనేక హక్కుల సంఘాలు, న్యాయం కోసం పోరాటం చేసే వ్యక్తులు, సంస్థలు ఒక్క సారిగా కలవర పడ్డాయి. బహుషా దేశం లోనే ఒక ఆదివాసీ అమాయక యువకుడు, అందునా జానపద కళాకారుడికి పడిన మొట్ట మొదటి ఉరిశిక్ష ఇది. దేశం మొత్తం మీద జితేన్ మరాన్డికి ఉరిశిక్షను రద్దు చేయండని ప్రజలు ఉద్యమాలు లేవ దీసారు. కొన్ని రోజుల క్రితం డాక్టర్ వినాయక సేన్ కి కూడా ఇట్లానే దేశ దేశాల నుండి మద్దతు లభించడం తో సుప్రీం కోర్ట్ బెయిల్ ఇవ్వక తప్పలేదు.
ఈ ఉరిశిక్ష వెనుక పోలీసు వారి నాటకీయత, మైనింగ్ వారి కుట్రలు మరియు ఒక హుక్కుల కార్యకర్తను హతమార్చే రాజ్యం యొక్క నైజం దాగి ఉంది అని చెప్పడానికి ఏమి సందేహం లేదు. 26th అక్టోబర్ 2007 నాడు చిల్కారి అనే గ్రామంలో జరిగిన హింసాకాండలో దాదాపు ఇరవై మంది చనిపొయినారు. అందులో ఝార్ఖండ్ ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి కొడుకు అనూప్ మరాండి కూడా చనిపోయినాడు. దీని వెనుక నక్షలైట్లు ఉన్నారనే అనుమానంతో పోలీసు వారు ఎవరినో ఒకరిని అర్రెస్ట్ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు. అంతలో అక్కడి రాంచి లోని ప్రభాత్ ఖబర్ అనే దిన పత్రిక 29th అక్టోబర్ నాడు దోషులను పట్టుకున్నట్టు ఒక ప్రకటన చేసి, జితేన్ మరాండి అనే పేరుతో ప్రచురించి, అదే పేరున్న ఈ కళాకారుడి ఫోటో కూడా వేసింది. అయితే తండ్రి పేర్లు మాత్రం ప్రచురించ లేదు. మరుసటి రోజు అదే పత్రిక తాము ప్రచురించిన జితేన్ మరాండి, దోషి ఒకరు కాదని కాని పేర్లు ఒకటే ఉన్నాయని కూడా సర్ది చెప్పుకుంది. అయినా కూడా ఒక సంవత్సరం తరువాత 5th ఏప్రిల్ 2008 నాడు జితేన్ మరాండి ని పోలీసు వాళ్ళు ఒక ర్యాలీ నుండి వస్తుండగా అర్రెస్ట్ చేసారు.
నిందితుడి జితేన్ మరాండి ఆక శామ్లాల్ కిష్కు , నియమగిరి జిల్లా , తొసఫులి గ్రామానికి చెందిన వాడు కాని కావాలని ఈ హక్కుల కార్యకర్త, జితేన్ మరాండి పేరు కూడా ఒక్కటి కావడం తో ఇతని తండ్రి పేరు బుధ మరాండి అయినా కూడా అర్రెస్ట్ చేయడం జరిగింది. ముఖ్య మంత్రి బాబులాల్ సోదరుడు నునులాల్ మరాండి ఇచ్చిన పిర్యాదు తో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినారు. దీని వెనుక మైనింగ్ మాఫియ హస్తం కూడా ఉందని స్తానికుల మరియు అనేక మేధావుల, సంస్థల అభిప్రాయం. జితేన్ మరాండి తన గళంతో , సాంస్కృతిక ప్రదర్శనలతో ఆదివాసీలను రాజ్య హింసకి వ్యతిరేకంగా, అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజ పరుస్తూ ఉండడం, దాని ద్వారా ఆదివాసి ఆకలి కేకలకు రెక్కలొచ్చి చైతన్య వంతులవడం గిట్టని ఝార్ఖండ్ ఈ అవకాశాన్ని విడుచుకో దలచు కోలేదు, తనకు ఉన్న బలాన్ని, ఉక్కు పాదాన్ని, ఈ అమాయకుడి మీద మోపింది. పోలీసులు ఓవర్ ఆక్షన్ అంతా కూడా ఇక్కడే ప్రదర్శించడం జరిగింది.
నాకు అన్యాయం జరిగింది, నేను నిర్దోషి అని జితేన్ మరాండి పత్రిక ముఖంగా కూడా ఒక ప్రకటన ఇచ్చాడు, అతని భార్య అపర్ణా మరాండి, రెండేళ్ళ కుమారుడు అలోక్ మరాండి తో పాటు అనేక కార్య క్రమాలలో పాల్గొని తన భర్త నిర్దోషి అని, తమకు న్యాయం చేయండని అబ్యర్దించింది. దీనికి ఎపిసిఎల్సి, విరసం వంటి సంస్థలు అండగా నిలిచినాయి.ఇంకా దేశంలోని అనేక మానవ హక్కుల సంఘాలు కూడా జితేన్ మరాండి నిర్దోషి అని, అతనిని విడిపించాలని అనేక ప్రయత్నాలు మొదలు పెట్టినాయి. ఈ నెల డిసెంబర్ ఇరవైన రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కూడా పెద్ద ఎత్తున ఒక సమావేశం నిర్వహించ తలపెట్టింది డిల్లీలో.
ఈ మధ్య కాలంలో హక్కుల కార్య కర్తల మీద, ఉద్యమ కారుల మీద నాన్ బెలబుల్ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టి ప్రభుత్వం ప్రజలను భయపెట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అదులో భాగంగానే తెలంగాణ ఉద్యమ కారుడు చెరకు సుధాకర్ పై కూడా నాసా వంటి కేసులు మోపింది. ఇంక మైనింగ్ మాఫియ చేతిలో చిక్కుకున్న ప్రాంతాలకి అండగా నిలచిన సంస్తలని , వ్యక్తులని మావోఇస్టులనే నెపం తో అనేక విధాలుగా హింసిస్తుంది.సల్వా జుడుం లాంటి సంస్తలని శ్రుష్టించి, ఆదివాసీల మధ్య చిచ్చు పెట్టి, గ్రీన్ హంట్ లాంటి పధకాలతో ఉద్యమాలను అణచి వేయాలని చూస్తుంది. ఈ మధ్య కాలంలో పాశవికంగా కిషన్ జి ని హత్య చేసిన మమతా బెనర్జీ, చిదంబరం, మన్మోహన్ అండ్ కో కి దేశ వ్యాప్తంగా వెల్లువడిన విమర్శలను తట్టుకోలేకనో లేకపోతె జితేన్ మరాండి కి ఉరిశిక్ష వేస్తె ప్రజలు ఇంక తమని క్షమించరని అనుమానం వచ్చో కాని నేడు ఒక అడుగు వెనక్కి జేతెన్ మరాండి, అతనితో పాటు మరో ముగ్గురిని నిర్దోషులుగా పేర్కొని బెయిల్ మంజూర్ చేసింది.
ప్రజలు తమకు న్యాయం కావాలని కోరుతున్నారు, తమ బ్రతుకులు తాము బ్రతుకుతాం కాని ఎటువంటి అభివృద్ధి పేరుతో మా జీవితాలను, భూములను నాశనం చేయకండని ఆదివాసీలు ఉద్యమాలు చేస్తున్నారు. పర్యావరణం, పులులు, సింహాలు అని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం బహుళ జాతి సంస్థలకు కాపు కాస్తూ ఆదివాసీల బ్రతుకులను అడవి బయటకు నెట్టేస్తూ, వారి జీవన విధానాన్ని, సంస్కృతిని సమూలంగా నరికి వేస్తుంది. ఈ నరమేధం ఆపక పొతే, విలువైన అటవీ సంపదే కాకుండా అతి ప్రాచీన మైన మానవ జాతిని కూడా మనము పోగొట్టు కుంటాము.
అడవి బిడ్డలకి అన్నలు, అక్కలే కాదు సమాజం మొత్తం కూడా అండగా నిలబడి అన్యాయాన్ని ప్రస్నించాలి లేకపోతె కొంత మంది నిస్వార్దంగా సేవ చేసే బ్రతుకులు బలి అయితాయి. ఇవే ప్రభుత్వాలు ఏదో ఒక రోజు మనమిద కూడా అభివృద్ధి బాణాలు ఎక్కుపెట్టి మన జీవితాలని కూడా బలి పెట్టి, మన దేశంలో మనమే పరాయి వాళ్ళు గా ఉంటూ లేదా దేశం విడిచి పోయేలా చేసే అవకాశం ఉంది.
జితేన్ మరాండి గళం లో జల్, జమీన్, జంగల్ నినాదం అయి మనం కూడా ఆదివాసీలకు అండగా నిలబడదాం..ఈ దేశంలో రాజ్యాలకు, సామ్రాజ్య వాద శక్తులకు ప్రజా ఉద్యమాల బలాన్ని చూపెడదాం! ఈ దేశం మనది, ఎన్నో పోరాటాల ద్వారా స్వతంత్రం సాధించుకున్నది మళ్లీ మరో రూపంలో వస్తున్న సామ్రాజ్య సక్తులకి అమ్ముడు పోవడానికి కాదు. అడవులు ఆదివాసిలవి..వారికి జీవించే హక్కుని కాల రాస్తున్న ప్రభుత్వాలని, ప్రైవేట్ కంపెనీలను, వారికి అండగా నిలబడుతున్న రాజకీయ నాయకులను, ఉద్యమ కారుల ముసుగులో ఉన్న లంపెన్ నాయకులను నిలదీద్దాం!
సుజాత సూరేపల్లి
Filed under death sentence, jharkhan cultural activist, jiten marandi, mining mafia | Comment (0)నళినీ దీక్ష కు గుర్తింపు ఏది?
తెలంగాణ ఉద్యమం ఏదో ఒక రూపంలో ముందుకు పోతూనే ఉంది, అందుకు ఉదాహరణ డిల్లీలో నళినీ దీక్ష. ఇక్కడ ప్రతి రోజు వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అనేక కార్యక్రమాలు. నళిని ని ఒక స్త్రీ గా గౌరవించడమే కాదు, ఆమె ఒక ఉన్నత మైన పోలీసు పదవి వొదులుకొని ఒకడుగు మన చాలామంది నాయకులకంటే ముందుగానే ఉంది. మరో వైపు వంద సంవత్సరాలకు దగ్గరపడుతున్న కొండా బాపూజీ గారి దీక్ష. ఎందుకు వీరిని అంటరాని వారుగా చూస్తున్నాం? ఇక్కడా కాదు అక్కడ కాదు ఏకంగా దేశ రాజధానిలో, చలిలో, ఈ గుడ్డి, చెవిటి, కుంటి అసలు మెదళ్ళు లేని ప్రభుత్వాలకు ఏమైనా కనిపిస్తుందేమో అని ప్రాణాలకు తెగించి దీక్ష చేస్తున్నారు. మన తెలంగాణ ఉద్యమం ఎట్లాగూ నేషనల్ మీడియా దృష్టికి పోదు మరి ఇక్కడి టీవి చానాళ్ళ సంగతి సరే సరి. అంతకన్నా విడ్డూరం ఇక్కడి తెలంగాణ నాయకులకు వీరి దీక్ష గురించి పట్టించుకోక పోవడం. దీనిని కులం దృష్టిలో చూదాలంటారు సామాజిక తెలంగాణ వాదులు, కాదు జెండర్ దృష్టిలో చూడాలి అని మా స్త్రీ వాదులు, ఇవి రెండూ కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని కేవలం ఒక పార్టీ, ఒక కుటుంబం, ఒక కులం కి మాత్రమె ఆపాదించాలి అంటారు విజ్ఞులు. ఇందులో దేనికి మన వోటు?
తెలంగాణ ఉద్యమానికి ఎవరు ఏ రూపం లో ముందుకు వచ్చినా మద్దతు ఇవ్వాల్సిన బాద్యత అందరిది అని కోమటి రెడ్డి దీక్షలో గొంతెత్తి చెప్పిన పెద్ద పెద్ద నాయకులు ఎవరూ ఇపుడు నళినీ చుట్టూ కనపడట్లేదు. ఆయనంత గొప్ప త్యాగ శీలి లేడని డబ్బా కొట్టిన వారు ఇపుడు ఏమోహం పెట్టుకొని మాట్లాడతారు? అసలు కాంగ్రెస్ వాళ్ల దగ్గరికి పోవడానికి సిగ్గు లేదా? కొండా బాపు లక్ష్మన్ జి గారు ఫలానా పార్టీ చేతిలో కీలు బొమ్మ అయి వాళ్ళకే సప్పోర్ట్ చేస్తున్నాడు అని ఆయనకి ఒక బ్రాండ్ వేసి పెట్టినారు. అసలు అయన వెనుక ఎవరున్నారో అనే అడిగే హక్కు ఎవరికుంది? ఇక్కడున్న సొక్కమైన నాయకులు ఎవరు? గొంతులు కోసుకుంటాం, ప్రాణాలైనా అర్పిస్తాం అన్న వారు ఏరి? వందల మంది ప్రాణాలు బలి తీసుకున్న పాపం ఎవరిదీ? వాళ్ల చావులకు బాద్యత ఎవరు తీసుకుంటరు? మరి మన తెలంగాణ నాయకుల వెనుక ఎవరున్నారని సకల జనుల సమ్మె ని నిర్దాక్షిణ్యంగా ఆపేసి, పార్లమేన్టుని స్తంబింప చేస్తామని ప్రగల్భాలు పలికి ఇపుడు 2014 లో లెక్ఖలు చూసుకుందాములే అని నిమ్మలంగ ఉన్నరు? ఒక ఆడపిల్ల, తెలంగాణ కోసం అత్యున్నతమైన పదవి వొదులుకొని దీక్ష చేస్తుంటే మనమందరం ఎంత గౌరవం ఇవ్వాలి? స్తీలకు తెలంగాణ లో గొప్ప స్తానం ఇస్తాం అన్న మాట ఎపుడు వినలేదు కాని కనీసం సమ్మక్క సారలమ్మ, చాకలి అయిలవ్వ, బెల్లి లలిత లాంటి బిడ్డలను కన్న భూమి ల ఇంత అన్యాయమా? కనీసం మీరు శ్రుష్టించు కున్నా తెలంగాణ తల్లి బొమ్మను చూసి అన్న గౌరవం ఇవ్వాలి కదా.
ఎం తక్కువ తిన్నారు మా అక్కలు చెల్లెళ్ళు, పోలీసు వాళ్లకి అడ్డం పడి , పనికి మాలిన నాయకులని రోడ్ల మీదకి ఈడ్చ లేదా రచ్చబండల? చెప్పులు, చీపిర్లు, కారం పొళ్ల తోని ఒక్కొక్కడికి నీళ్ళు తాగిపించ లేదా? శ్రీకాంత చారి, వేణుగోపాల్, యాదగిరి, యాదయ్య లాంటి బిడ్డలను, భర్తలను, అన్న తమ్ముళ్ళని ఉద్యమానికి అర్పించ లేదా. యునివర్సిటీ లల్ల చొరబడి ఆడపిల్లలని చూడకుండా అడ్డగోలుగా, అసభ్యంగా ప్రవర్తిస్తే భరించ లేదా? లాఠి చార్జీల దెబ్బలు తినలేదా? లగడపాటి ఖిల్లాలలను దెబ్బ గొట్టి ఆడ పులులు అనిపించు కోలేదా? నిన్నటికి నిన్న సంధ్యక్కా వందలమంది ఆడవాల్లతోని డిల్లిని కదిలించ లేదా? ఎం తక్కువని నళినిని దూరం పెడుతున్నారు? వాళ్ళు పోయి, వీళ్ళు పోయి పలకరించి వస్తున్నారు కాని, మేమే తెలంగాణ ల ఏకైక పార్టీ అని విర్ర వీగేటోళ్ళు మాత్రం సప్పుడు చేస్తలేరు.
ఒక్క నాయకుడు, ఒకే ఒక్క నాయకుడు, ఖల్ నాయక్ లాంటి వారికి తెలంగాణ మొత్తం గుత్తాది పత్యం రాసి ఇచ్చినమా? తెలంగాణ ల ‘ఆ’ ఒక్క వారికి సంబందించిన వారు ఉద్యమం చేయక పొతే ఇంక ఎవరు చేసినా లెక్ఖ లోకి రాదా? చెరకు సుధాకర్ పై ప్రజల వత్తిడి పెరిగిందాకా అయన నమ్ముకున్న పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకుంది? సామాజిక తెలంగాణ వాదులు కులం గురించి మాటలాడడానికి అవకాశం ఎవరిస్తున్నారు? ఎందుకిస్తున్నారు? నళినీ, కొండా బాపూజీ ఇద్దరు కూడా బీసీలు కాబట్టి ఇట్లా చేస్తున్నారని బీసి సంఘాలు, ఇతర కుల సంఘాలు ఆరోపణ చేయకుండా ఎట్లా ఉంటాయి? వాళ్ళు మా పార్టీ కాదు కాబట్టి వాళ్ళని వదిలి వేయాలా? కోమటి రెడ్డి ఏ పార్టీ అని మద్దతు పలికినారు? అయన రెడ్డి కాబట్టి నా? ఒక మగవాడు కాబట్టి నా? ఇది మొగ వాళ్ల ప్రపంచమే అని మళ్లీ నొక్కి నొక్కి చెప్పాల్నా?
ఒక్క టీఅరెస్ పార్టీ తప్ప తెలంగాణాల ఇంకొకరు ఉద్యమాలు చేయకూడదా? చేస్తే వాటిని ఎవరూ సప్పోర్ట్ చేయకుండా జాగ్రత్త పడాలా? ఎందుకు? టీడిపిని తిట్టి తిట్టి అలసి పోయినారు కదా? కాంగ్రెస్ వాళ్ళని కొంచెం మెల్లిగా తిడతారు ఎందుకు? వీళ్ళకి వాళ్లకు తేడా ఏంది? అసలు అధికారంలో ఉండి ఏమి చేయలేని వాళ్ళని వదిలేసి ఎప్పుడో ఖతం అయిపోయిన పార్టీని పట్టుకొని గాయత్రి మంత్రం లెక్ఖ జపిస్తే వచ్చే లాభం ఏంది. అసలు జపాలకు, పూజలకు, యజ్ఞాలకు, ఊక దంపుడు ఉపన్యాసాలకు ఏమైనా విలువ ఉందా ఈ భారత దేశంల? ఇక్కడి పోలీసు వారికి, ప్రభుత్బాలకి ఏభాష అర్థం అయితదో సాయుధ పోరాటం దగ్గరనుంచి మాకు అనుభవాలున్నాయి. ఇంకా తెలంగాణ ఎట్లోస్తదని అనుకుంటున్నారు? తెలంగాణ విషయంలో రాజకీయ పార్టీలు అట్టర్ ఫేల్యూర్..ఒక్క పార్టీని అడ్డం పెట్టుకొని తెలంగాణ వస్తది అనుకుంటే అంతకన్నా పొరపాటు ఇంకొకటి లేదు. దొరల చేతిల తెలంగాణ పెడితే ఏమైతదో కూడా చెన్నా రెడ్డి దయవల్ల తేట తెల్లమైంది . మల్లా ఏ నమ్మకం పెట్టుకొని ఒక్క నాయకుడినే నమ్ముతున్నాం మనం? మనకు ఎంతో మంది నాయకులు కావలె, ఇది బిన్న సంస్కృతులు, సిద్దాంతాలు ఉన్న సమాజం, అందరిని కలుపుక పోవాలె. అసలు ప్రజలు లేకుండా ఆ నాయకుడు ఏమి చేయగలడు?
ఇప్పటికైనా ఈ రిమోట్ ఉద్యమాలు ఆపక పొతే మళ్లీ మన బొందను మనం తవ్వుకున్నట్టే. ఇపుడు జాక్ ఎం చేస్తుంది? ఇక్కడ కనీసం ఆడవాళ్ళు నళినీ కి మద్దతు తెలుపుతున్నారు మరి ఇతర అన్ని సంఘాలు ఎం చేస్తున్నాయి? ఇంకా ఏలిన వారి దగ్గరినుంచి సిగ్నల్ అందలేదా? ఏది ఏమైనా, నళినీ ని, కొండా బాపుని, ఇంకా ఎవరైనా నాన్ పొలిటికల్ పార్టీ ల వారు కాని ఏది చేసినా మనం వెనుకేసుకు రాక పొతే అది మన తప్పే అయితది. అన్ని చూపుడు వెళ్ళు మన వైపే ఉంటాయి. నళినీ స్తానంలో ఇవాళ ఇవరైతే ఉద్యమాన్ని దీక్షల వైపు తిప్పినారో వాళ్ళు కూర్చుని చేయాలి కాని వారు ఇపుడు లెక్ఖలలో తల మునకలైనట్లు తెలుస్తుంది. కనీసం వారికి సంబంధించిన వారు అన్నా దీక్షకి కూర్చుంటే లేదా కూర్చున్న వారికి మద్దతు ఇస్తే కొద్దిగా పరువు దక్కుతుంది లేదా సామాజిక వాదులు ఒక్క పిలుపిస్తే ఇక్కడ దొరల గడిలు బద్దలైతాయి..నమ్ముకున్న పార్టీలు పటా పంచలైతాయి. తిరిగి నిలబడే ప్రశ్న అయితే లేదు. గుస్సా తెప్పియకున్డ్రి జర అసలే కడుపు మండి ఉన్నాం..
జై తెలంగాణ
సుజాత సూరేపల్లి
డిసెంబర్ 9 ప్రకటన ఎవరి కోసం?
సరిగ్గా రెండు సంవత్సరాలు, తెలంగాణ పై ప్రకటన. మా లాంటి అనుమానస్తులు తప్ప చాల మంది పండుగ సంబురాలు జరుపుకున్న రోజు. అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఉన్నాయి, ఇక్కడ చిదంబరం అనే ఒక కేంద్ర మంత్రి ఉంటారు, అయన న్యాయం గురించి కూడా మాట్లాడుతాడు అని అమాయకంగా నమ్మిన మనం. ఆ తరువాత ఆ ప్రకటన కి వంద అర్థాలు వెతికి తీసారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. అసలు అయన మాట్లాడిన మాటలకు ఏమి అర్థాలు ఉన్నాయో కనీసం చిదంబరం కి అన్నా తెలుస్తే బాగుండును. ఇప్పటిదాకా తెలంగాణ ఇస్తున్నాం, ఇవ్వ బోతున్నాం, ఇద్దామను కుంటున్నాము అని రకరకాలుగా చెప్పుకుంటూనే వస్తున్నారు. ప్రజా ఉద్యమాలకి ఇంకా విలువ ఉందని కొద్ది కాలమైనా బ్రమ పడ్డారు మా అమాయక తెలంగాణ ప్రజలు. నిజానికి గత రెండు సంవత్సరాల కాలంలో జరిగిన సంఘటనలను పరిశీలిస్తే మోసాలు ఎన్ని రకాలుగా ఉంటాయో ప్రత్యక్షంగా అనుభవించి చూసినారు తెలంగాణ ప్రజలు. ప్రజాస్వామ్యం ముసుగులో, ఉద్యమాల పేరుతో ప్రజల మనోభావాలతో, ప్రాణాలతో ఆడుకొంటున్న నాయకులని, ప్రభుత్వాలని ప్రజలు నిశ్చేష్టులై చూస్తున్నారు. వీళ్ళని నమ్మి మనం ఎన్ని కోల్పోయాము, ఎందుకు ప్రజలలో ఈ నిర్లిప్తత అని ప్రశ్నించే వారికి ఒక్క తెలంగాణ చరిత్రని పరిశీలిస్తే చాలు, ప్రపంచ రాజకీయాలు అర్థం అయిపోతాయి.
9 ప్రకటన ని మరిపించడానికి అమ్మగారినుంచి ముచ్చటగా మూడు కానుకలు అని టీవి చానెళ్ళు గగ్గోలు పెడుతున్నాయి. అమ్మ బర్త్ డే గిఫ్ట్ అని తెగ సంబర పడి పోయి చెపుతున్నారు మంత్రులు. తెలంగాణ ప్రకటన వచ్చినపుడు కూడా కాంగ్రెస్ నాయకులు ఇదే మాట చెప్పినారు. దేవత కరుణించింది అని కొబ్బరికాయలు కొట్టిన వారు కూడా ఉన్నారు. ఈ ప్రజాస్వామ్య దేశంలో అందునా భారత దేశంలో పాశ్చాత్య సంస్కృతికి ఇంతకన్నా నిదర్శన ఇంకేం కావాలి అని మా బీజేపి మిత్రులు ప్రస్నిన్స్తున్నారు. పుట్టిన రోజు కానుకలు, వరాలు కురిపిస్తే అవి ప్రజా సంక్షేమాలు ఎట్లైతయి? అంటే దీనర్థం దేశ భవిష్యత్తు అన్ని కూడా ఒక వ్యక్తీ చేతిలో పెట్టమనే కదా అర్థం? ఒక వ్యక్తీ చేతిలో పవర్ ఉన్నపుడు దానిని ఏ స్వామ్యం అందురు? అయినా అమ్మగారి కానుకలు అనగా అవి ప్రజలను తమ కాళ్ళ పై తాము నిలబడడానికి, దేశాభి వృద్ధికి పనికి వచ్చే కానుకలు అనుకుంటే పొరపాటే.
ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడారంటే అవి పొదుపుకి సంబంధించిన విషయాలే ఉంటాయి. అప్పటి నుండి ఇప్పటిదాకా వారి స్వంతంత్ర నిర్ణయాలకు ఎపుడు పెద్ద పీట వేయలేదు. ముందుగా స్వయం సహాయక బృందాలు అన్నారు, ఆ తరువాత రుణాలు, అందులో కొద్దిగా వడ్డీ, పావలా వడ్డీ ఇపుడు పూర్తిగా వడ్డీ లేని డబ్బులు/లోన్లు. ఈ బృందాలు ఓట్లకి అడ్దాలు, వీళ్ళని కులాల వారిగా, ప్రాంతాల వారిగా, పార్టీల వారిగా విభజించి వీళ్ళతో వోటు రాజకీయాలు.( నా పీ హెచ్ డి శోదన ఈ అంశం మీదనే) పోనీ వీటి ద్వారా స్త్రీల స్తితి ఏమైనా బాగు పడింది అంటే అది ఎక్కడా కానరాదు. వారి మీద హింసలు, అత్యాచారాలు, కట్నాలు, హత్యలు ఏవి ఆగవు. ఈ రోజుకి కూడా ఆడ పిల్లలని ఒంటరిగా పంపించే ధైర్యం లేదు తల్లి తండ్రులకి కాని, శ్రేయోభిలాశులకి కాని..నిజానికి వీరు అభివృద్ధి చెందుతున్నారంటే ఆ పల్లెలు, వాళ్ల వాళ్ల కుటుంబాలు అర్తికంగా, సామాజికంగా ముందుకు పోవాలి. అవి ఏవి కూడా ఇక్కడ జరుగవు అన్నవి పచ్చి నిజాలు. అయినా మనం ఇక్కడ తెలుసుకోవలసిన నీతి ఒక్కటె, మేము మీకు ఎపుడూ అప్పులు ఇస్తున్టాము మీరు అడుక్కు తింటూనే ఉండాలి అని. ఇంక రెండో కానుక పని దినాల పెంపు, అది కూడా పెద్ద విభేదించ తగ్గది కాదు, మీకు మీ భూములు, పొలాలు, ఇల్లూ ఏమి లేకుండా ఎపుడూ మేము ఇచ్చే కూలితోనే బతకండి అని. అట్లనే ఎస్సి ఎస్టి ల కొరకు ఇంకోత సహాయం. ఇంక వీళ్ళ పరిస్తితి గురించి ఈ మానవ హక్కుల నివేదిక చూసినా అర్థం అయిపోతుంది, ఎక్కడో ఒకరిద్దరు దళారులని అడ్డం పెట్టుకొని వీళ్ళంతా ఇంతే అనే ముగింపు కి రావడం కష్టం.
ప్రజలు ఇవ్వాళ అడుక్కుని తినే కానుకల కోసం ఎదురు చూడడం లేదు, మాకు గౌరవ ప్రదమైన జీవితం కావాలని అడుగుతున్నారు. ఈ ప్రభుత్వాల పై మాకు నమ్మకం లేదు అని తేల్చి చెపుతున్నారు, మీ టూ జి కుంబ కోణాలు, గాలి జనార్ధన్, జగన్ మోహన్ గనుల దొంగలు, ఆదివాసీలను దోచుకునే పాస్కో, పోలవరం మరియు గ్రీన్ హంట్, ప్రాజెక్టుల పెరుతోని, సేజ్జుల పెరుతోని, మైనింగ్ల పేరుతో ప్రజలు అలసి పోయి ఉన్నరు. అదే సూత్రంగా ఇన్ని సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. ఎపుడు తెలంగాణ ఉద్యమం పైకి లేచినా అపుడు మంత్రి వర్గ విస్తరణ లేదా మండలి లేదా ఉద్యోగాల ఎర, కింది వర్గాల వారికి పదవులు ఇవ్వడం లాంటివి చేస్తుంటారు.ఇంతా చేస్తే కూడా వాళ్ళు బయట తిరగ లేని పరిస్తితి. అదే ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు ఉన్న తేడా.
రేపు మానవహక్కుల దినం! మనిషి అస్తిత్వాన్ని నిలబెట్టే హక్కులు లేని నాడు బతికున్నా చావడం మేలు అని చరిత్ర చెప్పిన మాట. ఈ దేశంలో ఎటు చూసినా కాని హక్కుల సూచికలో దరి దాపులలో కూడా లేము. ఇది దేనికి నిదర్శనం? ఇది రాజకీయ సంక్షోబానికి దారి తీసే సంకేతం. అందరికి సమానత్వం అనుకున్నా జరుగని పని, అట్లాగే ఏకాభిప్రాయం కూడా, ఇవి రెండూ కాకుండా , కేంద్రం పై వత్తిడి లేకుండా తెలంగాణ వచ్చేనా? డిసంబర్ ప్రకటన మాకోసమే అని ఉర్రూతలూగుతున్న ప్రజలందరికి ఒకటే విజ్ఞప్తి, ఈ ప్రకటన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులని బ్రతికించడానికి ఇచ్చిన ప్రకటన. మన అమాయకత్వానికి, వాళ్ల కుతంత్రాలకి అనుగుణం గా ఉండే ప్రకటన. జాగారనలతోని జనం కదలోచ్చుకాని కేంద్రం కదలదు కాక కదలదు. అయితే ఒక పెద్ద రాజకీయ పార్టీ కటినమైన ఉద్యమ ప్రనాలికని తయారు చేయాలి. వోట్ల రాజకీయాలతోని తెలంగాణ రాదు, ఒక మిలియన్ మార్చ్ తోని, సకల జనుల సమ్మెతోని, చెరుకు సుధాకర్ ధైర్యం తోని మాత్రమె తెలంగాణ తెచ్చుకోవాలి.
తెలంగాణ ఒక హక్కు, ఆత్మ గౌరవానికి సంబందించిన అంశం, ఆకలి కేకలకి, రాబోయే తరాలకి రెండు ముద్దలు తిండి పెట్టాలంటే తెలంగాణ ఒక అవసరం. కనీసం ఈ హక్కుల దినం రోజన్నా హక్కుల సంఘాల వాళ్ళు తెలంగాణ ఆవశ్యకతని హక్కుగా చూసి స్పందించి ప్రభుత్వం వారికి ఇవ్వాలి.
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి
Filed under 9th december, chidambaram, Telangana | Comment (0)చెరకు సుధాకర్ విడుదల ఉద్యమ విజయం
చెరుకు సుధాకర్ పై కేసు, అయన ఎవరో మొన్నటి వరకు చాల మందికి తెలవదు, పిడి ఆక్ట్ , నాసా కేసులు, విచిత్ర మైన కేసులు, అంటే ఏవో ఉగ్రవాదులు, దేశ బద్రత కి ముప్పు కలిగించే వాళ్ళమీద పెట్టే కేసులు ఈయన మీద ఎందుకు పెట్టినరు, ఈయన బాక్ గ్రౌండ్ ఏంది అని ఆరా తీయని వారు లేక పోలేదు. ఇంకా ఆశ్చర్యం కలిగించిన విషయం, ఈయన ఒక పార్టీ, అది కూడా తెలంగాణ పార్టీ లో పాలిట్ బ్యూరో మెంబర్. పార్టీ మొత్తం ఈయన కోసం తెలంగాణని స్తంబింబ చేస్తది అనుకున్న వాళ్లకి దిమ్మతిరిగే షాక్. ఆ పార్టీ నాయకుడు, ఎన్నో వాదోపవాదాల తరువాత, కృష్ణ మాదిగ లాంటి వాళ్ళు నిరాహార దీక్షలు, ధర్నాలు అనంతరం , హక్కుల కార్య కర్తలు, మేధావులు, రచయితలు ఆయన గురించి అనేక చోట్ల రాసి, మాట్లాడడం అయిపోయినంక గాని ఆ పార్టీ నాయకుడు, మూడు నెలల తరువాత గాని చూడడానికి వెళ్ళలేదు. ఇది చెరకు సుధాకర్ పై కేసుల బాధ కంటే ఎన్నో రెట్లు బాధ కలిగించిన విషయం.
అయన చేసిన తప్పేంది? ఉద్యమం ఉవ్వెత్తున నడుస్తున్నపుడు, తను ఉన్న ప్రాంతంలో ప్రజలతో కలిసి అనేక రకాలుగా ప్రతిఘటించడం. అందులో బస్సులు ఆపొచ్చు, అడ్డం పడొచ్చు, ఆవేశం పెల్లుబికినపుడు ఒకింత ముందుకు పోయి ఉండొచ్చు. ఇది విద్యార్థుల మీద భాష్ప వాయువులు, జర్నలిస్టుల మీద, ఉద్యమ కారుల మీద పాశవికంగా దాడి చేసిన దాని కంటే క్రూర మైనదా? అపుడు రాని అడ్డంకులు ఇపుడు ఎందుకు వచ్చినట్టు? చెరకు సుధాకర్ ఒక మానవత వాది, డాక్టర్, రచయిత, విప్లవ భావాలు కలిగి వీరోచితంగా పోరాడే నేర్పు కలవాడు, ప్రజలని కూడ గట్టి, యుద్ధానికి సిద్దం చేసే సత్తా ఉన్న నాయకుడు. కాకపొతే బూర్జువా రాజకీయాలలో ఉన్న కుటిల రాజకీయ విద్యలకి ఇంక అలవాటు పడలేదు. కాని ఇన్ని రోజుల జైలు జీవితం, కలిగిన మానసిక వొత్తిడి బహుశా పూర్తిగా ఆయనకి అర్థం చేసి ఉంటాయి. ఈయనని చూస్తె రాజకీయ నాయకులకి గుబులు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒక వర్గం, కులం నాయకులకి వేరే ఎవ్వడు అడ్డం వచ్చినా చంపడమో, కేసులు పెట్టడమో, అడ్డు తొలగించుకోవదమో చేస్తారు అని కొంత మంది సీనియర్ ఉద్యమ కారులు చెప్పు తున్నారు. నిజంగా దీనిని కులం కోణం లో చూడడం తప్పేమో అని ఎంత సర్ది చెప్పుకున్నా జరిగిన పరిణామాలు సీక్వెన్స్ గా ఆటు వైపే లాక్కు పోయి, చివరికి మేధావి వర్గం వారు కూడా ఇదే అభి ప్రాయాన్ని వెలిబుచ్చే వరకు తెచ్చింది. అయినా ఈ దేశంలో కులం లేని రాజకీయాలు చేసేది ఎంత మంది? కులం లేని రాజకీయాలు ఉన్నదేక్కడ? ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు ఎపుడూ ఒక మాట అంటరు, ఇక్కడ గాల్లోనే కులం ఉంటది , పాతాళం లోకి పోయినా కూడా వదలదు అని.
చెరకు సుధాకర్ మీద కేసులు, అయన జైలు శిక్ష, నిన్న వచ్చిన తీర్పు అన్ని ఊహించినవే. కాకపొతే ప్రజాగ్రహం ముందు వీగిపోయిన, ఒడి పోయిన రాజకీయాలు. అయన పై కేసు పెట్టి, ఉద్యమ కారులను భయ పెట్టి, ఉద్యమాన్ని అణచి వేసాము అనుకున్న వారికి ఇది తిరుగు లేని దెబ్బనే. మెల్ల మెల్లగా చెరకు సుధాకర్ కి మద్దతు పెరగడం నిన్నటి తీర్పు విన్న తరువాత తెలంగాణ మండి పడడం చూసినంక అన్న ఇక్కడి అధికారులు, వెనక ఉండి నడిపించే రాజకీయ నాయకులు, ఆంధ్రా పెత్తందారులు నేర్చు కావలసింది ఒక్కటె, తెలంగాణ ఉద్యమాన్ని ఎవడికి ఆపే దమ్ము ధైర్యం లేదు, ఇపుడు నిశ్శబ్దంగా ఉండడం విరమణ కాదు, ఏదో ఒక రోజు దావానలం లా ఎగసి పడక తప్పదు. రాజకీయ నాయకులు పాతకాలం నాటి చీప్ ట్రిక్కులు ప్రయోగిస్తే లాభం లేదు, తెలంగాణ చాల ముందుకు పోయింది, తేట తెల్లంగా ఒక్క్కొక్క వికృత రూపాన్ని చోస్తుంది. బట్టలిప్పి నిస్సిగ్గుగా నిలబడ్డ రాజకీయాలని ఈ దేశం కిషన్ జీ హత్య లో చూసింది. ఇంకా చూస్తూనే ఉంది. కాని ఉద్యమాలు వెనక్కి ఎపుడు తగ్గలేదు, వేళ్ళూనుకొని పాకుతూనే ఉంది, పేర్లు ఏమైనా గాని అన్యాయాన్ని ప్రస్నిస్తూనే ఉంది, ఆఖరికి అతి విలువైన ప్రాణాలను బలి పెడుతూనే ఉంది..ఇవే ప్రజా రాజకీయాలు.
తెలంగాణ ఎక్షనమైనా అగ్గి గుండంలా మార వచ్చు అనే సంకేతాలు పోయినంకనే హడావిడిగా చెరకు సుధాకర్ కి బెయిల్ ఇచ్చింరు అన్నది వాస్తవం. ఏదో అయిపొయింది కదా అనుకుంటే మళ్లీ ఎందుకొచ్చిన తలనొప్పి అని వెనక్కి తగ్గిన్రు. మొన్నటికి మొన్న ఎఫ్ డి ఐ ఇట్లనే వెనక్కి తీసుకోక తప్పలేదు, లోక్ పాల్ పై ఒకడుగు ముందుకు వేయక తప్పలేదు. ప్రజలు గొర్రెలు అని అనుకుంటే పొరపాటే, ప్రతి ఒక్క విషయానికి , సమస్యకి వోటు మాత్రమె సమాధానం చెపుతుంది అంటే ప్రతి అయిదు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమె మనం మాట్లాడుకోవాలి. అప్పటిదాకా చిరంజీవి, రాం చరణ్, అల్లూ అర్జున్ సినిమాలు చూస్తూ కూర్చోవచ్చు. తెలంగాణ ఇవ్వమంటే కష్టం కాని, ఫ్రీ తెలుగు సినిమాలకి ఎం కష్టం చెప్పుండ్రి. లాభాలు పొందేది వాళ్ళే కదా, అక్కడ కూడా పోగొట్టుకోనేది మనమే.
చెరకు సుధాకర్ మళ్లీ ఒక ఉద్యమ రూపం లో మన ముందు ఉన్నాడు, న్యాయం ప్రజల వైపే ఉంది, తెలంగాణ లో ఉద్యమ జ్వాలలు ఇంకా ఆరలేదు అని నిరూపణ అయింది. ఇపుడు ముందున్న కర్తవ్యం కలుపు మొక్కలని ఏరి పారేసి, పచ్చని పంట పొలాల కొరకు నడుం బిగించడమే. ఈ మలి ఉద్యమంలో వందల, వేల కొలది చెరకు సుధాకర్ లను తయారు చేసుకున్నది తల్లి తెలంగాణ లేదా వెలుగు లోకి తీసుకొచ్చింది. అదృష్టమో, దూర ద్రుష్టమో దొంగలు ఎపుడు వెనుకబడే ఉంటారు, న్యాయం మాత్రమె గెలుస్తుంది. ఇదే చరిత్ర.
జై బోలో తెలంగాణ! ఇంక్విలాబ్ జిందాబాద్.
సుజాత సూరేపల్లి
Filed under Dr. Cheraku sudhakar, samme, telangana political parties | Comment (0)చీకటి రోజులు..
డిసెంబర్ నెల బ్లాక్ డేలకి పేరొందినది గా చెప్పుకోవాలి అందులో అరవ తారీకు మరిచి పోలేని దుర్దినం. ఇప్పటి బ్లాక్ డే 1992 బాబ్రి మస్జిద్ కూల్చివేతకి నిరసనగా ముస్లిం లు, హక్కుల సంఘాల వాళ్ళు, కమ్మునిస్ట్లు, సోసియలిస్టులు, అన్యాయాన్ని ప్రశ్నించే వాళ్ళు అందరు నిరసన దినంగా పాటించే రోజు. ఈ దేశ రాజ్యాంగంలో సర్వమతాలకు సమాన హక్కులున్నాయని రాసుకొని, రాం, రహీమ్ అందరు ఒకటే అని చరిత్ర పుస్తకాలలో, పాటలలో, మాటలలో చెప్పుకొని ‘భిన్నత్వంలో ఏకత్వం’ అని గొప్పగా చెప్పుకునే దేశం, ముస్లిం మతాన్ని తీవ్రంగా, పాశవికంగా అవమానించిన రోజు. హిందుత్వా ముసుగులో, దేశాన్ని మత కలహాలకు నిలయంగా, హిందూ ముస్లిం ల మధ్య చిచ్చుపెట్టిన రోజు. ఇది నిజంగా బ్లాక్ డే నే, నిరసన దినమే. హక్కులనేత ఈ దేశాన్ని సెక్యులర్ దేశంగా సెక్యూర్ చేయడానికి ప్రయత్నించినా మహా నేత వర్ధంతి రోజు జరిగిన హింస. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన హిందూ సేనలు. మైనారిటీలమీద జులుం చూపించడమంటే ఈ దేశ చరిత్రని, సంస్కృతిని, మానవతా విలువలని కాల రాయడమే.
మరొక చీకటి దినం దేశానికి ఒక దశా దిశని నిర్దేశించిన మహా మనిషి నిష్క్రమణ, మహా పరినిర్వాన దినం గా లక్షలాది మంది ప్రజలు తమ నాయకునికి నివాళులు అర్పించే దినం. ఈ దేశంలో కులం ఒక భయంకరమైన జబ్బు, దీనిని నిర్మూలిస్తే గాని దేశాభి వృద్ధి సాధ్యం కాదు అని సోధించి, పరిశోధించి, సాధించిన మేధావి. అత్యంత ఉన్నత చదువులు చదివిన వాళ్ళలో ఒకడు, క్రింది కులాల లో బహుశ మొదటి, చివరి వాడు కూడా. చదువులన్ని జ్ఞానం కొరకే అని, జ్ఞానం అంత అజ్ఞానులకు, అమాయకులకు, అణచివేయబడిన వాళ్లకు ఆసరాగా ఉండాలని, వాళ్ళలో చైతన్యం నింపాలని, ప్రశ్నించడం నేర్పించాలని, అందరు సమానమే అన్న భావన అందరిలో నిపాలని తపన పడి, ఆచరణలో చూపించిన వ్యక్తీ. కొలంబియా యునివర్సిటి లో ఆర్థిక శాస్త్రం , లండన్ లో డాక్టరేట్, తరువాత బారిస్టర్ చదువు తిరిగి దేశానికి వచ్చి ప్రజా సేవలో నిమగ్నం. రాజ్యాంగ నిర్మాతగా, అంబేద్కర్ ని కేవలం క్రింది కులాలకి పరిమితం చేసి అందులో అంటరాని వాళ్లకి మాత్రమె చెందిన వ్యక్తిగా చూపించిన ఘనత ఇక్కడి చరిత్రకారులకి మాత్రమె దక్కుతుంది. ఈ దేశ స్వాతంత్రం సంగ్రామంలో, హక్కుల ఉద్యమంలో, మానవతా విలువలలో, మతాలలో, మైనారిటీలలో మమేకమై ఎన్నో విధాలుగా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించిన వ్యక్తీ. కేవలం లాయరుగా, లా మినిస్టర్ గా, రాజ్యంగా నిర్మాత గా , రాజకీయ వేత్తగా మాత్రమె కాకుండా అనేక రకాలుగా జీవితం చివరి క్షణం వరకు బడుగు, బలహీన కులాల హక్కులకోరకు, మానవత్వం రంగరించి, నిలబడి పోరాడిన వ్యక్తీ. ఈ రోజు ఆ మహానుభావుని 55 వ వర్దంతి. ఆయనే కనుక మరిన్ని రోజులు ఉండి వుంటే, కనీసం మరిన్ని మంచి మార్గాలు చూపించే వాడేమో.
మరొక చీకటి కోణం, దినం, డిసెంబర్ 9 కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన. చిన్న రాష్ట్రాలు పరిపాలనకు సులువు, కేవలం భాషా ప్రాతిపదికన మాత్రమె విభజిస్తే సరిపోదు, జనాభా, భౌగోళిక విస్తీర్ణం, ఆర్థిక పరమైన అంశాలని ఆధారంగా చేసుకొని విభజించాలని ఆనాడే చెప్పిన స్పుర ద్రుపి డాక్టర్ అంబేద్కర్ . ఇపుడు బాబా సాహెబ్ మన ముందు లేరు కాని ఆర్టికల్ 3 ప్రకారం అత్యంత సులువైన మార్గం ద్వారా చిన్న రాష్ట్రాలకు మార్గం చూపెట్టినాడు, మన రాజకీయ నాయకులకి చిత్త శుద్ధి లోపించి ఎవరు కూడ ఆ పద్ధతి ద్వారా తెలంగాణని సాధిద్దాం అని అనుకోవట్లేదు. కేవలం దందా నడపడానికి, తమ జీవితాలు బాగు చేసుకొని, సకుటుంబ సమేతంగా రాజకీయ లబ్ది పొందుతూ ముందుకు పోతున్నారు. ఎవరైతే శత్రువులని మనం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నామో వారితోనే జత కడుతూ తెలంగాణ ప్రజల మనోభావాలని ఎప్పటికపుడు తమ స్వార్థం కోసం ఉపయోగించు కుంటూ నడుస్తున్న నాయకత్వాలు. ప్రజలను తేనెపూసిన కత్తితో తూట్లు పొడుస్తూ, ఉద్యమాన్ని నీరు కారుస్తూ రోజులు వెళ్ళ దీస్తున్న రాజకీయాలు. అయినా కూడా నాయకులని మెడలు వంచి, కేంద్రానికి వణుకు పుట్టించి ఉవ్వెత్తున లేచిన ఉద్యమం తనకంటూ డిసెంబర్ 9 న చిదంబరం నోటి ద్వారా కేంద్రం తరపున ఒక ప్రకటనని సాధించుకున్నది. అది ప్రకటన లాగానే మిగిలిపోయింది. మరొక తీరని ద్రోహంగా చరిత్రలో నిలబడ బోతోంది ఏమో. వచ్చిన ప్రకటనని నిలబెట్టుకోలేక పోయినం, మీడియా సాక్షిగా వెలువడిన ప్రకటనలకి ఈ భారత ప్రాజాస్వామ్యంలో చోటు లేదు. ఎట్లైనా సాధించాలనే పట్టుదలతో నాయకుల మాటలకి పొంగి పోయి, ఆవేశ పడి, ఆందోళన చెంది ఎన్నో పానాలు పోగొట్టుకున్నాము. ఆ ప్రాణాలకి విలువ లేదు, కేసుల మీద కేసులు పెట్టి, నిజాయితీ పరులని జైల్లో పెట్టి, ప్రలోభ పెట్టి తెలంగాణని మల్లా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టినమా?
ఈ సారికి రెండు వార్షికోత్సవాలు పూర్తీ చేసుకున్నాం, నిన్నటి అవిశ్వాసం సినిమా చూసిన తరువాత ఈ రాజకీయాల మీద ఏవైనా నమ్మకాలుంటే అవన్నీ పూర్తిగా మట్టి గొట్టుకొని పోయినయి. ఆటు జగన్ చాల గొప్పగా మా ఎమ్మెల్యేలు మాట దాటలేదు అని చెప్పుకుంటే, ఇటు చిరంజీవి అనే సినిమా హీరో నా మాటా జవ దాటారు మావారు అని చెప్పుకుంటున్నాడు. వాళ్ల వాళ్ల అజెండాలు ఏవైనా కానీయండి, మాట మీద నిలబడడం మొదటినుంచి మనం చూస్తున్నాం. మరి ఈ గడ్డ మీద పుట్టి, ఈ జనాల వోట్లతోని బతికి బట్టకట్టి, తెలంగాణ మాతోనే సాధ్యం అని కోతలు కోసిన వారి సమాధానం? మా నాలుగు కోట్ల ప్రజల కోరిక కోసం(మా కోసం కాకున్నా) మేమందరం తెలంగాణ వైపే అన్నారా? అందరికి తెలిసిన నిజం ఒక్కటె,
నువ్వు నేను భాయి భాయి,
పార్టీ ఏదైనా కానివ్వోయి
మల్లా ఎలక్షన్లలో చూసుకున్దామోయి
తెలంగాణని మరికొన్ని రోజులు నాననివ్వోయి
మరిన్ని పదవులు కొట్టేయోచ్చోయి
అప్పటిదాకా ఎంజాయ్ చేయి
జైతెలంగాణ అడ్డంపెట్టుకొని..
ఈ చీకటి రోజులని దాటుకొని వచ్చే వెలుగు కిరణాలకై మన ఎదురు చూపు, లేదంటే మనమే జగన్నాథ రధ చక్రాలై దోపిడీ దారుల గుండెల్లో పరుగు పెట్టాలె..అదే తెలంగాణ విముక్తి మార్గం.
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి.
–
http://telanganaonline.org/surepally/
Filed under B.R. Ambedkar, blackday | Comment (0)ఐక్యత-అనైక్యత-తెలంగాణ రాజకీయ క్రీడలు
మనమిపుడు కన్నీళ్ళు కార్చే రోజ్జుల్లో బతకడం లేదు “మొసలి కన్నీళ్లు కార్చే రోజుల్లో బతుకుతున్నాం” అన్న గాలిబ్ మాటలు ఎప్పటికి శిలా ఫలకం పై రాసి పెట్టుకోవాల్నేమో. తెలంగాణ లో రాజకీయ యోధానుయోధులు హఠాత్తుగా డిఫెన్స్ లో పడ్డట్టు కనపడుతున్నారు. నిన్నటి యుద్ధాలు, ప్రాణ త్యాగాలు, ద్వంసం, విధ్వంసం, చీమను, దోమను తిరగనీయం, అసెంబ్లీ, పార్లమెంట్ నడవనీయం లాంటి మాటలన్నీ నీటిమీద మూటలైనట్టు స్పష్టంగా కనపడుతున్నై. ఇపుడు ఎక్కడ చూసినా వెయిట్ అండ్ సి పాలసి కనపడుతుంది. గవర్నర్ గారు చిదంబరం ని కలుస్తారు, తెలంగాణలో ‘కరువు’ విపరీతంగా ఉంది అని మాత్రమె చెప్పాను, బలగాల గురించి నాకు తెలవదు, నేను ఎటువంటి నివేదికా ఇవ్వలేదు అని ఎంతో అమాయకంగా మీడియా కి సెలవిచ్చారు. అసలు అయన అంత అమాయకుడు ప్రపంచంలో ఇంక వెతికినా దొరకడు అన్నంత మాయకంగా ఉన్నాడు శ్రీ శ్రీ శ్రీ గవర్నరు నరసింహన్ గారు.
నిజమే ఇపుడు కలి కాలం, కరువు కాలం, ఆరుగాలం కష్టం మంట గలిస్తే అట్లనే ఉంటది. ప్రపంచంలోనే గొప్ప దేశంగా వెలిగిన తెలంగాణ ఎందుకు కరువు ప్రాంతంగా గుర్తించ బడింది? వజ్రాలకు , గనులకు, ఖనిజాలకు పుట్టినిల్లు అయిన ఆఫ్రికా నేడు ఆకలి చావులకి చిహ్నంగా ఎందుకుంది? అమెరికా, ఐరోపా లాంటి సంపన్న దేశాల గుప్పిట్లో చిక్కుకొని, ఉన్నదంతా పోగొట్టుకొని, మానవ నాగరికతకే తల్లి అయిన ఆఫ్రికా దేశాలు నేడు ఎందుకు విలవిల లాడుతున్నాయి? అందుకే, అదే పంధాలో తెలంగాణ నన్ను కరువు ప్రాంతం గా గుర్తించండి అని మొత్తుకుంటుంది. ఇవాళ మన ఎంఎల్యేలు మాకు క్రాపు హాలిడే లోన్లు ఇయ్యండి అని అడుక్కుంటున్నారు. అన్నం పెట్టే చేతిని నరుక్కుని అన్నమో రామచంద్రా అని చిప్ప చేతిల బెట్టుకుని నిలబడ్డరు. సిగ్గులేదా మాకు కరెంట్ యియ్యున్రి అని అడగనీకి, బొగ్గు ఎడికేంచి పోతుందీ? కరెంట్ ఎవడికి అందాలే ముందు? నీళ్ళు, ప్రాజెక్టులు యియ్యున్రి ..ఎవడి నీళ్ళు మనకియ్యాలే? ఎవడు భూమి కోల్పోతడో వాడే మొదటి లబ్ది దారుడు అన్న జ్ఞానం లేనోళ్ళు రాజకీయాలు చేస్తారు, వాళ్ళను ఎమన్నా అంటే మావోల్లకు పొడుచుకొని పౌరుషం వస్తది. ఎందుకు? కారణాలు ఇయ్యాల ఖుల్లం ఖుల్లా గా మన కళ్ళ ముందున్నాయి. ఎన్నో రాజకీయ పార్టీలు, ఉద్యమ వేదికలు, ప్రజా సంఘాలు, ఎవ్వరూ కూడా జరుగుతున్న దోపిడిని ఎన్నడు ప్రశ్నించలే. నీకు ఆటానా, నాకు చారాణా అని బేరాలు మాట్లాడుకొనే గొప్ప నాయకులున్న ప్రాంతం మనది. తెలంగాణ ని అడ్డం పెట్టుకొని నాయకులుగా ఎదిగిన వారు కోకొల్లలు, ప్రాంతం పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొనే వారిదే రాజ్యం.
కరువు అయిపోయిన తరువాత సరి కొత్తగా కనపడుతున్నది “తెలంగాణ ఐక్యతా భోజనాలు” కార్యక్రమం లో రసాభాస, ఒక ప్రజా సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్ని పార్టీల మధ్య ఐక్యత కుదిరిద్దామని చేసిన ప్రయత్నం లో బయట పడిన అనైక్యత, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని మేము తెలంగాణ వాళ్ళం,( మామూలు వాళ్ళు కాదు) పొరపాటు వద్దు, తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య మాత్రమె అనైక్యత, మేము అనైక్యతకి మారు పేరు అని ప్రజలలో అనైక్యతని పెంచి పోషిస్తారు. సిద్ధాంతాల రాద్ధాంతాలలో మునిగి తెలంగాణని కరువులకి, భోజనాలకి పరిమితం చేసి, రోజులు రోజులు గడిపేసి తెలంగాణని వోట్ల గడిలో పెట్టి, నోట్ల కట్టలో చుట్టి, బేర సారాలు చేసి, లెక్ఖ పత్రాలు చూసుకొని , పొత్తులు జిత్తులు, ఎత్తులు పై ఎత్తులు వేసుకొని , తెలంగాణ తెద్దామని(అనుకుంటే సంతోషమే) , తెస్తామని చెపుతూ మోసం చేస్తూ ఏండ్లు గడుపుతూ ఉంటారు. చాతగాని రాజకీయ పార్టీల ద్వారా, నాయకుల ద్వారా తెలంగాణ రాదనీ ఒక దశాబ్దం దాకా చూసి ఇక లాభం లేదని ప్రజలు రోడ్ల మీద పడి, ప్రాణాలు కూడా తీసుకొని తీరొక్క రూపాల్లో ఉద్యమాలు చేస్తే వాటిని నిర్దాక్షిణ్యంగా అణచి వేస్తూ ఆధాత్మిక చింతన గురించి మాట్లాడుతుంటారు.
ఇంకా అజాదూ అన్న జాదూ మాటలకి లెక్ఖ పొత్రం లేదు,’ పార్లమెంట్ సమావేశాల తరువాతనే తెలంగాణ పై దృష్టి’, అసలైతే అయన క్రిస్మస్ శుభాకాంక్షలు, మొహర్రం ముచ్చట్లు చెప్తారు అనుకున్న వారికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్ వారి దృష్టి ఏందో, నీరో చక్రవర్తి కంటే ఏమి తీసి పోనీ మన్ మోహన్ గారి దృష్టి సడెన్ గా చిన్న వ్యాపారస్తుల మీద పడింది. ఎఫ్ డి ఐ అని కొత్త కుట్రలకి తెర తీసిన్రు, భూములు పాయె, అడవులు, ఆదివాసీలు, ఖనిజాలు, నీళ్ళు, నదులు, సముద్రాలు అన్ని పాయె, ఇంక ఉన్నది బడుగు వర్గాల ప్రజలు, వాళ్ల పొట్ట మీద కూడా దెబ్బ కొడితే అంతా సమాప్తం, ఇదే ప్రజాస్వామ్య సూత్రం, నయా రాజనీతి శాస్త్ర సారాంశం.
సామాన్య మానవునికి ఇంక నోరు మెదిపే అవకాశం ఎక్కడా ఉండది, నా భూమి , నా నేల అనే ఎమోషన్, సెంటిమెంట్ కి దూరం అయిపోతడు, తల్లి పేగు ను తెంచి రోడ్ల మీద పడేసుడు అన్న మాట. చివరికి ఒక కాందిశీకుడు గా మిగిలి పోయి, పూటకూళ్ళ జీవితం గడుపుతూ, బాంచెన్ దొరా అని కాలం గడుపుతుండాలి. అది పార్లమెంటు రాజకీయం, ఏదైనా ఒక సమస్య ని దారి తప్పించాలంటే ఇంకొక దానిని తెచ్చి ముందు పెట్టాలె.మాయావతి చిన్న రాష్ట్రాల కొత్త ప్రతిపాదన పక్కన పెట్టి, తెలంగాణ పాత ప్రతిపాదన మూట కట్టి పెట్టి, కసాయి సామ్రాజ్యాల పొట్టలు నిమ్పనీకి ఈడ కోట్లాది మంది కడుపులు కొట్టాలె. ఇంకా ప్రజలు పిచ్చోల్లె అనుకుంటే ఎట్లా ఏలిన వారు? ఇంక మా మీడియా వాళ్లకి పండగ, తెలంగాణ తప్ప ఏమైనా వేస్తాం అంటరు. అసెంబ్లీ రాజకీయాలు వచ్చేసరికి అసమ్మతి పాట, అయేది లేదు పోయేది లేదు కాని మస్తు మార్కెట్గి, న్తుంటే గంత చూపిస్తరు, ఆర్ని ! తెలంగాణ ఉద్యమాన్ని ఎన్నడు గిన్తగనం చూపెట్టలే ఒక్కడు కూడా. మేమెక్కడ తీసి పోయినం అని మా తెలంగాణ చానెల్ వాళ్ళు కూడా చిరంజీవి కొడుకు రామ చరణ్ ఎంగేజ్మెంట్ పడి పడి చూపిస్తిరి. ఆడ పోయి మెతుకులు గతికి, భక్తిని చాటుకుని వస్తిరి. గింత కంటే సిగ్గు శరం పోయే ముచ్చట ఎమన్నా ఉన్నదా?
తెలంగాణాల దోపిడీ కొత్త కాదు, దోపిడీ ఉన్నంత కాలం నిరసనలు ఉంటానే ఉంటాయి, అవి ఎపుడో ఉద్యమాల రూపం దాలుస్తాయి, దేశ దేశాలను కదిలిస్తాయి. ఇక్కడి విప్లవాలు దోపిడీకి వ్యతిరేకంగా పుట్టినయే, అన్నికూడా దోపిడీలను ప్రస్నిన్చినయే. వనరుల మీద పేద ప్రజలకి హక్కులు పంచినపుడే, అడవుల మీద అధికారం ఆదివాసీలకు ఇచ్చినపుడే , స్వయం నిర్నయాదికారం ప్రజల చేతిలో పెట్టినపుడే నిజమైన ప్రజా స్వామ్యం అని విప్లవ శంఖాలు ఊదింది ఈ గడ్డ మీదనే. సిద్దాంతాలు కళ్ళ ముందు కనపడవు, మెదళ్ళలో నాటుకొని మొలకెత్తుతాయి. ఈ సిద్దాంతాల మీదనే తెలంగాణ నిలబడ్డది ఇయాల, ప్రజల చేతిలో నుండి ఉద్యమాన్ని రాజకీయ పార్టీలు గుంజుకున్నాయి, మళ్ళా ప్రజల చేతిలోకి ఉద్యమం వచ్చినపుడే ఏమైనా మనకి ఆశలు, అప్పటిదాకా రోజుకో సినిమా టికెట్టు లేకుండా చూడడమే.
జై తెలంగాణ !
సుజాత సూరేపల్లి.
–
http://telanganaonline.org/surepally/
Filed under telangana movement, telangana political parties | Comment (0)హ్యాపీ ఆనివర్సరి: రెండో దీక్ష వార్షికోత్సవాలు
తెలంగాణలో ఇవాళ టీఅరెస్ అధినేత కెసిఆర్ దీక్షను స్మరించుకుంటూ రెండవ వార్షికోత్సవం జరుపుకున్నారు. అవును ఇది గుర్తుంచుకోవలసిన రోజే, దండి మార్చ్ అంత దినం వంటిదేనేమో. అయితే ఇపుడు వార్షికోత్సవాలు, స్మరణలు చేసుకొనే సమయమా ఇది? రెండు సంవత్సరాలు కాలం లో మనం కోల్పోయినవి ఎన్ని ప్రాణాలు? వాటికి విలువ ఏది? కెసిఆర్ దీక్ష చేసి త్యాగం చేసారు అనడం లో ఏ సందేహం లేదు అయితే వాటి ఫలితాలు రాబట్టుకోవడం లో మనం ఘోరంగా విఫలం అయినమన్న సంగతి పక్కన పెట్టి, పార్టీ స్టంట్ కోసం ఒక ప్రోగ్రాం లాగా చేయడమే ఇబ్బంది గా ఉంది. రెండు సుదీర్గ సంవత్సరాలు, బూటకపు కమిటీలు, చర్చోప చర్చలు, అడిగినోడికి, అడగనోడికి పదవులు..ఆదివాసీల జీవితాలను చిద్రం చేసే పోలవరం టెండర్లు, కావూరి సాంబశివ రావ్ లాంటి వారికి కరీంనగర్ ఫోర్ లైన్ల నిర్మాణం కాంట్రాక్ట్,అడ్డగోలుగా ఉద్యోగ ప్రకటనలు.. ఇంకొక వైపు ఆత్మహత్యలు, కేసులు, చెరకు సుధాకర్ లాంటి వారిపై నాన్ బైలబుల్ కేసులు, ఉవ్వెత్తున ఎగసిపడిన సకల జనుల సమ్మె, మిలియన్ మార్చిలు..ఈ రెండు సంవత్సరాలలో ఏది ఆపగలిగినం? పాపం ప్రపంచ భాషలలో అన్నింటిలో చూసినా ఇంత చిత్ర విచిత్రమైన సంఘటనలు కనపడవేమో.
పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెడతాం, స్తంబింబ చేస్తాం, తల తెగిపడినా కాని మడమ తిప్పం..ఎన్ని మాటలు, ఊసులు..ఈ చెవిటి ప్రభుత్వాలకు ఇవన్ని వినపడతాయా? పార్లమెంట్ ముందట శవమై వేలాడిన యాదిరెడ్డి మరణం కదిలించ లేక పోయింది, ఇంక ఎన్ని ధర్నాలు కదిలిస్తాయి? పొరపాటునో, గ్రహ పాటునో కాని నాయకులు ఇపుడు కాకపొతే 2014 లో చూసుకుంటాం నీ సంగతి అని చమత్కారాలు చేస్తున్నారు. అవును ఏమి చూసుకుంటారు? వారు కాకపొతే వీరు, నిజమే కాంగ్రెస్ రాకూడదు, బిజెపి వస్తే మొత్తానికి తెలంగాణ వస్తది, అది ఒక భరోసా ,నమ్మకం. మానిఫెస్తోలల్ల పెట్టుకొని, పొత్తులు, జిత్తులు వేసి, చిదంబరం నోటి వెంట ప్రకటన వెళ్ళగక్కి, రాష్ట్రపతి, ప్రదానమంత్రిల చేత ప్రసంగాలు చేపించి,సోనియమ్మ తెలంగాణాల మాట్లాడడం అన్ని మరిచి పోయి, ఇది నమ్ముదామా? నమ్మ వలసినదేనా? ఇపుడు మమతా బెనర్జీ కథ చూస్తున్నాము కదా, కావలసిన అంత సపోర్ట్ తీసుకొని, మావోఇస్తులను పొగిడి పొగిడి చివరికి ఎం చేసింది? సడ్డెన్ గా ఆమెకు ఉగ్రవాదులకంటే ఘోరంగా కనిపించారు, అతి క్రూరంగా హింసించి చంపించింది నాయకుడిని. ఇవి పార్లమెంటరీ ప్రభుత్వాల కుట్రలు, కుతంత్రాలు..ఏ రాయి అయితే ఏంది పళ్ళు రాలగొట్టుకోవడానికి. అయిన, మనకు గెలిపించడము తప్పితే, వారిని దింపే హక్కు రాజ్యాంగం ఇవ్వలేదు, ఉన్నా అది పనికి రాదు. రాజకీయ నాయకులు స్వయంగా రాజీనామాలు చేస్తే కూడా తీసుకునే ప్రభుత్వ యంత్రాంగం మనకు లేదు. కాని ఏలినవారికి కోపం వస్తే మాత్రం ఎవరినైనా, ఎపుడైనా తీసివేయ వచ్చు, జైలుకు పంపించ వచ్చు.ఇదే వోటు రాజకీయం, ఇటు వైపే మన ప్రయాణం.
పార్లమెంటులో రోజు పోడియం లో తారా జువ్వల దూసుకు వెళ్ళిన తెలంగాణ ఎంపీలు, సభా వాయిదా, గత నాలుగు రోజులుగా టీవిల్లో, పేపర్లో బోర్ కొట్టించే సన్నివేశాలు. అన్నింటికన్నా జోక్ ఏందంటే, ఈ టీఅరెస్ ఎంపీ లకి కాంగ్రెస్ వాళ్ళు మద్దతు పలకడం. అవును లొల్లి చేసింరు, చేస్తున్నారు, తరువాత? రోజులు రోజులు వాయిదా పడ్డంక మళ్లీ ఎప్పటి ఆటే, ఎడేసిన గొంగళి ఆడనే. అసలు రెండు సంవత్సరాలలో ఒకవేళ సమీక్ష చేసుకోవాలంటే దేని గురించి చేసుకోవాలి? అయన దీక్ష రోజు స్మరించుకుంటూనే, అప్పటినుంచి ఇప్పటిదాకా మనం ఎక్కడ ఓడిపోయినం, ఎట్లా ముందుకు పోవాలి, ఈ కదలని రాజ్యాలని ఎట్లా కదిలించాలి అని ఎపుడన్నా సమీక్ష చేసుకున్నామా? అసలు దీక్ష కి ప్రజా ఉద్యమం కి సంబంధం లేదా? ఒక్క నాయకుడితోనే చిదంబరం ప్రకటన ఇచ్చిన్రా? ప్రజలు అనుకున్న వాళ్ళు నిస్వార్థంగా చేసిన త్యాగాల మాట? వాటి వార్షికోత్సవాలు? వాళ్ళవి తద్దినాలు, సంవత్సరికాలు,కడుపు కోతలు, ఆకలి కేకలు, నిరాశా, నిస్పృహలు, మరి మీవి వార్షికోత్సవాల? ఏమని చెప్పాలి శుభాకాంక్షలు? మళ్లీ మళ్లీ ఇలాగే మనం దినాలు జరుపుకున్దామనా? హ్యాపీ న్యూ ఇయర్ లాగా? అవును, తెప్పించిన ప్రకటన నిలబెట్టుకోక పొతే అది ఎవరి తప్పు? ప్రజల గుండెల నిండా ఉన్న ఉద్యమాన్ని వాడుకోక పొతే ఎవరిని అనాలి? ఈ గడ్డ మీద ఉన్న అగ్గిని చల్లార్చడమా, రగిలించడమా ? ఇది నాయకత్వం లేని ప్రజా ఉద్యమమా? నావికుడు లేని పడవ అనడం సహజంగా నే ఉంటుందా?
ఒకవైపు జరుగుతున్న దోపిడిని ఆపలేక పోతున్నాం, అపుడు గాంధీ గారు నడిపిన స్వదేశీ ఉద్యమాన్ని, విదేశీ వస్తు బహిష్కరనని చేపట్టడం కూడా చేయలేకపోతున్నాం. మనకు మన సంస్కృతీ, సంప్రదాయాల మీద మన కంట్రోల్ లేదు. ఇక్కడ వ్యాపారాలను అభివృద్ధి చేస్తూ, మన ఆర్థిక వ్యవస్థని మనం నిర్మించుకోలేమా? ఎవరికీ చీమ కుట్టకుండా ఎక్కడన్నా ఉద్యమాలు సఫలం అయినట్టు చరిత్రలో ఉందా? అందరు మాయావతి లాగానే ఆలోచించరు కదా, ఆమె ట్రు అంబేద్కర్ వాది, చిన్న రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యం, పెత్తనం నుంచి తప్పించు కోవచ్చు అన్న ఆయన మాటలను(వోట్ల మూటలను కాకపొతే) శిరసా వహించి ముందుకు పోలేరు కదా?
అసలు మల్లా ఎలక్షన్లు అన్నపుడు, మంచిగా కాడర్ ని నిర్మించుకొని ప్రజల మధ్యలోకి పోయి, వారి సమస్యలపై పోరాటం చేయొచ్చుకదా? అసలు మందోక్కాడా రోగామోక్కాడా ఉన్నట్టుండి మన ఉద్యమం . ఎం చేస్తే ఉద్యమం ఉదృతంగా పోతదో మనకు అందరికి తెలుసు కాని, ఎట్లా మానేజ్ చేయాలో కేంద్రానికి, ఆంధ్రా పెట్టుబడి దారులకి తెలిసినంతగా ఎవరికీ తెలవదు. ఇప్పటికి ప్రజలు సిద్ధంగానే ఉన్నారు, ఒక్క వోటు రాజకీయాలకి స్పందిస్తారని మాత్రం మనం అనుకుంటే పొరపాటే, ఆఖరి నిముషం వరకు వారిని ఎన్ని ప్రలోభ పెడతారో మనకి తెలుసు. ఇపుడు వారితో ఉండే ఒక మనిషి కావాలి, నాయకత్వం భాద్యత తీసుకోవాలి. చెరకు సుధాకర్ మీద కేసులు ఎత్తివేయాలని పోరాటం చేయాలి, చూసి పోవడం కాదు.
ఏది ఏమైనా, ఈ దినం ఒక వేళ స్మరించుకో దలచుకుంటే అది కేవలం మన పరిస్తితిని బేరీజు వేసుకోవాలి. మల్లా దీక్షలు ఎమన్నా పనికి వస్తాయేమో ఆలోచించాలి. అసలు దీక్షల మీద ప్రజలకు విరక్తి పుడుతుంది. అసలు వీడు చావడు, చంపడు తెలంగాణ ఎట్లోత్టది అని ఒక పండు ముసలమ్మ అడిగింది, ఏమి సమాధానం చెప్పాలి? మేధావి వర్గం నిమ్మకి నీరెత్తినట్లు ఉంది, పార్లమెంట్లో హడావిడి చూసి ఉబ్బి తబ్బిబ్బు అయి కలలు కూడా కొందరు కనొచ్చు.
తెలంగాణ లో వ్యాపారాలు దెబ్బ తీయక పొతే తెలంగాణ రాదు, ప్రజలను మళ్లీ సమీకరించక పొతే కేంద్రం కదలదు. రాజకీయ నాయకులతోని తెలంగాణ వస్తది అనుకుంటే మళ్లీ మనల్ని మనం మోసం చేసుకున్నట్లే. అసలు తెలంగాణలో చేయని ఏదైనా పోరాట రూపం ఉందా? ఆత్మ బలిదానాలంటే ఎంతో ప్రశాంతం అనే కదా అర్థం, పోలీసు అరచకాలలో బతుకుతూ నిత్యం నలిగి పోతున్న జనం ఇంకా కోకొల్లలు ఉండనే ఉన్నారు. రచ్చబండ అని పచ్చిపుండు మీద కారం చల్లుతుంటే ఉక్రోషం పట్టలేక వెంటబడి తరిమిన వారు ఉన్నారు.
అవును మనం సాధించింది ఏంది? ప్రపంచంలో ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించడం, కేవలం ప్రజలు తమకు తామే ముందుకు వచ్చి ఎటువంటి సహాయ సహకారాలు బయటి నుండి లేకుండా ఒక న్యాయ బద్దమైన పోరాటం కోసం నిలబడడం. చిన్న పిల్ల నుంచి, పండు ముసలి వరకు జై తెలంగాణ అనిపించడం. ఎక్కడ అన్యాయం జరిగిందో లేక్ఖలతో సహా పోగు చేయడం, ప్రతి క్షణం శత్రువు వేసే ప్రతి అడుగు గమనించడం..అవును, ఎన్నో వందల ప్రాణాలు, వారి అందరికి వందనాలు..రాలి పోయిన పూలు..అమరులై నిలచిన వీరులు, వారు వీరులు కాకపోవచ్చు, మైండ్ యు! పిరికి వారు కాదు, హత్య కావించ బడ్డ వారు, ఆ వొక్క కాటగిరిలో అయినా వారికి కొంత గౌరవం ఇవ్వొచ్చు. ఇంకా ఇక్కడ ప్రపంచీకరణ ప్రభావం రాలేదు, పది మంది కోసం బతికే బతుకు అందరు కోరుకుంటున్నారు కాని నేను, నాదీ అనే దానికికోసం కాదు మేము బతికేది అని ఎలుగెత్తి చెప్పగలిగినారు. అంతో ఇంతో కొంతైనా మర్యాదగా ఇచ్చి మాట్లాడే సందర్బం ఏర్పడ్డది తెలంగాణ వాళ్ళు అమాయకులు కాదు , అగ్గి పిడుగులు అని ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది, అట్లనే ఇక్కడి నాయకుల గురించి కూడా పూర్తిగా వేరే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు.
మళ్లీ వార్షికోత్సవం చేసుకోక ముందే తెలంగాణ వస్తుందా? మిల్లియన్ డాలర్ ప్రశ్న..లేదు అందరం ఈ బూటకపు కాంగ్రెస్ ని గద్దె దించి ఎవరైతే తెలంగాణ ఇస్తారో వారిని గెలిపిస్తే చాల బాగుంటుంది అని అందరి ఆశ. ఆ దిశగా అడుగులు వేయక పొతే, రేపు మన నేల/కాళ్ళ కింద మట్టిని మనమే తవ్వుకొనే పరిస్తితి వస్తుంది. అప్పటి దాక మరింత దోపిడీ పెరుగుతుంది. మళ్లీ మళ్లీ ఎలక్షన్లల్ల పావులుగా వాడుకొని ప్రజల కోరికలను పక్కన పెడితే ఏమైతదో స్పష్టంగా చూస్తాం.
ఇది విరామమే, కచ్చితంగా విరామమే, ఏడ పారేసుకున్నమో ఆడనే ఎతుక్కోవాలే..అది చేస్తే, ఆచరిస్తే తెలంగాణ నడుచుకుంట వస్తది.
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి
ఎడబోయినదమ్మ ఈ నేల తార!
ఆఖరి శ్వాస వరకు
అడవి బిడ్డల విల్లంబువై
రాజ్య హింస పై ఎక్కుపెట్టిన బాణమై
అడవులకే అన్నవై
జీవితాన్ని అంకితం చేసిన మల్లోజుల
మావోయిసానికి మకుటం లేని
మహారాజుగా వెలిగిన తార
కరీంనగర్ పెద్దపల్లి పెద్దన్న
మళ్లీ రావని అనుకుంటున్న అమ్మకి
ఎడనుంచి ఉత్తరం రాస్తావ్?
ఎంతో మంది అమ్మల కడుపు కోతలను
దూరం చేస్తావని దూరమైన అమ్మ కోసం
ఆఖరి సారి, ఒక్కసారి ..ఒకే ఒక్కసారి
ఒక్కసారన్నా వస్తావని ఎదురుచూస్తున్న
కరీంనగర్ కామ్రెడ్ల కోసం
ఎర్ర జెండాల మధ్య లాల్ సలాం చేస్తూన్న
తెలంగాణ బిడ్డల కోసం
పోరాట మై, అగ్గి బావుటావై
విప్లవ తారవై మల్లోకసారి
అందరి గుండెల్లో మొలకెత్తు తావని
ఇక్కడి నయా భూస్వాముల చేతిలో చిక్కుకున్న
అమ్మ తెలంగాణని విడిపిస్తావని
ఆశపడ్డ అన్న తమ్ములకు
ఎం సమాధానం చెప్తావ్ కిషనన్నా!
అమ్మ కండ్లల్ల తడి ఆరలేదు
ఆఖరి చూపు కోసం కాదు
నీ ఆశయం కోసం
ఎందరో అమ్మలు పడిగాపులు కాస్తున్నారు
నువ్వు నడిచిన దారుల నిండా
నీకు నీరాజనాలు పలుకుతున్నారు
సాయుధ పొరాటామే
ఈదేశానికి విముక్తి అన్న నీ మాటలకు!
నాలుగు దిక్కులూ పిక్కటిల్లేలా
నినాదాలిస్తున్నారు…జోహార్ కిషన్ జి ! జోహార్!
..సుజాత సూరేపల్లి
Filed under Articles | Comment (0)అమ్మ నన్ను కన్నందుకు…!
ఒక ఉత్తరం, సందేశం ..కంటికి కానరాని, సుదూర తీరాలనుండి, అమ్మ కోసం తపించిన, తల్లడిల్లిన గుండె కాయ..మల్లోజుల కోటేశ్వర రావు, ఉత్తరం చదివిన ప్రతి ఒక్కరికి కళ్ళల్లో నీరు. దేశ రాజకీయాలని గడ గడ లాడించిన కిషన్ జి కూడ ఒక బిడ్డనే, కన్న తల్లి కోసం తపించిపోయిన గుండెనే. ఒక గొప్ప ఆదర్శం ముందు, బంధాలను , అనుబందాలను వదులుకొని ప్రాణాలను తను నమ్మిన సిద్దాంతం కోసం ధార పోసిన నాయకుడు. విప్లవ పార్టీలకు వన్నె తెచ్చిన కిషన్ జి,విప్లవాన్ని ఊపిరిగా మలుచుకున్న మనిషి. విప్లవాల గడ్డ, కరీంనగర్ బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ. వెంకటయ్య, మధురమ్మల పుత్రుడు. ఇక్కడ పుట్టి, ఇక్కడి రాజకీయాలలో నాయకుడిగా ఎదిగి, ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిన గొప్ప విప్లవానికి ఊపిరిలు ఊదిన కిషన్ జి. కర్కశ ప్రభుత్వాలకు బలి అయిపోయిన అరుణ తార, కొలకత్తా, పశ్చిమ మిడ్నాపూర్ లో చివరి శ్వాస. , ఎక్కడైతే నక్సల్ బరి పుట్టి పురుడు పోసుకుందో, అక్కడనే నాయకుడిగా ఎదిగి, ప్రజలలో ఒదిగి, ప్రభుత్వాల పన్నాగాలకు బలి అయిపోయిన పెద్ద అన్న.
ఇది బూటకపు ఎన్ కౌంటర్ల దేశం. అజాదు ను చంపుతారు అవును అయన నక్సల్, వెంటాడి వేటాడి చంపుతారు, హేమచంద్ర పాండే, ఒక జర్నలిస్ట్, ఈయనని కూడ చంపుతారు ఎందుకంటే ఆయనకి వీరితో సంబంధాలు ఉంటాయి కాబట్టి. అయన ఇంట్లో నిషిద్ధ సాహిత్యం ఉంటుంది అట, పొరపాటు పడవద్దు బూతు సాహిత్యం గురించి కాదు మనం మాట్లాడుతుంది, మార్పును కోరుకునే సాహిత్యం గురించి మాత్రమె. కొన్నిరోజుల తరువాత సుప్రీం కోర్ట్ ఇది అన్యాయం అంటుంది, అది ఏ పత్రికా రాయదు, రాసినా వాటి గురించి పెద్దగా చర్చ జరుగదు. గుజరాత్ లో మోడి ప్రభుత్వం కూడ ఇష్రత్ అనే విద్యార్దిని , ఆమెతో ఇంకా కొంత మందిని ఎన్కౌంటర్ చేస్తుంది, , ఉగ్రవాదులు అన్నారు కాని ఇపుడు ఇవే కోర్ట్లు కాదు వారిది బూటకపు ఎన్కౌంటర్ అంటుంది, షీలా శూద్ అనే సామాజిక కార్యకర్త, హక్కులు అడిగిన పాపానికి హత్య కావించ బడుతుంది. ఇపుడు లేటెస్ట్ గా జీతెన్ మరాండి, పాటలు పాడుకొని దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం అన్నందుకు ఆయనకు ఉరి శిక్ష..వెరసి ఇవి ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు. ఇక్కడ ఎవరినైనా చంపొచ్చు దానికి మావోఇస్ట్ అని పేరు పెట్టొచ్చు. ఇక్కడ రాసుకున్న రాజ్య , న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, ఎవడిని పడితే వాడిని, ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని అన్యాయంగా చంపొచ్చు. నీచేతిలో తుపాకి ఉంటె దేశ రక్షణ, నాచేతిలో తుపాకి ఉంటె నేనొక నిషిద్ధం. ఇది ఈ దేశ, రాజ్య, ప్రపంచ సూత్రం. దీనిని ప్రశ్నించే వాడు లేదు, ఉన్న కూడా వారు చాల మందికి అర్థం కారు. అభివ్రుది అనే ముసుగులో ఆదివాసీలను, అడవులను, బీద ప్రజలను దేశ సార్వ భౌమత్వాన్ని కార్పొరేటు శక్తులకు తాకట్టు పెడుతున్న రాజకీయ పార్టీలను ఎదిరించకూడదు.
ఆయనెవరో నేటి తరానికి తెలియకపోయి ఉండొచ్చు, చాల మంది తెలంగాణ ఉద్యమకారులకు, ఉద్యమ నినాదాలకి తెలిసే అవకాశం కూడా లేదు. ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక రంగు ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది, మావోఇస్ట్, నక్సలైట్, పీపుల్స్ వార్, సాయుధ పోరాటం ఇలాంటివన్నీ వినకూడదు, మాట్లాడకూడదు. మాట్లాడినవాడు కరడుగట్టిన రక్త పిపాసి, మనుషులను ఖండ ఖండాలుగా నరికే కసాయి వాడు, ఇది రాజ్యం, రాజ్యానికి కొమ్ము కాసే, పార్లమెంటరీ భక్తులు వాడే భాష. ఈ దేశ రాజకీయాలని ప్రజా పోరాట రూపం లో ప్రశ్నించిన వ్యక్తీ ఒక తెలంగాణ వాడు, ఇక్కడ జరిగిన అన్యాయానికి సాయుధ పోరాటం తప్ప మరో మార్గం లేదని నమ్మిన వ్యక్తీ. భారత రాజకీయాలలో కేవలం కొన్ని వర్గాల వారికి మాత్రమె న్యాయం చేకూరుతుందని, అధికార దాహం పేద, దళిత, ఆదివాసీ ప్రజలను అణచి వేస్తున్నాయని ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం, గొప్ప విప్లవోద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తీ. మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్ జి 1956 లో జననం కరీంనగర్ పెద్దపల్లి లో జననం. 1948 తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట పటిమని చేత పుచ్చుకొని, 1969 తెలంగాణ ఉద్యమం అణచివేయబడిన తరువాత ప్రత్యామ్న్యా రాజకీయాల్లోకి ప్రవేశించిండు. నక్సలైట్ల ఉద్యమం, శ్రీకాకుళ ఉద్యమం కూడా మొదలై, అణచివెతలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న చారిత్రాత్మక సందర్భం.
అవి ఎంతో మంది విద్యార్థులు తెలంగాణ కోసం బలి అయిన రోజులు, రాజ్యం క్రూరంగా ఉద్యమాన్ని అణచివేస్తే అదికూడా న్యాయం అడిగిన యువ కెరటాలను పిట్టల్లా కాల్చి వేస్తె, జైల్లో పడ వేస్తె మిగిలిన విద్యార్థుల రక్తం మరుగుతుంటే, ఏదో చేయాలనే తపన పడ్డ రోజులు. వోటు రాజకీయల ద్వారా రాని తెలంగాణ, ఎన్నో వోప్పందాల ద్వారా అందని న్యాయం, ఎన్నో వలసలు, వనరుల విద్వంసం, సాంస్కృతికంగా హింస, మానసికంగా అవమానం, ఆత్మ గౌరవానికి అన్యాయం జరుగుతుంటే ఆపలేని అసక్తత. అపుడే కొత్త గాలులు వీస్తూ, ప్రజా పోరాటాలకు నాంది పలుకుతున్న కొత్త రాజకీయాలు. న్యాయం , ధర్మం అడుక్కుతింటే రావని, ప్రశాంత వాతావరణం లో, రాజ్యానికి ఎటువంటి నష్టం కలగకుండా పోరాటాలు చేస్తే తమ ప్రాణాలకు ముప్పే కాని దోపిడీ దారులకు కాదని తెలుసుకున్న రోజులు. మానవాత వాదం కోసం, సమానత్వం కోసం నడుంబిగించిన కిషన్ జి. 1975 నుండి, 1980 వరకు కరీంనగర్ లో దాదాపు ప్రతి గ్రామం తిరిగిన వ్యక్తీ అని ఇక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా చెప్పుకుంటారు. గ్రామాలకి తరలి రండి అని పిలుపును ఇచ్చి, భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన జగిత్యాల జైత్ర యాత్రలో పాల్గొన్న వ్యక్తీ. చదువులో దిట్ట, మేధస్సులో ఆయనకు ఆయనే సాటి, అప్పటి విప్లవ కెరటాలన్నీ కూడా అగ్రకులాలే కావొచ్చు కాని నమ్మిన సిద్ధాంతం అందరికి సమానత్వం అందాలనే. నిలబడ్డది బడుగు , బలహీన వర్గాల కులాల వైపే, అందుకే వాళ్ళందరూ ఆదర్శ మూర్తులైనారు. కులాల ఉచ్చులను ఊడపీకి యుద్ధానికి సిద్ధం కండి అని పిలుపునిచ్చారు. అవును, అదే చదువు వాళ్ళు చదివింది, చదువు అంటే జ్ఞానం లేని వాడికి జ్ఞానం అని, అమాయకుడికి అండగా నిలబడాలని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకునే వాళ్లకి బుద్ధి చెప్పాలని, అప్పుడు వాళ్ళు ఏ కులం అని ఎవరు అడుగలే, మా కులపోళ్ళకే మేము పని చేస్తాం అని విప్లవ సిద్ధాంతం నేర్పలే..కొండపల్లి సీతారామయ్య, సత్య మూర్తి, ఆంధ్రా నాయకులు కాని తెలంగాణ న్యాయబద్ధమైన పోరాటం అని నమ్మిన వాళ్ళు. కులాలను ,ప్రాంతాలను, సిద్ధాంతాలను జయించింది తెలంగాణ ఉద్యమం. సమానత్వమే మానవత్వం గా ముందుకు నడిచింది.
మొట్టమొదటి సారిగా 1998 వరంగల్ డిక్లరేషన్ తో ముందుకొచ్చింది తెలంగాణ ఉద్యమం, తీసుకొచ్చింది మావోఇస్టు పార్టీ అని అప్పటి వారసత్వంలో ఇప్పుడు కొనసాగుతున్న నాయకులకందరికి తెలుసు. లక్ష మందితో సభా, తరువాత తెలంగాణ జనసభ, క్రూర నిర్బంధాలకు గురి అయి అణచి వేయబడ్డది. ఆ తరువాతనే ఒక రాజకీయ రూపం తీసుకుంది, వోటు రాజకీయాల్లోకి రావడానికి తోడ్పడింది ఈ మావోఇస్ట్ రాజకీయాలే అని చాల మందికి తెలియదు. న్యాయ బద్దమైన డిమాండ్ ఎవరు ముందుకు తీసుకువచ్చినా కూడా ఆహ్వానించ వలెను అని అందరం నమ్మిన సిద్ధాంతం. అప్పటినుంచి ఇప్పటివరకు చేయని పోరాటం లేదు, పోరాట రూపం లేదు, ఇవ్వాళ కూడా పార్ట్లమేంట్ లో చిప్ప చేత బట్టుకొని అడుక్కున్నా కూడా ఎవడు లెక్ఖ పెట్టింది లేదు. అంతా బూటకపు ఆర్భాటాలు, వోటు రాజకీయాలలో వోటుకున్న పవర్ దేనికి లేదు , దాని ముందు ఎన్ని ప్రాణాలు పోయినా లెక్ఖ లేదు, ఎంత మంది పై కేసులు అయినా, జైలు పాలు అయినా పట్టించు కొము..మల్లా ఎలక్షన్లు, మల్లా ఎలక్షన్లు, ఎన్ని సార్లు చూస్తామో మనకే తెలవదు..ముఖ్యంగా తెలంగాణ విషయంలో. అపుడు కాల్పులు విద్యార్థుల మీద, ఇపుడు ఆత్మ హత్యలు విద్యార్థులు, ఉద్యమ కారులు తమకు తామే అర్పించుకున్న సత్యాలు..వాటి పేరు పోరాటం, వీటి పేరు పిరికి తనం..ఎందుకు? ఒక్కటె ఒక్క లోపం, అప్పటిలాగా విప్లవ శక్తులు కాని, రాజకీయ శక్తులు కాని ప్రజలను పోరాటం వైపు మల్లించక పోవడమే..నిరంతరం నిరాశలోకి నెత్తి వేసి, ఎవడిని నమ్మాల్నో, ఎవడిని నమ్మవద్దో తెలవక సతమత మౌతున్న సందర్బాలు..చివరికి జాతకాలు మళ్లీ వోట్లలో, ఎన్నికలలో..ఉద్యమాలలో కాదు సుమా.
మల్లోజుల కిషన్ జి, దేశమంతా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విప్ల పార్టీ లో ముఖ్య నాయకుడు, తెలంగాణ నినాదాన్ని అక్కడ కూడా చాటి చెప్పినా మహా మనిషి. జీవితం లో ఒక్క సారి అయినా అమ్మని చూడాలన్న చిన్న కోరికను తీర్చుకోలేక పోయిన నాయకుడు. మధురమ్మ, కిషన్ జి ని కన్న తల్లి, దేశానికి ఒక గొప్ప మనిషిని ఇచ్చిన అద్రుష్టవంతురాలు. ఈ గడ్డ , తెలంగాణ గడ్డ పై పౌరుషం, తెలివి తేటలు, ధైర్య సాహసాలు అన్ని ప్రాంతాల ప్రజల న్యాయ మైన పోరాటం కోసం జీవితాంతం అహర్నిశలు కష్ట పడ్డ కిషన్ జి. బెంగాల్ ప్రభుత్వం లో పాగా వేసి, అక్క మమతని గెలిపించి అక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు న్యాయం చేయాలనే కోరికని మళ్లీ అతి కిరాచాకంగా అణచి వేసిన ప్రజాస్వామ్యం. విప్లవ పార్టీలను కూడా బురిడి కొట్టించిన రాజకీయాలు, అధికారం లోకి రాగానే అసలు రంగు చూపిన అక్క..ఇక్కడ తెలుగు దేశం, కాంగ్రెస్ అన్ని పార్టీలు చేసింది కూడా అదే పని. మిమ్మల్ని నమ్మేది లేదు అని మల్లోకసారి ప్రపంచానికి చాటిచెప్పిన వోటు రాజకీయాలకి జోహార్లు.
అప్పటి అణచి వేతకి ఎందరో విప్లవ బాట పట్టారు, ఇప్పటి అణచి వేతకి తెలంగాణలో ఏ బాట పడతారో రాబోయే రోజులు చెపుతాయి. ఎవరో ఒకరు, ఎపుడో ఒకరు ఎటో ఒక వైపు నడవాల్సిందే, న్యాయ పోరాటం జరగాల్సిందే, ఆగదు ఆగదు..వేల వేల బలగాలను, పైలట్ లెస్ విమానాలను, గ్రీన్ హంట్ లను, లక్షల కోట్ల రూపాయలను వెచ్చించినా..కార్పోరేట్ శక్తులతో, వరల్డ్ బాంక్ కనుసన్నలలో ప్రజాస్వామ్యం ముసుగులో ఎన్ని పాపలు చేసినా ప్రజలు క్షమిస్తారు అనుకుంటే పొరపాటే. ఎంత మందిని హత మార్చినా ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆపలేరు, ఒక సిద్దాంతాన్ని అణచి వేసే కంటే, దానిని సమస్య గా చూసే కంటే, ఎందుకు ఆ సిద్దాంతం బతుకుతుంది, మూలాలు ఎక్కడున్నవి అని ప్రశ్నించు కుంటే మంచిది. మావొఇస్తులది సమస్య కాదు, ప్రశ్న, స్వయం అధికారం కోసం పోరాటం, ఒక జవాబు అంటున్న వారి వాదనని ఎందుకు మనం చర్చించం? ..ప్రజల సమస్యలను, న్యాయ బద్దమైన డిమాండ్లను న్యాయంగా పరిష్కరించలేకపోతే జరుగ బోయే నష్టాన్ని, ప్రజల కోపాన్ని ఎవరు ఆపలేరు..హింస , ప్రతి హింస! ఇక్కడే ఆగిపోతాయి..ఇట్లనే సాగిపోతాయి న్యాయం దొరికే దాక.
తెలంగాణ బిడ్డ కు లాల్ సలాం! కరీంనగర్ లో పుట్టి, అంతర్జాతీయంగా పేరు గడించి, ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలను మళ్ళించి పోరాట బావుటాను ఎగుర వేసిన విజయ కెరటం, నీకు లేదు మరణం. నీ బ్రతుకంతా నువ్వు సృష్టించిన కిషన్ జీలు ఎందరో నీకు తెలువ కున్నా, నీ నీడలో నడిచే ప్రతి ఒక్క పోరాట యోదుడిలో నువ్వు బ్రతికే ఉంటావు, కోల్కత్తాలో కాని, కరీంనగర్ లో కాని నీ ఆలోచనలకూ ప్రతిరూపాలు నిరంతరం మొలకేట్టుతూనే ఉంటాయి. నీకు దారి తెలంగాణ పోరాటమే, నువ్వు ఎంచుకున్న రాజకీయాలు న్యాయ కోసమే..అదే తెలంగాణ జీవితం, జీవం..సిద్ధాంతం ఏదైనా చివరికి అది న్యాయమే, సామాజిక న్యాయమే. అది పీపుల్స్ వార్ కాని, మావోస్ట్ కాని..నువ్వో అఖండ జ్యోతి!
జోహార్ కామ్రేడ్ కిషన్ జి కి! అమ్మ, తెలంగాణ అమ్మ నిన్ను కన్నందుకు గర్వ పడుతుంది..నువ్వు ఎందరికో ఆదర్శంగా నిలిచి పోరాడినందుకు రేపటి తరానికి ఆదర్శంగా చూపెడుతుంది. ఆత్మహత్యలు కావు , అలుపెరుగని పోరాటమే మనకు ఆదర్శం అన్న నినాదం వైపు నడిపిస్తుంది.
జై తెలంగాణ!
సుజాత సూరేపల్లి.
–
సకల జనులలో ‘సింగరేణి’ : ఉద్యమ సమీక్ష
దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణ ఉద్యమానికి తలమానికం సకల జనుల సమ్మె. ఎన్నో ఒడిదుడుకులను దాటుకుంటూ, రాజకీయ చదరంగాలను, పద్మవ్యూహాలను తప్పించుకుంటూ, అతి ముఖ్య మైన దశలో వచ్చి నిలబడ్డ నేటి ఉద్యమంలో , కనీవిని ఎరుగని రీతిలో, సకల జనులు మనస్పూర్తిగా, నిబద్దతగా, పట్టుదలతో పాల్గొన్న ఉద్యమం. రాజ్యాలని, కుళ్ళు రాజకీయ నాయకులను గడ గడ లాడించిన ఉద్యమం. తెలంగాణ ప్రజలని ఎట్లైనా మోసం చేయొచ్చు అనుకున్న పాలక వర్గాలకు, శత్రు శిబిరాలకు వెన్నులోంచి వణుకు పుట్టించిన ఉద్యమం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం 2009నుండి తనకు తానుగా హింసించుకుంటూ,శాంతి బాటలో పయనిస్తూ, విభిన్న రీతిలో ప్రపంచలోని ఉద్యమాలకేల్ల తనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకుంటూ ముందుగు సాగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పుకునేది , ఆద్యంతం ఉదృతంగా సాగిన ఈ సమ్మె కి మొట్ట మొదట ఊపిరి పోసిన ఉద్యమ కారులు, సింగరేణి కార్మికులు.
సింగరేణి కాలరీస్, దేశం లోనే రెండో అతిపెద్ద పుబ్లిక్ రంగ సంస్థ. ఎన్నో కార్మిక సంఘాలు, ఆ సంఘాలకి చాలావరకు ఆంధ్రా నుంచి వచ్చిన వ్యక్తులు నాయకులు, లేదా ఇక్కడ స్తిర పడ్డ వాళ్ళు. సింగరేణిలో అధిక శాతం అధికారులు ఆంధ్రా వాళ్ళే, వడ్డించే వాడే మనవాడైతే అన్నట్లు, వారి అధికారంలో, వారి తగ్గట్టుగా కార్మిక నాయకులు, ఒకటి రెండు సంఘాలు ఎపుడూ ప్రజల పక్షాన ఉన్నాకూడా , తమ డిమాండ్లను ముందు పెట్టడంలో వెనుకబడే ఉండేవి. . పార్టీల మద్దతుతో, ప్రైవేట్ కంపెనీల లాభాల కోసం, ఆ కంపనీ అడుగులకు మడుగులోత్తుతున్న సమైక్య ఆంధ్ర ప్రభుత్వాలు ఈ ఆంధ్రా కార్మిక నాయకులని చేతిలో పెట్టుకొని శ్రామికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసి రోజులు గడుపుకున్తుంటాయి. ఇక్కడ సంస్కరణల కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు నడిచి చరిత్రలో నిలిచి పోయాయి. ఎక్కడైనా ఒక విప్లవాత్మక మార్పు కోసం, తమ హక్కుల కోసం, ఆత్మ గౌరవం కోసం ఉద్యమాలు జరిగితే దాని ప్రభావం అక్కడున్న పరిస్తితుట్ల మీద, వ్యక్తుల మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. ఇప్పటి సింగరేణి ఉద్యమం సకల జనుల సమ్మెని చూస్తె, వీరి ఐక్యత వెనుక ఉన్న అవగాహన, పట్టుదల, న్యాయపోరాటానికి మూలాలు, గత కాలపు ఉద్యమ అనుభవాలను ప్రతిఫలిస్తున్నాయి అని చెప్పక తప్పదు. తమ స్వంత లాభాల కోసం ఇక్కడి కార్మికులని ముక్కలు చెక్కలుగా చేసిన యాజమాన్యాలకి ఈ మలి తెలంగాణ ఉద్యమం పెద్ద సవాలుగా నిలబడ్డది. ఇక్కడ కార్మికుల ఐక్యతని చూసి ఏమి చేయాలో పాలుపోక బిక్క మొకం వేసుకొని జై తెలంగాణ అనకుండా ఉండలేక పోయాయి. ఇది ఈ కార్మికుల ఐక్యతకి గొప్ప నిదర్శనం. గాలిని మళ్ళించే వాడే నిజమైన ఉద్యమ కారుని లక్ష్యం అంటారు, గాలికి కొట్టుకుని పోయేవాడు ఎన్నడు న్యాయం చేయలేడు.
నిజానికి సింగరేణి కార్మికుల సమ్మె ఇంత ఉదృతంగా జరగడానికి అనేక కారణాలున్నాయి. ఇక్కడి భూమిని కోల్పోయి, సొంత భూమిలోనే నిరుపేదగా మారిన పరిస్తితులు, తమ ప్రాంత సహజ వనరులని ఫణంగా పెట్టి ఎక్కడికో తమ శ్రమని ధార పోస్తున్న కార్మికుల కష్టం ఉంది. రోజు రోజుకి తరిగిపోతున్న వనరులే కాకుండా, తమ ఆరోగ్యాన్ని కూడా లెక్ఖ చేయకుండా పని చేస్తూన్న కార్మికులకి ఎటువంటి న్యాయం జరుగక పొగ, ఉద్యోగ భద్రత కూడా లేకుండా చేస్తూన్న ప్రభుత్వాల కుటిల నీతికి బలై పోతున్న కార్మిక లోకం తమ కష్టాలకి కారణం తమ ప్రాంతం తమకి దూరం అవడమే అని తెలుసుకున్నారు. తెలంగాణ విముక్తిలోనే తమ బతుకులు కూడా బాగు పడతాయని అలుపెరుగకుండా తమ వంతు పాత్రని నిర్వహించారు. ఆత్మగౌరవం, స్వపరిపాలన, వనరుల పై అధికారం కోసం జరుగుతున్న ఈ మహోత్తర ఉద్యమంలో సింగరేణి కార్మికులు ముందుండి పట్టుదలగా ఉద్యమాన్ని నడపక పొతే బహుషా సమ్మెకి ఇంత శక్తి వచ్చి ఉండేది కాదేమో.
ఎటువంటి హంగూ ఆర్బాటం లేకుండానే, నాయకత్వం లేకుండా తమకు తాముగా, స్వచ్చందంగా మొదలు పెట్టినారు సింగరేణి కార్మికులు తమ ఉద్యమాన్ని. ఒక్కసారిగా ప్రైవేట్ రంగ సంస్థలు, పార్టీలు, కార్మిక సంగాలు ఉలిక్కి పడ్డాయి. కోతలు, బహిష్కరణలు అని భయపెట్టినాయి, మభ్య పెట్టినాయి. అనేక రకాలుగా ఉద్యమాన్ని అణచి వేయడానికి ప్రయత్నించినాయి కాని కార్మికుల ఐక్యతను చూసి తమ కుట్రలు, పన్నాగాలు ఏమి పని చేయలేవని పూర్తిగా తెలుసుకున్నాయి. సింగరేణి కార్మికులు జీతాలను వొదులుకుని, ఉద్యోగాలను ఫణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్నారన్న వార్త దావాలనంలా వ్యాపించింది, అక్కడి నుంచి ఒక్కో సంస్థ ముందుకు వస్తూ బలాన్ని పుంజుకున్నాయి. ప్రతి ఒక్క సంస్థ సింగరేణి కార్మికులకు మద్దతు తెలుపుతూ, తాము కూడా యుద్దానికి సిద్దం అంటూ ముందుకు నడిచినయి. ప్రతి రోజు అనేక సంఘాలు సింగరేణి కార్మికులకు తోడుగా మేమున్నాం అంటూ యాత్రలు చేపట్టినారు, ఇందులో ఇతర దేశాలలో స్తిర పడ్డ సంఘాలు కూడా తమ సంపూర్ణ మద్దతును పలికినయి.
సింగరేణి ప్రాంతంలో తిరగని నాయకులు సంఘాలు లేవేమో బహుషా: ఉత్తర తెలంగాణ సర్వస్వం దోపిడీ కి గురి అయిన ఆక్రోశం సింగరేణి ఉద్యమంలో అణువణువునా కనపడుతుంది. మస్టర్లు ఇస్తామని మభ్య పెట్టి, పోలీసులతోని బెదిరించి, స్త్రీలని కూడా చూడకుండా జైల్లో పెట్టి ఎన్ని రకాలుగా హింసించినా సింగరేణి ఉద్యమం ఆగలేదు. ఆటు ఖమ్మంలో బలహీనంగా ఉన్న ప్రజానీకం మీద తమ ప్రాతాపం చూపించి సమ్మెని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నించి విఫలం అయినారు. ఈ సమ్మెలో ఒక కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు..మలి తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు వందల్లో జరిగినా కోద్దా కదలని ప్రభుత్వాలపై పూర్తిగా నమ్మకాలు పోగొట్టుకున్నారు ప్రజలు.
సింగరేణి కార్మికుల ఐక్యత, సమ్మె వల్ల దక్షినాది రాష్ట్రాలు కొన్ని ఇతర రాష్ట్రాల పై తీవ్రమైన ప్రభావం పడ్డది. కార్మిక లోకాన్ని తమ చెప్పు చేతల్లో ఉంచుకున్నాము అనుకున్న ప్రైవేట్ పెట్టుబడి సంస్థలకి ఒక్క పెట్టున చెంప చెల్లు మనిపించినారు కార్మికులు. కార్మికులు కేవలం జీతాలకు, ప్రమోషన్లకు, బోనస్ లకు మాత్రమె సమ్మె చేస్తారని ప్రపంచానికి తెలిసిన సత్యం కాని ఈ సమ్మె ద్వారా ప్రజాస్వామిక హక్కుల కోసం కూడా కార్మికులు ప్రజల వైపు నిలబడి న్యాయం కోసం పోరాటం చేయడం మనం కళ్ళారా చూసినం. ఇది సామ్రాజ్య వాద శక్తులకి మింగుడు పడని సత్యం. ఒక్క సారిగా పెట్టుబడి దారులు కుమ్మక్కినారు. ఈ రకంగా సమ్మె జరిగితే కొన్ని పరిశ్రమలకే కాదు, రాబోయే రోజుల్లో రాజ్యాలే చీకట్లోకి పోవాల్సి వస్తుందని తెలుసుకుని, ఇక్కడి మంత్రుల్ని , కొన్ని పార్టీల నాయకులని సంప్రదించి తమ పావులు కదిపినాయి. కార్మిక లోకం తలచుకుంటే, అదికూడా సింగరేణి లాంటి సంస్థలు, ప్రపంచానికి వెలుగుని, ఆదాయాన్ని ఇచ్చే బొగ్గు కార్మికులు ఒక్కటైతే పునాదులు కదిలినంత పని అయింది.
సింగరేణి సమ్మె వల్ల రాజకీయ పార్టీలు కూడ తమ వైఖరిని మార్చుకొనే పరిస్తితికి వచ్చాయి, ఉద్యోగ సంఘాలు, ఇతర సంఘాలు ఒక్క తాటిపైకి వచ్చి ఒకరికొకరు అండగా నిలబడ్డరు. ఇంక అభాద్దాలు ఏమాత్రం నడవవని తమ తీరునే మార్చుకున్నారు అక్కడి తెలంగాణ సంఘాల నాయకులు. ఏది ఏమైనా సింగరేణి సమ్మె వల్ల ఒక్కటి బలమైన సంకేతం ప్రభుత్వాలకి, పెట్టుబడి దారులకి, అర్థమైంది ఏమిటంటే, ఇక్కడ కార్మికులని వేరు చేయడం మా వల్ల కాదు అని. తెలంగాణ లో ఉత్తర తెలంగాణకి అనేక ఉద్యమాలతోని సంబంధం ఉండడం కూడా దీనికి ఒక కారణం. ఇక్కడి మాదన కుమార స్వామి, రాజగోపాల్, రామమూర్తి మరి అనేకులు ముందు పడి ఈ చరిత్రను పేపర్ల లో మాత్రమె కాకుండా ఒక చరిత్ర కి సంబంధిచిన డాక్యుమెంట్ గా తీసుకు రావడం భావి తరాలకి, ఉద్యమాలలో ఉన్న వారికి చాల ముఖ్యం. ఈ ఐక్యతనే రేపు తెలంగానై తీసుకు రాగలదు.
జై తెలంగాణ
సుజాత సూరేపల్లి.
